ఒక అన్వేషి నిష్క్రమణ – అఫ్సర్‌

ఈ నాలుగు మాటలు రాయడానికి ముందు అసలు సాయిపద్మ నిజంగా లేదన్న విషయం నేను నమ్మాలి కదా! అదే కష్టంగా ఉంది. ఈ చేదు నిజానికి నా నమ్మకంతో పని ఉందా లేదా అన్నది వేరే విషయం కానీ… ఇది నా ఆలోచనల్లో ఒక భాగం కావడానికి చాలా సమయమే పట్టవచ్చు. ఇంకా వారం కూడా కాలేదు. ‘‘సోల్‌స్పేస్‌’’లో సాయిపద్మ స్వరం వినిపిస్తూనే ఉంది.

ఈ మధ్య కాలంలో ముసుగుల్లేని ఇంత బలమైన గొంతుక వినడం అరుదే. తన స్పష్టమైన ఆలోచనలాగానే నిక్కచ్చిగా మాట్లాడే గొంతుక ఆమెది.
ఎంత కాదన్నా, ఇది వ్యక్తిగతమే అవుతుంది. సాయిపద్మతో నా పరిచయం పదేళ్ళపైనే. ఒక పుట్టినరోజు నాడు ఫేస్‌బుక్‌ ఇన్‌బాక్స్‌లో పలకరింతతో మొదలయింది. తను రాసింది:
మీ పుట్టినరోజని కవిత
రాకపోయినా రాద్దామని
కూర్చున్నానా కొన్ని కావేరి నది
వొడ్డున కుప్ప వేసిన దుఃఖాలు మరో
గుప్పెడు ప్రవాసీ ఒంటరితనాలు
విడిపించుకున్న చేతివేళ్ళ
సున్నితత్వాలూ వొకరూ వొకరూగా
వెళ్ళిపోతున్న గుల్దస్తా జ్ఞాపకాలు
వశం కాక మిగులుతున్న సూఫీ
తత్వాలూ అన్నీ వొకేసారి
యాదికొచ్చి అన్ని ఆలోచనలూ,
చేతివేళ్ళ మధ్య ఇసుకలా
జారిపోయాయి శూన్యం
అబ్బురపరిచింది…The thin line between poetry, poet, poetry curator ship ఎంత పెద్ద వివశత్వమో కదా… ఇవన్నీ చేసే శక్తి, స్థలం, కాలం మీకు దొరకాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు ` సాయిపద్మ
ఆ మెసేజ్‌ చివరి వాక్యం ఇక్కడ ముఖ్యం. ఆ వాక్యంలో ఆమె బతుకు పుస్తకమే ఉంది. అది ఆమె సొంత వాక్యం కాకపోవచ్చు. ఎవరినుంచో అరువు తెచ్చుకున్నదే… కానీ, సాయిపద్మని define చేసిన వాక్యమే అది.
“Remember there’s no such thing as a small act of kindness. Every act creates a ripple with no logical end.” – Scott Adams
ఈ స్కాట్‌ ఆడమ్స్‌ ఎవరో నాకు తెలియక్కర్లేదు. కానీ, ఇందులోంచి సాయిపద్మ కృషి అంతా కనిపిస్తోంది నాకు. ఆ కొద్దిపాటి కరుణే ముఖ్యం అని ఆమె అనుకున్నది. ఆ తరువాత తాను ఏం రాసినా… కవిత్వమూ, కథలూ, ఫేస్‌బుక్‌ పోస్టులూ… వాటన్నిటిలో తన విశ్వాసాలూ, జీవన లక్ష్యాలూ, కక్ష్య తప్పని ఆత్మవిశ్వాసమూ, ఆత్మ గౌరవమే నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా తను రాసే వాక్యాల తీవ్రత మనల్ని ఒక పట్టాన వదలదు.
‘‘అందరూ గాయపడుతూనే ఉన్నాం… అదృష్టవశాత్తూ కొందరి గాయాలు శారీరకం…’’
‘‘మనలో కలుపుకున్నా సన్నిహితం కాని బంధాలు చుట్టూ అందరూ తామరాకు మీద నీటి బొట్లే, కలిసీ కలవకుండా, మాట్లాడీ మాట్లాడకుండా సముద్రాల్ని, తనలో కలుపుకున్న మనుషులు కొందరైతే, కళ్ళల్లోనే కదలనివ్వకుండా కాపరం
ఉంచేవాళ్ళు మరికొందరు గుప్పెడు పసుపుపూలు నలిగిపోయినా చెప్పే స్వాగతం మరిన్ని గరుకుతేలి ఎండిన కొండల్లో మొలకెత్తిన తలూపే తడి తడి గరికె మొలకలూ, అన్నీ చూస్తూ అనుభవించే అదృష్టం ఎందులోనూ మమేకం కాలేనప్పుడే పెళుసు మాటలూ…’’
‘‘సాహిత్య ప్రపంచం గాభరాగా ఉంది, ఏమైనా రాయడానికి!’’
‘‘నేనా… రాస్తూనే ఉన్నాను. కొన్నిసార్లు కదలలేని నిస్సత్తువలో గాలిలో గీతలు… నీళ్ళ జాడలలో వెతుక్కొనే కళాఖండాలు అవి రాతల్లో ఎలా ఉంటాయోనన్న పిచ్చి ఊహలు నీటి ఏనుగుల అంబారీల కలవరింతలు దూరమైపోతున్న మరణపు పలవరింతలు…’’
‘‘కవిత్వాన్ని… అకవిత్వం కాకపోతే ఎవరు కుశలం అడుగుతారు’’.
… … …
ఇక సారంగలో సాయిపద్మ రచనల గురించి ఎన్నయినా చెప్పవచ్చు. 2015లో ‘‘ఫత్వాలను ధిక్కరించిన ఆమె’’ అనే శీర్షికతో పాకిస్తానీ ఫెమినిస్టు కవయిత్రి ఫహ్మిదా రియాజ్‌ గురించి తన వ్యాసం వెలువడిరది. ఆ వ్యాసంలో తను అంటుంది:
‘‘ఆమెని, ఆమె కవిత్వాన్ని చదవాలి… వాళ్ళకి నచ్చిన ఉటోపియా నుండి, నిజంలోకి నిర్భయంగా నడవాలి… కనీసం ప్రయత్నించాలి… ఫహ్మీదా కోసం కాదు… మన మానసిక ఆరోగ్యం కోసం…!!’’
ఇదే సాయిపద్మ సాహితీ పఠనం రహస్యం. ఒక తీవ్రమైన తపనలోంచి తదేక దీక్ష లాంటి reflexivity ని తను సాహిత్యంలో వెతుక్కుంది. నిత్య జీవితంలో క్షణం తీరికలేని పనుల్లో సాహిత్యం తనకొక నిలువుటద్దం.
అరుణ్‌సాగర్‌కి రాసిన నివాళి వ్యాసంలో ఇలా అంటుంది:
అందరు కవులూ జీవితాన్ని బ్రతికేస్తారు, తడిగా కొందరు, పొడి పొడి మాటల ఒంటరితనాల్లో మరికొందరు. కానీ, ఒకరో, ఇద్దరో… జీవితాన్ని సెలబ్రేట్‌ చేస్తారు.
ఇవన్నీ ఆయా రచయితల గురించి చెప్పిన వాక్యాలని ఎప్పుడూ అనిపించదు. ఒక ఉత్తమ అక్షర ప్రేమికురాలు చదువుతూ, చదువుతూ, ఆ చదివిన వాటిని తన మనసులో ఎలా లీనం చేసుకుంటుందో సాయిపద్మ చెప్తుంది.
… … …
నిన్ననో, మొన్ననో మా ఇంట్లో సాయిపద్మ పేరు వినిపించింది. ఏదో ఒక సాహిత్య సభ ఏర్పాటు గురించి మాట్లాడుతూ కల్పన ‘‘సాయిపద్మని తప్పకుండా పిలవాలి. తను బాగా స్పష్టంగా మాట్లాడుతుంది’’ అంటోంది. కానీ, ఇంతలోనే ఈ వార్త… నిజమో, అబద్ధమో తెలియని స్థితిలో కల్పనకి చెప్పాను.
ఇది నిజం కాదని తరువాతయినా చెప్పగలనా?!
(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ నుండి…)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.