ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్టు మహిళా మేధావి రోజా లగ్జంబర్గ్ (1871- 1919). బెర్లిన్ (జర్మనీ)లో 2003 జనవరి 12వ తేదీన సుమారు లక్షమంది ప్రజలు రోజా లగ్జంబర్గ్ సంస్మరణ సభకు హాజర య్యారు. ఆమె తన జీవితకాలంలోనే ప్రము ఖ ప్రజా ఉద్యమ కార్యకర్తగా, మార్క్సిస్టు మేధావిగా ఎనలేని గుర్తింపునూ, కీర్తిని పొందింది. సామ్రాజ్యవాదానికీ, ప్రపంచీకర ణకూ(అమెరికనిజంకూ) వ్యతిరేకంగా తన జీవితకాలం అంతా పోరాడింది. సమకాలీన కార్యకర్తల్ని, మేధావుల్ని కలుపుకొని ముందుకు సాగింది. ఫాసిస్టు శక్తులు ఆమెని నడివయసుకంటే ముందే పాశవికంగా హత్యచేశారు. కానీ ఆమె ఆశయాన్ని ఎవ్వ రూ హత్య చెయ్యలేరు. ఆమె మరణానంతరం మరింత ప్రతిభావంతంగా, శక్తివంతంగా ప్రజా హృదయాల్లో, అభిమానుల మనోఫల కంలో జీవిస్తూవున్నది, జీవిస్తూనే వుంటుంది.
ఇక్కడ ఆమె రచనలు మూడింటిని గురించి మాట్లాడుకుందాం.
1.The Rosa Luxemberg Reader
– Edited by Peter Hudis and Kevin B. Anderson (corner stone)
2.The Essential Rosa Luxemberg
– Edited by Helen scott
ఇందులో ఆమె రెండు ప్రధాన వ్యాసాలున్నాయి
Reform and Revolution- and The Mass strike (Danish Books)
3. The National Question selected writings (Aakar Books)
ఈ మూడు పుస్తకాలూ చదివితే అధ్యయనం చేస్తే లగ్జంబర్గ్ ఆలోచనా ధోరణి మనకు క్షుణ్ణంగా తెలుస్తుంది. ఆమెది ప్రధానంగా మార్క్సిస్టు దృక్పధం. సమకాలీన ప్రపంచ రాజకీయ సమస్యలన్నిట్నీ అధ్యయనం చేసింది. ఆమె రచనల్లో మనకు లోతయిన విశ్లేషణ లభిస్తుంది.
పోలాండ్‌లో జన్మించిన రోజా- సోషలిస్టు పార్టీల నిర్మాణంలో, కార్యకలాపా ల్లో చురుగ్గా పనిచేసింది. 1919 నాటి స్పార్టసిస్ట్ తిరుగు బాటు తరువాత – బెర్లిన్‌లో ఆమెని నిర్భంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. కాని ఆమె భావజాలాన్ని ఏం చేయలేకపోయారు. కాగా మరణం తరువాత ఆమె తన రచనల ద్వారా ప్రజలకూ, అభిమానులకూ, మార్క్సిస్టు కార్యకర్తలకూ మరింత చేరువయ్యింది.
మంత్లీరివ్యూ ప్రెస్ ప్రచురించిన రోజా లగ్జంబర్గ్ రీడర్‌లో ఆమె ప్రధాన రచనలన్నీ ఉన్నాయి. భారతదేశంలో కార్నర్ స్టోన్ పబ్లికేషన్స్, ఖరగ్‌పూర్-వారు ప్రచురిం చారు. 447 పేజిల బృహద్ గ్రంధం.
మరొక పుస్తకం – ది స్సెన్షియల్ రోజా లగ్జంబర్గ్‌ను డేనిష్‌బుక్స్ ప్రచురించారు. ఈ పుస్తకంలో ఆమె ప్రధాన రచనలు రెండు ఉన్నాయి. 1. రిఫామ్ ఆర్ రివల్యూషన్ 2. ది మాస్ స్టైక్ The National Question – selected writers-Monthly Review press, Newyork- వారు ప్రచురించగా దానిని భారతదేశంలో Aakar books వారు ప్రచురించారు. The Rosa Luxemberg Reader లో ఆమె ప్రధాన రచనలు The National Question – Selected Writings.
రోజా లగ్జంబర్గ్ రచనల అధ్యయ నం చెయ్యడం ఈ తరానికి ఎంతయినా అవసరం. ఆమె పనిచేసినట్టు వివిధ ప్రజా ఉద్యమాల్లో వారు పనిచెయ్యడానికి తగిన స్ఫూర్తి ఆమె రచనలు ఇస్తాయి.
ఇవ్వాళ భారతదేశంలో – వందన శివ, మేధా పాట్కర్ మొదలైన వివిధ ఉద్యమాల్లో పనిచేస్తున్నారు. పర్యావరణం, స్త్రీ వాదం, ప్రపంచీకరణ మొదలైన రంగాల్లో పనిచేస్తున్నారు. సాధారణ మహిళలు, కార్యకర్తలు ఆ స్ఫూర్తిని తీసుకుని పనిచెయ్యాలి. ఏదీ తనంత తాను సాధ్యంకాదు. మనం పట్టుదలతో, దృఢ దీక్షతో పని చెయ్యాలి. అందుకు రోజా వంటివారి నుంచి ఉత్తేజాన్ని తీసుకోవాలి.
ఎవరి పరిధిలో వారు సమస్యల పై చర్చించడం, ఐక్యపోరాటాలు నిర్మిం చడం, భావజాల సారూప్యం గలవారిని కలుపుకుని వెళ్లడం ఎంతో అవసరం. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో వుండాలి. పురు షాధిపత్యం భావజాలంపై ఉద్యమించాలి. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుని ముందుకు సాగాలి.