జూపాక సుభద్ర
కుల వ్యవస్థలో మానవ హక్కులు కోల్పోయిన శూద్ర, దళిత కులాలకు, స్త్రీలకు 1848లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారికి చదువు చెప్పిన మొదటి ఉపాధ్యా యిని ‘సావిత్రిబాయి ఫూలే. బతికినంత కాలం స్త్రీవిద్యకోసం, అంటబడనివారికి చదువునందించడానికి శ్రమించింది. బ్రాహ్మణాధిక్య హిందు సమాజంపై తిరుగు బాటు చేసింది. మద్యపానంపై పోరాడింది. కార్మిక , కర్షక అభ్యున్నతికి ఉద్యమాలు నడిపింది. జ్యోతిబాఫులేతో కలిసి సత్యశోధన సమాజాన్ని స్థాపించి సామాజిక న్యాయం కోసం కృషి చేసిన సంఘసంస్కర్త సావిత్రిబాయిఫూలై. ఆమె మంచి టీచరని గొప్ప సామాజిక సేవకురాలని బ్రిటిషు ప్రభుత్వాలు గుర్తించి గౌరవించినయి. కాని ఆమె సేవను గుర్తించడానికి బ్రాహ్మణాధిపత్య భారతదేశానికి శతాబ్దంన్నర కాలం బట్టింది. ఆ గుర్తింపునకు గుర్తుగా ఆమె పేరు మీద ఒక స్టాంపు వేసి చేతులు దులిపేసుకున్నది కేంద్రప్రభుత్వం.
కుల సంఫల రాజకీయ చైతన్యాల వత్తిడివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే జ్యోతిబాపులే జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని జరపడానికి నిర్ణయించింది. కాని జ్యోతిబాపూలేతో పాటు సమానంగా సమాజానికి సేవ జేసిన సావిత్రిబాయిఫూలే జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని మరిచింది.
ఆధునిక భారతదేశానికి మొదటి టీచర్ సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే ‘వలి’ అనే బీసి కులస్థురాలు. ఆమె 193 జనవరి 3న మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఖండాలా ప్రాంతంలో గల నాయగావ్‌లో పుట్టింది. తల్లి లక్ష్మిబాయి, తండ్రి ఖండోజి.సావిత్రిబాయి వంటకో… యింటికో పరిమితమైన కులం నుంచి వచ్చినామెకాదు. పనిపాటల శ్రమజీవనంలో బతికే కులం నుంచి వచ్చింది. సావిత్రిబాయి ఆడదిక్కు లేని జ్యోతిబాఫూలే యింటికి తొమ్మిదేళ్లకే అతని భార్యగా అడుగుపెట్టింది. అప్పట్నించి జీవితాంతం సామాజిక ఉద్యమ కార్యకర్తగా, నేతగా కొనసాగింది. జ్యోతి బాఫూలే మరణానంతరం కూడా సత్యశోధక సమాజాన్ని మొక్కవోకుండా ముందుకు నడిపిన ఉద్యమకారిణి.
‘నువ్వు యింటిపట్టునుండు నేను పోరాటం జేస్తా’ అనే మగవాళ్లకన్నా జ్యోతిబాఫూలే వేయిరెట్లు జెండర్ ప్రజాస్వావ్యన్ని సావిత్రిబాయిఫూలే పట్ల కనబరచాడనొచ్చు.ఫూలే తన చదువును చైతన్యాన్ని, చదివిన ప్రతి పుస్తకాన్ని సావిత్రిబాయికి పంపేవాడు. అట్లా పంచుకున్న వాటిలో ఫూలేని తీవ్రంగా ప్రభావితం చేసి మనిషిి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వాలవైపు నడిపించింది ధామస్‌పైన్ రాసిన ‘రైట్స్ ఆఫ్ వన్’. అట్లాంటి చైతన్యంఫూలేతో అంది పుచ్చుకున్నందువల్లనే హిందు బ్రాహ్మణ సమాజంనుంచి తీవ్ర ప్రతిబంధకాలెదురైనా ధైర్యంగా సావిత్రిబాయి మొదటి బాలికా పాఠశాలకు మొట్ట మొదటి భారత మహిళా టీచరయింది. ఆడపిల్లలకు, అంటబడనోల్లకు చదు వెందుకు? ఆడదై వుండి బలాదరుగ బజారు కొచ్చి చదువు చెప్పుడేందని, సంగానికి కీడని, విరుద్దమని ఛీకొట్టినా, ధ..ధ అని తిట్టినా, అలుకునీల్లు మీద బోసినా… ఆ అవమానాలన్నింటిని భరించి మహిళలకు నిమ్న జాతులకు చదువు చెప్పింది సావిత్రిబాయిఫూలే.
కొల్మాటినీల పేరుతో, తమాషాల పేరుతో దళిత కులాల ఆడవాల్ల మీద జరిగే వ్యభిచార దురాచారాలకు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి ఉద్యమించింది. సతి, వితంతు, వైధవ్యం, అనాధ బాలలు(సమాజావెదం లేని సంతానం) వంటి సమస్యలు నిమ్నజాతి స్త్రీలవి కావు. అవి బ్రాహ్మణ స్త్రీల చుట్ట ఆవరించిన దురాచారాలుగా వుండేవి. నిమ్నజాతికి చెందిన సావిత్రిబాయి ఒక వైపు బ్రాహ్మణాధిపత్యం పట్ల వ్యతిరేక ఉద్యవలు నడుపుతూనే బ్రాహ్మణ స్త్రీ బాధితుల్ని అక్కున చేర్చుకుని వారికోసం ఆశ్రమం నెలకొల్పింది. వారి సాంఘిక దురాచారాల నిర్మూలనకు పోరాడింది.
సావిత్రిబాయిఫూలే సంస్కరణో ద్యమాలు తన జాతివరకే పరిమితం కాకుండా సామాజంలోని బాధితులందరిపట్ల సేవాదృక్పధం కనబరిచింది. ఆమెకున్న యీ విశాల దృక్పధానికి చరిత్రలు ఏ గుర్తింపులు, విలువలు యివ్వలేదు. సావిత్రిబాయి నిమ్నజాతిలో కాకుండా ఏ ఆధిపత్య బ్రాహ్మణకులంలోనో పుట్టి వుంటే ఆమె చేసిన సామాజిక సేవకు చరిత్రంతా వెకరిల్లేది. ఆమె ‘వలి’ కులంలో పుట్టి కులవ్యవస్థను, దాని విలువల్ని ప్రశ్నించి సామాజికంగా నిమ్న వర్గాల కోసం ఉద్యమించింది గనుకనే బ్రాహ్మణాధిపత్యం భారత జాతి చరిత్రలు సావిత్రిబాయి ఫూలేని విస్మరించినాయి. వీరికిసంఘ సంస్కర్తలంటే రాజారావ్మెహన్ రాయ్, రెనడే, దయనంద సరస్వతి వంటి బ్రాహ్మణ సంస్కర్తలే. ఈ సంస్కర్తలు పెట్టిన బ్రహ్మసమాజాలు, ప్రార్ధన సమాజాలు, సార్వజనిక్ సమాజాల్లాంటి వాటిని ఉద్యమ చరిత్రనిండా గానుగు తిప్పిండ్రు. యీ సమాజాల్లో పేరు పెత్తనమంతా బ్రాహ్మణ కులాలదే. యీ సమాజాలన్ని వారి సమస్యల సంస్కరణలకోసం ఏర్పాటు చేసుకున్నవే. కాని సార్వజనీనమని, సామాజికమని చరిత్రంతా అబద్ధప్రచారం చేసుకున్నరు. వీరి బ్రహ్మసమాజాల్లో నిమ్నజాతుల సమస్యలుగాని , ఆ మనుషులుగాని కనిపించరు. ఫూలే సత్యశోదక్‌లాంటి సవజాన్ని దేశ వ్యాప్తంగా యింకా ఎన్నెన్ని సమాజాల్ని మరుగున పడేసిండ్రో.
సావిత్రిబాయి సామాజిక ఉద్యమ నాయకురాలే కాదు ఆమె గొప్ప రచయిత్రి. కావ్యఫూలే, భావన్‌కషి సుబోధర్‌లాకర్ వంటి రచనల్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు.
సావిత్రిబాయిఫూలే గొప్ప ఆచరణ వాది. సమాజావెదం లేని సంతుని దత్తత తీసుకుని సవలించింది. 1890లో తన భర్త జ్యోతిబాఫులే మరణిస్తే సమాజ రీతికి భిన్నంగా, నియమాలన్నింటిని ధిక్కరించి పితృస్వామిక విలువల్ని తృణీకరించి తనే అంతిమ సంస్కరాలు నిర్వహించిన ఘనత సావిత్రి బాయి ఫూలేది. ఆ కాలంలోనే వందల కులాంతర వివాహాలు చేసింది. స్వయన తన దత్తపుత్రునికి కూడా కులాంతర వివాహం చేసింది. అనేక వ్యతిరేక తల్ని ఎదుర్కొన్నది. తన పెరట్లో బావిని తవ్వించి అంటరాని వాల్లకు నీటికొరత తీర్చింది.
అట్లాంటి గొప్ప సంఘ సేవకురాలు ఫూలే మరణం తర్వాత కూడా దళిత బహుజనకులాలకు స్త్రీలకు విద్యనందిస్త, సాంఘిక దురాచారాల నిర్మలనకు పాటు పడుత,సత్యశోధక సమాజాన్ని నడు పుత….ప్లేగు వ్యాధి పీడితులకు సేవ జేస్త… ప్లేగు వ్యాధికి గురై 1987 వర్చి 10 వ తారీఖున మరణించింది. సావిత్రి బాయి జీవితాదర్శాన్ని విస్తృతి చేయడానికి, గౌరవించడానికి ప్రభుత్వాలు ఆమె జయంతి, వర్ధంతుల ఉత్సవాల్ని నిర్వహించాలి.నిమ్న జాతులకు, స్త్రీలకు చదువు చెప్పిన మొదటి మహిళా టీచర్ అయినందున ఆమె జన్మదినమైన జనవరి 3ను భారత జాతీయ మహిళా దినంగా ప్రకటించాలి. ఏదైనా యూనివర్సిటీకి(రాబోయే) సావిత్రిబాయి ఫూలే పేరు పెట్టాలి. స్పూర్తి ప్రదమైన ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయల్సినవసరముంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags