చేనేత పరిశ్రమ – డా.ఎ.కళ్యాణి

ఆధునిక జీవనశైలికి అర్రులు చాస్తూ, చదువు లేకపోయినా, సరైన ఉద్యోగం లేకపోయినా, కూలిపని చేస్తూ అయినా హైదరాబాద్‌ వంటి నగరాలలో నివసించడానికి మొగ్గు చూపుతున్నారు కానీ, సొంత ఊరిలో ఇంటిపట్టున ఉంటూ కులవృత్తిని చేస్తూ జీవనం గడపడానికి నేటి యువత విముఖత వ్యక్తం చేస్తున్నారు. అలా గ్రామీణ ప్రాంతాలలో కులవృత్తులు కనుమరుగవుతున్నాయి.

ఈ కుల వృత్తులలో ముఖ్యమైనదీ, సమాజానికి నాగరికత నేర్పినదీ చేనేత వృత్తి. అలాంటి చేనేత వృత్తి నేడు రాష్ట్రంలో పూర్తిగా క్షీణదశకు చేరుకుంది.
ఈ నేత వృత్తిలో రెండు రకాలున్నాయి. 1. చేనేత మగ్గం, 2. మర మగ్గం
1. చేనేత మగ్గం: విశాలమైన వరండాలో చెక్కతో చేసిన మగ్గం, దాని ముందు ఒక గుంటలో వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతని ఎదురుగా మగ్గం ఫ్రేముపై నిలువు దారాలు పేర్చి వరండాకు మరో చివర కట్టబడి ఉంటాయి. ఫ్రేములో అడ్డుదారం కోసం దారపు కండెలు అటూ ఇటూ పంపుతూ, దారాలు సరిచేసుకుంటూ ఆ వ్యక్తి మగ్గం నేస్తుంటాడు. అతడికి రోజంతా కావలసిన దారపు కండెలను తయారుచేసి ఇస్తూ ఉంటుంది అతని భార్య. ఆ ఇద్దరూ రోజుకు 8 గంటలు కష్టపడితే చీర నేసినందుకు గానూ ఇంత కూలీ అని ఇస్తున్నారు తప్పితే, ఆ మహిళ చేసే పనికి వెల కట్టడం లేదు. ఇది మహిళల శ్రమను దోచుకున్నట్లే. బహుశా ఈ తరహా శ్రమదోపిడీ ప్రపంచంలో మరే వృత్తిలోనూ కనిపించదేమో. ఒక మగ్గం ఉన్న కుటుంబం ఒక వ్యాపారస్తుని దగ్గర ముడిసరుకు తెచ్చుకుని, భార్యాభర్తలిద్దరూ కలిసి మగ్గం నేస్తున్నా, ఒక వ్యక్తి కూలిని మాత్రమే పొందుతున్నారు. అదే స్వంతంగా నాలుగు మగ్గాలు ఉన్నవాళ్ళు ముడిదారం మాత్రమే తెచ్చుకుని దారాలకు రంగులద్దడం, డిజైన్లను తయారు చేయడం, కండెలు పట్టడం వంటి అన్ని పనులు ఇంటిల్లిపాదీ (కనీసం నలుగురు) చేసి మగ్గం నేస్తున్నారు. ఇందులో కూడా మహిళల శ్రమదోపిడీ కనిపిస్తుంది. వారికి ప్రత్యేక వేతనం అంటూ ఏమీ ఉండదు. ఇలా ఒకరి కూలీకి ఇద్దరు లేదా ముగ్గురు పనిచేస్తూ చాలీచాలని డబ్బులతో, ఆర్థిక లేమితో బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు వంటి వాటికి ఆర్థిక భారం మోయలేక అప్పులు చేసి, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
2. మర మగ్గం: మరమగ్గాలు నడిపే నేత కార్మికుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ కూడా మహిళల శ్రమ దోపిడీ జరుగుతోంది. ఒక వ్యక్తి నాలుగు మరమగ్గాలను కూలీకి నడుపుతుంటే, అతని భార్య సహకారం తప్పనిసరిగా అవసరమవుతుంది. కరెంటు సరిగా ఉండక, ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడు, అదికూడా రాత్రీపగలు తేడా లేకుండా మరమగ్గం నడుపుతూ, నిద్రకు దూరమవుతూ, తాగుడుకు దగ్గరవుతూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు.
ఈ చేనేత, మరమగ్గాల వారికి ప్రభుత్వపరంగా ఋణాలు అందుతున్నాయిÑ అలాగే ఆ తర్వాత కాలంలో ఋణమాఫీలు కూడా జరుగుతున్నాయి. అయితే, అవన్నీ వ్యాపారస్థుల వరకే పరిమితమవుతున్నాయి కానీ, మగ్గం నేసే సాధారణ కార్మికుడి దగ్గరకు చేరలేకపోతున్నాయి. మూల వ్యవస్థ (వేరు) చెదలు పట్టి నాశనమవుతుంటే, పూలు, కాయలకు పురుగు పట్టకుండా మందు పిచికారీ చేస్తున్నట్లుగా ఉంది మన ప్రభుత్వ పరిస్థితి. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని కాపాడడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. దేశ, విదేశాల్లో పోచంపల్లి, గద్వాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ చీరలకు పోచంపల్లి దుప్పట్లు, దిండు కవర్లు, కర్టెన్లు, డ్రెస్‌ మెటీరియల్‌ మొదలైన వస్త్రాలకు ఎంతో డిమాండ్‌ ఉంది. కానీ ఆ చీరలు, ఇతర వస్త్రాలు నేసే సాధారణ కార్మికుల ఆత్మహత్యలు మాత్రం ఆగటం లేదు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న పోచంపల్లిని ఎంతోమంది విదేశీయులు సందర్శిస్తున్నారు. అలాగే, ఎందరో విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్లు పోచంపల్లిని, చుట్టుపక్కల గ్రామాలను మాత్రమే సందర్శిస్తున్నారు కానీ, మిగతా చేనేత ప్రాబల్యం ఉన్న గ్రామాలను పట్టించుకునే వారే కరువయ్యారు. మన తెలంగాణ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం విద్య, వ్యవసాయం, తర్వాత చేనేతకు ప్రాముఖ్యతను కల్పించాలని ఆశిస్తున్నాను. పోచంపల్లికి 13 కి.మీ. దూరంలో ఉన్న పోచంపల్లి చేనేత పార్క్‌ను ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు.
1. అలాంటి చేనేత పార్కులను ప్రభుత్వమే చేనేత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి. రెండు గ్రామాల మధ్య ఒక ఐదెకరాల స్థలంలో రెండు, మూడు షెడ్లు వేసి, మగ్గాలు ఏర్పాటు చేసి, కార్మికులకు నెలసరి వేతనం ఇస్తూ, వీటి నిర్వహణ బాధ్యతను చేనేత సహకార సంఘాలకు అప్పగించాలి.
2. మూడుపూటలా తిండి సరిగా లేని ఈ పరిస్థితులలోనే అద్భుతమైన డిజైన్లను సృష్టించి, పోచంపల్లి వస్త్రాల ఖ్యాతిని దేశ, విదేశాల్లో వ్యాపింపజేసిన నేత కార్మికులకు ప్రభుత్వం కూడు, గూడు ఏర్పాటు చేసి నెలసరి వేతనం ఇస్తూ, ఆందోళన లేని జీవితాన్ని గడపగలిగేలా చేస్తే, మన పోచంపల్లి వస్త్రాల ఖ్యాతిని దిగంతాలకు మరింతగా వ్యాపింపచేయవచ్చు.
3. చేనేత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గ్రామాల మధ్య షెడ్లను వేసి, రంగులద్దడం, దారాలు పోయడం, కండెలు పట్టడం, డిజైన్లు తయారుచేయడం వంటి అన్ని విభాగాలను అక్కడే ఒకేచోట చేర్చి ప్రతి వ్యక్తికి సరైన వేతనం కల్పించగలిగితే మహిళల శ్రమదోపిడీ ఆగుతుంది. అలాగే కార్మికుల ఆత్మహత్యలూ తగ్గుతాయి.
4. నెలలో 20 రోజులు విదేశీయులు, విద్యార్థులు పోచంపల్లి గ్రామాన్ని మాత్రమే సందర్శిస్తున్నారు. కానీ, మిగతా చేనేత గ్రామాలను కూడా పై విధంగా అభివృద్ధి చేస్తే పోచంపల్లిలా అవికూడా పర్యాటక ప్రాంతాలుగా బాసిల్లుతాయి.
5. ఊరూరా చేనేత పార్కులను ఏర్పాటు చేసి, అక్కడ అన్ని విభాగాలలో శిక్షణ ఇస్తూ, నేత కులస్తులకు సగం ప్రాతినిధ్యం కల్పిస్తూ, మిగతా కులాలవారికి మిగిలిన సగం సీట్లను కేటాయిస్తూ వారిలోని సృజనాత్మకతను కూడా పెట్టుబడిగా పెట్టి చేనేతలో ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇలా చేయగలిగితే, నిజంగా గాంధీజీ కలలు కన్న ‘గ్రామ స్వరాజ్యం’ను మనం సాధించినట్లే.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.