పుస్తకాలను 23-11-2024 (శనివారం) రోజు ఆవిష్కరించారు. ‘విజయ గాథ’ డా. బోయి విజయభారతి గారి స్వీయ చరిత్ర. ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ విజయ భారతి గారి గురించి 52 మంది రాసిన జ్ఞాపకాలను గుదిగుచ్చి అందించిన స్మారక సంచిక.
‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ లో నా వ్యాసం ఉంది. ‘విజయ గాథ’ ని నేను, గిరిజ పైడిమర్రి edit చేశాం. ఆ process గురించి గిరిజ ఆ పుస్తకంలో రాసింది.
మామూలుగా అయితే విజయభారతి గారు తన పుస్తకాలు చాలా వరకు తనే edit చేసుకునేవారు. 83 years వయసులో స్వీయ చరిత్ర రాశారు. దానికే ఆవిడ అలసిపోయారు. ఓపిక (శరీర సత్తువ) తగ్గటం వల్ల, చూపు మందగించటం వల్ల editing లో తనకు సహకరించాల్సిన పని మా దాకా వచ్చింది. మేం చేసింది editing లో సహకారం. గిరిజ రాసినట్లు ముందు నన్ను అడిగితే తటపటాయించాను.
April, 2024 లో విజయభారతి గారు నాకు phone చేసి ‘స్వీయ చరిత్ర రాశాను. Editing విషయం చూడండి’ అన్నారు. వెంటనే సరే అనటానికి ఒక అనుమానం అడ్డు వచ్చింది. ఆ తర్వాత దానికి రెండు భయాలు తోడయ్యాయి.
Madam circle లో లాయర్లు, ప్రొఫెసర్లు, రచయితలు, రచయిత్రులు, జర్నలిస్టులు, ఉద్యమకారిణులు, దశాబ్దాలుగా వారి వెంట నడచిన వాళ్ళు … ఇలా చాలామంది ఉన్నారు. దానికి ఇపుడు ఆ ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ సాక్ష్యం. అందులో ఉన్నవాళ్ళు కూడా ఆవిడ circle లో అర వంతో, పావు వంతో. ఇంకా చాలామంది ఉండచ్చు. అంతమంది ఉండగా, వాళ్ళతో compare చేస్తే తనతో తక్కువ పరిచయమే ఉన్న నన్ను ఎందుకు అడుగుతున్నారు అనేది నా అనుమానం.
ఆ మాట అడగలేను. ఎందుకంటే కొన్ని situations లో ఆవిడ way of talking and tackling కాస్త నాకు తెలుసు. అడిగితే సుతిమెత్తగానే ‘మీకు వీలు అవుతుందో, లేదో చెప్పండమ్మా’ అని నా limits ఏంటో నాకు చెప్పగలరు. పోనీ, అలాంటి సమాధానం గురించి నా అంచనా తప్పు కావచ్చు, కారణం చెప్పేవారేమో అనుకుందామా అంటే అప్పుడు కూడా అడగలేను.
ఎందుకంటే అంత పెద్దావిడ (ఆవిడ చిన్నా చితకా మనిషి కాదు.) edit చేయమని అడిగినపుడు కారణం చెప్పమని అడిగితే కారణం చెప్పచ్చేమో కానీ, ‘ఈ గుడ్డు నన్ను ప్రశ్నించింది’ అని మనసు కష్టపెట్టుకుని బాధపడే అవకాశం ఉంది. అలా బాధ పెట్టటం నాకు ఇష్టం లేదు. అందుకని ‘ఇది hot summer కదా, concentrate చేయటం కష్టం. Summer అయిపోగానే ఆలోచిద్దాం madam’ అన్నాను.
ఆ తర్వాత వచ్చిన భయాలు ఏంటంటే మొదటిది భాషకు సంబంధించినది. విజయభారతి గారు ప్రాచీన తెలుగు సాహిత్యం చాలా అంటే చాలా చదివారు. దాని మీద ఆవిడకు పట్టు ఉంది. దాని ప్రభావం కూడా ఉంది. ఆ భాష ప్రభావం ఆవిడ రాసిన కొన్ని పుస్తకాలలో కనిపిస్తుంది. నేను తప్పొప్పుల గురించి మాట్లాడటం లేదు. ప్రభావాల గురించి చెపుతున్నానంతే. ఆవిడతో మాట్లాడినపుడు ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఉన్న flavor ని తను చాలా miss అయ్యారు, అవుతున్నారు అనిపించింది. ఎందుకంటే ఆ సాహిత్యాన్ని ఆవిడ చదివినంత చదివిన వాళ్ళు ఆమె circle లో లేరేమో అనిపించింది. ఉంటే కదా, కాసేపు దాని గురించి మాట్లాడుకుంటూ ఆస్వాదించేది.
ప్రాచీన తెలుగు సాహిత్య భాష ఒక్కటే విజయభారతి గారికి తెలుసా! అంటే కాదు. ఆ తర్వాత వచ్చిన ఆధునిక సాహిత్యం నుంచి ఇప్పటి అస్తిత్వ వాదాల సాహిత్యం దాకా చదివారు. ఆ భాష, ఆ జార్గాన్ (Particular Words. అవి అందరికీ అర్థం కావు.) తెలుసు. ఆవిడ రాసిన కొన్ని రచనలలో అది కనిపిస్తుంది. ఈ రెండు భాషలలొ నాకు ప్రావీణ్యం లేదు. ఏ భాష వాడినా handle చేయటం నాకు కష్టం కావచ్చు.
రెండో భయం emotions ని handle చేయటం. స్వీయచరిత్ర అంటే Bunch of experiences మాత్రమే కాదు, Bunch of Emotions కూడా. రాసిన వాళ్ళు, వాళ్ళ బాల్యం దాకా వెళ్ళి (Re-living in the Past అనచ్చా.) గుర్తు చేసుకుంటూ రాస్తారు. అది ఒకోసారి, ఒక్కొక్కరికి boost కావచ్చు, Painful కావచ్చు. Edit చేయాలంటే వాళ్ళ emotions యొక్క intensity ని కూడా అంచనా వేసి దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. మరి అది నాకు చేతనవుతుందా అనిపించింది. ఈ కారణాల వల్ల వెంటనే సరే అనకుండా తటపటాయించాను.
June లో విజయభారతి గారు గిరిజని అడిగారు. తను నాకు friend. మేమిద్దరం చేస్తాం అని విజయభారతి గారికి చెపితే ఆవిడ సరే అన్నారు. నాకు ఆ విషయం చెప్పి మనిద్దరం చేద్దాం అంది. సరే, ముందు material రానీ చూద్దాం అన్నాను. ఆ material చేరిన process ని గిరిజ ముందుమాటలో రాసింది. అందులో ఉన్నవి నేను ఇక్కడ మళ్ళీ చెప్పటం లేదు.
Material రాగానే bundle ఊడదీసి ముందు ఆవిడ రాసిన papers లో ఒక file తీశాను. రెండు పేజీలు చదవగానే అక్షరజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా చదవగలిగిన భాష అని అర్థం అయిపోయింది. అంత సరళంగా ఉంది. వెంటనే నా అనుమానాన్ని పక్కన పెట్టేశాను. ఒక భయం పోయింది. ఇంకో భయం ఉంది కానీ, విజయభారతి గారు పెద్దావిడ కాబట్టి, మాట్లాడినప్పుడు నేనే జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందు విజయభారతి గారికి phone చేసి మేం కలిసి పనిచేస్తాం అని చెప్పేశాను.
ఆవిడ వయసు రీత్యా రాయటంలో వచ్చిన repetitions, ముందు వెనకలు రాయటాలు … గురించి గిరిజ ముందుమాటలో రాసింది. ఆ పనులు చేస్తున్నపుడు మేం కలిసి, విడివిడిగాను (ఎవరింట్లో వాళ్ళు ఉండి పని చేస్తూ ఏదైనా clarification కావాలనుకున్నపుడు) Phone లో విజయభారతి గారితో మాట్లాడాం. అప్పుడు నేను notice చేసినది ఏంటంటే ‘మీరు నాతో Phone లో మాట్లాడండి. ఏం అడిగినా Phone లో చెపుతాను’ అని frequent గా అనేవారు. అంటే మాకు, వాళ్ళకి కలవటానికి వీలయ్యే ఆదివారాలు ఆవిడ కూతురు, మనవలతో గడపాలి అనుకుంటున్నారా! అనిపించేది.
ఆవిడ ఇబ్బందిని అర్థం చేసుకోగలం. కానీ, మేం చేసిన పనిని అప్పుడప్పుడు అయినా తనకు చూపించటం అవసరం. అలా చేయకపోతే పుస్తకం సరిగా రాకపోవచ్చు. అది మాకు ఇబ్బంది. ఈ విషయం నా బుర్రలో తిరుగుతుండగానే first draft రాయాల్సిన stage దాకా వచ్చాం.
ఒకళ్ళు arrow marks etc. చూస్తూ చదివితే ఇంకొకళ్ళు రాయలనుకున్నాం. గిరిజ రైటింగ్ బాగుంటుంది కానీ, నా రైటింగ్ బాగోదు. చిన్నపుడు మా అన్నయ్య నా రైటింగ్ చూసి ‘తమ వ్రాలు తమకే చదువరాదు’ అని జోకులు వేసేవాడు. నేను రాసింది తిరిగి చదవాలంటే నాకే అర్థం కాదు అని దాని తాత్పర్యం. ఆ స్థాయిలో ఉంటుంది నా రైటింగ్.
ఇంట్లో laptop ఉంది, Type చేయగలను. అదయితే చదవటానికి అందరికీ easy అవుతుంది అనిపించింది. ఆ మాటే గిరిజకి చెప్పి compose చేసేస్తాను అన్నాను. మా పనిలోకి ‘compose’ అనేది అలా వచ్చింది. ‘Composed files పంపిస్తాను. అమ్మకి print వేసి ఇవ్వటమో (భారతి గారు భూతద్దం చేత్తో పట్టుకుని చదువుకునేవారు.), మీరు చదివి వినిపించటమో చేయండి. Mail ID ఇస్తే files పంపిస్తాను’ అని అడిగాను. ‘తప్పకుండా చేస్తాను’ అని మహిత mail ID ఇచ్చారు. అలా పంపటం వల్ల madam కి చూడటానికో, చదవటానికో వీలు అయింది. మా ఇబ్బంది solve అయింది.
First Draft అయిపోయింది. మళ్ళీ Phone లో మాటలు. Corrections, inclusions తో 2nd draft చేశాం. దానిని మహితకి పంపించాను. ఈ పనులు చేస్తూ చదువుతున్నపుడు 1920s and 1930s లో నలుగురు ఆడపిల్లలు ఉన్న ఇంట్లోకి గొల్ల చంద్రయ్య గారు, వయసులో ఉన్న భీమన్న గారిని, అంత frequent గా ఎలా రానిచ్చారు అనిపించింది. ఇంకొక్క student కూడా వాళ్ళింటికి అలా వెళ్ళిన information ఆవిడ రాసినదాంట్లో కానీ, support గా పంపిన మెటీరియల్ లో కానీ లేదు. మరి ఈయనను అలా ఎలా allow చేశారో అర్థం కాలేదు. నా బుర్రలో ఈ ప్రశ్న తొలుస్తుండగానే 3rd draft కూడా ready అయింది.
అలా ఎందుకు చేస్తూ పోవాల్సి వచ్చిందంటే పని జరుగుతుంటే విజయభారతి గారికి ఉత్సాహం వచ్చి కొన్ని add చేసేవాళ్ళు. ‘ఏదో flow లో రాసేశాను. అప్పటి చిరాకులు కోపాలు ఇప్పుడు లేవు. వాటిని తీసేయండి’ అని కొన్ని తీసెయ్యమనేవాళ్ళు. అలా 3rd draft దాకా వచ్చింది. Complete అయిపోయిందని సంతోషిస్తూ, ఒకసారి దాన్ని చదువుతుంటే అందులో ఎక్కడా భీమన్నగారి కుటుంబం గురించి ఏమీ లేదని notice చేశాను. ఆయన అమ్మానాన్నల పేర్లే లేవు.
Phone చేస్తే ‘రాశానమ్మా, సరిగా చూడండి. Material లో వెతకండి’ అన్నారు. వెతికే phone చేశాను. మళ్ళీ వెతికాను. ఎక్కడా కనిపించలేదు. చిన్న paper మీద రాసిన వంశవృక్షం కనిపించింది. అది clear గా లేదు. ఆ విషయం చెపితే ‘ఆ వివరాలు చెపుతాను, రాసుకోండి. అవి లేకపోతే ఎలాగా’ అన్నారు. రాసుకున్నాను. విజయభారతి గారి ఇద్దరు తాతలు (అమ్మ నాన్న, నాన్న నాన్న), బొజ్జ తారకం గారి తాతగారు అందరూ friends. ఈ మూడు కుటుంబాల వాళ్ళు సన్నిహితులు. అందుకని భీమన్న గారు గొల్ల చంద్రయ్య గారి ఇంటికి సన్నిహితులుగా వచ్చేవారని నాకు అపుడు అర్థం అయింది.
భీమన్న గారి కుటుంబ వివరాలు రాసుకున్నాక వాటిని ఎక్కడ insert చెయ్యాలా అని ఆలోచిస్తోంటే స్వీయచరిత్రని ఆ వివరాలతోటే మొదలెడితే బాగుంటుంది అనిపించింది. అంతకు ముందు గొల్ల చంద్రయ్య గారి వివరాలతో మొదలయింది. గొల్ల చంద్రయ్య గారిది town అయితే పల్లయ్యదాసు గారిది గ్రామం. గ్రామీణ నేపథ్యం నుంచి ఆ కుటుంబాలు అలా ఎదగటం బాగా అనిపించింది. విజయభారతి గారితో ‘పల్లయ్యదాసు గారి కుటుంబ వివరాలతో మీ స్వీయచరిత్ర మొదలెడితే బాగుంటుందేమో ఆలోచించండి’ అన్నాను. ఎందుకు అంటే కారణం చెపుదాం అనుకున్నాను. ‘ఆ పురాణాల నేపథ్యం, ప్రాచీన సాహిత్యం, ఆ వారసత్వమేగా, భీమన్న గారిని నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. దానితోటే మొదలెట్టండి’ అన్నారు. మీరు ఈ route లో వచ్చారా అని మనసులో అనుకున్నాను.
అపుడు first chapter లో ఆ మార్పులు చేసేసి, final draft మహితకి పంపించాను. Madam చెపితే ముందు మాటలు రాయటం కోసం డా. సంగిశెట్టి శ్రీనివాస్ గారికి, డా. ఇ. సుధారాణి గారికి పంపించేశాను. Computer Work నా laptop లో చేశాను కాబట్టి వాళ్ళకి నేనే పంపించాను. విజయ భారతి గారు Happy. నేను, గిరిజ కూడా Happy. Photo లో విజయభారతి గారితో నేను, గిరిజ. February, 2022.
రెండు రోజులు పోయాక నా అనుమానం నా బుర్రలోకి మళ్ళీ వచ్చేసింది. ముందుమాట రాస్తున్న మిత్రులు (మిత్రులు అంటున్నాను కానీ, ఆయన రచనల వల్ల ఆయన అంటే గౌరవమే ఎక్కువ) సంగిశెట్టి శ్రీనివాస్ గారికి phone చేసి ‘Madam నన్నుఈ పనికి ఎందుకు choose చేసుకున్నారో తెలియటం లేదు. నేను editing పని first time చేశాను. అందులో ఏవైనా పొరపాట్లు ఉంటే చెప్పండి.’ అని అడిగాను. (ఇంకా print కి వెళ్ళలేదు కాబట్టి madam తో మాట్లాడి corrections చేసే అవకాశం ఉంది.). ’60 years పైబడిన సాహిత్య జీవితం, 80 years పైబడిన జీవితానుభవం madam వి. ఆవిడ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. మీరు ఆలోచించకండి’ అన్నారు. నిజమేగా అని relax అయిపోయాను. Thank You Sangishetty Srinivas గారు. 23-11-2024 న book release కూడా అయిపోయింది.
పుస్తకంలో నాకు ఆసక్తి కలిగించిన విషయం ఒకటుంది. అది ఒక్కటీ share చేసి ఆపేస్తాను. విజయభారతి గారు భీమన్న గారి కుటుంబ వివరాలు చెపుతుంటే రాసుకుంటున్నపుడు మధ్యలో ‘మీకు చేట భారతం తెలుసు కదా’ అన్నారు. ‘ఆ తెలుసు. Elaborate గా చెపుతున్నపుడు అంటాం కదా’ అన్నాను. ‘కాదండీ’ అన్నారు చాలా విసుగ్గా. ఆ విసుగుని translate చేస్తే ‘నా ఖర్మ కొద్దీ దొరుకుతారు ఇలాంటి వాళ్ళు’ అని దాని అర్థం. ఈ పని చేస్తున్న process లో ఆవిడవి రకరకాల modulations విన్నాను. అంత విసుగు ఎప్పుడు వినలేదు. ఆశ్చర్యపోయాను. చేట భారతం అంటే పద విశేషమో, వ్యక్తీకరణో కాదు. అది వస్తు విశేషం. నాకు ఆ విషయం తెలీదని ఆవిడ ఊహించలేదు. ఆ విసుగుకు కారణం అపుడు అర్థం అయింది. చెపుతోంటే రాసుకున్నాను.
‘పల్లయ్య గారి అన్నదమ్ములలో ఒకాయన రంగూన్ వెళ్ళి కొంతకాలం ఉండి వచ్చారు. వస్తూ చేట భారతం తెచ్చారు. చేటకి ఉపయోగించే వెదురు తడికల మీద, చేట మీద చిల్లులు కనపడకుండా మట్టి పేడతో అలికినట్లే అలికి దాని మీద భారతం రాసేవారట. దానిని ఆయన రంగూన్ నుంచి వస్తూ తీసుకు వచ్చారు. అప్పుడు లేబర్ స్కూల్లో రెండో, మూడో చదువుకుంటున్న భీమన్న గారు కూడబలుక్కుంటూ ఆ భారతం చదవటానికి ప్రయత్నం చేసేవారట. అక్షరాలలో భారతాన్ని ఆయన చూసినది అప్పుడే. అది ఆయనకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. చేట పరిమాణంలో వెదురు తడికల మీద రాయటం కదా, అవి పెద్ద పెట్టెల పరిమాణంలో ఉండేవట. దానిని చేట భారతం అని పిలిచేవారు.’ (విజయ గాథ pages-40, 41).
నేను దీనిని గురించి first time విన్నాను. రంగూన్ వెళ్ళి అక్కడ సంపాదించుకున్న సొమ్ము నుంచి కొన్నారంటే అది costly అనేది కూడా అర్థం అయింది. రాస్తుంటేనే మనసులోకి రెండు ప్రశ్నలు వచ్చాయి. ఆవిడ నన్ను చాలా విసుక్కున్నారనే విషయం మర్చిపోయి ‘మట్టి, పేడతో చిల్లులు లేకుండా చేసినా, ఎప్పుడైనా నీళ్ళు పడినా వానలో తడిసినా మట్టి పేడ పోతాయి కదా. దానిని ఎలా కాపాడటం కుదిరింది. ఆ వెదురు తడికల మీద దేనితో రాసి ఉంటారు’. అని అడిగాను. నా కుతూహలం చూసి (విని) madam కి కోపం పోయినట్లు ఉంది, నవ్వేశారు.
‘వేసవికాలంలో రెండు మూడు రోజులు గట్టిగా ఎండ కాస్తే పట పటా ముక్కలైపోయే తాటాకుల మీద గ్రంథాలు రాశారుగా. అవి అన్ని దశాబ్దాలు ఎలా ఉన్నాయి. అంటే ఏవో మూలికలూ అవీ ఉపయోగించి లేపనాలు తయారు చేసి, వాటికి పూసి రాసి ఉంటారనేది అర్థం అవుతోందిగా. అవి అప్పటి preservative methods. ఈ చేట భారతానికి కూడా అలాంటి methods ఏవో follow అయి ఉంటారు. ఇంక రాయటం విషయానికి వస్తే పండితులు గంటం ఎలా ఉండాలో నమూనా ఇస్తే వడ్రంగులో ఎవరో చేసి ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ వృత్తి కార్మికులు వెదురు తడికల మీద రాయటానికి కావలసిన పరికరాన్ని తయారు చేయలేరా!’ అన్నారు.
వావ్! అనుకుని ‘ఉండండి. ఉండండి’ అన్నాను. (రాసుకుంటున్నాను ఆగండి. తర్వాత continuation matter లోకి వద్దాం అని దాని అర్థం). ‘ఉండాల్సింది నేను కాదు, మీరు. మీ ప్రశ్నలు, నా జవాబులు ఇందులో వద్దు. నేను ఆ విషయం తర్వాత చూస్తాను’ అన్నారు. అంటే తర్వాత విపులంగా వ్యాసం రాయటమో, మరోటో (మాటల్లో record చేయటం కూడా కావచ్చు) చేస్తారన్నమాట. ఆవిడ చెప్పినట్లే అందులో రాయలేదు.
ఇపుడు విజయభారతి గారు లేరు. ఆవిడ రాయదలచుకున్న వ్యాసమో మరోటో రావు. కాబట్టి దీనిని మీకు share చేశాను. Madam తో మాట్లాడిన తర్వాత ఇంకోటి కూడా అనిపించింది. చేట భారతం ప్రసిద్ధి కెక్కింది కానీ, అదే time లో వేరే కథలో గాథలో కూడా అలా (వెదురు తడికల మీద) వచ్చి వుండచ్చు కదా అనిపించింది. దీనిని ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది.
‘విజయ గాథ’ పుస్తకం editing పనిలో నేను చాలా నేర్చుకున్నాను. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.
పుస్తకం పనిలో నన్ను భాగం చేసిన విజయభారతి గారికి, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు.