సమాచార విప్లవానికి దారివేసిన ఇంటర్‌నెట్ అపారమైన సమాచారాన్ని చిటికేసినంత తేలికగా అందుబాటులోకి తెచ్చింది. క్షణాల్లో వార్తల చేరవేత, అవతలి మనుష్యుల్ని చూస్తు మాట్లాడగలిగిన డిజిటల్ వీడియోల సౌలభ్యం, లక్షలాది ఫోటోల నిక్షిప్తం, ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం ఇవెన్నో లాభాలతో పాటు నష్టాల్ని కల్గిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపట్ల నెట్‌హింస కూడా జరుగుతోంది. ఫోటోలను మార్ఫింగు చేయడం, అబ్యూసివ్ , ఇమెల్స్ పంపడంలాంటివి. వీటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవిగో.
– ఎడిటర్
ఇక్కడ ఫిర్యాదుదారులు రెండు రకాల పరిస్థితులకు ఎదుర్కొంటారు
నేరము జరుగుతూ ఉన్నపుడు/లేదా తప్పక జరుగుతుందనుకొన్నపుడు.
నేరము ముందే జరిగిపోయినపుడు.
చేయవలసిన, తీసుకొనవలసిన చర్యలు :
మొదటి కేసులో ఆ సమాచారాన్ని సంబంధిత లోకల్ పోలీసుకు తెలియజేయండి లేదా దాని గురించి సైబర్ క్రైమ్ సెల్‌కు సమాచారం వెబ్‌సైట్ ద్వారా గీగీగీ.బిచీరీశిబిశిలిచీళిజిరిబీలి.ళిజీవీ/గీగీగీ.నీగిఖిలిజీబిలీబిఖిచీళిజిరిబీలి.వీళిఖీ.రిదీ తెలియజేయాలి. అలా చేసినట్లయితే ఆ సంఘటన జరుగకుండా నివారించే అవకాశం ఉంటుంది.
రెండవ కేసునందు చాలావరకు ఆర్థిక సంబంధమైన నేరాలన్నీ |ఆ్పు పరిధిలోకి వస్తాయి. కావున ఫిర్యాదుదారుడు సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా ్పు్పుఐ లో గానీ ఫిర్యాదు చేయాలి. ఇటువంటి కేసు సైబర్ ఎన్విరాన్‌మెంట్‌లో జరిగినదయితే కేవలం ఫిర్యాదు చేస్తే సరిపోదు. ఈ క్రింద చెప్పబడిన సమాచారాన్ని కూడా అందించవలసి యుంటుంది.
ఇటువంటి కేసు సైబర్ ఎన్విరాన్‌మెంట్‌లో జరిగినదయితే కేవలం ఫిర్యాదు చేస్తే సరిపోదు. ఈ క్రింద చెప్పబడిన సమాచారాన్ని కూడా అందించవలసి యుంటుంది.
పరిశోధనకు సంబంధించిన లి-మెయిల్ మెసేజ్‌లు.
ఇతర లి-మెయిల్ అడ్రస్‌లు.
పంపినవారి సమాచారం.
ఆ కమ్యూనికేషన్‌కు సంబంధించిన సమాచారం (కాంటెంట్).
|ఆ అడ్రస్‌లు.
డేట్ (తారీఖు) మరియు టైం (సమయం)కు సంబంధించిన సమాచారం.
ఉపయోగించిన వ్యక్తి (యూజర్) యొక్క సమాచారం.
అటాచ్‌మెంట్స్.
పాస్‌వర్డ్స్.
అప్లికేషన్ లాగులు అవి ‘స్నూపింగు’కు సాక్ష్యాలుగా ఉంటాయి.
ఆ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగించిన కంప్యూటర్.
స్క్రీన్ లేక యూజర్ నేమ్ (బాధితుడు మరియు అనుమానితుడు ఇద్దరివీ)
ఆ ఇంటర్‌నెట్ సర్వీస్ (ప్రొవైడర్ (|ఐఆ) అకౌంట్ ఉపయోగిస్తున్న దాని యజమాని (ఓనర్).
ముఖ్య సమాచారం/మొత్తం సమాచారం
ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్న లేదా చూసిన డేట్ మరియు టైమ్ వివరాలు.
అంతకు పూర్వం/ముందు చేసిన కాంటాక్ట్‌ల యొక్క డేట్స్ మరియు టైమ్‌ల వివరాలు.
ఏదైనా ఆ కమ్యూనికేషన్ బాధితుని ద్వారా లాగింగు లేదా ప్రింటవుట్ చేయబడి ఉంటే అది.
ఉపయోగించిన/ఉపయోగపడే/సంబంధించిన పాస్‌వర్డ్స్.
నేరంతో సంబంధముందని భావించిన అనుమానితుల వివరాలు.
ఏదైనా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లో ఉపయోగించినట్లయితే అది మరికొంత అదనపు సమాచారాన్ని గ్రహించి ఉంచుతుంది. అటువంటి సమాచారం యొక్క వివరాలు.
క్రెడిట్‌కార్డ్/జుఊఖ కార్డ్/డెబిట్ కార్డ్‌ల యొక్క సమాచారం మరియు వాట్ అకౌంట్ వివరాలు.
ఆ కార్డులు ఇటీవలి కాలంలో ఉపయోగించిన ప్రదేశాల వివరాలు.
డిజిటల్ సాక్ష్యాన్ని చాలా సులభంగా నాశనం చేయవచ్చు/చెడగొట్టవచ్చు ఉదాహరణకు
ఉపయోగించడం ద్వారా అది మారిపోతుంది.
దాన్ని దురుద్దేశ్య పూర్వకంగా మరియు తరచుగా తుడిచివేయడం గానీ లేదా మార్పు చేయడం గానీ జరుగుతుంది.
దానిని సరిగా హాండ్లింగు చేయకపోయినా, సేవ్ చేయకపోవడం వలన కూడా అది మారిపోవచ్చును.
ఈ కారణాల వలన సాక్ష్యమును జాగ్రత్తగా సేకరించాలి మరియు దాచి ఉంచాలి. ఇటువంటి నేరాల పరిశోధనలో ఇంటర్‌నెట్ ఉపయోగించడం, టైమ్, డేట్ మరియు టైంజోన్ సమాచారం మొదలైనవి రుజువు చేయడం చాలా ముఖ్యం.
ఫిర్యాదు చేసేటపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు
ఎల్లపుడూ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి పోలీసులను సంప్రదించి వారికి ఫిర్యాదు చేయడమే సరియైన పని.
అన్నింటికంటే ముందుగా సంబంధిత బ్యాంకుకు ఆ మోసాన్ని గురించి తెలియజేయాలి. దీని వలన తరువాత జరిగే నష్టాల నుంచి తప్పించుకొనవచ్చు.
మోసగాడు ఇప్పటికీ మీతో టచ్‌లో ఉంటే, అతనితో సంబంధాన్ని కొనసాగిస్తూ అతని గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు అందజేయండి.
మీకు ఏదైనా ఒక మెయిల్ |ఈ లేదా మొబైల్ నంబరు మీద అనుమానం ఉన్నట్లయితే, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ చేయకండి మరియు దాని గురించి వెంటనే పోలీసులకు తెలియజేయండి.
ఎంత ఇబ్బందికరమైన సమాచారమైనా సరే పోలీసులు దాన్ని చూసేవరకు నేరానికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని తొలగించకండి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags