1) మీరు 3 సంస్థలతో కలిసి పనిచేయటం ఎలా అన్పించింది?
జ. మూడు సంస్థల సభ్యులంతా కలిసి ఒకే ఉద్దేశ్యంతో పనిచేస్తూ ఒక మహిళ తన హక్కులు వినియోగించుకుంటూ సమాజంలో ఎలా బ్రతకాలి అనేది నేర్చుకోవటం మరియు ఇంకొకరికి నేర్పించేలా తయారవ్వటం సంతోషంగా అనిపిస్తుంది.
2) మీరు నేర్చుకున్న అంశాలలో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం లేదా ఆలోచింపచేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా?
ఉంటే అవి ఏంటి?
జ. II ఫేజ్కే అటెండ్ అవ్వటమైంది. వాటిలో ట్రాన్స్జెండర్లు, వారి జీవితాలు, స్త్రీవాద ఉద్యమాలు, అసంఘటిత కూలీల కష్టాలు… ఈ అంశాలు ఎక్కువ ఆలోచింపచేశాయి.
3) ఐక్యతారాగం ద్వారా వ్యక్తిగతంగా మీలో వచ్చిన మార్పు ఏంటి?
జ. ట్రాన్స్జెండర్ను చూసే విధానంలో దృష్టికోణం మారింది. వాళ్ళతో దగ్గరనుంచి మాట్లాడగలుగుతున్నాను. సమాజంలో స్త్రీలు పడుతున్న కష్టాలను లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నారు.
4) మీరు నేర్చుకున్న అంశాలు మీకు పనిలో ఎలా ఉపయోగపడ్డాయి? ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్తారు?
జ. నేను నేర్చుకున్న అంశాలు, నేను చేసే పనిలో మహిళా దృష్టికోణంలో అర్థం చేసుకుంటూ మహిళలు సమాజంలో మరియు కుటుంబంలో పడుతున్న కష్టాలు, కోల్పోతున్న హక్కులు, వాటివలన కలిగే నష్టాలు లోతుగా అర్థం చేసుకుని వారికి సహాయపడే విధంగా ఉపయోగపడుతున్నాయి.
5) జెండర్ సంబంధిత అంశాలను మీ కుటుంబంలో గానీ, బంధువులు గానీ, పనిచేసే చోట గానీ మరియు ఇతర ప్రాంతాలలో అమలు చేయించడంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి?
జ. బంధువులలో మహిళలకు నిర్ణయాధికారం లేదు అనేది గమనించటం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక అంశాలలో, ఇంటి పనులలో కూడా జెండర్ సమానత్వం లేదు అనేది గమనించటం జరిగింది. ఇవి ఏమైనా అమలు చేయవలసి వచ్చినప్పుడు గొడవలు జరగటం సంభవిస్తుంది.
6) స్త్రీవాద దృక్పథంతో యువనాయకత్వాన్ని ఒక ఉద్యమంలా ముందుకు నడపడానికి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? ఏమైనా నేర్చుకోవాలని ఉందా?
జ. II ఫేజెస్ ట్రైనింగ్స్ మాత్రమే అటెండ్ అవ్వటం వల్ల అసంతృప్తిగా ఉంది. ఇంకా ట్రైనింగ్స్ ద్వారా నేర్చుకోవాలని ఉంది.
7) మూడు సంస్థల సభ్యులు కలిసి ఫెసిలిటేటర్స్గా ఎలా ముందుకు వెళ్ళవచ్చు?
జ. మూడు సంస్థల సభ్యులు వివిధ ప్రాంతాలకు చెందినవారు మరియు భిన్నమైన కుటుంబ నేపథ్యం కలిగినవారు
ఉన్నారు. కావున ఒకరి ప్రాంతాలకు మరొకరు వెళ్ళి మీటింగులు మరియు ట్రైనింగ్స్ నిర్వహించుకుంటూ, అక్కడ ప్రాంతాల స్త్రీల పరిస్థితులు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు.