మా నాన్నగారిది గోవాడ గ్రామం. పేరు నడుకుర్తి వెంకటరత్నం కవిగారు. ఆయన చక్కని గాయకుడు కూడా. మా నాన్నగారి నరనరాల్లో జీర్ణించి ఉంది కవిత్వం. మా తాతగారి పేరు నడుకుర్తి వెంకట స్వామిగారు. జానపద కీర్తనలు చక్కని కంఠంతో పాడుతూండేవారు. రాయలేడు. తాళపత్ర గ్రంథాలు వాళ్ళ దగ్గరే చూశాను. మా నాన్నగారు గుంటూరు జిల్లా బోర్డులో ఎల్‌డిసిగా ఉద్యోగం చేసేవారు. మా అమ్మపేరు రత్న మరియ. ఆమె గోవాడ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌గా చేశారు. మా అమ్మ గారే గురువు నాకు. అక్షరాలలో అమ్మ గురువు. నాన్నగారు కవిత్వంలో గురువు. వాళ్ళ దగ్గర నుంచి గజాలవ ప్రక్రియలు ప్రాక్టీస్ చేశాను కదా. అట్లా వచ్చింది కవిత్వం. అమ్మ అక్షరాల పుట్ట. నాన్న కవిత్వాల గుట్ట. ఇల్లంతా అలలు నేర్చిన పుస్తకాల కట్ట. చిన్నప్పటినుంచి ఇదే వాతావరణంలో పెరిగాను. అమ్మగారి గురించి నేను రాసుకున్నది ఏంటంటే అర్థవర్థంతో ఒకే పదం మూడు విధాలుగా చెప్తూ నాల్గవ భాగంతో మంజరి అనేది పార్వతీభాష సంప్రదాయాల నుంచి తెలుగులోకి సంప్రాదింపజేశాను. రత్నకవిరాగం, శృంగార లహరి రాగం, గగన సంధ్యారాగం అన్ని మారియాంబ టీచర్ కెంపులే. మామ్మగారి గురించి అలా రాసుకున్నాను. ”అమ్మ మారియాంబ, టీచర్ బోర్డ్ స్కూల్ నందు, అన్నంను, అక్షరాలను తిన్నదాంక ఆగదాయే, ఇంటి బయట అమ్మపోరు” అని అమ్మ గురించి నా చిన్నతనంలోనే రాసుకున్నాను. నేను కవిత్వం పది, పన్నెండు సంవత్సరాల వయస్సులోనే రాయడం మొదలుపెట్టాను. నాన్నగారి వాతావరణం తెల్లవారటంతోనే పద్యాలు, కావ్యాలు చదువుకోవడం. ఆ వాతావరణం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ”అమ్మ అభరణం ఇచ్చిన అక్షరాల సముద్రం. నాన్న రాసి ఇచ్చిన కవిత్వపు శిఖరం” అమ్మ ఇచ్చిన అక్షరాల సముద్రం వలన ‘టీచర్’ నయ్యాను. నాన్న ఇచ్చిన కవిత్వం వలన ‘కవయిత్రి’ నయ్యాను. అది వాతావరణం. నాన్నగారు చాలా కావ్యాలు రాశారు. అందులో ఐదు, ఆరు ప్రింట్ చేయించాను. ఇపుడు వాళ్ళు ఇద్దరూ లేరు. వాళ్ళ కీర్తి ఉన్నది. మొట్ట మొదట రాసినది ‘గైడ్’ కానుక. ఇది వాళ్ళకు ప్రార్థన అయింది. నేను విద్యార్థిగా ఉన్నపుడు రాసిన కవిత రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకంలో అచ్చయింది. నేను రాసిన కవితలు, వ్యాసాలు అన్ని దిన, వార పత్రికలలో, స్కూల్ మ్యాగజైన్లలో అచ్చయినాయి. ”మేమంతా బటులం, విష్ణు మార్గదర్శకులం” అనే కవిత మొట్ట మొదట కృష్ణపత్రికలో వచన కవిత్వంలో ప్రచురించబడింది. అరాచకమైన పరిస్థితుల్లో ఉండగా స్వాతంత్య్రం మళ్ళీ వచ్చింది. అది వస్తూనే ఉంది. పోతూనే ఉంది. మా పరిస్థితులేమి మెరుగు పడలేదు” అనే విషయంమీద స్వాతంత్య్రం మళ్ళీ వచ్చింది అనే కవితను 1967లో ప్రారంభదశలో రాశాను. యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘంలో సమ్మె చేపట్టినాను. ఉపాధ్యాయ సంఘాల్లో జరిగే సమ్మెల మీద ”బుద్ధం శరణం గచ్ఛామి” అనే వచన కవిత రాశాను. అది కృష్ణ పత్రికలో అచ్చయింది. కృష్ణ పత్రికలోనే గాక అన్ని వార పత్రికల్లో అచ్చయింది. ”నారీమణులు – బేరసారాలు” ప్రభలో, ‘హేతువాదం’ పత్రికలో కొన్ని కవితలు అచ్చయినాయి. స్త్రీల సమస్యల మీద పేదరికం, వరకట్నం, వైధవ్యం, శీలం, సహగమనం మొదలగు వాటి మీద మార్కిస్టు ఆలోచనతో రాస్తూ వచ్చాను. పత్రికల్లో వచ్చాయి. పద్య కవితలు ఎక్కువగా అచ్చు కాలేదు. కానీ పుస్తకం వేశాను. జాషువాగారి గురించి ‘కోకిల గానం’ అనే పద్య కవిత తంగిరాల వెంకట సుబ్బారావుగారి ‘చైతన్య కవిత’ పత్రికలో అచ్చయింది.
‘సంపంగి మనసు’ అనే పద్య కవిత రాజమండ్రి నుండి ఖండిక ‘సాహితీ సమాలోచనం’ అనే పత్రికలో అచ్చయింది. సంపంగి కవి సమ్మేళనం ఒకటి ఉంది. సంపంగి వాసన తుమ్మెదకు పడదట. వాసన చూడదు అంటారు. దానిమీద సంసారంలో భార్యభర్తల మధ్య వైషమ్యాలు, విభేదాలు, వియోగాలు వీటన్నింటి నారీ మిషతో ఆ పనిని చేశాను. కవితను రాశాను.
అదే నెలలో ‘వేసవి కొలిమి’ కవిత రాశాను. అది విజేతలో అచ్చయింది.
‘ఒళ్ళంతా చెమట కలాలై నిక్కబొడుచుకుని ఎదుగును చేస్తుంది. గొంతును దాహం బీడరం వేసుకున్న ఎడారిని చేస్తుంది. అరికాళ్ళను నేల పెనం మీద మాడగలిగే రొట్టెలను చేస్తుంది. మాడును కిరణాల చిదుగునై, రగిలే కుండల్ని చేస్తుంది. జగమంతా చెప్పులు గొడుగు వరంగా పొందిన నేపత్నికాగా, చెవులు మాత్రం కోకిల కూసిన కుహు కుహు కూసికాల మేఘాల వర్షాధారం కాగా అల్లుకునే హాయిలతల పొదుగు అవుతుంది.
‘పాట కచేరీ’ కవిత రాశాను. అది ‘బిసి గర్జన పత్రికలో అచ్చయింది.
‘అవునులే పండుగ రోజు సిల్క్ చొక్కాకే మురిసిపోయే పసివాడివి నీకేమి తెలుసు. ప్రజాస్వామ్యం భవనానికి పునాది రాయి అయిన ఓటులో చీప్‌లిక్కర్ వదులుకోవడం కోసం కుండ మార్పిడి పెట్టిన వాడివి. నువ్వు రాజకీయ రంగంమీద రాజువేషం కట్టమంటే హైటెక్ దుమారంలో ఉలిపిరి కాగితంలో కొట్టుకొని పోయే ఉద్యోగ రిజర్వేషన్ కోసం విత్తం అనే భటుడుగా సెటిల్ అయిపోయినవాడివి. దేశం మీదికి రాముడో, రహీమో, రాబర్టో రానీ మీలో రగిలే ఆత్మకుంపటికి చెల్లుచీటి ఎందుకు అవుతావో, పొలాల పొచ్చులో అట్టడుగు క్లాస్ ఒకటి ఏర్పర్చి అందులో నీకు శాశ్వతంగా సీటు రిజర్వేషన్ ఏర్పర్చిన కుటిల వ్యూహాన్ని ఏమంటావో, శాస్త్రీయ సంగీతం పాట కచేరీలో వయోలిన్ చెట్టు తీగల రాపిడి కొమ్మల్లోంచి పిట్టలు ఎగిరే నాదం కక్షలోనికి జొరబడే శృతి కలిసే గాయకుడి గాత్రంలో కదిలే ఐక్యత యాత్రలోనికి కాలు కదిపి నడు. పరిగెత్తే ఎస్కలేటర్ మెట్లుమీద పాదం మోపి బ్యాలెన్స్ చేసుకున్నట్లు ”ఊపు అందుకున్న
ఉద్యోగంలోనికి ఒక్క ఉదుటున చేరు” ఇదండీ కవిత. ఇంకొక కవిత జలసింహం అనేది. అది వార్తలో వస్తే రావొచ్చు.
”ఓహో జలదేవత. నీ అలల ఒడిలో పెద్ద బంతిలా ఊగించే భూగోళాన్ని పోనుపోను గర్భంలో చెమ్మల్ని ఆవిరి చేసే పురుడుగా శాసిస్తావేమోనని భయం కలిగి బల్లి భయపడుతుంది. ఇప్పటికే దాహార్తి రూపాయి నాణం మార్కెట్లో మంచుబిళ్ళ అయి కరిగి గుక్కెడు నీళ్ళగా రూపాంతరం చెందుతుంది. అహంభావంతో అక్షయపాత్ర అవుతుందనుకున్న బాంక్ అకౌంట్ వెకేట్ అయి వెన్ను విరిగిన రైతన్న భుజాన జోలె పట్టివాలి అన్నపూర్ణ చేతికి అక్షయ పాత్ర అయి వచ్చేటట్లు, నువ్వు పొర్లి తుళ్ళి పాములా పాకి అమృత జరియై పాతాళానికి వెళ్ళవో ఉప్పు వలపన్నీ సముద్రం పోయాక నిన్ను కాకిని చేసి మెడ మెలేసి అలల అల్లిక బుట్టలవలె అదిమి పెట్టు కుంటుంది నిన్ను. దోస గింజల సోగగా, విప్పారే వాన చినుకులు విత్తనంగా, నీటి నిల్వలు సాలుగా, ఎద పెట్టిన నీరు పైరులు వ్యవసాయం నేను శపిస్తున్నాను. భూమి శివుడి అట్టడుగు పొరలా జటాజూటపు సిద్ధాంతం పొందిన జలకన్యగా, అపుడు మన జలచక్రం కులికే ఉపరితలం, పురివిప్పుకొని ఆటాడే ఆకాశం నీటిమట్టం నెమలిగా మంత్రజలం చల్లి వియోచించే భవిష్యపు నులి చేతిపుండిక. ఇపుడు మాత్రం నా దేశం పశువులు, పక్షులు, పరిశ్రమలు, పర్యావరణం సమతులం అవసరములా! ఎడారిలో దప్పిక వున్న జగత్ గాంగేయుడు శయనించిన శరతల్పం. ఆలోచనల అక్షయ తూనీగ సాధించిన పథకాల గాండీవం ధారకు, పాతాళాన్ని చేధించుకొని వురికిన ఉత్భిజం, ఉత్తిగ తరగ రంగమై ఉద్భవించిన జలశిల్పం.” ఇదండీ కవిత. ‘వేసవి కొలిమి’ తర్వాత ‘తొందర పడ్డ తొలకరి పిట్ట’ అనే కవితను రాశాను. దళిత ఏస్పెక్ట్తో కూడా ఒక కవిత రాశాను.
నేను ఆంగ్ల కవితలు కూడా రాశాను. అనువాదాలు కూడా చేస్తూ ఉంటాను. నవలలు కూడా రాశాను. కాని నా గురించి ఎవ్వరికి తెలియదు. నేను ఉద్యోగంతోనే సతమతమయిపోయాను. అందుకే ఎక్కువగా కవితలు పత్రికలకు పంపించలేదు.
1980లో ఫెమినిస్టులు ఇంకా రాయడం మొదలు పెట్టక ముందే నేను రాసిన ‘చంద్రగ్రహణం’ అనే మొట్ట మొదటి కవితా సంకలనం ఫెమినిస్ట్ కావ్యం అని నిరూపిస్తూ 1999లో ఒక ఫీచర్ కూడా వచ్చింది. ఎం.ఫిల్లో పరిశోధన చేస్తున్నాను. పెళ్ళి అయిన తరువాత అనుమానపు మొగుడు కుంచులలో పామువంటివాడు. ఏ విశేషం లేకుండా పద్యాలుండకూడదని నాన్నగారు ప్రోత్సహించారు. పెళ్ళి అయిన తరువాత సాహిత్య ఉద్యమాల గురించి స్టడీ చేశాను. నన్ను మార్క్సిజం చాలా ప్రభావితం చేసింది. శ్రీశ్రీని ఎక్కువగా అభిమానించాను. ఆధునిక సాహిత్యానికి ఆద్యుడు శ్రీశ్రీయా లేక గురుజాడా అని ఒక శీర్షిక పెట్టి అభిప్రాయాల్ని ఆహ్వానించాను. నేను మాత్రం శ్రీశ్రీ ఆద్యుడు అని రాశాను. శ్రీ శ్రీ మీద ఒక సమగ్రమైన వ్యాసం కూడా రాశాను. నేను మార్క్సిజం తీసుకోవడంవల్ల నన్ను కొంచెం ఎడంగా పెట్టారు. స్కూల్లో పిల్లలకు ఎక్కువగా అప్పటికపుడే గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతుంటాను. కనుక వాళ్ళు నన్ను కవయిత్రి టీచర్‌గా అనుకొంటారు. మా పెద్ద తమ్ముడు కూడా కవే. మా దగ్గర చదువుకున్న వాళ్ళు (శిష్యులు) బాగానే చదువుకొని పైకి వచ్చారు. అపుడపుడూ నా దగ్గరకు వస్తారు కూడా. మా కూతురు కూడా టీచర్‌గా పనిచేస్తోంది. మూడు తరాల నుంచి టీచర్ ఉద్యోగమే చేస్తున్నాం.
భారతంలోని పద్నాలుగు పాత్రల గురించి రాశాను. ‘నన్నయ్య మహిళ’ అనే పుస్తకంలో రాశాను. ‘స్థాన భంగిక’ అనే భారతంలోని కోట్స్ చేసిన పద్యాలను సంభాషణ రూపంలో రాశాను. భారతంను మార్చి వేశాను. కాబట్టి దానికి ఆమోదం ఇంకా రాలేదు. ప్రజల ముందు పెట్టాలి. మా నాన్నగారు మాట్లాడుతుంటే గోష్టిలాగా అందరూ వచ్చి కూర్చుండేవారు. అందులో సంభాషణను నేను విన్నాను. ‘కుంతీదేవి అర్జునుడిని పాండురాజుకే కన్నది. ధర్మరాజు, భీముడు వేరే అనుకోవచ్చు. ఎట్లా అంటే ముని శాపం ఉంది కదా. నీవు నీ భార్యతో కలిసినపుడు తలపగిలిపోతుంది అని కదా. అయితే నా ఆలోచన ఇది. 10 సంవత్సరాల క్రితం రాశాను. ముని పాండురాజును శపిస్తే సన్యాసి అయ్యాడు. భార్యమాట ఏమిటి? పనిష్మెంట్ భార్యకు కదా! భార్య గురించి ఆలోచించకుండా శపించాడు అంటే ఆ సమయంలో సమాజంలో పురుషుడు ఒకడే వ్యక్తి అన్నమాట. అతనికి ఉపాంగం భార్య అంతే. కుంతిని దేవతల ద్వారా సంతానం పొందు అని పాండురాజు పురికొల్పాడు. భార్య సహగమనం చేసి భర్తతో పోవాలి. ఆ రోజుల్లో ఇది ఉంది కదా. పాండురాజు నా గురించి ఆలోచించి, నా సుఖం కోసం వేరే మార్గం చెప్పాడు కదా అని కుంతి అనుకొని ఆయన రక్తసంబంధంతో పుట్టిన వాడికి (అర్జునుడికి) పట్టాభిషేకం చేయాలని అనుకుంది. జనమేజయుడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ధర్మరాజు కొడుకుకి పట్టాభిషేకం చేయలేదు. పరాక్రమంలో కూడా అర్జునుడికి పాండురాజుకి పోలికలు ఉన్నాయి. రంగులో కూడా పోలిక కలదు. అందుకే పాండురాజు కొడుకు అర్జునుడు, అర్జునుని కొడుకు అభిమన్యుడు. అభిమన్యుని కొడుకు పరీక్షిత్ మహారాజు. ఆయన కొడుకు జనమేజయుడు. అందుకే పట్టాభిషేకం జరిగింది. మౌలిక విషయాన్ని మార్చకుండా కథా గమనాన్ని మార్చాను. ద్రౌపదిని అయిదుగురికి ఒక భార్యగా చేసింది ఎందుకంటే అయిదుగురికి అయిదుగురు భార్యలుగా వస్తే వాళ్ళ సంసారంతో వాళ్ళు విడిపోతారు. అది జరగకుండా ఉండాలని ఒక తాటికి కట్టుబడి ఉండాలని కుంతి ఇట్లా చేసింది. బలమైన పక్షంగా వాళ్ళు
ఉండాలని. ఆ సమయంలో ఇట్లా చేసుకోవడం లేదు కనుక ద్రౌపదిని ఎక్కువగా ‘పంచభత్రుక’ అని హేళన చేశారు. ఇలా ఆలోచించేదానిని.
రామాయణం గురించి కూడా రాశాను. అది ‘భారతీయ స్త్రీ ధర్మానికి ప్రతీక సీత’ అని రాశాను. అది కడప రేడియోలో ప్రసారమయింది. ఇతిహాసాలు, భగవద్గీత, శ్రీశ్రీ, ఆధునిక సాహిత్యం, దళిత సాహిత్యం, ఫెమినిజం చదివాను. అన్ని పుస్తకాలు సేకరించి పెట్టారు మా నాన్నగారు. మా రచనలు మాములుగానే ఇచ్చాం. కాని అమ్మకానికి ఇవ్వలేదు. కవిత అనేది స్వేచ్ఛగా వెలువడాలి. గురజాడ అనేది స్వచ్ఛమైన ఆధునికం. ఆయన మీద ఒక వ్యాసం రాశాను. ‘కన్యాశుల్కం’ ఒక ప్రబంధం ఎన్ని సార్లు చదివినా బాగుంటుంది. ప్రబంధ యుగంలోనే శృంగారాన్ని గుప్పించి రాశారు. తరువాత శృంగారంలో తీపికి మొఖం మొత్తి మధుమేహం వచ్చింది. తరువాత భావకవులు రాయప్రోలు, బసవరాజు అప్పారావు, రామకృష్ణ శాస్త్రి మొదలగువారు కల్లుమానండి, జడ కుచ్చులు, మద్యపానం మొదలగు సామాజిక సమస్యలను తీసికొని రాశారు. ప్రణయంలో శృంగారం లేదు ఆరాధించడం మాత్రమే. స్త్రీని ఒక దృష్టితో చూడకూడదు. శృంగార ప్రబంధం నుండి విముక్తి ఈ భావకవులు చేశారు. అసలు స్వేచ్ఛ అనేది ఏమిటి అనేది భావకవులు చేశారు. 39లో రాసిన కవితలన్ని మహాప్రస్థానం. 43లో అరసం వచ్చింది. ఆరుద్రవాళ్ళు వచ్చారు.