సంపాదకీయం

హింసలేని సమాజం కోసం…

పితృస్వామ్య భావజాలం, ఫ్యూడల్‌ సంస్కృతి బలంగా పట్టి ఉన్న భారతీయ సమాజంలో స్త్రీలు భిన్నరూపాల్లో హింసని అనుభవిస్తున్నారు. పితృస్వామ్య కుటుంబ పరిధిలో పుట్టుక నుంచే వివక్షని, హింసని ఎదుర్కొంటున్నారు. ఇంట్లో గృహ హింసతో పాటు పనిచేసే చోట, బహిరంగ స్థలాల్లోనూ తీవ్రమైన హింసని అనుభవిస్తున్నారు. నిజానికి తాము హింసని అనుభవిస్తున్నామనే స్పృహనివ్వకుండా అనేక రకాల ఆచారాలు, కట్టుబాట్లు స్త్రీలని కట్టిపడేసి ఉంచుతున్నాయి. నానా రకాల హింసల్నుంచి తప్పించుకునే వీలు కల్పించే అనేక చట్టాలున్నప్పటికీ, ఆ చట్టాలను ఉపయోగించుకోనివ్వని అణచివేతలో, అవగాహనా రాహిత్యంలో ఆధునిక మహిళలు సైతం ఉన్నారు. ఆస్తి హక్కు ఉన్నప్పటికీ, భర్త విదిలించే మనోవర్తి కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి, నివసించే ఇంట్లో హక్కున్నప్పటికీ అర్థరాత్రి, అపరాత్రి ఇంటినుండి పిల్లలతో సహా గెంటివేయబడడం, తమ రక్షణార్ధం ఎన్నో చట్టాలున్నప్పటికీ ”న్యాయం” ఇవ్వని న్యాయస్థానాలు, ప్రజల రక్షణ కోసమే ఉన్నా ఎటువంటి రక్షణ ఇవ్వని పోలీసు వ్యవస్థ… వెరసి… హింసలో కునారిల్లే బాధిత మహిళలకు ఎలాంటి చేయూత, సహకారం, రక్షణ ఇవ్వని పితృస్వామ్య వ్యవస్థలు… వీటన్నింటి మీదా పనిచేయడానికి, స్త్రీలకు అండగా ఉండడానికే భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ రూపుదిద్దుకుంది. పాత భావాల మార్పు కోసం, నూతన భావజాల వ్యాప్తి కోసం 1993 నుండి పత్రిక ద్వారా, ప్రత్యక్షంగా బాధిత మహిళలకు చేదోడు వాదోడుగా, అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో 1995లో భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా సామాజిక రంగంలోకి వచ్చాం.

హింసలేని సమాజ నిర్మాణం ముఖ్య లక్ష్యంగా భూమిక మూడు దశాబ్దాలుగా వివిధ అంశాలమీద పనిచేస్తోంది. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావద్భారత దేశంలోను భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా తన కార్యకలాపాలను విస్తృతం చేసుకుంది. భూమిక హెల్ప్‌లైన్‌ ప్రారంభించి దశాబ్దకాలం దాటిపోయింది. ఈ పది సంవత్సరాలలో దాదాపు 70 వేల మంది స్త్రీలు హెల్ప్‌లైన్‌ కౌన్సిలర్‌లతో తమ సమస్యల గురించి మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్‌ల సహకారం తీసుకున్నారు. ప్రస్తుతం హెల్ప్‌లైన్‌ 24 గంటలూ పనిచేస్తోంది. అలాగే మేము సమస్యలనెదుర్కొనే మహిళల కోసం వివిధ పోలీస్‌ స్టేషన్లలో సపోర్ట్‌ సెంటర్లు కూడా నడుపుతున్నాం. సి.ఐ.డి. కార్యాలయం (మాసాబ్‌ ట్యాంక్‌)లో ఇద్దరు కౌన్సిలర్లతో భూమిక సపోర్ట్‌ సెంటర్‌ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల నుండి ఈ సెంటర్‌కి కేసులొస్తాయి. బాధిత స్త్రీలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతోపాటు ఆమెకి అవసరమైన అన్ని సహాయాలను ఈ సెంటర్‌ అందిస్తుంది. బాధిత స్త్రీ కోరితే భర్తను, అత్తమామలను, తల్లిదండ్రులను సెంటర్‌కు పిలిపించి గ్రూప్‌ కౌన్సిలింగ్‌ కూడా ఇవ్వడం జరుగుతుంది.

2015లో ఐటి కారిడార్‌, గచ్చిబౌలి విమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో భూమిక సపోర్ట్‌ సెంటర్‌ ప్రారంభించాం. ఈ సెంటర్‌లో ప్రస్తుతం ఒక కౌన్సిలర్‌ ఉన్నారు. ఎక్కువగా ఐటి ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారాలనాశిస్తూ ఈ సెంటర్‌కి వస్తున్నారు. ఈ సెంటర్‌లో ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కౌన్సిలర్‌ అందుబాటులో ఉంటారు.

త్వరలో సరూర్‌ నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో భూమిక సపోర్ట్‌ సెంటర్‌ ప్రారంభం కాబోతోంది. రాచకొండ కమీషనరేట్‌ పరిధిలో ఈ సెంటర్‌ నడుస్తుంది.

2015లో హైదరాబాద్‌లోని చెంచల్‌ గూడాలో వున్న మహిళల ప్రత్యేక కారాగారంలో ఖైదీల కోసం ఒక సపోర్ట్‌ సెంటర్‌ను ప్రారంభించాం. ఇక్కడ ఖైదీలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతోపాటు వారి పిల్లల విద్య తదితర అవసరాలు, వారి కుటుంబాలతో మాట్లాడడం, విడుదలైన ఖైదీల బాగోగులు చూడడం కూడా ఈ ప్రాజెక్టులో భాగమే.

అలాగే 2015 నుండి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో బాల్య వివాహాల నివారణ కోసం పనిచేస్తున్నాం. బాలికలను సాధికారులను చేయడం, పాఠశాలల్లో

ఉంచగలగడం, బాల్య వివాహాలను ఆపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. భూమిక హెల్ప్‌లైన్‌ నంబరు తొమ్మిదో తరగతి పుస్తకంలో ప్రభుత్వం ప్రింట్‌ చేయడం వల్ల ఈ నంబరు విస్తృతంగా విద్యార్ధుల్లోకి వెళ్ళింది. బాల్య వివాహాల గురించి విద్యార్థుల నుండే హెల్ప్‌లైన్‌కు కాల్స్‌ ఎక్కువ వస్తాయి. అందుకే ఇప్పటివరకు కొన్ని డజన్ల పెళ్ళిళ్ళను ఆపగలిగాం.

ఇటీవల కాలంలో షీ టీమ్స్‌ పోలీసులతో కలిసి పనిచేయడం ద్వారా పబ్లిక్‌ స్థలాలు స్త్రీలు, బాలికలకు సురక్షిత ప్రాంతాలుగా ఉండేలా కృషి చేస్తున్నాం. షీ టీమ్స్‌ పోలీసులకు దొరికే ఆకతాయిలకూ, పబ్లిక్‌ స్థలాల్లో స్త్రీలపై హింసకు పాల్పడే నిందితులకు, వారి కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో స్త్రీల పట్ల అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తే వారు ఎదుర్కోబోయే తీవ్ర పరిణామాలను వారికి వివరించడం, కౌన్సిలింగ్‌ ఇవ్వడం ద్వారా పురుషులు/మైనర్‌ బాలురిలో మార్పుకై పనిచేస్తున్నాం.

భూమిక పత్రిక ద్వారా, భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ ద్వారా చేపట్టే అనేక కార్యక్రమాలతో హింసలేని సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటోంది, ఆ దిశగా పనిచేస్తోంది. ముగ్గురు వ్యక్తులతో మొదలై 27 మందిగా విస్తరించి, 200 మందికిపైగా వాలంటీర్లు, న్యాయవాదుల సహకారంతో తమ లక్ష్యంవైపు సాగుతోంది.

ప్రభుత్వ వ్యవస్థలు, పోలీస్‌, న్యాయవ్యవస్థ స్త్రీల పట్ల జండర్‌ స్పృహతో ప్రవర్తించేలా వారిని చైతన్యపరచటానికి వివిధ స్థాయిల్లో శిక్షణలు ఇవ్వడం జరుగుతోంది.

మీకేదైనా సమస్య ఎదురైతే మౌనంగా వుండకండి. అందుబాటులో వున్న సపోర్ట్‌ సిస్టమ్‌ని ఉపయోగించుకోండి. హెల్ప్‌లైన్‌కి కాల్‌ చేయండి. 100 (పోలీస్‌)కి కాల్‌ చేయండి. షీ టీమ్స్‌కి కాల్‌ చేయండి. భూమిక సపోర్ట్‌ సెంటర్లలో అందుబాటులో వున్న సేవల్ని వినియోగించుకోండి. హింసను భరించటం కాదు, ఎదిరించటం, ప్రశ్నించటం నేర్పుకోండి.

మౌనం వీడండి… హెల్ప్‌లైన్‌ మీ కోసమే…

మేము మీతోనే… 24 గంటలూ…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.