ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి
(భూమిక పాఠకుల కోసం ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్రని ఈ సంచిక నుండి సీరియల్‌గా
ప్రచురిస్తున్నాం. -ఎడిటర్‌)

(ఈ జీవిత చరిత్రలో గృహస్థుగా ప్రేమ్‌చంద్‌ జ్ఞాపకాలు పొందుపరచటం జరిగింది. ఒక రచయిత, సాహిత్యకారుడి వ్యక్తిత్వం ఇందులో కనిపిస్తుంది కనుక, సాహిత్యపరంగా కూడా ఈ పుస్తకానికి విలువ ఏర్పడింది. మానవీయ దృష్టితో కూడా ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంత విశాల హృదయుడో చెప్పటం ఈ పుస్తకం ఉద్దేశం. దీన్ని చెప్పటానికి నాకు ఉన్నంత హక్కు మరెవరికీ లేదు. ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్పాలంటే, మేమిద్దరం ‘ఒకేనావలో ప్రయణించిన వాళ్లం.’ – శివరాణీదేవి)

బాల్యం
బెనారెస్‌కి నాలుగు మైళ్ల దరంలో ఉండే లమహీ అనే ఊళ్లో 1880 జూలై 31 తేదీన ప్రేమ్‌చంద్‌ పుట్టాడు. ఆయన తండ్రి పేరు అజాయబ్‌రాయ్‌, తల్లి ఆనందాదేవి. ప్రేమ్‌చంద్‌కి ముగ్గురు అక్కలు. ఇద్దరు చిన్నప్పుడే పోయరు. మూడో అక్క చాలా రోజులు బతికింది. ఆవిడకన్నా మా ఆయన ఎనిమిదేళ్ళు చిన్నవాడు. తల్లి ఎప్పుడ జబ్బుగానే ఉండేది. ఈయనకి రెండు పేర్లు ఉండేవి – తండ్రి పెట్టిన పేరు, మున్షీ ధనపత్‌రాయ్‌, పెద్దనాన్న పెట్టిన పేరు మున్షీ నవాబ్‌రాయ్‌. తల్లిదండ్రులిద్దరికీ అతిసార వ్యాధి ఉండేది. పుట్టిన రెండు మూడేళ్ల లోపలే ఆయన బాందా జిల్లాకి వెళ్లవలసి వచ్చింది. చదువు ఐదో ఏట ప్రారంభించారు. ముందు మౌల్వీగారి దగ్గర ఉర్ద భాష నేర్చుకున్నారు. మిగతా పిల్లవాళ్లతో కలిసి ఆ మౌల్వీగారింటికి చదువుకోటానికి వెళ్లేవారు. చదువులో ఈయన చాలా చురుకుగా ఉండేవారు. చిన్నప్పుడు మనిషి మాత్రం చాలా బలహీనంగా ఉండేవారు. చిన్నప్పట్నించీ ఈయనకి హాస్యప్రియత్వం ఉండేది. ఒకసారి ఏం జరిగిందంటే, చాలామంది కుర్రవాళ్లు కలిసి మంగలివాళ్ల ఆట ఆడుతున్నారు. ఈయన ఒక పిల్లవాడికి క్షవరం చేస్త, వెదురుబద్దతో వాడి చెవి తెగ్గోశారు. ఆ కుర్రవాడి తల్లి మండిపడుత ఈయన తల్లిగారి దగ్గరకి ఫిర్యాదు చెయ్యటానికి వచ్చింది. ఆమె గొంతు వినబడగానే ఈయన కిటికీ పక్కన నక్కారు. తల్లి అది గమనించి, ఆయన్ని ఇవతలికి లాగి, నాలుగు తగల్నిచ్చింది.
”ఆ అబ్బాయి చెవి ఎందుకు తెగ్గొట్టావురా?” అందావిడ.
”నేను వాడి చెవి తెగ్గొట్టలేదు, క్షవరం చేశాను.”
”వాడి చెవినించి రక్తం కారుతంటే నువ్వు క్షవరం చేశానంటావా?”
”అందరు ఇలాగే ఆడారుగా!”
”ఇంక ఇలాంటి ఆటలు ఆడకు.”
”ఇంకెప్పుడ ఆడను.”
మరో సంఘటన –
ఈయన పెద్దనాన్నగారు జనుము అమ్మి ఆ డబ్బుని గట్లో పెట్టాడు. ఈయనగారు ఆ పెద్దనాన్నగారబ్బాయితో మంతనాలు జరిపాడు. అతను ఈయన కన్నా వయసులో పెద్ద. ఇద్దర కలిసి ఆ డబ్బు తీసేసుకున్నారు. డబ్బైతే దొంగిలించారు కాని, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఇద్దరికీ తెలీదు. పెద్దనాన్న కొడుకు ఆ డబ్బుకి చిల్లర సంపాదించి, పన్నెండణాలు మౌల్వీగారికి ఫీజు చెల్లించాడు. మిగతా నాలుగణాలకి జామపళ్లు, నువ్వు ఉండల అవీ కొనుక్కుని ఇద్దర కలిసి తినేశారు.
పెద్దనాన్న వాళ్లిద్దర్నీ వెతుక్కుంట వెళ్లి, ”మీరిద్దర డబ్బు దొంగిలించారా?” అని అడిగాడు.
”అవును. ఒక రూపాయి తమ్ముడు దొంగిలించి తెచ్చాడు” అన్నాడు చిన్నాన్న కొడుకు.
పెద్దనాన్న గద్దించాడు, ”ఏదీ ఆ రూపాయి?”
”మౌల్వీ గారికి ఫీజు చెల్లించాం”
పెద్దనాన్న ఇద్దర్నీ మౌల్వీగారి దగ్గరికి తీసుకెళ్లి, ”వీళ్లిద్దర మీకు డబ్బిచ్చారా?” అని అడిగాడు.
”అవును, పన్నెండణాలు ఇచ్చారు.”
”అవి నాకిచ్చెయ్యండి.”
ఆ తరవాత ”మిగతా నాలుగణాల ఏవి?” అన్నాడు వాళ్లతో.
”వాటితో జాంపళ్ళు కొనుక్కున్నాం.”
ఈ విషయం చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆయన స్వయంగా చాలా విషయలు నాకు చెప్పారు.
”చిన్నాన్న వాళ్లబ్బాయిని కొడుత ఇంటికి తీసుకొచ్చాడు. నా మొహం చూడాలి, కత్తివేటుకి నెత్తురుచుక్క లేనట్టుగా పాలిపోయింది. నేను భయం భయంగా ఇంట్లోకి అడుగుపెట్టాను. మా అన్న దెబ్బలు తినటం చూసి ొమా అమ్మ నన్ను కూడా కొట్టటం మొదలు పెట్టింది. పిన్ని పరుగెత్తుకొచ్చి నన్ను విడిపించింది. నన్నే ఎందుకు విడిపించిందో, తన కొడుకుని ఎందుకు విడిపించలేదో నాకర్థం కాలేదు, బహుశా నేను బక్కపల్చగా, అర్భకంగా ఉంటానని ఆవిడకి జాలేసిందేవె!”
”వంతెన మీద కూర్చునే చెప్పుల వాడు కుట్టిన చెప్పుల్ని నేను చాలాకాలం వేసుకున్నాను. మా నాన్న బతికున్నన్నాళ్లూ పన్నెండణాలకన్నా ఎక్కువ ఖరీదు చేసే చెప్పులు నాకోసం ఎప్పుడ కొనలేదు, గజం నాలుగణాలకన్నా ఎక్కువ ఖరీదైన బట్ట కొనలేదు. నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను, అందుకే నేను ప్రత్యేకంగా ఉండాలని ఎప్పుడ అనుకోలేదు. మా చిన్నాన్న కొడుకులతో సహా మేం మొత్తం ఐదుగురు మగపిల్లలం. నన్నెవరన్నా మీరెంతమంది అన్నదమ్ములు, అని అడిగితే, ఐదుగురం అనే చెప్పేవాడిని. నేను గిల్లీ దండా ఆట ఎక్కువగా ఆడేవాడిని.
”నాకు ఎనిమిదేళ్ళప్పుడు, అమ్మకి చాలా జబ్బు చేసింది. ఆరునెలలు మంచం మీదే ఉంది. నేనావిడ తల దగ్గర కూర్చుని విసెనకర్రతో విసిరేవాడిని. నా పెద్దనాన్న పిల్లలందర నా కన్నా పెద్దవాళ్లే. వాళ్ళు అమ్మకోసం మందులు తీసుకురావటం లాంటి పనులు చేసేవారు. మా అక్క అత్తారింట్లో ఉంది. తను కాపురానికెళ్లింది. అమ్మ తలవైపు ఒక సీసానిండా చక్కెర ఉండేది. అమ్మ నిద్రపోగానే నేనది తీసుకుని తినేవాడిని. అమ్మ ఇంకో పదిరోజుల్లో పోతుందనంగా అక్క వచ్చింది. వాళ్లింట ినించి మా నాన్నమ్మ కూడా వచ్చింది. అమ్మ ఇక దక్కదని తెలిసిపోయక నాన్నమ్మ వ గురించి నాన్నతో, ఇకనించీ నువ్వే వీళ్లకి అన్నీ!” అంది.
”అందరు ఏడుస్తున్నారు, కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. అమ్మ పోయిన కొన్ని రోజులకి అక్కయ్య తన ఇంటికి వెళ్లిపోయింది. రెండు మూడు నెలల తరవాత నాన్నమ్మకి కూడా జబ్బుచేసేసరికి, ఆవిడ లమహీకి వెళ్లిపోయింది. నేను, అన్నయ్య మిగిలాం. అన్నయ్య చక్కెర కలిపిన పాలు నాకు తాగటానికి ఎప్పుడ ఇస్తూ ఉండేవాడు. కానీ తల్లి ప్రేమ మళ్లీ దొరకలేదు! నేను ఒంటరిగా కూర్చుని చాలా ఏడ్చేవాణ్ణి”.
”ఐదారు నెల్లకి మా నాన్న కూడా జబ్బు పడ్డాడు. ఆయన లమహీకి వచ్చేశాడు. ఆయనతోపాటు నేను వచ్చాను. మౌల్వీగారి దగ్గర చదువుకోవటం, గిల్లీ దండా ఆడటం, చెరుకు గడలు విరుచుకుని తినటం, బటాణీకాయలు వలుచుకుని తినటం, ఇదే పని నాకు.
”నాన్న అక్కయ్యింటికి వెళ్ళేప్పుడు నన్ను తప్పకుండా వెంట తీసుకు పోయేవాడు. మా నాన్నమ్మ చెప్పే కథలు తెగ వినే వాణ్ణి. ఆవిడ కథలు చెప్పేప్పుడు నాకూ అన్నయ్యకీ ఎప్పుడ పోట్లాటే. ఇద్దరం ఆవిడతో, నాకేసి చూస్త కథ చెప్పు అని విసిగించేవాళ్ళం. ఆవిడకి నేనంటేనే ఎక్కువ ప్రేమ”.
”ఆ తరవాత ొమా నాన్నకి జీమన్‌పూర్‌కి బదిలీ అయింది. నేను, నాన్నమ్మతో అక్కడికి వెళ్ళాం. అన్నయ్య ఇందర్‌కి వెళ్ళాడు”.
”కొన్నాళ్ళకి మా పిన్ని (సవత్తల్లి) ఇంటి కొచ్చింది. ఈ పెళ్లి నాన్నమ్మకి నచ్చలేదు. పిన్నితోబాటు ఆవిడ తమ్ముడు విజయ్‌ బహాదర్‌ కూడా వచ్చి మా ఇంట్లో ఉండసాగాడు. వస్తూనే ఇంటి పెత్తనమంతా పిన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆవిడకి నా మీద కన్నా తన తమ్ముడిమీదే ఎక్కువ ప్రేమ. నాన్న పోస్టాఫీసునుంచి వచ్చేప్పుడు తినటానికేమైనా తీసుకొస్తే అదంతా నాన్నే తినాలనుకునేదావిడ. వాటిని ఆయన ముందు పెట్టేది, ‘ఇవి పిల్లల కోసం తెచ్చాను’, అనే వాడాయన. పిన్ని ఆయన చెప్పిన మాట వినకపోతే ఆయన కోపగించుకుని బైటి కెళ్లిపోయేవాడు.
”ఎలాగో ఒక ఏడాది గడిచింది. అక్కయ్య తనింటికి వెళ్లిపోయింది. నాన్నమ్మ మా ఇంటికొచ్చి, మా ఇంట్లోనే పోయింది”.
”నాన్న అద్దెకి తీసుకున్న ఇంటికి నెలనెలా నూటయభై రపాయలు అద్దె ఇచ్చే వాళ్లం. ఈ ఇల్లు చాలా ఛండాలంగా ఉండేది. దాని గుమ్మం పక్కనే ఒక ఇరుకు గది ఉండేది. నేను అక్కడే పడుకునేవాణ్ణి. నాకు ఏమీ ఉబుసుపోనప్పుడల్లా నేను పక్కనే ఉండే పొగాకమ్మే అతనింటికి వెళ్ళేవాణ్ణి. అప్పుడు నా వయసు పన్నెండేళ్లు”.
గోరఖ్‌పూర్‌ : కజాకీ
”నాన్నకి గోరఖ్‌పూర్‌కి బదిలీ అయింది. ఇక్కడ కూడా మాకు ఇంత క్రితం దొరికిన ఇల్లులాంటిదే దొరికింది. అక్కడిలాగే గుమ్మం పక్కనే చిన్న గది. నేన నాన్నతో గోరఖ్‌పూర్‌ వెళ్లినప్పుడు నాకు పదమూడేళ్లు. మిషన్‌ హై స్కల్లో ఆరోక్లాసులో నా పేరు నవెదు చేయించారు. పిన్ని కూడా వచ్చింది. నాన్నమ్మ అప్పటికే పోయింది.
”నాకు గాలిపటాలెగరెయ్యటమంటే ఎంతో ఇష్టంగా ఉండేది, కానీ చేతిలో డబ్బులుండేవి కావు. విజయ్‌ బహాదర్‌, నేన బాలేమియఁమైదానం కేసి వెళ్లి అక్కడ ఎగిరే గాలిపటాలని చూసేవాళ్లం. ఎక్కడైనా గాలిపటం తెగి కింద పడి, దాని దారం దొరికితే నేను నా కోరిక తీర్చుకునేవాడిని”.
”రాత్రి ొమాత్రమే మేమిద్దరం గదిలో ఉండేవాళ్లం. విజయ్‌ బహాదర్‌ వయసులో నాకన్నా చిన్న. అతను మాతోనే ఉండేవాడని చెప్పా కదా! ఇక్కడ కూడా నాకొక పొగాకు దుకాణం దొరికింది. నాకు తీరిక దొరికితే ఆ దుకాణంలో పోయి కూర్చునేవాణ్ణి. ఎందుకంటే ఇంట్లో ఏమీ తోచేది కాదు. అక్కడే నాలో రాయలన్న ఆసక్తి తలెత్తింది. ఏదేదో రాసి రాసి చింపేస్త ఉండేవాణ్ణి. అప్పుడప్పుడ మా నాన్న హుక్కా తాగుత నా గదిలోకి వచ్చేవాడు. నేను రాసిన కాయితాలు చూసి, ”నవాబ్‌! ఏమైనా రాస్తున్నావా?” అనేవాడు. నేను సిగ్గుతో కుంచించుకు పోయేవాణ్ణి. కానీ నా రాతల విషయంలో నాన్నకి ఏొమాత్రం ఆసక్తి ఉండేది కాదు. దానిక్కారణం ఉంది. అసలు పనిలో తలమునలుగా ఉండే ఆయనకి తీరికే ఉండేది కాదు. అదీగాక ఆయనకి ఇలాంటి విషయల్లో ఆసక్తి కూడా ఉండేది కాదు. నేను రాత్రి ఎక్కడున్నా ఆయన ఇదేమిటని అడిగేవాడు కాదు. నేను బైటా, ఆయన లోపలా ఉండేవాళ్లం. బహుశా ఆ రోజుల్లో తల్లిదండ్రులు దాన్ని తమ డ్యటీ అనుకునేవారు కాదేవె. పిల్లలకి స్వేచ్ఛ ఉండేది.
”మా ఇంటికి దగ్గర్లోనే రామ్‌లీల జరిగేది. ఆ రామ్‌లీలలో రాముడు, సీత, లక్ష్మణుడు నాకు చాలా అందంగా కనిపించేవారు. ఆ సమయంలో నా దగ్గరు ఉన్న వస్తువుని రాముడికివ్వటానికని పరిగెత్తేవాణ్ణి. డబ్బులున్నా సరే, అతనికే ఇచ్చేవాణ్ణి. అతను నాతో మాట్లాడితే చాలు, నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయేవాణ్ణి. నేనెంత తెలివితక్కువ దద్దమ్మనో! ఈ రోజుల్లో పిల్లలు ఎంత చురుగ్గా ఉంటారు!”.
”నాకు ఎప్పుడ డబ్బుకి ఇబ్బంది గానే ఉండేది. నా ఫీజు నెలకి పన్నెండుణా లుండేది. ఆ పన్నెండణాలలో ఒకటో అరో ప్రతి నెలా స్వాహా చేసేసేవాణ్ణి. నేనుండే పేటలో తక్కువ కులాల వాళ్ళు ఉండేవారు. వాళ్లు నా దగ్గర కొన్ని పైసలు తీసేసుకునే వాళ్లు. అందుకని ఫీజు కట్టే సమయనికి పూర్తి డబ్బులుండేవి కావు. ఇంట్లో అమ్మ లేదాయె. పిన్నినే అడిగేవాణ్ణి. ఆవిడ చాలా విసుక్కునేది. నాన్నకి చెప్పే ధైర్యం ఉండేది కాదు. అందుకే మాటిమాటికీ అమ్మ గుర్తుకొచ్చేది. నిజంగా అబద్ధం ఆడటం కూడా ఒక కళే. నిజం చెప్పటం వల్లే తన్నులు తినేవాణ్ణి. మేముండే ఇల్లు ఒక గొల్ల ఆమెది. ఆవిడ వితంతువు. ఆవిడా మా పిన్నీ ఏవేవో చెప్పుకుని నవ్వుకుంటూ ఉండేవాళ్లు. నేను కూడా వినేవాణ్ణి. వాళ్లు అలా నవ్వుకోవటం ్చూస్తే నాకు సరదాగా అనిపించేది. కానీ నాకు పదమూడేళ్లకే తెలిసిపోయిన ఆ విషయలు పిల్లలకి ప్రాణాంతకమైనవి!
”మళ్లీ నాన్నకి జమనియకి బదిలీ అయింది. నేను కూడా వెళ్లాను అక్కడి తపాలా బంట్రోతు నామీద చాలా ప్రేమ చూపించేవాడు. అతను నన్ను భుజాలకెత్తుకుని పరిగెత్తేవాడు. నేనెప్పుడ అతనికోసం చూస్త ఉండేవాణ్ణి. అతను వచ్చేప్పుడు నాకోసం చెరుకుముక్కల, జామపళ్లూ, కారెట్‌ దుంపల తెచ్చేవాడు. అందుకే అతనంటే నాకూ చాలా ఇష్టంగా ఉండేది. ఒకసారి నాన్న అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు. మర్నాడు అతను రాకపోయే సరికి, ”ఇవాళ కజాకీ రాలేదేం పిన్నీ? అని పిన్నిని అడిగాను.
”ఎందుకు రాలేదో, నాకేం తెలుసు?” అందావిడ. ఇంక నేనేమీ అనలేదు. లోపల్లోపలే బాధ పడ్డాను. మనసు పీకుతనే ఉంది. రాత్రి నాన్న రాగానే భయం భయంగా, ”నాన్నా, కజాకీ ఎక్కడికి వెళ్లిపోయడు?” అని అడిగాను.
”దొంగ వెధవని ఉద్యోగంలోంచి తీసిపారేశాను” అన్నాడాయన. నేను భయపడుతనే, ‘నాన్నా, అతను చాలా మంచివాడు’, అన్నాను. ‘దొంగ గాడిద’ అన్నాడు నాన్న.
”నేను ఏమీ అనలేదు. రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. పాపం ఎంత మంచి వాడో, అనుకున్నాను. పెద్దయ్యక అటువంటి మనిషిని ఎప్పుడ నాదగ్గరే అట్టిపెట్టుకుంటానని నిశ్చయించుకున్నాను. పొద్దున్నే నేనతనుండే చోటికి పరిగెత్తి వెళ్లాను. అతన్ని పిల్చుకొచ్చాను. చప్పుడు చెయ్యకుండా కొట్టుగదిలోకెళ్లి, గోధుమ పిండీ, పప్పుల, బియ్యం తీసుకొచ్చాను. అప్పుడు నేను ఏనిమిదో క్లాసులో ఉండేవాణ్ణి. పిన్ని కూడా అతన్ని మళ్లీ పనిలోకి తీసుకోమని నాన్నకి సిఫార్సు చేసింది. నేను కొట్టుగదిలోంచి తెచ్చిన వస్తువుల్ని తీసుకుని, కొద్దికొద్దిగా ఇమ్మని చెప్పింది.
(ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.