ఇండియాస్‌ డాటర్‌ ‘ డాక్యుమెంటరీ మీద నిషేధాన్ని ఎత్తివేయాలి – కొండవీటి సత్యవతి

ఇండియాస్‌ డాటర్‌ … .ఏమిటిది? ఇది ఒక డాక్యుమెంటరీ సినిమా …. ఎవరు తీసారు? బ్రిటన్‌కు చెందిన ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ లెస్లీ ఉడ్విన్‌ అనే ఆమె ”ఇండియాస్‌ డాటర్‌” పేరుతో ఒక డాక్యుమెంటరీ తీసింది. ఏముంది దానిలో… ఆ పేరు ఎత్తడం… దానిని చూడడం ఎందుకు నేరమైంది? చూడకుండానే…. అందులో ఏముందో తెలుసుకోకుండానే భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించింది? అయినప్పటికీ ఇప్పటికే లక్షలాదిమంది ఆ డాక్యుమెంటరీని యూట్యూబ్లో చూసి, ఇతరులకు పంపిస్తూనే వున్నారు. భారత ప్రభుత్వం నిషేధించాననుకుంది కాని చాలా మంది భారతీయులు, విదేశీయులు దీన్ని చూసారు, చూస్తున్నారు.

ఈ డాక్యుమెంటరీ నేపథ్యంలోకి వెళితే…2012 డిసెంబరులో యావత్‌ భారతదేశాన్ని కుదిపేసిన నిర్భయ మీద లైంగిక దాడి, హత్య, ఆ నేరానికి శిక్ష పడిన నిందితుల అంశంతో డాక్యుమెంటరీ తీసింది ఉడ్విన్‌. ఇందులో నిర్భయ సుేలో మరణ శిక్ష పడి, తీహార్‌ జైలులో వున్న ముఖేష్‌ సింగ్‌తో ఇంటర్వ్యూ వుంది. జ్యోతి సింగ్‌ తల్లిదండ్రులు, డిఫెన్స్‌ లాయర్లు, ఇంకా ఎంతో మంది ఇంటర్వ్యూలు లెస్లీ ఉడ్విన్‌ తీసిన ఇండియాస్‌ డాటర్‌ డాక్యుమెంటరీలో వున్నాయి. ఈ డాక్యుమెంటరీ రిలీజుకు ముందుగానే ముఖేష్‌ సింగ్‌ ఇంటర్వ్యూకు సంబంధించిన అంశాలు మీడియాలో వచ్చాయి. ” రేప్‌ చేస్తే చేయించుకోవాలి కానీ తిరగబడూడదు” అనే హెడ్డింగుతో ప్రధాన మీడియాలో కథనాలొచ్చాయి. పార్లమెంటు సమావేశాలవుతున్నాయి కాబట్టి ఈ వార్తపై పార్లమెంటులో పెద్ద దుమారం జరిగింది. వెంటనే ¬వ్‌ు మినిస్టర్‌ రాజ్‌నాథ్‌సింగ్‌… ఇది ఇండియా పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం… ఈ డాక్యుమెంటరీ రిలీజ్‌ అయితే భారత్‌లో టూరిజం దెబ్బతింటుంది… పరువు పోతుంది, డాక్యుమెంటరీని నిషేధిస్తున్నాం అని ప్రకటించారు. ముందస్తు మీడియాలో కథనాలు రాకపోయివుంటే ఈ డాక్యుమెంటరీ మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యుండేది. దానిలో వ్యక్తమైన అభిప్రాయాలను యావత్తు దేశం వీక్షించి వుండేది.

ఏముంది ఆ డాక్యుమెంటరీలో? కౄరాతి కౄరంగా జ్యోతి సింగ్‌ని హింసించి, ఆమె చావుకు కారకులైన వారిలో ఒకడైన ముఖేష్‌ సింగ్‌, బాధితురాలు జ్యోతిసింగ్‌కి, యావత్‌ స్త్రీలకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు చూసిన వారందరి వెన్నులోను వొణుకు పుట్టించాయి. రెండు సంవత్సరాలుగా జైలులో వుండి, చావుశిక్ష కోసం ఎదురు చూస్తూ ూడా ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా స్త్రీల పట్ల కక్కిన విషం తాలూకు ప్రభావం స్త్రీలందరి మీద పడింది. కోపోద్రిక్తులైనాం… ఆగ్రహావేశాలతో ఊగిపోయాం… మరీ ముఖ్యంగా అతని తరపున వాదిస్తున్న లాయర్లు అతనికంటే ఘాెరంగా మాట్లాడిన మాటలు డాక్యుమెంటరీ చూసిన స్త్రీలందరినీ తీవ్రంగా గాయపరిచాయి. ఒకలాంటి షాక్‌కు గురిచేసాయి. నేరం చేసిన నేరస్తుడిని జైలులో వుంచేది అతనిలో మార్పు తేవడానికి. తీహార్‌ జైలు ఆ పని చెయ్యలేదు కాని ముఖేష్‌ సింగ్‌ ఎలాంటి స్త్రీ ద్వేషో … ఎలాంటి కౄర మనస్తత్వం వున్నవాడో అర్థమైంది.

అయితే లా పట్టా పుచ్చుకున్న, చదువుకున్న వర్గానికి చెందిన వారైన ఎ.పి. సింగ్‌, ఎమ్‌.ఎల్‌ శర్మ మాటలు గమనించినప్పుడు ఈ దేశంలోని అధిక శాతం మగవాళ్ళు పురుషాహంకారంతో, పితృస్వామ్యానికి ప్రతినిధులుగానే వున్నారు, ఆధునిక భారతంలో పురుషుల ఆలోచనలు ఆదిమ స్థాయిలోనే ఉన్నాయనే భయానక సత్యం ప్రపంచానికి కళ్ళకు కట్టింది. పరమ స్త్రీ వ్యతిరేక ”ఖఫ్‌ పంచాయితీ”లకు, ఈ లాయర్లకి తేడా లేక పోవడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. వారు టీవీ రూముల్లోకి వచ్చి ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్నే మళ్ళీ చెప్పి నా ూతుర్ని తగలబెట్టే హక్కు నాకుందని ఎ.పి.సింగ్‌ చెప్పడం, భారతీయ సంస్కృతి ఉత్కృష్టమైంది. అందులో స్త్రీలకు స్థానం లేదు అని శర్మ చెప్పడం చూస్తే వీళ్ళకి చట్టం మీద ఎంత గౌరవముందో అర్థమవ్వడంతోపాటు సగటు భారతీయ పురుషుడి దృక్పధం… స్త్రీల పట్ల వారి ఆలోచనా ధోరణులు చాలా పబ్లిక్‌గా ప్రపంచానికి తెలిసి వచ్చాయి.

స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడులకు వారి వస్త్రధారణే కారణమని నిస్సిగ్గుగా చెప్పిన ముఖేష్‌ సింగ్‌ని సమర్ధించే వారు తయారవడం… అవును నిజమే అని వత్తాసు పలకడం పరమ ప్రమాదకరమైన ధోరణి… ఈ ధోరణిని ఖండించాల్సింది పోయి…. ఈ సినిమా భారత వ్యతిరేకమైంది కాబట్టి నిషేధిస్తున్నామనడం ఎలాంటి దృక్పథాలను చూపిస్తోంది? భారతీయ పురుషుల బుర్రల్లో ఏమివుంది? స్త్రీల పట్ల వారి ఆలోచనలెలా వున్నాయనే అంశాన్ని విప్పి చూపించిన ఇండియాస్‌ డాటర్‌ డాక్యుమెంటరీని నిషేధించడం చాలా అప్రజాస్వామికమని వాయిసెస్‌ ఫర్‌ జెండర్‌ జస్టిస్‌ ఫోరమ్‌ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

ఇంటా బయట పెరుగుతున్న హింస, వివక్షలను తిప్పికొడుతూ భారత మహిళ ముందుకు సాగుతూనే వుంది. నిర్భయ లాంటి ఘటనలను నివ్వెరపరిచి నిలువెత్తు ధైర్యాన్ని నీరైపోయేలా చేసినా… కళ్ళు ధారలు కడుతున్నా పిడికిలి బిగించి … ముందుకే సాగుతోంది. ఎన్నో సంఘర్షణల మధ్య, అసమానతల మధ్య, వివక్షల మధ్య పోరుబాటలో నడుస్తున్న ఆధునిక మహిళ… ఆటవిక దశలో మిగిలిపోతున్న పురుషుల దృక్పధాల పట్ల, ఆలోచనల పట్ల తీవ్ర నిరసనని వ్యక్తం చేస్తున్నది.

మహిళలు తమ పోరు ఆపిన దాఖలాలు లేవు కానీ… ప్రభుత్వాలు తమ వాగ్దానాలను కాగితం పడవల్ని చేసి అపహాస్యం చేస్తూనే వున్నాయి. నిర్భయ పేరుమీద ఏర్పాటు చేసిన 1000 కోట్లను ఖర్చు చెయ్యకుండా మురగబెడుతున్నాయి. కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసి… 800 కోట్లు గాలికొదిలేసాయి. ఒక పక్క గృహహింస చట్టం అమలు కోసం సరిపడిన బడ్జెట్లు లేవు. నిర్భయ పేరు మీద ఏర్పాటు చేసి ఒన్‌ స్టాప్‌ క్రైసిస్‌ సెంటర్‌లకు కేటాయింపులు చెయ్యకుండా.. నిధుల లేమితో ఈసురోమంటున్న డి.వి.సెల్స్‌ కౌన్సిలర్‌లను ఈ సెంటర్లలలో కూర్చోబెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం?. అత్యాచార బాధితులకు గౌరవంగా అందించాల్సిన లక్షరూపాయల నష్టపరిహారం సక్రమంగా అందడం లేదు. ఇక్కడ కూడా నిధుల్లేవు అనేదే రొటీన్‌ సమాధానం. నిర్భయ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నదే అత్యాచార బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి. నిర్భయ ఫండ్‌ (దాదాపు 1800 కోట్లు) దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న ూఅవ ూ్‌శీజూ జతీఱరఱర జవఅ్‌వతీ లకి రిలీజ్‌ చెయ్యాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం.

ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని పట్టించుకోవాలి. నిర్భయ దుర్ఘటన జరిగినప్పుడు ఎగసిపడిన నిరసన జ్వాలలు అప్పుడే చల్లారిపోవడం చాలా బాధను కలిగిస్తోంది. ఇండియాస్‌ డాటర్‌ చూపించిన అభివృద్ధి నిరోధక భావాల గురించి కానీ కరడు కట్టిన పితృస్వామ్య భావజాలాన్ని వ్యతిరేకిస్తూ కానీ అడపా తడపా కొన్ని వ్యాసాలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో అరకొర చర్చలు తప్ప పెద్ద ఎత్తున నిరసనలు, ప్రొటెస్ట్‌లు ఎందుకు వ్యక్తం కాలేదు??? ఈ నిశ్శబ్దం దేనిని సూచిస్తుంది?? మౌనం అర్థాంగీకార సూచన అనుకోవాలా?? అలాగే వొక్క బృందాకారత్‌ తప్ప మహిళా రాజకీయ నాయకులెవ్వరూ ఎందుకు నోరువిప్పలేదు. ఎందుకు మౌనం పాటించారు? అధికార పక్షం సరే, ప్రతిపక్షాలెందుకు అధికార పక్షాన్ని అనుసరించాయి? ఇది ఏలాంటి ప్రజాస్వామ్యం? ఈ మౌనాన్ని ప్రశ్నిస్తూ.. ఇండియాస్‌ డాటర్‌ డాక్యుమెంటరీ మీది నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ దేశ పురుషుల బుర్రల్లో తిష్ట వేసిన మనువుల్ని, పితృస్వామ్య భావజాలాన్ని వదిలేయాల్సిన తరుణం వచ్చిందని సమ సమాజం కోసం, జెండర్‌ న్యాయం కోసం అందరం కలిసికట్టుగా పనిచెయ్యాలని పిలుపునిస్తూ, పురుషుల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ….

ఇండియాస్‌ డాటర్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, .. దీనిని దూరదర్శన్‌ సహా అన్ని చానళ్ళలోను ప్రసారం చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.