ఇంటర్వ్యూ – శ్రీను, వెన్నెల, చంద్రకళ, అంజలి డి.జి. మాధవి, పద్మ

ఐక్యతారాగం ప్రక్రియ మొత్తం జెండర్‌ మరియు జెండర్‌ సంబంధిత అంశాలపై అవగాహనను మరియు సమూహాలతో పనిచేయడానికి అవసరమైన శిక్షణా నైపుణ్యాలను పెంచుకోవడానికి దోహదం చేసింది. జెండర్‌ దృక్పథాన్ని బలోపేతం

చేసుకోవడం ద్వారా ఆశిస్తున్న మార్పు దిశగా పనిచేయడానికి గతంలో రకరకాల పద్ధతులను ఉపయోగించేవాళ్ళం. పాటలు, నాటికలు, గ్రూపు చర్చలు, చార్ట్స్‌ చేసేవాళ్ళం. అలాగే కొత్తగా ఐక్యతారాగం శిక్షణలో మరిన్ని మెరుగైన ప్రభావవంతమైన ఫోటోఫ్రేమ్‌ పద్ధతిని నేర్చుకున్నాం. ఇందులో మనం అర్థం చేయించాలనుకున్న అంశాన్ని, పాత్రల్ని ఎంచుకుని ఆ వేషంలో కదలకుండా నిలబడి ఉండాలి. ఇదంతా చూసేవారికి మనం వారికి అర్థం చేయించాలనుకున్న అంశం సులభంగా అర్థమవుతుంది.
సమాజంలో స్త్రీలు, ఆడపిల్లలపై చూపిస్తున్న వివక్షతని సులభంగా తెలియచేయడానికి ఏ ఏ అంశాలు మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది తెలియచేయడానికి మేమంతా కలిసి (శిక్షణలో ఉన్న సభ్యులంతా కలిసి) 4 గ్రూపులుగా విడిపోయి ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఫోటోఫ్రేమ్‌లో చూపించాము.
దీనికోసం మేము ఎంచుకున్న అంశాలు కుటుంబం, మతం, న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ.
కుటుంబం: ఇందులో ఆరుగురు వ్యక్తులుంటారు. తల్లి, తండ్రి, నానమ్మ, ఇద్దరు
కూతుళ్ళు, ఒక కొడుకు. తండ్రి ఉద్యోగం చేస్తాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్‌ చదవడంతో అతని దినచర్య మొదలవుతుంది. ఇంటి పనులలో అతని భాగస్వామ్యం ఉండదు. అందుకని పేపర్‌ చదువుతున్నట్లుగా అతన్ని చూపించాము. తల్లి ఇంటి పనులతో పాటు భర్తకు, అత్తకు సేవలు చేయడం, పిల్లలకు కావలసిన అవసరాలన్నీ తీర్చడమనేది ఆమె ఖచ్చితమైన బాధ్యతగా ఆ కుటుంబ పరిస్థితి ఉంటుంది. అందుకని తల్లి పాత్రను ఆమె భర్తకు సేవలు చేస్తున్నట్లుగా చూపించాము. ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు చదవుకోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ తల్లికి ఇంటిపనుల్లో సహకరిస్తుంటారు. అందువల్ల ఆడపిల్లలు చదువుకుంటున్నట్లు, ఇంటి పనులలో సహాయం చేస్తున్నట్లు చూపించాం. ఆ ఇంట్లో తండ్రి తర్వాత అధికారం నాన్నమ్మకు ఉంది. కుటుంబం మొత్తం తను చెప్పినట్లుగానే వినాలనే అజమాయిషీ చూపిస్తారు. ముఖ్యంగా నాన్నమ్మ తన అజమాయిషీని కోడలు, మనవరాళ్ళపై చూపిస్తుంది. ఆమె తన మనవరాళ్ళపై అధికారం చూపిస్తున్నట్లుగా చూపించాము. అబ్బాయి చిన్నప్పుడు చదువుకుంటున్నట్లు చూపించాము. ఈ కుటుంబంలో అధికారం మొత్తం తండ్రి చేతిలోనే ఉంటుంది. తర్వాత నాన్నమ్మ చేతిలో ఉంటుంది.
కోడలికి, ఆడపిల్లలకు ఎటువంటి నిర్ణయాధికారం ఉండదు, గుర్తింపూ ఉండదు. ప్రస్తుత మన సమాజంలోని కుటుంబ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవలసింది పితృస్వామ్య వ్యవస్థ అనేది మన కుటుంబాల్లో ఎంత బలంగా పాతుకుపోయిందనేది… అర్థమవుతూనే ఉంది కదా! ఈ ప్రభావం వలన స్త్రీలు, పిల్లలు ఎంత వివక్షతకు, అణచివేతకు గురవుతున్నారనేది మనకు చాలా స్పష్టంగా అవగతమవుతుంది.
మతం: సమాజంలో ఉన్న మతాలకు అనుగుణంగా ఆయా మతాలలో స్త్రీ యొక్క స్థానం ఎలా ఉందనేది ఫోటోఫ్రేమ్‌ ద్వారా అందించాము. ఇందులో హిందు, ముస్లిం, క్రైస్తవ మతాలు ఉన్నాయి. ఒక ఆధునిక, హిందూ మహిళను, ఒక పురుషుడు ఆధిపత్యం కలవాడిగా చూపించాము. ఇందులో సంప్రదాయాలను పాటిస్తున్న హిందూ మహిళ తన స్థానానికి ప్రాముఖ్యతను ఏర్పరచుకోగలిగింది. ఎందుకంటే అనాదిగా వస్తున్న పితృస్వామ్య భావజాలానికి ఈమె ప్రతీకగా ఉంది. ఆ విధంగా సంప్రదాయాలను పాటిస్తున్న హిందూ మహిళగా ఒకరిని చూపించాం.
కొంత ఆధునికత గల హిందూ మహిళకు కట్టుబాట్లు, నియమాలు అనేవి తక్కువగా ఉన్నాయి. ఆమె వివక్షతకు తక్కువగా గురవుతుంది.
ముస్లింలపై, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఈ మతాలకు చెందిన పురుషులు కూడా స్త్రీలపై ఆధిపత్యం చూపిస్తున్నారు. అన్ని మతాల్లో పితృస్వామ్య ఆధిపత్యం ఉంది. దీనికి ప్రతీకగా ఒకరిని చూపించాము. హిందూ మత నాయకులు, పురుషుల వద్ద ఎక్కువ అధికారం ఉంది. క్రైస్తవ మహిళలపై కట్టుబాట్లు, నియమాలు అనేవి ముస్లిం మహిళలకన్నా కొద్దిగా తక్కువగా ఉన్నాయి.
ఏ మతంలో చూసినా స్త్రీలకు కట్టుబాట్లు, నియమాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. అందువలన వివక్షతకు గురవుతోంది.
న్యాయ వ్యవస్థ: మన న్యాయ వ్యవస్థ స్త్రీలకు, బాలికలకు ఏ విధంగా సహకరిస్తోంది, ఎంతవరకు సహాయాన్ని అందివ్వగలదు అనేది ఈ ఫోటో ఫ్రేమ్‌ ద్వారా వివరించాము.
ఇందులో న్యాయ దేవత, పెళ్ళి కూతురు, ఆమె తండ్రి ఉంటారు. కూతురి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తండ్రి తన కూతురికి పెళ్ళి చేస్తున్నాడు. ఆ పరిస్థితిలో కూతురు తండ్రి మాటలను శిరసావహిస్తుంది. పెళ్ళి కూతురి తండ్రి పెళ్ళి కొడుకు తండ్రికి కట్నాన్ని వినయంగా అందిస్తున్నాడు. పెళ్ళి కొడుకు తండ్రి గర్వంగా కట్నకానుకలను తీసుకుంటున్నాడు. మరొక జంటలో భర్త భార్యను గృహహింసకు గురిచేస్తున్నాడు. న్యాయ దేవత కళ్ళు మూసుకుని వీటన్నింటికీ సాక్ష్యంగా నిల్చొని ఉంటుంది. వరకట్న నిరోధక చట్టం ఉంది, అయినా కట్నం ఇస్తున్నారు. గృహహింస నిరోధక చట్టం ఉంది, అయినా గృహ హింస జరుగుతోంది. స్త్రీల రక్షణకు అనేక చట్టాలు ఉన్నా స్త్రీలకు న్యాయం జరగడం లేదు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం కోసం కూడా చట్టాలు వచ్చాయి, కానీ సమాజంలో మార్పు రావడం లేదు. ఎందుకంటే, చట్టాలు మరియు న్యాయ వ్యవస్థ పితృస్వామ్యం నుండి తమను తాము స్వతంత్రీకరించుకోలేకపోతున్నాయి. పుస్తకాలలో పేర్కొన్నట్లు న్యాయం సామాజిక వాస్తవాలకన్నా ఒకడుగు ముందుంది. ఇది కొంత అభివృద్ధిని సూచిస్తుంది. కానీ, ఇదేమంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే స్త్రీలలో వెనుకబాటుతనం, జెండర్‌ అసమానతలు పెద్దగా తగ్గలేదు. పెళ్ళికొడుకు తండ్రికి, భర్తకి ఎక్కువ అధికారం ఉంది. పెళ్ళికూతురికి, భార్యకి అధికారం లేదు.
విద్యావ్యవస్థ: మన సమాజంలో ఆడపిల్లలకు అందించాల్సిన విద్య విషయంలో ఉన్న కట్టుబాట్ల, నియమాలు వారిని ఇంకా వెనుకబాటుతనానికి గురిచేస్తున్నాయి. ఈ ఫోటో ఫ్రేమ్‌ ద్వారా అడ్డంకులను ఎదుర్కొని బాగా చదువుకొని ఒక అమ్మాయి లాయర్‌ అవుతుంది.
అబ్బాయిని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారు, అక్కడ మంచి వసతులు
ఉంటాయి. అమ్మాయిని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు, అక్కడ అరకొర వసతులు ఉన్నాయి. సమాజంలో మగపిల్లల చదువుకే ప్రాముఖ్యత ఉంది. ఆడపిల్లలకు చదువెందుకని ఇంటి పనులకోసం చదువు మాన్పించారు. కానీ, ఆ అమ్మాయికి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉంది. అందుకని పాఠశాలకు వెళ్ళే అవకాశం లేనందున అనియత విద్యా కేంద్రంలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి చదువు ముఖ్యమైనదని కుటుంబం భావించలేదు, కాబట్టి ఇంటిపని చేసుకుంటూ చదువుకుంటోంది. లేడీ లాయర్‌కి, ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్న అబ్బాయికి ఎక్కువ అధికారం ఉంది. డ్రాపవుట్‌ అయిన అమ్మాయికి అధికారం తక్కువగా ఉంది.
అధికారం లేని స్థితి నుండి మనం అధికారాన్ని పొందే స్థితికి ఎలా మారుతామనేది అర్థం చేసుకోవడం చాలా అవసరం. అధికారాన్ని తమ దగ్గరే ఉంచుకోవడాన్ని అందరూ కోరుకుంటారు. మన దగ్గర ఉన్న అధికారాన్ని ఇతరులతో పంచుకోవడం చాలా కష్టం. బయట ప్రపంచంలోనే కాదు, మన కుటుంబాల్లో, సంస్థల్లో, మన సముదాయాల్లో కూడా ఈ ధోరణి ఉంటుంది. అయితే సమానత్వాన్ని, అలాగే అందరి కోసం న్యాయం అని నమ్మే సమాజాన్ని సృష్టించడానికి అధికారాన్ని పంచుకోవడం గురించి కూడా ఆలోచన చేయాలి.
ఈ నాలుగు అంశాల మీద సమాచారాన్ని మిగిలిన సభ్యులకు మేము చాలా వివరంగాను, సులభంగాను ఇవ్వగలిగాము. కానీ వ్యక్తిగతమైన భావ వ్యక్తీకరణను మార్చుకుని ఇందులో పాత్రకు తగిన విధంగా ఇమడ్చడంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాము. ఈ విధానాన్ని మేము పనిచేస్తున్న గ్రామాల్లోను, సంఘాల్లోను చేయడంతో వారికి సమాచారాన్ని సులభంగా అందించగలిగాము. సంఘాల వారు అర్థం చేసుకోవడంతో పాటు ఆచరించడం జరిగింది. వ్యక్తిగతమైన మార్పు దిశగా ప్రయత్నం జరిగింది. ఇది మాకు సంతోషాన్నిచ్చింది.

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.