మానవ హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన సాయిబాబా – కొండవీటి సత్యవతి

సాయిబాబా గారి గురించి నాకెప్పుడు తెలిసింది. చాలా సంవత్సరాల క్రితం ఫేస్‌ బుక్‌లో ఎవరో రాసిన ఆర్టికల్‌ చదివినప్పుడు ఆయన గురించి వివరంగా తెలిసింది. ఆయన 90 శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని, అతి కఠినమైన నాగపూర్‌లోని అండాసెల్‌ జైలులో

ఉన్నారని విన్నప్పుడు చెప్పలేని ఉద్వేగం మనసంతా కమ్ముకుంది. నడవలేని మనిషిని ఖైదు చేసిన అమానుష ప్రభుత్వం ఆయనలో ఏమి చూసి అంత భయపడిరది. చక్రాల కుర్చీలో ఉండే మనిషిని పదేళ్ళపాటు ఒంటరి సెల్‌లో బంధించి ఆయన శరీరాన్ని, అన్ని ముఖ్య అవయవాలని ధ్వంసం చేసి కొన్ని నెలల క్రితమే నిర్దోషి అంటూ విడుదల చేసింది. అంటే ఒక నిర్దోషిని, 90 శాతం అంగవైకల్యంతోను, అనేక అనారోగ్య సమస్యలతోను బాధపడుతున్న సాయిబాబాని సుధీర్ఘ కాలం ఒంటరిగా బంధించి ఉంచి నువ్వు నిర్దోషివంటూ విడుదల చేయడం ఎంత దారుణమైన విషయమో ఈ ప్రజా వ్యతిరేక, ఫాసిస్ట్‌ ప్రభుత్వానికి అర్ధమయ్యే అవకాశమే లేదు.
చేయని తప్పుకు ఉద్యోగం పోగొట్టుకుని, యూనివర్సిటీలో క్వార్టర్‌ పోగొట్టుకుని జైలు నుండి విడుదలయ్యే నాటికి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి అక్టోబర్‌ 12న సాయిబాబా చనిపోయారు. నిజానికి ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది. ఎంతో జీవితం ముందుంది. యాభై ఎనిమిది సంత్సరాలకే ఆయన చనిపోవడం భారతదేశంలో నడుస్తున్న అన్ని ఉద్యమాలకు ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమాలకు పెద్ద గొడ్డలి పెట్టు. ఆయన భావధార, ఆయన మేధస్సు ప్రభుత్వాన్ని గడగడ లాడిరచించాయి. ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరించి ఆయన్ని మరణం అంచుల వరకు తీసుకెళ్ళి చంపేసింది ఫాసిష్టు ప్రభుత్వం.
సాయిబాబాను మొదటి సారి ప్రత్యక్షంగా చూసింది ఆయన మరణానికి ముందు హైదరాబాద్‌ వచ్చినప్పుడు కిక్కిరిసిన ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మాట్లాడినప్పుడు. మీడియా ఆయనను చుట్టుముట్టి వదలకుండా మాట్లాడిరచినప్పుడు అలసిపోకుండా ఎన్నో అంశాలు మాట్లాడారు. తన జైలు అనుభవాలను వివరించారు. ఎన్నో సార్లు వసంతతో కలిసి వేదికెక్కినా ఆరోజు ఆయనతో మాట్లాడలేకపోయాను. మీడియా ఆ అవకాశం ఇవ్వలేదు.
సాయిబాబాతో మాట్లాడలేకపోయాననే వెలితి రెండో సారి వైద్యం కోసం హైదరాబాద్‌ వచ్చి నిజాం హాస్పిటల్‌లో చేరినప్పుడు తీరింది. ఆయనతో చాలా సేపు మాట్లాడగలగడం, ఆయనతో కలిసి ఒక ఫోటో తీసుకోగలగడం తలుచుకుంటే సంతోషం, దుఖం రెండూ కలుగుతున్నాయి. ఆరోజు నేను ప్రశాంతి లంచ్‌ తీసుకుని హాస్పిటల్‌ కి వెళ్ళినప్పుడు వసంత లేరు. మేమిద్దరం ఆయన ఎదురుగా కూర్చుని ఎన్నో విషయాలను విన్నాం. తన అండాసెల్‌ అనుభవాలు, తన రచనలను, ఉత్తరాలను జైలు వాళ్ళు ఎడిట్‌ చేసే పద్దతులు వివరంగా చెప్పారు. ఈ నెల భూమిక కవర్‌ పేజీ మీద ఊర్వశి బుటాలియా ఫోటో చూసి చాలా సంతోషంగా మా ఢల్లీి ఫ్రెండ్‌ అన్నారు. మీ జైలు అనుభవాలు రాయండి సాయిబాబాగారూ భూమికలో వేద్దాం అంటే అలాగేనమ్మా తప్పకుండా రాస్తాను అన్నారు. ఆ తర్వాత ఫైజ్‌ కవిత్వం పుస్తకం గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం. మీరు అనువాదం చేసిన జిరాక్స్‌ కాపీ వసంత పంపించారని, ఈ పుస్తకాన్ని పబ్లిష్‌ చెయ్యాలని సాయి అనుకుంటున్నారని చెప్పారని చెబుతూ గీతా రామస్వామిని మొదట అడిగానని నేను చెప్పాను. హెచ్‌బిటి కవిత్వ పుస్తకాలను పబ్లిష్‌ చెయ్యలేదని, అనువాదాన్ని మరొకరు చూడాలని గీత అన్నారని చెప్పాను. ఫైజ్‌ కవిత్వాన్ని అనువాదం చేసిన ముగ్గురు వ్యక్తుల అనువాదాలను తాను చూసానని ఎవరి ప్రత్యేకత వారికుంటుందని చెపుతూ శివారెడ్డిగారు ముందు మాట రాయడం పూర్తైతే తన అనువాద పుస్తకాన్ని త్వరలో వెయ్యాలనుకుంటున్నానని అన్నారు. ఆయన మనస్సులో ఎన్నో భవిష్యత్‌ ప్రణాళికలున్నాయి. తాను మళ్ళీ కాలేజీలో చేరి తన అధ్యాపక వృత్తి కొనసాగించాలని చాలా బలంగా కోరుకున్నాడాయన.
సాయిబాబా మాట్లాడుతూనే చటుక్కున నవ్వే చిరునవ్వు అచ్చం పసి పిల్లల నవ్వులాగా ఉండడాన్ని గమనించి ఆయనని కలిసిన రోజే నేను నా ఫేస్‌ బుక్‌ పోస్ట్‌లో రాసుకున్నాను. ఆ నవ్వు నిండా అమాయకత్వం నిండి ఉంటుంది.
మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా అని ప్రశాంతి అడిగింది. తప్పకుండా తీసుకోండి అంటే మేమిద్దరం ఆయన వెనక నిలబడి ఫోటో తీసుకున్నాం. హాస్పిటల్‌లో ఆయనకి తోడుగా ఉంటున్న అనిల్‌ ఈ ఫోటో తీసాడు. ఆయన వెంటనే అనిల్‌ నా ఫోన్‌ లో కూడా తియ్యి అని తన ఫోన్‌ లో కూడా తీయించుకున్నారు. ఇదే ఆయన చివరి ఫోటో అని వసంత అన్నారు. అంతకు ముందు హాస్పిటల్లో ఆయన రూం ముందు ఉన్న చిన్న వెలగ పూల తోటలో ఉన్న బుద్ధుని ముందు తాను తీసిన ఫోటోనే చివరి ఫోటో అని వసంత అనుకున్నారు. కానీ ఆ తర్వాతే ఆయనతో మేము ఫోటో తీసుకున్నామని వసంతకు చెప్పాను. అలా ఆ రోజు ఎన్నో విషయాలు మాట్లాడి ఆయనకు భోజనం పెట్టమని అనిల్‌కి చెప్పి మేము వచ్చేసాము. ఆ తర్వాత రెండు రోజులు కూడా గడవకుండానే ఆయన చనిపోయారు.
చివరగా నా జీవితానికి ఒక గౌరవాన్ని, సార్ధకతని కలిగించిన సాయిబాబా గారి వీల్‌ చైర్‌ గురించి తప్పక రాయాలనుకుంటున్నాను.
2019లో షాహీన్‌బాగ్‌ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను, ప్రశాంతి ఢల్లీి వెళ్ళాం. షాహీన్‌ బాగ్‌ ఉద్యమం జరుగుతున్న టెంట్‌ లో మొదటి సారి వసంతను చూసాను. తానే ఫలానా అని పరిచయం చేసుకున్నారు. సాయిబాబా గారి గురించి ఆరోజు ఉద్యమ టెంట్‌ లో వసంత మాట్లాడినప్పుడు అందరూ ‘హం దువా కరేంగే’ అంటూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేసారు. వసంత ప్రసంగంలో ఆ రోజు సాయిబాబా గురించి నాకు చాలా విషయాలు తెలిసాయి.
అక్కడి నుండి నేను వసంతతో కలిసి వాళ్ళింటికి వెళ్ళాను. జైలులో ఆయన పరిస్థితి గురించి మాట్లాడుతూ పోలీసులు నిర్లక్ష్యంగా విసిరేయడం వల్ల ఆయన వీల్‌ చైర్‌ పాడైపోయిందని, విరిగిన కుర్చీతో చాలా ఇబ్బంది పడుతున్నారని చెబుతూ కొత్తది కొనాలంటే ఇరవై నుంచి ముఫ్పై వేలవుతుందని చాలా బాధగా చెప్పారు. నేను వెంటనే మీరు ఏమీ అనుకోనంటే నేను కొంటాను అంటే అయ్యో వద్దులెండి చాలా ఖర్చువుతుంది అన్నారు. నాకు ఇబ్బంది లేదు నెల నెలా నాకు పెన్షన్‌ వస్తుంది. ఇలాంటి వాటికే ఖర్చు పెడతాను మీరు ఆన్లైన్‌లో బుక్‌ చేసి నాకు బిల్‌ పంపండి అన్నాను. మొత్తం మీరే పెట్టుకుంటారా అని వసంత చాలా ఆశ్చర్యంగా అన్నారు. ఏమీ ఫర్వాలేదు అంటే తను హమ్మయ్య చాలా రిలీఫ్‌గా ఉంది తనకి డిజిటల్‌ మోడల్‌ వీల్‌ చైర్‌ కావాలి అంటే అదే కొనండి అన్నాను. 12 మార్చి 2020 రోజున వసంత సాయిబాబాకు జైలులో డిజిటల్‌ వీల్‌ చైర్‌ అందే ఏర్పాటు చేసారు. ఆ కొత్త వీల్‌ చైర్‌ ఆయనకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని తెలిసినప్పుడు నేను గొప్ప సంతోషాన్ని పొందాను. అప్పటి నుండి ఆయన అదే వీల్‌ చైర్‌ వాడుతున్నారు.
ఆ వీల్‌ చైర్‌లో ఆయనని ప్రెస్‌ క్లబ్‌లో చూసినప్పుడు కూడా చాలా తృప్తిగా అనిపించింది. ప్రపంచస్థాయి మేధో సంపదతో, సమాజంలోని సర్వుల హక్కుల కోసం, ముఖ్యంగా ఆదివాసీల హక్కుల కోసం ఆహరహం తన ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన సాయిబాబా కోసం నేను చేసిన పిడికెడంత పని నాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో నేను మాటల్లో చెప్పలేను.
అలాగే ఆయన తనకు జైల్‌లో చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలను అమెజాన్‌లో బుక్‌ చేసి నాగపూర్‌లో ఉండే ఆయన అడ్వకేట్‌ ద్వారా పంపించినప్పుడు కూడా అదే సంతృప్తి కలిగింది. సమాజం కోసం ఆలోచించి తన జీవితాన్ని పణంగా పెట్టిన మనిషి కోసం నేను చేసింది చిన్న సాయమే కానీ ఈ చిన్న పని ద్వారా నేను పొందిన ఆనందం ఎంతో విలువైంది నాకు.
సాయిబాబాకి సింబల్‌గా మారిన ఆ వీల్‌ చైర్‌ నాకిచ్చే ధైర్యం తక్కువదేమీ కాదు.
జోహార్‌ సాయిబాబా
సాయిబాబా అమర్‌ హై

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.