స్త్రీవిముక్తి ధోరణి కవియిత్రుల్లో ప్రథమ గణ్యగా సాహిత్య పరిశీలకులు పరిగణిస్తున్న సావిత్రిని ఎవరూ అని ఇవాళ ఎవరూ అడగరు. కాని, 1984 మార్చి 23 ఆంధ్రజ్యోతి వారపత్రికలో ”బందిపోట్లు” అనే కవిత చదివినప్పుడు మాత్రం ఎవరీ సావిత్రి అని చాలా మంది ఆశ్చర్యపోయారు. సావిత్రి ఇంటి పేరు రాసుకోదు. కానీ, 1984 నుండి బందిపోట్లు ఆమె ఇంటి పేరయింది. ఆమె రచనల్లో బందిపోట్లు నిశ్చయంగా అన్ని విధాల ఉత్తమ కవిత. తెలుగు వాళ్ళు మామూలుగా మాట్లాడుకునే భాషలో ఇంత పురుషాధిక్యముందని బహుశా మొదటిసారి కళ్ళు తెరిపించిన కవిత ఇదేననుకుంటాను. ఇంతే కాదు, ‘పెళ్ళి’ని శిక్షగా పరిగణించే సంస్కృతి ఈ దేశంలో తెలుగు వాళ్ళకు ప్రత్యేకం ూడా కావచ్చు. ఈ కవితను ఇంగ్లీషులో అనువదించి ఇతర రాష్ట్రాల్లో వివరించేటప్పుడు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. స్త్రీ విముక్తి సాహిత్యంలో ఈ ”బందిపోట్లు” మొదటిది అవునో కాదో నాకు తెలియదు. కాని, తెలుగు భాషా ప్రయాణల్లో పురుషాధిక్య ధోరణిని ఎత్తి చూపిన మొదటి కవితగా చెప్పవచ్చుననుకుంటాను.
ఈ కవిత పత్రికలో మొదటిసారి అచ్చయినప్పుడు ఆంధ్రప్రదేశ్ (అంబేద్కర్) సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి బి.ఎ. తెలుగు మౌలికాంశాల కోర్సుకు పాఠాలు రాస్తున్నాను. అందులో వచన కవిత్వం అనే పాఠంలో వచన కవిత్వ లక్షణాలను పరిచయం చేయడానికి వెంటనే నాకీ కవిత పనికొచ్చింది. ఆ తర్వాత ”వచన కవిత్వంలో నిర్మాణ వ్యూహాలు” అనే భావన (జశీఅషవజ్‌ూ) నిర్మాణంలో ఈ కవిత చాలా ఉపయోగపడింది. అంతే కాదు, భాషా శాస్త్రం సాహిత్య విమర్శకు ఎట్లా పనికొస్తుందో ఋజువు చేయడానికి ూడా ఈ కవితను వాడుకున్నాను. ముఖ్యంగా 1986 – 1987 విద్యా సంవత్సరంలో విశ్వ విద్యాలయ నిధుల సంఘం (యుజిసి) వారి లెక్చర్షిప్‌లో దేశంలో కొన్ని చోట్ల ఈ కవితలోని విశేషాలను ఇంగ్లీషు అనువాదం ద్వారా చర్చించాను.
నేనిప్పటికీ మర్చిపోలేని అనుభవమేమిటంటే ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 1987లో జరిగిన పంతుళ్ళ పునశ్చరణ తరగతుల్లో ఈ కవితను చర్చించేటప్పుడు ఇద్దరు స్త్రీలు మధ్యలో వచ్చి ూర్చున్నారు. అందులో ఒకరు చాలా మంది సాహిత్యకులకు పరిచయమైన కృష్ణావాయుగారు, రెండవవారు సావిత్రి అని క్లాసు అయిన తర్వాత తెలిసింది. ఆమెను చూడటం అదే మొదటిసారి, చివరిసారి ూడా. ఒక్క కవితకు ఇంత చరిత్ర ఉండటం విశేషమే. విరసం సభ్యురాలు ఈశ్వరి లాగే సావిత్రికి ఆమెను అమితంగా ప్రేమించే మిత్రులుండడం సంతోషించవలసిన విషయం. 1991 అక్టోబర్ 4న తన భౌతిక జీవితం చాలించినా సాహిత్యం ద్వారా మన మధ్య జీవించే అవకాశాన్ని అరణ్యకృష్ణ, తదితర సాహిత్య మిత్రులు ‘సావిత్రి’ అనే పుస్తకం ద్వారా కలిగించడం అభినందించదగింది. కృష్ణశాస్త్రి గారు భారతి రజతోత్సవ సంచికలో ‘పాతిళ్ళే తెలుగు కవిత్వం’ అనే వ్యాసం రాస్తూ గురజాడ అప్పారావుగారు మరణించిన తర్వాతనే జీవించడం ప్రారంభించారన్నారు. ఈ మాట సావిత్రికి ూడా అన్వయిస్తుంది. స్త్రీ విముక్తి ధోరణి సాహిత్యంలో సావిత్రి స్థానం ఆధునీకాంధ్ర సాహిత్యంలో గురజాడ అప్పారావు గారి స్థానంతో పోల్చదగింది కావడం ూడా ఈ సందర్భంలో గుర్తురాక మానదు. పత్రికలకు ఉత్తరాలు రాయటం ద్వారా రచనా వ్యాసంగం ప్రారంభించి, రేడియో ప్రసంగాలు నిర్వహించి, సృజనాత్మక రచనలు విమర్శల వరూ ఎదిగిన సావిత్రిని ఈ ఏసావిత్రి’ సంపుటంలో దర్శిస్తాము. ఈ సంపుటిలో ఆమె కవిత్వం, వ్యాసాలు, సమీక్షలతో పాటు ఆమెను గురించి మిత్రులు రాసిన చిన్న చిన్న వ్యాసాలు ూడా ఉన్నాయి. ఆమె తన అమ్మను గూర్చి రాసిన కథనంలో ఆమె ఆత్మకథ కొంతమంది వీటన్నిటి ఆధారంగా ఆమె వ్యక్తిత్వం గ్రహించడానికి వీలు కలుగుతున్నది. ఈమె సాహిత్య వ్యక్తిత్వానికి, జీవిత వ్యక్తిత్వానికి సన్నిహిత సంబంధముంది.
తాను పుట్టి పెరిగిన వాతావరణంలో పితృస్వామ్య దుర్లక్షణాలను సావిత్రి చిన్నతనం నుంచి ద్వేషించింది. అందులో తన తల్లి కష్టాలను ప్రత్యక్షంగా చూసింది. అందుకు కారణమైన వ్యవస్థతో పాటు తండ్రిని ూడా ద్వేషించింది. మా నాన్న అనే వాడు లేకపోతే ఈ ప్రపంచం అందమైందేనన్న చలం సావిత్రి అభిమాన రచయిత అయ్యాడు. అరణ్యకృష్ణ మాటల్లో ”రంగనాయకమ్మగారన్నా, ఆమె సాహిత్యమన్నా పిచ్చి అభిమానం”. ముఖ్యంగా రామాయణ విషవృక్షం పీఠిక ద్వారా ఎక్కువ ప్రభావితురాలయింది. తన అభిమాన రచయితల నుంచి నేర్చుకోవల్సింది మాత్రమే నేర్చుకున్నది ఈమె.
స్వేచ్ఛా వ్యక్తిత్వం సహించలేని వివాహ బంధం నుంచి పోరాడి విముక్తి సాధించింది. చాలీ చాలని ప్రూఫ్ రీడర్ జీతంతో పేదరికంతో పాటు అనారోగ్యంతో ూడా పోరాడుతూనే తన రచనలు సాగించింది సావిత్రి. ఇంకా ఎన్నో రచనలు చేయగల ధీశక్తి, అవగాహన ఉన్న రచయిత్రి ఈ రోజుల్లో అంత ప్రమాదం కాని క్షయ వ్యాధికి లొంగిపోయింది. ఈశ్వరి, (డాక్టరు) కరుణ, సావిత్రి వాళ్ళ జీవితాల ముగింపు తలచుకుంటే, మరీ ముఖ్యంగా వారు వదిలిన సాహిత్యం తలచుకుంటే వాళ్ళ మీద చనువు కొద్దీ చిరాస్తుేంది. ఎంతో రాయాల్సిన, ఎన్నో సాధించాల్సిన జీవితాలు ఇంత అర్థాంతరంగా ముగిసాయే అని పుట్టెడు దు:ఖం ముంచుకొస్తుంది. వీళ్ళల్లో ఇంకా సావిత్రే నయం. కొన్ని కవితలు, సమీక్షలు, వ్యాసాలు, రెండు కథలు మనకు మిగిల్చింది. బందిపోట్లు సావిత్రిగా పరిచయమైన కవియిత్రి సావిత్రి సాహిత్య వ్యాసంగ వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆమె మిత్రులు మంచి వీలు కల్పించారు. ఈమె కవిత్వంలో దగా పడ్డ స్త్రీ ఆర్తి బహుకోణాల్లో వినిపిస్తుంది. దాదాపు అన్ని ఖండికల్లోనూ అదే వినిపిస్తుంది. అవన్నీ వాస్తవ జీవితానుభవాల నుంచి రావడం విశేషం. కొన్ని కొన్ని అందమైన మాటల వెనుక ఉన్న మోసాన్ని తెలియజేసే ”తప్పదు మరి” చూడండి.” పదాలన్నీ భలేగున్నాయి/భ్రమల్లో పడేస్తున్నాయి” అంటూ ప్రేమ, అనుబంధం, అవకాశాలు, సంస్కృతి, ప్రగతి అనే మాటలను ఉదహరించి ”ఏమైనా సరే – కవి/పుట్టేసిన నిరపరాధుల్ని ఇలాగైనా జోకొట్టు/ఇంకొక్క క్షణమైనా” అని ఆ పద ప్రయోగాల బండారాన్ని బయటపెట్టింది.
గృహిణి అనే ఖండికలో ఇంటిచాకిరి చేసే స్త్రీ శ్రమకు విలువ కట్టకపోవటాన్ని ఇట్లా చెబుతుంది.
”ఉపాధి లేదు
సెలవులు లేవు, సేద దీర్చే నెలవే లేదు
డ్యూటీలున్నాయి, వోటీలున్నాయ్
సూటీ పోటీ మాటలున్నాయ్
బోరుకొట్టే ఈ చాకిరీకి బోనసు లేదు
ఏవేవో భజన్లు తప్పించి ఎక్స్‌గ్రేషియా లేదు
అయినా ప్రచార సాధననాలంటాయ్
నేను పనిలేనిదాన్నని
భాషే రాని బడుద్ధాయిలంటారు
భారమెంత వహిస్తున్నా నేనే భార్యనని”
సావిత్రికి భాషా పరిశీలనలో ఉన్న పదును ఆమె కవిత్వంలో చాలా చోట్ల స్పష్టపడుతుంది. భార్య అనే మాటలో ఉన్న అపార్ధాన్ని చాలా నేర్పుగా పట్టుకుంది. ‘బందిపోట్లు’లో ూడా ఈ పరిశీలన పటుత్వం కనిపిస్తుంది. అట్లాగే ”మాకీ దినోత్సవం వద్దు” అనే కవిత్వంలో ”గాజులేస్కుూచున్నానా! అంటావ్.. అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారంటావ్” అనే చోట జాతీయాల్లో స్త్రీని అవమానించే ధోరణిని పసిగట్టింది. తెలుగు భాషా ప్రయోగాల్లో దాక్కొని ఉన్న పురుషాధిక్య భావాన్ని ఇంత ఒడుపుగా పట్టుకొని బట్టబయలు చేసిన కవియిత్రి ఈమేనేమో!
ఈమె కవిత్వంలో గడుసుదనంకన్నా సూటిదనం, కరకుదనం ఎక్కువ. కవితాశిల్పాల కోసం కాల విలంబనం చేయదు. పురుష ద్వేషి అనిపించేంత పురుషాహంకార ద్వేషముంది. మగవాళ్ళకు స్త్రీల తరఫున మాట్లాడే హ్క లేదనేంత తీవ్రవాదిలా కనిపిస్తుంది. ‘అవును మరి’ అనే ఖండికలో..
మా కష్టాలు చెప్పేందుకు
మీ నోళ్ళే తగినవంటారు
మీరు చె్క అక్షరాల్లోని
విలన్లు మీరే అయినా
మీరు మా అశ్రువులన్నీ
దోచేసుకునే దళారులయినా
యింకా యింకా నమ్మాలి మేము
కలుములన్నీ కట్టబెట్టి
కట్టుబట్టల్తో మిగిలిన వాళ్ళు
గడుసుముండలనీ! నమ్మేసి
‘విమెన్స్‌లిబ్’ ూడా మగాళ్ళ ప్రసాదమేనని
వొప్పేసుకుంటే సరి!
గొంతుకోసేసి గొల్లుమనడం ఇదే మరి!
అని అడవాళ్లను ఉద్దరిస్తామనే మగవాళ్లను ూడా సహించదీమె. కుహనా సంఘసంస్కర్తల కుతంత్రాలను హేళన చేసిన గురజాడ అప్పారావు గారు గుర్తొస్తారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీ చైతన్య రచయిత్రులు, కవియిత్రులలో రెండు వర్గాలు కనిపిస్తాయి. తమ అనుభవాల ద్వారా స్త్రీ విముక్తి మార్గాన్ని అనుకరించిన వారు ఒక వర్గం. చదువు, జ్ఞానం (సఅశీషశ్రీవసస్త్రవ) ఈ ధోరణిలోకి వచ్చినవారు మరో వర్గం. అదీ ఇదీ ఉన్నవారు మూడో వర్గం. అందర్ని ఇట్లా స్పష్టమైన వర్గాల్లోకి చేర్చడం అన్ని వేళలా కుదరదు గానీ ఈశ్వరి, సావిత్రి మొదటి వర్గమని వాళ్ళ కవిత్వాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు. వాళ్ళ జీవితాల గురించి తెలుసుకుంటే ఇది నిర్ధారితమవుతుంది. ఈ మార్గం కవయిత్రుల్లో శిల్ప విన్యాసాలకన్నా ఆక్రోశం, ఆవేదన, కసి ఎక్కువగా కనిపిస్తాయి. వ్యక్తీకరణలో మెరుగుల కోసం శ్రమించినట్లు కనబడరు.
స్త్రీ సమస్యల ప్రత్యేకతను ప్రస్పుటీకరిస్తూనే వాటిని ఇతర సమస్యలతో సంవాదింపచేయడం సావిత్రి కవిత్వంలో ఒక వ్యక్తీకరణ మార్గం. ‘పరాధీనత’ అనే కవిత చూడండి.
అమ్మాయినో అయ్య చేతిలో పెట్టాం
ఆరునెలలలో బూడిడైపోయింది
వూరినో అయ్య చేతిలో పెట్టాం
భూములన్నీ దిగమింగి
రైతుల్ని ూలీలుగా మార్చేశాడు
రాష్ట్రాన్నో అయ్య చేతిలో పెట్టాం
అవిశ్వాస తీర్మానాలు
అసమ్మతి రోదనలూ
అర్థాంతర ఎన్నికలూ
దేశాన్నో, అయ్య చేతిలో పెట్టాం
యెంచక్కా తాకట్టు పెట్డాడు.
సమాంతరంగా దేశ సమస్యలను ప్రస్తావించటం వల్ల స్త్రీ సమస్యలకు జనరాలిటీ వచ్చింది.
సావిత్రి ఛందస్సులో చేసిన రచనలు ూడా కొన్ని ఉన్నాయి. సామ్యవాదం అనే కవితలో గీత, ఆటవెలది పద్యపాదాల ఛాయలు కనిపిస్తాయి. ఇవి కాక గేయాల రూపంలో రాసినవి కొన్ని ఉన్నాయి. చెరబండరాజు చనిపోయినప్పుడు ”జోహారు జోహారు చెరబండరాజు” అనే పాట రాసింది.
”తాకట్టు పాలైన తల్లి భారతిని తలచి తలచీ నీవు తల్లడిల్లావ్
నిజము చెప్పినవాడా ఆ తల్లి ఆవురని అడలుచున్నదిరా”
అని ద్విపదకు సన్నిహితమైన ఖండగీతిలో సాగుతుందీ పాట. ఇదే నడకలో సినీ నటి సావిత్రిపై రాసిన ‘పసిపాపలా నిదురపో తల్లిగా’ అనే పాటలో కవితా స్ఫూర్తి ఎక్కువగా కనిపిస్తుంది.
”కొండంత వేదనను గుండెలో దాచుకుని
మోసాల మనుషులను మైకాన మన్నించి
ఆ కళ్ల మెరుపులో ఆకళ్ళు మరిపించి
చెక్కిళ్ళ నునువుతో మక్కువే కొల్లగొని
ఆ పెదవి విరుపుతో ఆహ్లాదమే పంచి
తెలుగుతెరపై కోటి వెలుగులను ప్రసరించి
తరలిపోయిన తార – తరుణి మా సావిత్రి
ఇకనైన పొందుమా వినువీధి విశ్రాంతి!”
ఈమె మిథ్రగతి ముత్యాల సరాన్ని ూడా ప్రశంసనీయంగా నిర్వహించింది.
”పుష్యమందున సశ్యలక్ష్మికి
పూలతేరుల స్వాగతం
పుణ్యశాలిని పుడమి తల్లికి
పులకరింతల ఆగతం
బంతి మొక్కల బారులవె-చా
మంతి మడి సోయగమిదే
యింతలింతలు కావులే-హే
మంతకాంతుల వింతలే”
పాదమధ్య యతులూ, బిందు పూర్వకప్రాసలూ అనుప్రాసలూ, పాదాంత గురువతో పదం ప్రారంభించి తర్వాత పాదంలోకి చొచ్చుకుపోవటం, సరిపాదాల్లో మాత్రలు తగ్గించి పాడుకోడానికి తగినట్టు గుర్వంతం చేయటం – ఇవన్నీ చూస్తే కొద్దిపాటి శిక్షణతో ఈమె ఎంత ముత్యాల సరాలు రాయగలదో అనిపిస్తుంది. ఈమె రాసిన గేయాల్లో అక్కడక్కడా కనిపించే గతి భంగాలు చూస్తే ఈమె కవిత్వానికి లయబద్ధత శిక్షణ ద్వారా కాక అప్రయత్నంగా అబ్బినట్టు ఊహించవచ్చు. శిక్షణే వుంటే ఇంంత మంచి గేయాలు ఎన్ని రాసి ఉండేదో!
సావిత్రి కవిత్వంతో పాటు మంచి వచనం ూడా రాసిందని ఈ సంపుటి వచ్చే వరకు నాకు తెలీదు. ఈమె వచనంలో హాస్యం
ఉంటుంది. అది పదునుగా ఉంటుంది గాని మొరటుగా ఉండదు. ఈమె రాసిన కథలూ, వ్యాసాలూ ూడా స్త్రీ విముక్తి ధోరణి అంకితం.
రాసే భాష (అచ్చుభాష) కలిగించిన బ్రాట్లె సౌకర్యాన్ని చలంలాగా ఎంత సమర్థంగా వాడుకున్నదో ‘ఈ దేశంలో ఇదో వర్గం’ అనే కథ చదివితే గుర్తించగలం.
కొన్ని గ్రంథ సమీక్షలు మినహాయిస్తే సావిత్రి వ్యాసాలు స్త్రీ విముక్తికి ఉద్దేశించినవే, స్త్రీని చిన్నచూపు చూసే రచనలు తన దృష్టికి వచ్చినప్పుడు ఎంతవారైనా ఆమె లక్ష్యపెట్టక తన అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తీకరించింది. కుటుంబరావుగారితో పేచీ పెట్టుకుంది. ప్రపంచ కమ్యూనిస్టులంతా నెత్తిన పెట్టుకుని గౌరవించే చైనా రచయిత లూసన్న్‌ును విమర్శించింది. ”ఎందరో వీర కమ్యూనిస్టులు ూడా స్త్రీల గురించి బాధత్యారహితంగా మాట్లాడినవారే!” అని మాట్లాడింది.
ఆడవాళ్ళు ఉద్యోగాలళ్తేె సమస్యలుండొచ్చు గాని అవి ఉద్యోగాలు మానేస్తే పోయేవి కావని ఒక వ్యాసంలో వివరించింది. ఇంటి పేర్లో పితృస్వామిక పద్ధతిని వ్యతిరేకిస్తూ ఇంకో వ్యాసంలో వాదించింది.
సావిత్రి రచనలన్నీ సంకలనకర్తకు దొరికాయో లేదో కాని, దొరికినవాటిని బట్టి చూసిన స్త్రీ విముక్తి లక్ష్యంతో సావిత్రి తనకు చేతనైనన్ని ప్రక్రియల్లో కృషి చేసినట్లు గుర్తించగలం. అదీ పేదరికంలో, అనారోగ్యంతో పోరాడుతూ. ఆరోగ్యం ఆమెకు ఇంకా అవకాశమే ఇస్తే ఎంత గొప్ప ఫెమినిస్టు రచయిత్రి అయ్యేదో! ఇప్పటి ఇన్ని సాహిత్య ప్రక్రియల్లో ఎంతో లక్ష్యశుద్ధితో కృషి చేసిన రచయిత్రిగా తన స్థానాన్ని చిరస్థాయి చేసుకొని నిష్క్రమించింది.