పనిచేసే చోట లైంగిక వేధింపులు

లైంగిక వేధింపుల గురించి సుప్రీంకోర్టు 1997 సంవత్సరంలో ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఈ తీర్పులో ప్రాధమిక హక్కుల పరిధిని సుప్రీంకోర్టు మరొక్కసారి విస్తృతం చేసింది. ఉద్యోగినుల జీవించే హక్కులో లైంగిక వేధింపులు ఎలా వుంటాయో, ఈ పరిస్థితిని ఎలా మార్చవచ్చో సుప్రీకోర్టు వివరించింది. ఈ వేధింపులకి గురి చేస్తున్న వ్యక్తులపైన కఠిన చర్యలు ఎలా తీసుకోవాలో కూడా విశాఖ కేసులో (ఏ.ఐ.ఆర్‌. 1997 సుప్రీకోర్టు 3011) సుప్రీంకోర్టు వివరించింది. మార్గదర్శక సూత్రాలు కనీస మానవ హక్కులైన లింగ సమానత్వం అమలు గురించి లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా పనిచేసే చోట ఉద్యోగినుల పట్ల వుండే లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా ఎలాంటి చట్టాన్ని పార్లమెంటు చేయనందున సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలని జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్గదర్శక సూత్రాలని పనిచేసే అన్ని ప్రదేశాల్లో అన్ని సంస్థల్లో శాసనం తయారు చేసే వరకు పాటించాల్సి వుంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సూత్రాలని కోర్టు తయారు చేసిన శాసనంగా అందరూ పాటించి అమలు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 141 ప్రకారం వీటిని శాసనంగా అందరూ భావించాల్సి వుంటుంది. 1. పనిచేసే ప్రదేశం, సంస్థల యజమాని లేక బాధ్యతాయుతమైన వ్యక్తి విధి పనిచేసే ప్రదేశం యజమానిగానీ, బాధ్యతాయుతమైన వ్యక్తిగానీ లైంగిక వేధింపులను హింసను నిరోధించడానికి, ఆరికట్టడానికి అవసరమైన చర్యల్ని తీసుకోవాల్సి వుంటుంది. దానికి అవసరమైన తీర్మానాలని, ఒప్పందాని లేక ప్రాసిక్యూషన్‌ని చేపట్టాల్సివుంటుంది. లైంగిక వేధింపులని, హింసని నిరోధించడానికి ఆ పనిచేసే ప్రదేశం యాజమాని గానీ బాధ్యతాయుతమైన ఉద్యోగిగానీ ఈ ప్రయత్నాలను అవలంభించాల్సి వుంటుంది. 2. ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం లైంగిక వేధింపులంటే…? ఈ మార్గదర్శక సూత్రాలలో నిర్వచించిన ప్రకారం లైంగిక వేధింపులంటే అప్రియమైన లైంగిక ప్రవర్తన కూడా లైంగిక వేధింపులలో భాగమే. అది ప్రత్యక్షంగా వుండవచ్చు. పరోక్షంగా వుండవచ్చు. శారీరకంగా తాకడం, ఇంకా ముందుకు వెళ్ళడం, లైంగిక అనుగ్రహం గురించి డిమాండ్‌ లేక కోరిక, లైంగిక పరమైన మాటలు, అశ్లీల సాహిత్యాన్ని చూపించడం (బొమ్మలు కూడా), ఏదైనా అప్రియమైన శారీరక, మౌఖిక లేదా అమౌఖిక లైంగిక నడవడిక. ఈ లైంగిక వేధింపులు ఏ మహిళలకి వర్తిస్తాయి? ఈ లైంగిక వేధింపుల నిర్వచనం ఉద్యోగినులందరికీి వర్తిస్తుంది. వాళ్ళు జీతం తీసుకుని పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు లేక స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాళ్ళే కావచ్చు పబ్లిక్‌ లేక ప్రైవేట్‌ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళే కావచ్చు. లైంగిక వేధింపుల నేరం జరిగిందని ఎప్పుడు అనుకుంటారు. ఈ లైంగిక వేధింపులు జరిగినప్పుడు బాధితురాలైన మహిళ ఆ వేధింపుల వల్ల అక్కడ పనిచేయడం అవమానకరంగా వుండి, ఆరోగ్య, రక్షణ సమస్యలు వున్నట్టు సహేతుకమైన భయం వున్నప్పుడు అది లైంగిక వేధింపు నేరం అవుతుంది. లైంగిక వేధింపులని నిరోధించడానికి పనిచేసే చోట యజమానిగానీ, బాధ్యతాయుతమైన వ్యక్తిగానీ ( అది పబ్లిక్‌ సెక్టార్‌ కావచ్చు. ప్రైవేట్‌ సెక్టారు కావచ్చు) తీసుకోవాల్సిన చర్యలు -సుప్రీంకోర్టు నిర్వచించిన ప్రకారం లైంగిక వేధింపులు అంటే ఏమిటో? వాటి నిషేధం గురించి అందరికీ తెలిసేటట్టుగా ఆ విషయాన్ని ఆ పనిచేసే స్థలాల్లో ప్రకటించాలి. లైంగిక వేధింపులు అంటే ఏమిటో అందరికీ తెలుసేట్టుగా అవసరమైన రీతుల్లో వాటిని పంపిణీ చేయాలి. – సుప్రీంకోర్టు నిర్వచించిన ప్రకారం లైంగిక వేధింపులని నిషేధిస్తూ, చెడు ప్రవర్తనగా గుర్తించి తమ క్రమశిక్షణకి సంబంధించిన రూల్స్‌, రెగ్యులేషన్స్‌ని సవరించాల్సి వుంటుంది. ఈ క్రమశిక్షణకి సంబంధించిన రూల్స్‌, రెగ్యులేషన్స్‌ సవరించాల్సి వుంటుంది. ఈ క్రమశిక్షణని ఉల్లంఘించిన ఉద్యోగుల పట్ల చర్యలు తీసుకునేట్టుగా నిబంధనలని సవరించాలి. ఈ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకి వర్తిస్తాయి. – ప్రైవేటు సంస్థలు కూడా ఈ లైంగిక వేధింపుల నిషేధాన్ని తమ స్టాండింగు ఆర్డర్స్‌ (ఇండస్ట్రియల్‌ ఎంప్లాయిమెంట్‌ (స్టాండింగు ఆర్డర్స్‌) చట్టం, 1946లో పొందుపరుస్తూ సవరణలు తేవాలి. ఈ క్రమశిక్షణని ఉల్లంఘించిన వ్యక్తుపౖౖె చర్యలు తీసుకోవాలి. – ఉద్యోగినులు ప్రశాంతంగా పనిచేయడానికి అవసరమైన వాతావరణాన్ని యజమానులు కల్పించాలి. పని గురించి, విరామం గురించి, ఆరోగ్య పరిశుభ్రతల గురించి యజమానులు పట్టించుకోవాలి. అంతేకాదు ఉద్యోగినులు పనిచేయడానికి ప్రతికూల వాతవరణం వుండకుండా చూడాలి. అననుకూల వాతవరణంలో వున్నానని ఉద్యోగిని భావించకుండా వుండే వాతావరణం వుండేట్లు చూడాలి. క్రిమినల్‌ చర్యలు ఉద్యోగుల ప్రవర్తన వల్ల ఏదైనా నేరం జరిగినప్పుడు యజమాని తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఈ లైంగిక వేధింపులకి గురించి చేసిన వ్యక్తుల నడవడిక, చర్యలు భారతీయ శిక్షాస్మృతి ప్రకారంగానీ, ఏదైన చట్ట ప్రకారం గానీ నేరమైనప్పుడు ఆ పనిచేసే స్థలం యజమాని చట్ట ప్రకారం సంబంధిత అధికారులకు ఫిిర్యాదు చేయాలి. లైంగిక వేధింపులకి గురైన బాధితులు, సాక్ష్యులు ఫిర్యాదు విచారణ సమయంలో కక్ష సాధింపులకి, వివక్షలకి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా పనిచేసే స్థల యజమానులపై వుంటుంది. ఫిర్యాదుల విభాగం బాధితురాలికి ఊరట కలిగిస్తూ అవసరమైన ఫిర్యాదు విభాగాన్ని ఆ పనిచేసే స్థల యజమాని సృష్టించాల్సి వుంటుంది. ఎవరి నడవడిక గురించైనా బాధితులు పిర్యాదు చేసినప్పుడు, ఆ నడవడిక ఏదైనా చట్ట ప్రకారం నేరమైనప్పటికీ కాకపోయినప్పటికీ సర్వీస్‌ నిబంధన ఉల్లంఘన అయినప్పటికీ కాక పోయినప్పటికీ ఆ ఫిిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఆ ఫిర్యాదులని నిర్ణీత సమయంలో పరిష్కరించేట్టుగా కూడా నిబంధనల్ని సవరించాలి. ఫిర్యాదుల కమిటీ, ఫిర్యాదుల కమిటీలో సభ్యులైవరు? ఈ కమిటీ ఏం చెయ్యాలి? లైంగిక వేధింపుల పిర్యాదులు స్వీకరించడానికి ఓ ఫిర్యాదుల కమిటీ వుండాలి. ఈ కమిటీకి మహిళలే నేతృత్వం వహించాలి. కమిటీల్లోని సభ్యుల్లో సగం మంది మహిళలే వుండాలి. ఈ కమిటీకి సహకరించడానికి అవసరమైన సపోర్టింగు స్ట్టాఫ్‌ కూడా ఏర్పాటు చేయాలి. బాధితులకి సలహాలు, మార్గదర్శకత్వం వహించానికి ప్రత్యేకమైన సలహాదారు కూడా వుండాలి. ఫిర్యాదులని రహస్యంగా వుంచాలి. సీనియర్‌ లెవల్స్‌ నుంచి అనవసరమైన ఒత్తిడిగానీ ప్రభావాన్ని గానీ నిరోధించడానికి పిర్యాఉల కమిటీ ధర్డ్‌పార్టీల పాత్రని ఈ కమిటీలో వుంచాలి. ఆ ధర్డ్‌ పార్టీలు ప్రభుత్వేతర సంస్థలు కావొచ్చు లేక లైంగిక వేధింపుల గురించి అవగాహన వున్న ఏదైనా సంస్థ కావొచ్చు. ఈ ఫిర్యాదుల కమిటీి తమ వార్షిక నివేదికను ప్రభుత్వానికి పంపించాలి. ఫిర్యాదుల మీద కమిటీ తీసుకున్న చర్యల్ని నివేదికలో తెలియచెయ్యాలి. పనిచేసే స్థల యాజమానుల బాధ్యత పనిచేసే స్థల యజమానులు, బాధ్యతాయుతమైన వ్యక్తులు మార్గదర్శక సూత్రాల అమలు గురించిన నివేదికను, ఫిర్యాదుల కమిటీ నివేదికలను సంబంధిత ప్రభుత్వ డిపార్టుమెంటులకి తెలియజేయాలి. మూడో వ్యక్త్తి వేధింపులు మూడో వ్యక్తి వేధింపులు వుంటే ఏం చెయ్యాలి? మూడో వ్యక్తి వల్లగానీ, ఇతరుల వల్లగానీ లైంగిక వేధింపులు ఉద్యోగినులకి కలిగినప్పుడు, ఆ పనిచేసే స్థల యజమానిగానీ, బాధ్యతాయుత వ్యక్తిగానీ ఉద్యోగినికి ఆ సహాయానికి అవసరమైన అన్ని యత్నాలు చేయాలి. ఆ వేధింపులని నిరాకరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు రంగంలో ఈ మార్గదర్శక సూత్రాల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ప్రైవేటే రంగ సంస్థలు కూడా ఈ మార్గదర్శక సూత్రాలను పాటించడానికి అవసరమైన చర్యల్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆయా ప్రభుత్వాలని కోరింది. అంతేకాదు అందుకు అవసరమైన చట్టాన్ని కూడా చేయాలని సుప్రీంకోర్టు కోరింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని హక్కులు మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లో ఉన్న హక్కులకి ఈ మార్గదర్శక సూత్రాలు అదనం. అంతేకానీ హక్కులని ఇవి తీసివేయవు. సుప్రీంకోర్టు తుది ఆదేశాలు ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఈ విధంగా తుది ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగినులు లింగ సమానత్వం పాటించడానికి అమలు పరచడానికి రక్షించడానికి ఈ మార్గదర్శక సూత్రాలను, నియమాలని పనిచేసే అన్ని ప్రదేశాలలో తప్పక పాటించాలి. ఈ ఆదేశాలు అందరి మీద పాలనీయమై అమలు పరిచే విధంగా వుంటాయి. అంతేకాదు. వీటి స్థానంలో సరైన శాసనం తయారు చేసేంత వరకు వీటిని అమలుచేయాలి. పనిచేసేచోట మహిళల్ని వేధింపుల నుండి రక్షించడానికి రూపొందించిన కొత్త బిల్లు 2010 1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి పార్లమెంటు పఠిష్టమైన చట్టం తేవాలని సూచించింది. 13 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రమంత్రివర్గ ఈ కొత్త బిల్లును రూపొందించింది. ఇది రాజ్యసభలో ఆమోదం కూడా పొందింది. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆమోదం పాందుతుందని అందరం ఆశించాం కానీ పార్లమెంటు లో రాజకీయ కుమ్మలాటలు, అవినీతిచర్చలు తప్ప ఈ దేశ స్త్రీలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కొత్త బిల్లు ఆమోదం పొందలేకపోయింది. ు ఈ కొత్త బిల్లు చట్టరూపం దాలిస్తే పనిచేసే చోట మహిళలు లైంగిక వేధింపులకు గురైనట్లు రుజువైతే యాజమాన్యం రూ. 50 వేలు జరిమానా చెల్లించాలి. ు ఈ చట్టం (రాబోయే) ప్రభుత్వ, ప్రయివేటు, సంఘటిత, అసంఘటిత రంగాలన్నింటినీ వర్తించబోతోంది. ు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకే కాకుండా వివిధ పనులమీద వచ్చే మహిళలు, విద్యార్ధినులు, హాస్పిటల్‌ పేషెంట్లు మొ. వారంతా దీని కిందికొస్తారు. ు విచారణ సమయంలో వేధింపులకు గురైన మహిళ, సెలవు లేదా బదిలీ కోరవచ్చు. ు ఫిర్యాదు అందిన 90 రోజుల్లో ఫిర్యాదుల కమిటీ విచారణ పూర్తి చెయ్యాలి. అయితే ఇళ్ళల్లో పనిచేసే మహిళల్ని ఈ చట్ట పరిధిలోకి తేవకపోవడం తీవ్ర ఆశాభంగాన్ని కల్గిస్తుంది. వారు కూడా ఈ సమస్యను తీవ్రంగానే ఎదుర్కొంటున్నారు. వీరిని కూడా తప్పకుండా ఈ చట్ట పరిధిలోకి తేవాలి. అలాగే రాజీలు కుదిర్చే చర్యలకి యాజమాన్యాలు ప్రయత్నించకుండా చట్టంలో ఏర్పాటు వుండాలి. అలాగే ఫిర్యాదు చేసిన మహిళల్ని భయభ్రాంతులను చెయ్యడం, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటమని బెదిరించడం లాంటివి జరగకుండా ఏర్పాటు వుండాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.