ఆలోచింప జేసే ఆదిలాబాద్‌ యాత్ర

– శోభా రాణి

తెల్లవారుజామున 5 గంటలకు ఇల్లు చేరాం. అలసటగా అనిపించి 1 గంట పడుకొని లేద్దామని పడుకున్నాను. ఒక ఊరిలో ఒక నిరుపేద రైతు కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని అతిసామాన్య కుటుంబం. ఏ వసతులూ లేని ఎండకూ, వానకి తలదాచుకుంటే చాలు అనుకునే ఇల్లు. ఇంటిముందు పాలిచ్చే గేదెలు నాలుగు కోళ్లు, రెండు మేకలు ఇదే ఆస్థి, అంతస్థు. తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచి వాకిల్లు ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులేసేవారు. అయినా ఇంటిచుట్టూ మురికినీరు పోయే వసతిలేక, మరుగుదొడ్లు లేక ఎంతో ఇబ్బందిగా ఉండే పల్లెటూరి వాతావరణం. స్నానాలు లేక చిరిగిన బట్టలతో బడికి వెళ్ళొచ్చి వచ్చీరాగానే పుస్తకాలు గూట్లో పడేసి, అబ్బాయిలు అమ్మాయిలనే తేడా లేక సిర్రెగోనె, గోటీలు, కోతికొమ్మచ్చి… ఇలా ఊరు ఊరంతా తిరుగుతూ ఆడుకునే ఆటలు, సంధ్యవేళ కాగానే కోళ్లను కమ్మి, దీపాల బుగ్గలు సన్నని చూడిద వేసి తుడిచి ఎక్కలు ముట్టించి అన్నం పొయ్యిమీదపెట్టి అమ్మానాన్నలు బావుల దగ్గరి నుండి వచ్చేసరికి పళ్లాల్లో అన్నం పెడితే వాళ్లు ఎంతో కష్టపడివచ్చి తిని హాయిగా పడుకునేవాళ్లు. ఇండ్లలోనే రోళ్ళు, భూమిలో పాతిన విసుర్రాళ్లు, ఇటుకలతో చేసిన పొయ్యిలు, పొయ్యిల మీద అలికి ముగ్గులు, అలికి ముగ్గేసిన నేల. అకస్మాత్తుగా పాఠశాలకు వెళ్ళాలి ఆలస్యమవుతుందని మెలకువ వచ్చేసరికి నేను ఆదిలాబాద్‌ జిల్లాలోని బుర్కరేగడి గ్రామంలో ఉన్నానా లేదా ఇది నా చిన్నప్పటి జ్ఞాపకమా అని అర్థమయ్యేసరికి రెండు నిమిషాలు పట్టింది. స్వాతంత్య్రము వచ్చిన కొత్తలో ఉన్న పరిస్థితులే ఇంకా కళ్లకు కట్టినట్టు కనిపించాయంటే అతిశయోక్తి కాదు.

కొండవీటి సత్యవతిగారు వేసిన ఈ ట్రిప్‌ మమ్మల్ని ఎంతగానో ఆలోచింపచేసింది.

మేము మొదటగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లోని విజయ్‌ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు అమృతలతగారి విజయ్‌ హైస్కూల్‌లో దిగాం. అక్కడ మాకు ఘనస్వాగతం, ప్రేమపూరిత ఆహ్వానం లభించింది. మేము అక్కడినుండి అమృతలతగారు నిర్మించిన అపురూప వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, అమృతలతగారు నిర్మించిన వృద్ధాశ్రమాన్ని చూశాం. అక్కడ చాలామంది వృద్ధ మహిళలు ఆశ్రయాన్ని పొందుతున్నారు. ఇది అమృతలతగారి దయాహృదయానికి నిదర్శనం. ఆ వృద్ధ మహిళలతో కొద్దిసేపు గడిపి ఆర్మూరు మండలము మామిడిపల్లిలోని అమృతలతగారి ఇంటికి చేరుకున్నాం. ఆ ఇల్లును వారు మాకు ఏర్పాటుచేసిన భోజన వసతులను చూసి నాకు ఎంత ఆడంబరమైన మనిషో అనుకున్నాను కానీ తెల్లారేసరికల్లా ఆమె నిరాడంబరత, మానవతాహృదయం, హుందా తనం, ప్రేమ అట్టే తెలిసి పోయింది. పొచ్చెర జలపాతం కింద చాలాసేపు అన్నీ మరిచిపోయి అది కొట్టే తడదెబ్బలను హాయిగా భరిస్తూ ఎంతో ఆనందంగా గడిపాము. అక్కడినుండి కుంటాల జలపాతం వెళ్ళాం. ఇక్కడ నాగోబా జాతర జరిగేటప్పుడు నాగోబా దేవతను ఈ జలపాతానికి తీసుకొచ్చి జలాభిషేకం చేసి ఆలయానికి తీసుకెళ్తారట.

తరువాత మేము చాలాదూరం ప్రయాణించి ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న మొండిగుట్ట గ్రామాన్ని చేరుకున్నాము. అక్కడ మేము దిగిన ఇల్లు, పక్కనే మంచెలా లేదా మద్దెలా ఉన్న ఇప్పటి డ్యూప్లెక్స్‌ మాడల్‌ ఇల్లు పాతకాలం మాదిరిగానే ఉన్నా కొంత ఆధునికత సంతరించుకున్నట్లు అనిపించింది. చల్లనిగాలి మెల్లమెల్లగా తాకుతుంటే ఎంత హాయిగా ఉందో జీవితాంతం ఇలాంటి ప్రశాంత వాతావరణం, కాలుష్యరహిత వాతావరణం ప్రజలందరికీ లభిస్తే ఎంత బాగుండునో అనిపించింది. అక్కడ జింకలు, ఎలుగుబంట్లను చూశాం. అక్కడినుండి రెండు ట్రాక్టర్లలో దట్టమైన అడవి మధ్యన పిల్లకాలువలను దాటుతూ రహదారి సరిగాలేక ట్రాక్టరు కూడా అటూ ఇటూ ఎటు పడిపోతుందో అన్నంత ప్రమాదకరంగా ఉన్నా, నడుములు పట్టేసేలా ఎత్తేస్తున్నా ప్రభాదేవి మేడమ్‌గారి ఛలోక్తులు, పాటలు, అంత్యాక్షరిల వల్ల ఆ అలసట తెలియకుండానే ఆదిలాబాద్‌ జిల్లా గోండు జాతి ప్రజలు నివసించే బుర్కరేగడి గ్రామాన్ని చేరుకున్నాము. అక్కడి ప్రజలు గుస్సాడి నాట్యంతో డప్పు చప్పుళ్ళతో మాకు స్వాగతం పలికారు. అక్కడ ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. మిగతా ఏ వసతులూ లేవు. ఆసుపత్రికి వెళ్ళాలంటే తగిన రోడ్లు, రవాణాసౌకర్యాలు లేవు. మిగతా ప్రపంచంతో మానవసంబంధాలు లేకుండా వారి జీవన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఆ గ్రామ ప్రజలు ఆ ఊరిపెద్ద మాట ప్రకారం ఒక దగ్గర గుమిగూడి చక్కని నృత్యం చేశారు. వారితోపాటు మేమూ ఎంజాయ్‌ చేశాము. ఇంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా ఇలాంటి గ్రామాలను ప్రత్యక్షంగా చూడటం చాలా బాధనిపించింది. మొండిగుట్టలో అమృత మేడం రాసిన పాటకి అప్పటికప్పుడు ప్రభా మేడం, రమా మేడం, సుజాత మేడం, ఇంకా కొందరు అధ్యాపకులు కలిసి నృత్యరూపం వేశారు. అది అందరినీ ఆకట్టుకుంది. ఈ ట్రిప్‌లో పాల్గొన్న ప్రతీ మహిళ పాటలోనైనా, మాటలోనైనా స్త్రీపోరాట ప్రతిమ, స్త్రీశక్తి మహిమ, స్త్రీల అభ్యుదయమే కనిపించింది. ఆ రాత్రి ఉట్నూరు చేరుకుని అక్కడ బసచేసి ఉదయమే కొమురం భీం సమాధి వద్దకు వెళ్ళాం. అక్కడికి చేరిన తరువాత కనీసం తెలంగాణా ఏర్పడే సమయంలోనైనా కొమురం భీం సమాధిని చూడగలిగామనే ఆనందం కలిగింది. నా జన్మ ధన్యమైంది అనిపించింది. ఆ కాలంలో ఆదివాసీల హక్కుల కోసం జల్‌, జంగల్‌, జమీన్‌ ఈ మూడింటిపైనా పోరాడిన తెలంగాణ అమరవీరుడు కొమురం భీం. కెరమొరి మండలంలోని జోడేఘాట్‌లో ఈయన సమాధి ఉంది. అక్కడ 2 నిమిషాలు ఆయన్ని స్మరించుకొని మోడీ గ్రామం చేరుకున్నాము. అక్కడ ఔరిళిఖిరిఖీలిజీరీరిశిగి ఖబిదీబివీలిళీలిదీశి ్పుళిళీళీరిశిశిలిలి తో సమావేశమయ్యాము. వారు పండిస్తున్న దేశవాళీ మచ్చ కందులు, జొన్నలు మొదలైనవి సహజ ఎరువులతో, సహజ కీడా నాశనకారిలతో పండించిన పంటలను చూడడం జరిగింది. ఔరిళిఖిరిఖీలిజీరీరిశిగి వల్ల ముందు తరాలకు ఎంత ప్రయోజనమో వారి ద్వారా అడిగి తెలుసుకున్నాము. మాతోపాటు ఒక గోండుజాతి సాక్రుబాయి అనే మహిళ వచ్చింది. ఆమె మహిళా సమతలో పనిచేస్తుంది. ఈ అమ్మాయికి తెలుగు బాగా వచ్చు. చాలా చక్కని పాటలు గోండుభాషలో, తెలుగు భాషలో కూడా పాడింది. ఈమె అక్కడి ఆదివాసీల జీవనశైలి వారి సంస్కృతి, ఆచార వ్యవహారాల గురించి చాలా చక్కగా వివరించి చెప్పింది. అక్కడ తోటి, కోహి, కోలం, గోండు తెగలవారు నివసిస్తారు. వీరు గుస్సాడి, థింసా నాట్యం చేస్తారు. వీరు ప్రతీ సంవత్సరము ఊరిలో క్రొత్త పండుగ చేసేదాకా ఏ పంటనూ తినరు. ఇక్కడొక వింత ఆచారం ఇప్పటికీ అక్కడ అమలులో ఉంది. అమ్మాయిలు కానీ, ఊరి కోడళ్ళు ఎవరైనాసరే ప్రతి నెల మాసధర్మంవల్ల దూరంగా ఉన్నప్పుడు వారికి ఊరి బయట ఒక ఇల్లును ఏర్పాటు చేస్తారు. ఆ నాలుగురోజులు ఊర్లో ఎవరైనా సరే ఊరి బయట ఉన్న ఆ ఇంటికి వెళ్లాల్సిందే. ఆ నాలుగురోజులు వారికి భోజనాలు అన్నీ అక్కడే. తర్వాత వారిని ఊళ్లోకి తీసుకొచ్చేటప్పుడు అన్నీ తెగలవాళ్లు కళ్లాపి చల్లి తీసుకొస్తారు. బహుశా ఇది పరిశుభ్రత కోసమేమో!

తరువాత ఉషగావ్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఇక్కడ మొక్కజొన్న గట్క, జొన్నపింజతో, పల్లీల పొడితో ఏదో పాయసం చేశారు. మేము వెళ్ళాము అనగానే వారు ఎంతో ప్రేమతో మమ్మల్ని ”రాం రాం” అని ఆహ్వానం పలికారు. వారితో చాలాసేపు ఉండి వారితో కలిసి భోజనాలు చేసి వారితో మాటామంతీ జరిపి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాము. వీరి కులవృత్తి ఓజా వర్క్‌. ఇక్కడ నివసించేవారు ఓజా తెగవారు. వీరు ఇత్తడితో చేసిన నాగుపాములు, ఊద్దాని, హారతులు, వారికి పెండ్లిళ్ళలో అవసరమయ్యే సామాగ్రిని తయారుచేసి వాటిని ఎగ్జిబిషన్‌లా పెట్టారు. మైనంతో చాలా చక్కగా సాంచెలు తయారుచేసి ఆ నమూనాలను ఇత్తడిని కరిగించి చేస్తున్నారు. వారి ఆ వృత్తినైపుణ్యం చాలా మెచ్చుకోతగ్గది. ఆడవారు, మగవారు అందరూ పనిచేస్తున్నారు.

అక్కడినుండి రాత్రి పది గంటలకు వర్నీ చేరుకున్నాము. అక్కడ ష్ట్రఙఖ సహకారంతో నడిచే సమత అనాథ పిల్లల వసతి గృహం ఉంది. ఎంతో శుభ్రంగా సొంత ఇండ్లను తలపించేవిగా ఉన్నాయి వారి గదులు. అక్కడ పిల్లలు మేమొస్తున్నామని నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉన్నారు. మేము వెళ్ళగానే ఎంతో ఆత్మీయంగా మా దగ్గరికి చేరుకొని వారి ఇండ్లను చూపించారు. వారు మాకోసం ఎంతో కష్టపడి వారి సృజనాత్మకతను వెలికితీసి ఎన్నో గ్రీటింగ్‌ కార్డులు చెట్ల ఆకులు, పుల్లలతో మంచి అర్థాన్నిచ్చే విధంగా తయారుచేసి మాకిచ్చారు. ఆ పిల్లల్లో చాలామంది మంచి రచయిత్రులు, కవులు, చక్కని గాయకులు, ఎంతో తెలివైన పిల్లలు చాలామంది ఉన్నారు. వారు అక్కడ తల్లిదండ్రులు లేరన్న విషయం మర్చిపోయి స్వేచ్ఛగా, ఆనందంగా వారిలోని ప్రతిభాపాటవాలను వెలికితీసి జీవితంలో గొప్పగొప్ప లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటిని ఏ విధంగా చేరుకుంటామో అనే పట్టుదల, కసి వారిలో కనిపించా యి. వారు ఒక కిలోమీటరు దూరంలో పాఠశాలకు సైకిళ్ళపై వెళ్ళి చదువుకుంటున్నారు. అక్కడ రాత్రి భోజనం ముగించుకొని బస్సెక్కి హైదరాబాదు చేరుకున్నాం. ఇదొక చిన్న విహారయాత్ర, మనసును ఆలోచింపచేసిన యాత్ర, ఇదొక వినోదయాత్ర, మనమేదో చేయాలని తాపత్రయపడే యాత్ర, ఇదొక విజ్ఞానయాత్ర, మనకున్న జ్ఞానం, మనం చూసిన ప్రపంచం చాలా చిన్నది అని తెలిపే యాత్ర.

ఇది జీవితాంతం గుర్తుంచుకోతగిన అడ్వెంచర్‌. వివిధ రచయిత్రులతో, విద్యావేత్తలతో, సామాజిక చైతన్యమూర్తులతో, వివిధ కోణాలలో నైపుణ్యాలు కలిగిన మహిళతో కలిసి సాగిన ఈ ట్రిప్‌ జీవితానికి ఎంతో స్ఫూర్తిదాయకం. మేలుకొలుపు. సంపన్న వర్గాల జీవన విధానంతో సహా, అతిపేదవర్గాల జీవనవిధానం ముఖ్యంగా గోండు ప్రజల, ఆదివాసీల వివిధ తెగలకు సంబంధించినవారి జీవన విధానం, కట్టూ బొట్టూ, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వారి ఆహార్యం ఎక్కడో పుస్తకాల్లో చదవడం కాకుండా వారితో ప్రత్యక్షంగా కలిసి జీవించిన రెండు రోజులు మనిషికి చైతన్యం కలిగించేలా చేశాయి. దేశం బాగుపడడానికి, అభివృద్ధిపథంలో నడవడానికి ఇంకా ఎంతో కృషి జరుగాల్సిన అవసరం ఉందన్న విషయం దానికి ప్రతీ వ్యక్తి తోడ్పడాలన్న విషయం అర్థమైంది.

ఏదేమైనా ఇంత మంచి ప్రోగ్రామ్‌ వేసిన కొండవీటి సత్యవతి గారికి, మాతోపాటు రెండు రోజులు వారి అమూల్య సమయాన్ని వెచ్చించి మాకు అన్ని వసతులు ఏర్పాటుచేసి సమయం వృధా కాకుండా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన అమృతలత గారికి, మరియు రచయిత్రుల బృందానికి, విజయ్‌ విద్యాసంస్థల అధ్యాపకులకు, కార్టూనిస్ట్‌ నెల్లుట్ల రమాదేవి గారికి, ట్రిప్‌లో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇంత ప్రత్యక్షంగా, చూసిన విషయాలనే పత్రికగా నడిపిస్తున్న ”భూమిక” సంపాదకులు కొండవీటి సత్యవతిగారు ఎల్లవేళలా మాకు ఆదర్శప్రాయులు, అభినందనీయులు.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.