నోబెల్‌ పురస్కార మహిళామణులు – 2015- వేములపల్లి సత్యవతి

ఈసారి విచిత్రంగా రెండు సోషలిస్టు దేశాలయిన రష్యా, చైనా దేశాలకు చెందిన మహిళలు నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. రష్యాలో లెనిన్‌ నాయకత్వాన సోషలిస్టు ప్రభుత్వ స్థాపన జరిగింది (నేడు లేదు). చైనాలో మావో నాయకత్వాన కమ్యూనిస్టు ప్రభుత్వ పాలన కొనసాగింది. నేడూ కొనసాగుచున్నది. నోబెల్‌ పురస్కారానికి ఎంపికయిన రష్యాకు చెందిన మహిళ స్వెత్లానా లెనిన్‌ పరిపాలిస్తున్నప్పుడు, చైనాకు చెందిన యుయుతు, మావో పరిపాలిస్తున్న కాలంనాటివారు కావటం మరోవిశేషం. ఇరువురు ఒకేసారి ప్రతిష్టాత్మకమయిన నోబెల్‌ పురస్కారానికి ఎంపికవటం ఆశ్చర్యం, ఆనందం.

స్వెత్లానా 31 మే 1948లో లెనిన్‌ కాలంనాటి రష్యాలో పుట్టింది. తండ్రి బెలారసియన్‌ జాతికి చెందినవాడు. తల్లి ఉక్రేనియన్‌ జాతికి చెందినామె. తల్లి తండ్రులిరువురు భిన్న సాంస్క ృతిక జాతులకు చెందినవారు కావటం వలన ఆ ఇంటి వాతావరణం స్వెత్లానా వ్యక్తిత్వాన్ని భిన్నమైనదిగా తీర్చిదిద్దింది. చదువు ముగిసిన తర్వాత చిన్న చిన్న పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసింది. తదుపరి ‘నేమ్యావ్‌’ అనే సాహిత్య పత్రికలో ఆమెకు పని దొరికింది. సాహిత్య పత్రికలో పనిచేయటం మొదలు పెట్టిన తర్వాత స్వెత్లానాకు సాహిత్యంమీద అభిరుచి ఏర్పడింది. నెమ్మది నెమ్మదిగా మొదలు పెట్టిన ఆమె రచనా వ్యాసంగం పదును తేలిన రచనలు చేసే స్థాయికి చేరుకుంది. యుద్ధాలకు, అంతరిక్ష అణు పోటీల ప్రయోగాలకు కోట్ల కొలది ప్రజాధనం ఖర్చు చేయటాన్ని స్వెత్లానా కలం ఖండించింది. యుద్ధ సమయాలలో ప్రజల కడుపులు నింపవలసిన ఆహారాన్ని, వారి కడుపులు మాడ్చి యుద్ధరంగానికి తరలించటానికి వ్యతిరేకంగా ఆమె రచనలు చేయసాగారు. అంతర్యుద్ధాలను, విదేశీ యుద్ధాలను, ప్రపంచ యుద్ధాలను అన్నిటిని, వాటివలన జరిగే అనర్థాలను అన్నిటిని తూర్పారపట్టింది. అణుయుద్ధాల అనర్థాలు ఆమెను కలచివేశాయి.

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌లోని నాగసాకి, హిరోషిమాలపై హైడ్రోజన్‌ బాంబులు వేసింది. లక్షలమంది జనం చనిపోయారు. వేల మైళ్ల దూరం వరకు అక్కడి నేల నేటికీ నిరుపయోగంగా పడివుంది. చెర్నోబిల్‌ (రష్యాలో) అణుధార్మిక కర్మాగార విస్ఫోటనం వలన కూడ నాగసాకి-హిరోషిమా లాగానే లక్షలమంది మరణించారు. నేటికీ ఆ ప్రాంతంలో ఒక పచ్చని మొక్క మొలవదు.  ఈ ఘటన ఆమెను నిలువెల్లా దహించివేసింది. సోవియెట్‌, ఆఫ్ఘాన్‌ యుద్ధాన్ని వ్యతిరేకించింది. ఆఫ్ఘాన్‌లోను, తన దేశంలోను యుద్ధంలో గాయపడిన సైనికులను, వారి కుటుంబాలను కలుసుకుంది. వారి ఇంటర్వ్యూలు తీసుకుంది. మొదట ఆనాటి ఆమె దేశ ప్రభుత్వం ఆమె రచనలు నిషేధించి, ఆమెను దేశ బహిష్కారం చేసింది. ఫ్రాన్స్‌, జర్మన్‌, స్వీడన్‌ మొదలగు దేశాలలో పదకొండు సంవత్సరాలు ప్రవాస జీవితం గడిపింది. 2011వ సంవత్సరంలో తాను పుట్టిపెరిగిన గడ్డమీద కాలు మోపింది. సాహిత్య శాంతి నోబెల్‌ పురస్కారాలు అందుకున్న వారిలో స్వెత్లానా 14వ (పదునాల్గవ) ఆమె యుద్ధాలపై అక్షర యుద్ధంచేసిన స్వెత్లానాను అభినందించకుండా ఉండలేము.

చైనా మహిళా శాస్త్రవేత్త యుయుతు

ప్రతి సంవత్సరం స్వీడన్‌దేశం అన్ని రంగాల్లోని శాస్త్రవేత్తలను నోబెల్‌ అవార్డుకు ఎంపిక చేసి వారికి ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ అవార్డును ప్రదానం చేస్తున్నది. ఈ సంవత్సరం ఎంపిక చేసిన శాస్త్రవేత్తల్లో చైనాకు చెందిన మహిళా శాస్త్రవేత్త యుయుతు, రష్యాకు చెందిన బెలారస్‌ రచయిత్రి స్వెత్లానా అలెగ్జివిచ్‌ కూడా ఉన్నారు. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వ పాలన జరుగుచున్నది. రష్యాకు లెనిన్‌ ఎటువంటి వాడో చైనాకు మావో అలాంటి నాయకుడే. యుయుతు మలేరియా ప్రాణాంతక జ్వరానికి మందు కనిపెట్టింది. శాస్త్రవేత్తలు తాము కనిపెట్టిన మందులను ముందుగా ఎలుకల మీద, కోతుల మీద ప్రయోగించి చూస్తారు. కాని యుయుతు తాను కనిపెట్టిన మందును తన మీదనే ప్రయోగం చేసుకున్న ధీర మహిళా శాస్త్రవేత్త. మందు పేరు ”ఆర్టెమైసినిస్‌”.

మలేరియా జ్వరం ఒక రకానికి చెందిన దోమకాటువలన వస్తుందని వైద్యులు తెలుసుకున్నారు. ఈ జ్వరం ఒక రకంగా తగ్గదు. చలితో వస్తుంది. మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. మలేరియా జ్వరానికి మామూలు మనుషులే కాకుండ యుద్ధరంగంలోని వేలాది సైనికులు కూడా వ్యాధిగ్రస్తులవటం, వందలకొలది సైనికులు చనిపోవటం జరుగుతుంది. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా బాంబులవలన చనిపోయిన వారికంటె, మలేరియా జ్వరంతో చనిపోయిన చైనా సైనికుల సంఖ్య అధికంగా వుండటం మావో గ్రహించాడు. దీనిని అంతమొందించే శక్తివంతమయిన మందును కనిపెట్టమని తనదేశ శాస్త్రవేత్తలకు పిలుపు ఇచ్చాడు. ప్రోత్సహించాడు. మావో పిలుపుతో శాస్త్రవేత్తలు ”టాప్‌ సీక్రెట్‌ 523” పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించారు.

యుయుతు వెంటనే పరిశోధనారంగంలో ప్రవేశించింది. బీజింగ్‌లోని ‘అకాడమీ ఆఫ్‌ ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడిసిన్‌’లో చేరింది. రెండువేల ప్రాచీన మూలికా రెసిపీలను రివ్యూ చేసింది. వాటిలో పదహారు వేల సంవత్సరముల క్రిందట రాసిన రాతప్రతిని ఆమె సాధించింది. ఆ రాత ప్రతిలో ”స్వీట్‌ వామ్‌ వుడ్‌” (మంచిపత్రి)ను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే మలేరియా జ్వరానికి అద్భుతంగా పనిచేస్తుందని రాసివుంది. నానపెట్టిన నీటిని మొదట కోతుల మీద, ఎలుకల మీద ప్రయోగించి చూసింది. మంచి ఫలితాలు కనిపించాయి. కాని మనుషుల మీద ప్రయోగిస్తే ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న సందేహం కలిగింది. మనిషి మీద ప్రయోగించి చూడాలనుకున్నారు. ఆ పరిశోధనా బృందానికి నాయకత్వం వహిస్తున్న యుయుతు తన మీదనే ప్రయోగించి చూడటానికి ముందుకొచ్చిన ధీర మహిళా శాస్త్రవేత్త. ఎలాంటి దుష్ప్రభావం కనిపించలేదు. దట్టమైన అడవులలో పనిచేస్తూ మలేరియాకు గురయిన వారికి ఆ నీటిని త్రాగించారు. అద్భుతంగా పనిచేసింది. వారిలో మలేరియా మటుమాయమైంది. ఆ మందు వాడకం వలన అనతి కాలంలోనే మలేరియా పీడితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవటం గమనించారు. విచారం కలిగించే విషయమేమిటంటే అది కనిపెట్టినందుకు యుయుతుకు తగిన గుర్తింపు ఆ దేశంలో లభించలేదు. మందు కనిపెట్టమని ప్రకటించిన మావో కాలంలోగాని, అతని మరణానంతరంగాని యుయుతుకు ఎలాంటి గుర్తింపు రాలేదు. మట్టిలో కలసిన మాణిక్యం అయింది యుయుతు. అదే యూరప్‌, అమెరికా లాంటి దేశాల్లోనైతే ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. 1977 వరకు మలేరియాను గురించి ఆమె రాసిన వ్యాసాలు అచ్చవలేదు.

లూయిస్‌ మిల్లర్‌ అమెరికాదేశపు శాస్త్రవేత్త. 2005లో చైనా వెళ్లాడు. చైనా శాస్త్రవేత్తలను కలిశాడు. ఆ సందర్భంలో ఆయన చైనా శాస్త్రవేత్తలను ”ఆర్టెమైసినిస్‌” ను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరని ప్రశ్నించాడు. ఆ శాస్త్రవేత్తల్లో ఒక్కరుకూడా కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు చెప్పలేకపోయారు. అసలు వారెవరికి యుయుతును గురించి తెలియదు. కాని లూయిస్‌ మిల్లర్‌కు ఆ శాస్త్రవేత్తను కలుసుకోవాలన్న బలమైన కోరిక ఉన్నది. వెతికే పనిలో పడ్డాడు. చివరకు లూయిస్‌ ప్రయత్నం ఫలించింది. బీజింగ్‌లోని ఒక పాతపడిన అపార్ట్‌మెంట్‌లో ఆమెను కలుసుకోగలిగాడు. ఆమెను ప్రపంచానికి పరిచయం చేసాడు. వెలుగులోనికి తెచ్చాడు. 2011లో అమెరికాకు చెందిన వైద్య ప్రశంస ‘లాస్కర్‌’ అవార్డును ప్రదానం చేసి నమస్కరించాడు. 2015లో నోబెల్‌ గ్రహీతల పేర్లలో యుయుతు స్థానం సంపాదించుకుంది. ఆమెకు స్వదేశంలో గుర్తింపు రాకపోవటానికి ముఖ్య కారణం సోషలిస్టు వ్యవస్థలో సామూహిక సిద్ధాంతం ముఖ్యమయినది. వ్యక్తి గుర్తింపు కన్న సమిష్టి గుర్తింపు ప్రాధాన్యత చెందింది. బహుశ ఆ కారణాల చేత వైద్యరంగంలో యుయుతుకు ఆదేశంలో గుర్తింపు రాలేదేమో! చివరకు ఆమె కృషికి గుర్తింపు లభించినందుకు మనమందరము అభినందనలు తెలుపుదాం.

మనదేశంలో పురుషుల్లో విశ్వకవి ఠాగూరు, సి.వి. రామన్‌, అమర్త్యసేన్‌ మొదలగు వారు నోబెల్‌ పురస్కార గ్రహీతలు. మహిళల్లో ఒకే ఒక్క మదర్‌ థెరిస్సా ఉన్నారు. మనదేశపు మహిళలు వివిధ రంగాలలో పురుషులకంటె ధీటుగా అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఆకాశయానం, అంతరిక్ష, పరిశోధనశాఖ, త్రివిద దళాలు, సరిహద్దుల్లో భద్రతా దళాలలోను ప్రవేశించి అద్భుతాలు చేస్తున్నారు. అదేవిధంగా వివిధ పరిశోధనా రంగాలలో ప్రవేశించి, మేడమ్‌ క్యూరీలాగ, ఇరాన్‌కు చెందిన శిరీన్‌ ఇబాదీలాగ, యెమెన్‌కు చెందిన తవక్కుళ్‌ కర్మన్‌లాగ, రష్యాకు చెందిన స్వెత్లానాలాగ, చైనాకు చెందిన యుయుతులాగ మనదేశ మహిళలు కూడ నోబెల్‌ అవార్డు పొందేలాగ ముందుకు సాగాలని, సాధించాలని ఆశిద్దాం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.