నాన్న వరాల తల్లి, అమ్మ గారాలపట్టి. ఒక్కగానొక్క ముద్దుల కూతురు వరంగల్ జిల్లా నుండి తన జీవిత లక్ష్యాన్ని సాధించాలని బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో రాణించాలని గుంటూరు ”ఆచార్య నాగార్జున యూనివర్సిటీ”లో చేరింది రిషితేశ్వరి. వచ్చిన మొదటి రోజే చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. సీనియర్స్ రాక్షసులల్లె జూనియర్స్‌ని పీక్కుతినే జూదం పేరే ”ర్యాగింగ్”. ఆ అవమానాన్ని భరించలేక ఒక నిండు ప్రాణం బలి అయింది. ఆ ప్రాణం మీద ఆశలు పెట్టుకున్న అమ్మా నాన్న తను ఇక ఈ లోకంలో లేదు అని తెలుసుకున్నాక వారు ఒక జంతువులా జీవనం సాగిస్తున్నారు. కానీ ఆ తల్లి కడుపుకోత ఆ తండ్రి గుండెకోత ఏ ఒక్కరికి అర్థం కాదు. ముఖ్యంగా ఆ ప్రాణాన్ని బలితీసుకున్న అసురులకు అసలే అర్థం కాదు. అలాంటి వాళ్ళని నడిరోడ్డుమీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాలి. ”ఆడవారికి ఆడవారే శత్రువులు” అనేది ఒక నానుడి. కాని రిషితేశ్వరి విషయంలో అదే నిజమయింది. ఆ అమ్మాయిని ర్యాగింగ్ పేరుతో మనలాంటి ఒక ఆడపిల్లే కదా అనే ఆలోచన కొద్దిగా కూడా లేకుండా ప్రాణాలకు విలువ కూడా తెలియదా? ప్రాణాలకు విలువ కూడా లేదా? రిషితేశ్వరి విషయంలో ఇంకొక విషయం గురువులను కూడా నమ్మకుండా చేస్తుంది. ఆ అమ్మాయి ప్రాణం కోల్పోడానికి గురువులు కూడా చేయి అందించారు. ఇప్పుడు నిజ నిర్థారణ కమిటీ వచ్చి ఆయన్ని సస్పెండ్ చేసినంత మాత్రాన రిషి తిరిగి రాదుగా. ఆ తల్లి కడుపుకోత ఎవరు తీర్చలేరుగా? దీనికి ప్రభుత్వం నష్టపరిహారం అంటే ఒక నిండు ప్రాణానికి వెలకట్టినట్టే. ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవారిపై అరాచకాలు ఆగవు – అభయ, నిర్భయ అని ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ఈ ప్రపంచం మారదు. అందరు అంటూ ఉంటారు ఎవరో ఒక మహానుభావుడు రావాలి అని. ఎవరిదాక ఎందుకు మనలోనే ఎవరో ఒకరు ఉంటారు. రిషితేశ్వరి లాంటి స్థితి ఎవరికి రాకుండా
ఉండాలని కోరుకునే వాళ్ళలో మనము ఒకరిమౌదాము. May her soul rest in peace. Prohibit Ragging.