ఇంటర్వ్యూ:

ఇంటర్వ్యూ:
1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది?
జ. మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒకరి అనుభవాలు వ్యక్తిగతంగా పంచుకోవడానికి అవకాశం దొరికింది. మూడు సంస్థలలో పనిచేసే ప్రదేశాలలో

ఉన్నటువంటి పరిస్థితులు అందరం తెలుసుకున్నాం. పరిస్థితులు తెలియడం వలన వ్యక్తిగతంగా అనుభవాలు పెరిగాయి. మూడు సంస్థల సభ్యులు ఒకే ఆలోచనా విధానాలతో పనిచేయడం వలన చాలా నేర్చుకున్నాము. సంస్థల పరంగా సపోర్టు కూడా దొరికింది. నైపుణ్యాలు పెరిగాయి. సమాచార స్థాయి పెరుగుతుంది.
2. మీరు నేర్చుకున్న అంశాలలో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం లేదా ఆలోచింపచేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే తెలుపగలరు.
జ. స్త్రీవాద దృష్టి కోణం పనిచేయడంలో జెండర్‌ పరమైన అంశాల గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా ప్రభావితం చేసిన ముఖ్యమైన అంశం ట్రాన్స్‌జెండర్‌ జీవన విధానం, వారు పడుతున్న ఇబ్బందులు. వారిని సమాజంలో ఎలా చూస్తున్నారు, ప్రజలు వారికి ఇస్తున్న గుర్తింపు ఎలా ఉందో తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్‌ జీవిత విధానం తెలుసుకున్న తర్వాత వారి జీవిత విధానం మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. స్త్రీలకు, పిల్లలకు ఉన్న చట్టాలు మరియు సపోర్ట్‌ సిస్టం గురించి తెలుసుకోవడం జరిగింది. స్త్రీ, పురుషుల మధ్య, కులాల మధ్య, ట్రాన్స్‌జెండర్‌, మతం, దివ్యాంగులు, ధనిక, బీద, దళిత మహిళలు, ఆదివాసీ, జోగినీ వ్యవస్థ మొదలైనవి.
3. ఐక్యతారాగం ద్వారా వ్యక్తిగతంగా మీలో వచ్చిన మార్పు ఏమిటి?
జ. గ్రామాల్లో మూఢనమ్మకాలను నమ్మకపోవడంÑ ట్రాన్స్‌జెండర్‌ అంటే మనతో సమానంగా చూడడంÑ ధైర్యంగా మాట్లాడడంÑ ఒక వ్యక్తి సమస్యను తన కోణంలో చూసి అర్ధం చేసుకోవడంÑ నచ్చినట్లు ఉండడంÑ మాట్లాడే విధానంలో మార్పుÑ స్త్రీ దృష్టి కోణంలో ఆలోచించడంÑ ఒక పని చేసేముందు ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడంÑ బాధ్యతగా పనిచేయడంÑ ఆచారాలు, సంప్రదాయాలు, అభిప్రాయాలు, కట్టుబాట్లుÑ ఓపిక, సహనం కోల్పోకుండా ఉండడం.
4. మీరు నేర్చుకున్న అంశాలు మీకు పనిలో ఎలా ఉపయోగపడ్డాయి? ముందుకు ఎలా తీసుకొని వెళ్తారు?
జ. మాట్లాడే విధానంలో చాలా అంశాలు నేర్చుకొని పని ప్రదేశంలో ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి. పరిస్థితులను అర్థం చేసుకొని మాట్లాడడంÑ మెటీరియల్‌ పరంగా, కేస్‌ స్టడీస్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికల రూపాలలో బయటపడ్డాయి. ఎదుటివారిని, ఇతరులను భాగస్వాములుగా చేయడంలో ఉపయోగపడ్డాయి. సంబంధిత అధికారులతో కలిసి పనిచేయడంలో కూడా ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు: గ్రామ స్థాయిలో, మండల స్థాయిలోÑ స్త్రీలపై, పిల్లలపై హింస ఎలా జరుగుతుందో తెలుసుకోవడంÑ ఉదా: ట్రైనింగ్స్‌, మీటింగ్‌లలోÑ పితృస్వామ్య వ్యవస్థ గురించి వివరించడంÑ గ్రామస్థాయిలో, మండలస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి ముందుకు వెళ్ళడం.
5. జెండర్‌ సంబంధిత అంశాలను మీ కుటుంబంలో గానీ, బంధువుల్లో గానీ, పనిచేసే చోట మరియు ఇతర ప్రాంతాలలో అమలు చేయడానికి/చేయడంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
జ. జెండర్‌ సంబంధిత అంశాలు ముందు ఇబ్బందిగా అనిపించేవి. స్త్రీల పనులు పురుషులు చేయడంలో ఇబ్బందులుగా, వివక్షతగా అనుకునేది ఇంట్లో, బయటా కూడా. ఈ ఐక్యతారాగం ట్రైనింగ్‌ తర్వాత చేయవలసిన పనిలో తేడా లేకుండా ఇంట్లో సమానంగా చేయడం జరుగుతోంది. స్నేహితులలో, బంధువులలో కూడా మార్పు తీసుకురావడం జరుగుతోంది. ఉదాహరణకు: బట్టలు ఉతకడం, వంట పనిలో, పిల్లలను చూసే విధానంలోÑ ఇంట్లో, బయట నిర్ణయాలు తీసుకోవడంలో, పనిచేసే విధానంలోనూ. ముఖ్యంగా వ్యవసాయ పనులలో స్త్రీలు 70% పని చేస్తారు. పురుషులు 30% పని మాత్రమే చేస్తారు. కానీ రైతులంటే పురుషులను మాత్రమే గుర్తిస్తారు. వీటిపైన స్త్రీలు, పురుషులలో అవగాహన పెంచితే మార్పు వస్తుంది. ముఖ్యంగా పిల్లల పెంపకంలో, ఆటవస్తువులలో, ఆహారమివ్వడంలో, పనిలో, తిరగడంలో, బట్టలు వేసుకోవడంలో…
6. స్త్రీ వాద దృక్పథంలో యువ నాయకత్వాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు నడపడానికి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు?
జ. స్త్రీలకు, పిల్లలకు స్త్రీ వాద దృక్పథంలో, యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. కావలసిన సమాచారాన్ని తెలుసుకొని, పెంపొందించుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి అవసరమైన చట్టాలపైన అవగాహన అవసరం. పరిష్కార మార్గాలకు పూర్తి సమాచారం ఉండాలి నైపుణ్యాలు పెంచుకోవడం, ఆలోచించే శక్తి సామర్ధ్యాలు ఉండాలి. మనతోపాటు ఉన్న సంస్థలు, వ్యవస్థలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం, ధైర్యం ఉండాలి. స్త్రీ వాద దృష్టి కోణంలో పనిచేసే క్రమంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కారించడానికి సంస్థలు, వ్యవస్థలతో పరిచయాలు పెంచుకొని పరిష్కారదిశగా ముందుకు వెళ్ళవచ్చు.
7. మూడు సంస్థల సభ్యులు కలిసి ఫెసిలిటేటర్‌గా ఎలా ముందుకు వెళ్ళవచ్చు?
జ. మూడు సంస్థల నుండి వచ్చిన సమస్యలను క్రోడీకరించి వాటిని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఫెసిలిటేటర్‌గా కావలసిన నైపుణ్యాలు అవసరం.
ఇంటర్వ్యూ:
1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది?
జ. వెన్నెల: అందరం కలిసి పనిచేయడంవల్ల చాలా నేర్చుకున్నాను. మనకున్న ఆలోచనలు, సలహాలు ఫీల్డులోను, వ్యక్తిగతంగాను వారికి ఉపయోగపడే విధంగా పంచాము. వారినుండి నాకు ఉపయోగపడే ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను.
శ్రీను: గతంలో నా సంస్థ ఇచ్చిన సూచనలు, సలహాతో ఫీల్డులో చేసేవాడిని కానీ 3 సంస్థల వాళ్ళం కలిసి పని చేయడం ద్వారా ముగ్గురి సలహాలు, సూచనలు గతంకంటే ఎక్కువగా నా ఫీల్డులోను, నాకు వ్యక్తిగతంగాను చాలా ఉపయోగపడిరది.
చంద్రకళ: 3 సంస్థలతో కలిసి పనిచేయడం నాకు పెద్ద ఉమ్మడి కుటుంబంలా అనిపించింది.
అంజలి: ఎవరు ఏమి చేస్తున్నారు అన్నది ఒకరి గురించి ఒకరం తెలుసుకోవటం, అందరం కలిసి ఉమ్మడిగా కలిసిపోవడం నాకు సంతోషంగా అనిపించింది.
2. మీరు నేర్చుకున్న అంశాలలో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం లేదా ఆలోచింపచేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే తెలుపగలరు.
జ. వెన్నెల: ఐక్యతారాగంలో 4 ట్రైనింగ్స్‌లో నన్ను ప్రభావితం చేసి ఆలోచింపచేసిన అంశాలు చాలా ఉన్నాయిÑ మహిళల హక్కులు, పోరాటాలు, జీవిత చరిత్రలు, జెండర్‌ వ్యవస్థ, ట్రాన్స్‌జెండర్‌ వంటివి.
శ్రీను: కుల వ్యవస్థ గురించి, పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, వారు కోల్పోతున్న స్వేచ్ఛ మరియు ట్రాన్స్‌ జెండర్‌, జోగినీ వ్యవస్థ, వికలాంగులు మొదలైనవి చాలా అంశాలు నన్ను ప్రభావితం చేశాయి, ఆలోచింపచేశాయి.
చంద్రకళ: కుల వ్యవస్థ, జోగినీ, ట్రాన్స్‌జెండర్‌… వారి చరిత్రలు నన్ను ప్రభావితం చేసి ఆలోచింపచేశాయి.
అంజలి: నేర్చుకున్న విషయాలలో నన్ను ప్రభావితం చేసినవి చాలా ఉన్నాయి. అందులో ట్రాన్స్‌జెండర్‌ చరిత్రలు, జోగినీ వ్యవస్థ, మహిళా చట్టాలు కొన్ని.
3. ఐక్యతారాగం ద్వారా వ్యక్తిగతంగా మీలో వచ్చిన మార్పు ఏమిటి?
జ. వెన్నెల: మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు, ఆలోచనలతో ఐక్యతారాగం ద్వారా నాలో చాలా మార్పు వచ్చింది.
శ్రీను: ఐక్యతారాగం నాలుగు ట్రైనింగ్స్‌ వల్ల నాలో చాలా మార్పు వచ్చిందని అనుకుంటున్నా. మాట్లాడే విధానం, అందరితో కలిసిపోయే విధానం ఐక్యతారాగం ద్వారా నా ఫీల్డు లోను, నా వ్యక్తిగతంగాను చాలా మార్పు వచ్చింది.
చంద్రకళ: నా ఫీల్డులో సెషన్‌ గురించి, అందరితో మాట్లాడే విధానం, ముఖాముఖిగా, పర్సనల్‌ పాయింట్లు కూడా మాట్లాడడం… అలా చాలా మార్పు రావడంతో పాటు ఎంతో ఉపయోగపడ్డాయి.
అంజలి: నాలో వ్యక్తిగతంగా చాలా మార్పు వచ్చింది. నాకు చాలా భయం, సిగ్గు ఉండేది. ఇప్పుడు అందరితో ధైర్యంగా మాట్లాడగలను. కలిసి పాటలు పాడడం, కవితలు రాయడం, ట్రాన్స్‌జెండర్స్‌తో మాట్లాడడం, వారికి సలహాలు ఇవ్వడం… ఇదంతా ఐక్యతారాగం వల్లనే నాలో చాలా మార్పు వచ్చింది.
4. మీరు నేర్చుకున్న అంశాలు మీకు పనిలో ఎలా ఉపయోగపడ్డాయి? ముందుకు ఎలా తీసుకొని వెళ్తారు?
జ. వెన్నెల: ఐక్యతారాగం నేర్పిన ప్రతి అంశం మనకు ఫీల్డులో ఉపయోగపడేదే. వారు ఇచ్చిన ట్రైనింగ్స్‌ ద్వారా గ్రూప్‌లలో మాట్లాడుకుంటూ, కేసుల గురించి, చిన్న గ్రూపులో చర్చించుకోవడం. ఉదాహరణకు`కడపలో చనిపోయే స్థితిలో ఉన్న ట్రాన్స్‌మెన్‌ను చివరి నిమిషంలో కాపాడగలిగామంటే అది ఐక్యతారాగంలో నేర్చుకున్న శిక్షణల వల్లే.
శ్రీను: జరిగిన 4 ట్రైనింగ్స్‌ ద్వారా నాకు ఫీల్డులో చాలా ఉపయోగపడ్డాయి. చిన్న గ్రూపులు, కోర్‌ గ్రూపులు, కొన్ని అంశాల మీద చర్చించుకోవడం, తర్వాత పెద్ద గ్రూపులో చర్చించుకోవడం… ఇలా ముందుకు వెళ్ళవచ్చు.
చంద్రకళ: ఐక్యతారాగంలో నేర్చుకున్న ప్రతి అంశం నా ఫీల్డులో ఉపయోగపడ్డాయి. 3 సంస్థల సభ్యులను కలిసి ఫీల్డులో చేయడం, చర్చించుకోవడం ద్వారా ముందుకు వెళ్ళవచ్చు.
అంజలి: నేను నేర్చుకున్న అంశాలు మహిళలే ఎందుకు హింసకు గురవుతున్నారు అనే విషయాలపై మహిళలకు మరియు ఆడపిల్లలకు తెలియచేయడం. మహిళలు, ఆడపిల్లలు ఎలా హింసకు గురికాకుండా ఉండాలనే విషయాలపై మరింత ముందుకు వెళ్తాను.
5. జెండర్‌ సంబంధిత అంశాలను మీ కుటుంబంలో గానీ, బంధువుల్లో గానీ, పనిచేసే చోట మరియు ఇతర ప్రాంతాలలో అమలు చేయడానికి/చేయడంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
జ. వెన్నెల: ఐక్యతారాగంలో జరిగే ప్రతి అంశాలను నా కుటుంబంతో చర్చిస్తా. అయితే బంధువులతో చర్చ జరగలేదు. పనిచేసేచోట, ఇతర ప్రాంతాలలో వారికి జరగుతున్న సమస్యల గురించి పోరాడాం.
శ్రీను: నా కుటుంబంలో పిల్లలని సమానంగా చూస్తాను (ఐక్యతారాగం ట్రైనింగ్‌కి వచ్చిన తర్వాత నుండి). బంధువులకు కూడా సలహాలివ్వడం, పని ప్రదేశంలో మహిళలకు సమాన వేతనం గురించి. ఉదా: ఉపాధి హామీ పని.
చంద్రకళ: నేర్చుకున్న అంశాలను కుటుంబంతో, పనిచేసే చోట, అలాగే బంధువులతో చర్చించటం జరిగింది. ట్రాన్స్‌ జెండర్‌ సమస్యలను తెలుసుకున్న నేను పనిచేసేచోట చెప్పగలుగుతున్నా.
అంజలి: పనిచేసేచోట, తల్లిదండ్రులకు, ఆడపిల్లలు`మగపిల్లల విషయంలో ఇద్దరికీ సమానం అనే చోట(మాట) తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.
6. స్త్రీ వాద దృక్పథంలో యువ నాయకత్వాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు నడపడానికి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు?
జ. వెన్నెల: నేర్చుకున్న ప్రతి అంశం కూడా స్త్రీవాద దృక్పథంతో చూసి నేర్చుకున్నాం. శిక్షణ, సెషన్స్‌, ఛార్ట్స్‌ ద్వారా పిల్లల్లో నాయకత్వాన్ని పెంచవచ్చు. పుస్తకాలు, స్కిట్స్‌, పాటలు మొదలైనవన్నీ నేర్చుకోవాలని అనిపించింది.
శ్రీను: ప్రతి అంశం స్త్రీవాద దృక్పథంతోనే చూడాలి.
చంద్రకళ: నాయకత్వ లక్షణాలు స్త్రీవాద దృక్పథంతో చేయాలి. శిక్షణలు కావాలి.
అంజలి: స్త్రీవాద దృక్పథంతో ప్రతి అంశం ఉండేలా చేయాలి. శిక్షణలు కావాలి.
7. 3 సంస్థల సభ్యులు కలిసి ఫెసిలిటేటర్‌గా ఎలా ముందుకు వెళ్ళవచ్చు?
జ. వెన్నెల: 3 సంస్థల సభ్యులు కలిసి చిన్న గ్రూపుల ద్వారా, వీడియోకాల్స్‌ ద్వారా అంశాలను చర్చించి ముందుకు సాగవచ్చు.
శ్రీను: జూమ్‌ మీటింగుల ద్వారా, శిక్షణల ద్వారా, చిన్న, కోర్‌ గ్రూపుల ద్వారా మాట్లాడుకుంటూ ముందుకు సాగవచ్చు.
చంద్రకళ: 3 సంస్థలు ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది.
అంజలి: 3 సంస్థల వారు కలిసి వేర్వేరు చోట్లకు వెళ్ళి సెషన్స్‌ చేయడంత

నాగమ్మ, రాము

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.