ఆంధ్రప్రదేశ్‌ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం – 2002

పెళ్ళిళ్ళ తప్పనిసరి నమోదు చట్టం రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు వర్తిస్తుంది. ఈ చట్టంలోని 8వ సెక్షన్‌ క్రింద రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్ళి తప్పనిసరిగా నమోదు కావాలి.

ఈ చట్టానికి 2002 మే 21వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం తెలిపారు. అదే నెలలో గెజెట్‌లో ప్రచురితమై 2006 నుండి అమలులోనికి వచ్చింది. ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది.
ఈ చట్టం ప్రకారం ఏ మతం, కులం, సాంప్రదాయానికి చెందిన పెళ్ళి ఐనా ”వివాహం” నిర్వచనం క్రిందకి వస్తుంది.
చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉంటారు. వీరి క్రింద అన్ని జిల్లాలకు జిల్లా పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్‌లు ఉంటారు. అలాగే అవసరమైనంత మంది అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్‌లు కూడా జిల్లాల్లో ఉండే వీలుంది. సాధారణంగా జిల్లా కలెక్టరు జిల్లా పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్లుగా బాధ్యత వహిస్తారు.
చట్టం అమలుకోసం రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎప్పటికప్పుడు ఇచ్చే నిబంధనలకు లోబడి, వాటిని జిల్లా స్థాయిలో అమలు చేయడం జిల్లా రిజిస్ట్రార్ల బాధ్యత.
పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని క్రింద ప్రాంతాలవారిగా పెళ్ళిళ్ళ అధికారులు ఉంటారు. గ్రామాలలో గ్రామ కార్యదర్శి, పట్టణాలలో మున్సిపాలిటి కమీషనర్‌, నగరాలలో మున్సిపల్‌ కార్పోరేషన్‌ కమిషనర్‌ పెళ్ళిళ్ళ అధికారులుగా ఉంటారు. వీరు తమ ప్రాంతంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నిర్దేశించిన వేళల్లో అందుబాటులో ఉండాలి. కార్యాలయ పనిదినాలు, వేళలు నోటీసు బోర్డుపై అందరికీ కనిపించేలా పెట్టాలి.
పెళ్ళి జరిగిన రోజునుండి 30 రోజులలోపు పెండ్లి కుమారుడు, కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకులైనా పెళ్లి నమోదు కోసం ఇచ్చే దరఖాస్తు నింపి సంతకం చేసి పెళ్ళిళ్ళ అధికారికి ఇవ్వాలి. ఈ దరఖాస్తును ఉచితంగా పొందవచ్చు.
దరఖాస్తులో భాగంగా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురి వయస్సు తెలిపాలి.
దీనిపై పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, ఇద్దరి తరపున ఇద్దరిద్దరు సాక్షులు పెళ్ళిళ్ళ అధికారి దగ్గరే సంతకం చేయాలి.
పెళ్ళిళ్ళ అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిస్టరులో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకోవాలి.
పెళ్ళి నమోదు పెళ్ళి జరిగే చోట లేదా మన ఇంటిదగ్గర కూడా చేయించకోవచ్చు. ఆ ప్రాంతానికే అధికారి రావడానికి వీలవుతుంది. అయితే అందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకుని, ఆ ప్రాంత పెళ్ళిళ్ళ అధికారికి సమాచారం అందించాలి. దీనికోసం కొంత నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పెళ్ళి జరిగిన 30 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించాలనుకుంటే జరిగిననాటి నుండి రెండు నెలలలోపు 100 రూపాయల ఫీజుతో పెళ్ళి నమోదు చేసుకోవచ్చు.
ఉద్దేశ్యపూర్వకంగా లేదా తెలిసి కూడా నిర్లక్ష్యంగా పెళ్ళి నమోదు చేయని వారికి 1000 రూపాయలు జరిమానా పడుతుంది.
అలాగే వివాహ నమోదు పత్రంలో తెలిసి / మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలుశిక్ష లేదా 1000 రూపాయల జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
పెళ్ళి నమోదు పత్రం (సర్టిఫికెట్‌) పై పెళ్ళిళ్ళ అధికారి సంతకం, సీలు వేసి దంపతులకి ఉచితంగా ఇవ్వాలి.
పెళ్ళిళ్ళ నమోదు రిజిస్టరు నిర్దేశించిన నమూనాలోనే ఉండాలి. మార్పులు, చేర్పులు ఉంటే రిజిస్ట్రార్‌ జనరల్‌ మాత్రమే ఎప్పటికప్పుడు సరిచేసి పెళ్ళిళ్ళ అధికార్లకు సరఫరా చేయాలి.
ఒకవేళ పెళ్ళిళ్ళ రిజిస్టర్‌లో నమోదైన పెళ్ళిళ్ళ వివరాలు కావాలంటే అందుకు అవసరమై ఫీజు చెల్లించి పొందవచ్చు.
పెళ్ళి నమోదు చేయని పెళ్ళిళ్ళ అధికారికి 3 నెలల జైలుశిక్ష లేదా 500 రూపాయల జరిమానా లేదా రెండూ.
పెళ్ళిళ్ళ నమోదు ఎందుకు?
వివాహానికి చట్టబద్ధత ఉంటుంది.
కుటుంబానికి సంబంధించి అన్ని పథకాల వర్తింపుకు ఇది అవసరం.
క    భర్త నుండి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు ఋజువు.
క    కట్నం వేధింపుల సందర్భంలో నేరం ఋజువు అవడానికి ముఖ్య ఆధారం.
క    హింస, వేదనకు గురైన లేదా గురౌతున్న స్త్రీలు విడాకులు పొందడానికి అవసరం. విడాకులు కోరే భర్తలు కూడా పెళ్ళి ఆధారాలు చూపాల్సి ఉంటుంది.
క    రెండవ వివాహాలని అడ్డుకోవడానికి స్త్రీ, పురుషులిద్దరికీ ఇది ఒక ముఖ్యమైన సాక్ష్యం.
క    ప్రేమపేరుతో మోసాలు, రహస్య వివాహాలు, సాక్ష్యాలు, రుజువులేని పెళ్ళిళ్ళను ఆపడానికి ఇది ఒక ఆధారం.
క    బాల్య వివాహాలను నిరోధించేందుకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతుంది.
క    దీని ఆధారంగా మహిళలు ఇతర సంబంధిత చట్టాల నుండి త్వరగా తీర్పులు పొందే అవకాశం వుంది.
పెళ్ళిళ్ళ అధికారులు
గ్రామం        :    గ్రామ కార్యదర్శి / ఎక్టిక్యూటివ్‌ ఆఫీసర్‌
మునిసిపాలిటి    :    మున్సిపాలిటి కమీషనర్‌
కార్పొరేషన్‌    :    మున్సిపల్‌ కమీషనర్‌
జిల్లా            :    కలెక్టర్‌
రాష్ట్రం            :    డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌
వివాహ నమోదు పత్రం నమూనా  (ఖలిళీళిజీబిదీఖితిళీ ళితీ ఖబిజీజీరిబివీలి)
ఫారం-బి (8వ సెక్షన్‌ చూదుము)
1)    పెళ్ళి తేది    :
2)    పెళ్ళి ప్రదేశం (ప్రదేశాన్ని గుర్తించడానికి వీలుగా వివరాలతో)
3)    వరుడి వివరాలు
ఎ)    వరుడి పూర్తి పేరు    :
బి)    తండ్రి / తల్లి పేరు    :
సి)    పెళ్ళినాటికి వరుడి వయస్సు    :
డి)    నివాసం ఉండే ప్రదేశం:
ఇ)    చిరునామా    :
ఎఫ్‌)పెళ్ళినాటికి వరుడి స్థితి (అవివాహితుడు / విడాకులు పొంది          ఉన్నాడు / భార్య మరణించింది) :     వరుడి సంతకం
సాక్షులు    :
1)    ఎ)    పేరు    :
బి)    తండ్రి / భర్త పేరు:
సి)    వయస్సు    :
డి)    నివాసం ఉండే ప్రదేశం:
ఇ)    చిరునామా    :                                              సాక్షి సంతకం
2)    ఎ)    పేరు    :
బి)    తండ్రి / భర్త పేరు    :
సి)    వయస్సు    :
డి)    నివాసం ఉండే ప్రదేశం    :
ఇ)    చిరునామా    :                                              సాక్షి సంతకం
3)    వధువు వివరాలు
ఎ)    వరుడి పూర్తి పేరు    :
బి)    తండ్రి / తల్లి పేరు    :
సి)    పెళ్ళినాటికి వరుడి వయస్సు    :
డి) నివాసం ఉండే ప్రదేశం    :
ఇ)    చిరునామా    :
ఎఫ్‌)పెళ్ళినాటికి వధువు స్థితి (అవివాహితుడు / వితంతువు / విడాకులు పొందియున్నది)    :    వధువు సంతకం
సాక్షులు    :
1)    ఎ)    పేరు    :
బి)    తండ్రి / భర్త పేరు    :
సి)    వయస్సు    :
డి)    నివాసం ఉండే ప్రదేశం    :
ఇ)    చిరునామా    :          సాక్షి సంతకం

2)    ఎ)    పేరు    :
బి)    తండ్రి / భర్త పేరు    :
సి)    వయస్సు    :
డి)    నివాసం ఉండే ప్రదేశం    :
ఇ)    చిరునామా    :           సాక్షి సంతకం
గమనిక: పాస్‌పోర్ట్‌ ఫోటోలు లేదా పెళ్లి ఫోటో అతికించవలెను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.