అమలాపురం అనే ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊరిలో రంగయ్య, రామవ్వ అనే ఇద్దరు దంపతులున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మొదటి పాప పేరు రమ్య, రెండవ పాప పేరు రవళి. ఆ ఊరిని ఆనుకొని ఒక గుట్ట, చెరువు ఉంది. రంగయ్య వాళ్ళకు ఒక పెంకుటిల్లు, తోట ఉన్నాయి. ఊరి చివరిలో ఉన్న బడికి రమ్య, రవళి కలిసి వెళ్ళి చదువుకుంటారు. అప్పుడప్పుడు తోటకు వెళ్ళి ఆడుకుంటారు. వారి తోటలో ఒక మామిడి చెట్టు ఉంది. దానికి చాలా మామిడిపండ్లు కాశాయి. ఆ చెట్టు పైన ఒక రామచిలుక గూడు కట్టుకొని దాని మీదే నివసించేది. ప్రతి రోజు దానికి ఆహారంగా మామిడిపండ్లను తినేది. ఆ చెట్టు ప్రక్కన ఒక నీటి తొట్టె ఉంది. దానిలో ఉన్న నీటిని తాగి అది దాహం తీర్చుకునేది. ఒక రోజు వారిద్దరు ఎండలో అలిసిపోయి ఆ మామిడిచెట్టు క్రింద కూర్చున్నారు. అప్పుడు ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటో అని అటూ ఇటూ చూస్తున్నారు. ఒక్కసారిగా చెట్టు పైకి చూశారు. దాని మీద ఒక గూడు ఉంది. అందులో రామచిలుక కనిపించింది. దాని శరీరమంతా ఆకుపచ్చగా, ముక్కు ఎర్రగా ఉంది. చాలా అందంగా ఉంది కదా! అనుకుంటూ దాని దగ్గరకు వెళ్ళి చూస్తే దాని రెక్కకు దారం చుట్టుకుంది. ఆ దారం ఆ చెట్టుకు చుట్టుకొని ఉంది. వెంటనే ఆ దారాన్ని విప్పేసి దాన్ని కాపాడారు. ఆ చిలుకకి ఒక మామిడిపండు తినిపించారు. తొట్టిలో ఉన్న నీటిని తాగించారు. ఆ చిలుకకు రాము అనే పేరు పెట్టారు. వీరు ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. రోజు వెళ్ళి ఆ చిలకతో ఆడుకొని సరదాగా గడిపేవారు. ఒక రోజు ఆ చిలుకకు మంచి గూడును తయారుచేశారు. దానిని ఆ చెట్టు కొమ్మల పైన ఉంచి ఆ చిలుకను ఆ గూటిలో ఉంచారు. అది వారితో ఆనందంగా గడుపుతుంది. ఒక రోజు అకస్మాత్తుగా చాలా పెద్ద గాలి, వర్షం వచ్చింది. ఊరిలో ఉన్న చెరువు నిండింది. అప్పుడు రమ్య, రవళికి చిలుక గూడు గుర్తొచ్చింది. వర్షం తగ్గాక వారిద్దరు పరుగు పరుగున వెళ్ళి చూసేసరికి ఆ గూడు క్రింద పడిపోయింది. ఆ చిలుక అరుస్తుంది. వెంటనే వారిద్దరు ఆ చిలుక దగ్గరకు వెళ్ళి చూస్తే అది వారిద్దరిని చూసి నా ఇల్లు పడిపోయింది. నేనెక్కడ ఉండాలి. అన్నట్టు అరుస్తూ ఏడుస్తుంది. దాని బాధను చూసి వారిద్దరు మరోసారి దానికి ఎప్పుడు కూలకుండా ఉండే ఒక చిన్నగూటిని గట్టిగా కట్టి దాన్ని అందులో ఉంచారు. ఆ చిలుక వారికి కృతజ్ఞతలు తెలియచేసింది. అంతలో రంగయ్య, రామవ్వ ఇద్దరు వచ్చారు. మామిడిపండ్లు రాలిపడి ఉన్నాయి. అయ్యో చేతికొచ్చిన పంట రాలిపోయిందని చాలా బాధపడ్డారు. రమ్య, రవళి చిలుక గూటి గురించి చెప్పారు. వారు కూడా చాలా బాధపడ్డారు. రాలిన కాయలు ఏరడంలో అమ్మానాన్నలకి సహాయం చేశారు. మరుసటి రోజు రంగయ్య, రామవ్వ ఇద్దరూ కలిసి మామిడి పండ్లు అమ్మడానికి అంగడికి వెళ్ళారు. రమ్య, రవళి కలిసి చిలుక దగ్గరకు వెళ్ళారు. వారిని చూసి చిలుక చాలా సంతోషించింది. మీరుండేప్పటికే నేను ఇన్ని రోజులు బ్రతకగలిగాను. లేదంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు అని తెలియచేసింది. మీ ఇద్దరిని దేవుడు చల్లగా చూస్తాడని దీవించింది. రమ్య, రవళి ఇంటికి వెళ్ళారు. చిలుక వాళ్ళిచ్చిన పండ్లు తిని, నీరు తాగి దాని గూటి దగ్గరకు వెళ్తుండగా కాలు జారి నీటి తొట్టిలో పడిపోయింది. అప్పుడు అది చాలా అరిచింది. గిలగిల కొట్టుకుంది. చివరకు దాని ప్రాణాలు విడిచింది. మరుసటి రోజు వచ్చి రామూ అనుకుంటూ చిలుకను పిలిచారు. పలకలేదు. చాలా వెతికారు. చివరికి ఆ చెట్టు క్రింద ఉన్న నీటి తొట్టెలో చూశారు. చిలుక చనిపోయి ఉంది. దానిని చూసి వీరిద్దరూ చాలా బాధపడ్డారు. దానికి ఒక గోయి త్రవ్వి అందులో పెట్టారు. వెంటనే ఇంటికి వెళ్ళి రంగయ్యకు, రామవ్వకు జరిగిన విషయమంతా చెప్పారు. వారు కూడా చాలా బాధపడ్డారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత మరుసటి రోజు వారిద్దరూ బడికి వెళ్ళారు. తోటి పిల్లలతో ఉండకుండా వారిద్దరు మాత్రమే క్లాస్‌రూమ్‌లో విచారంగా కూర్చోవడాన్ని వారి టీచర్‌గారు చూశారు. ఆ టీచర్ పేరు స్వరూప. వారిద్దరి దగ్గరకు వెళ్ళి ఏమయ్యిందమ్మా అని అడిగారు. ఫ్రెండ్స్‌తో ఆడుకోకుండా మీరిద్దరే ఎందుకిలా విచారంగా కూర్చున్నారని అడిగారు. వెంటనే వేసవి సెలవుల్లో తోటలో జరిగిన విషయాన్ని చెప్పారు. వారి టీచర్ చాలా బాధపడింది. మరుసటి రోజు వారి బడిలో ఉన్న పిల్లలందరికీ, టీచర్స్ ఆందరికీ ఈ విషయాన్ని చెప్పారు. వారందరూ వీరిద్దరిని చాలా మెచ్చుకున్నారు. వీరిద్దరు చేసిన సహాయాన్ని మెచ్చుకుని బహుమతులు ఇచ్చారు. ఎందుకంటే బడిలో ఫస్ట్ ర్యాంకు వీరిద్దరిదే. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. పెద్దవారితో గౌరవంగా మాట్లాడతారు. అని అందరూ మెచ్చుకున్నారు. అలా వారిద్దరూ బాగా చదువుకొని అందరి పేర్లు నిలబెట్టారు. గౌరవంగా బతుకుతూ వారి జీవనాన్ని గడిపేస్తున్నారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags