25-10-2024 రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నాగర్ కర్నూలులో కొత్తగా చేరిన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కి స్వాగతం చెపుతున్న సభ. వేదిక మీద ఆ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా, హాస్టల్ వార్డెన్‌గా కూర్చున్నప్పుడు కలిగిన ఆనందం, అనుభూతి మాటలలో చెప్పలేనివి.
ఆ స్టూడెంట్స్, వాళ్ళ తల్లితండ్రులు ఇచ్చిన ఇన్స్పిరేషన్ గురించి, తల్లితండ్రుల గురించి గర్వంగా చెపుతున్నపుడు నాకు మా అమ్మ విజయభారతి గుర్తు వచ్చింది.
నేను ఇలా ఈ వేదిక మీద కూర్చోవడానికి కారణం అమ్మే కదా అనిపించింది. అమ్మని తల్చుకుని చాలా గర్వపడ్డాను. అమ్మ ఉంటే బాగుండేది అనిపించింది. 1987లో నన్ను మెడిసిన్ చదవమని నాకు అద్భుతమైన మార్గం చూపించింది. ఇప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తున్నపుడు నేను నాకు తెలియకుండానే అమ్మ నుంచి చాలా నేర్చుకున్నాను అనిపిస్తోంది. కుటుంబ విలువలు, ఎక్కడ ఎలా ఉండాలి, ఎదటివాళ్ళు మనని అర్థం చేసుకునేందుకు, మనం వాళ్ళని అర్థం చేసుకునేందుకు వెసులుబాటు కలిగేలా టైమ్ ఇస్తూ ఎప్పుడు తగ్గి ఉండాలి, నిబ్బరంగా నిలబడి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇలా నేర్చుకున్నవి చాలానే ఉన్నాయి.
I am very thankful and grateful for her.