ఓహో సుమబాలా !
మనిషి మనసును గెలిచిన మధుర మధుబాలా
అరదాల సుందరీ మనసున మయూరి
ఎన్నెన్ని రంగులో నీకెన్ని హొయలో
చేతిలో ఇమిలేవు
చెరతకు చేరేవు
మనసును గెలిచావు
మత్తును చల్లావు
చెలినే నేనంటూ గారాలు పోయేవు
||ఓహో సుమబాల||
సగమే నేనంటూ బీరాలు పోయేటి
సగాన్ని మరిపించీ సరిగమలాడేవు
విసుగు విరామాలను పక్కకు పంపావు
వీడని నీడవై వెన్నంటి వున్నావు
||ఓహో సుమబాల||
సువిశాల సుందరీ
మనసుకు మయూరి
ఎన్నెన్ని నేర్పితివో ఎద సంబరాలకూ
కష్ట సుఖాలు పంచుకునే ఏకైక మిత్రునివీ
నవ్వులు పూయించే మమతల మందాకినీ
||ఓహో సుమబాల||
వర్గ వైషమ్యాలను వీడని జనమంతా
ఆబాల జగమంతా నిను వీడి వుండలేరు
అన్నింటికి అతీతమైన నిన్ను
నిత్యం కొలిచేము
నీ బాట నడుచుకుంటూ నీరాజనమిచ్చేము
||ఓహో సుమబాల||