డా. రమా మెల్కోటె
1980 నాటికి మూడవ ప్రపంచ దేశాల స్థితిగతులు
1970లో మూడవ ప్రపంచ దేశాల ప్రజలు ఆశించినట్లుగా, ఆ దేశాలు అభివృద్ధి చెందలేదు. 80లు వచ్చేసరికి చమురు సంక్షోభం ఏర్పడటం, ధరలు చుక్కల్లోకి దూసుకెళ్ళడంతో పాటు, మూడవ ప్రపంచ దేశాలు ఎగుమతి చేసే ముడిసరుకుల ధరలు పడిపోవటం సంభవించాయి.
అనావృష్టి, కరువుకుతోడు అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తులకి, వ్యాపారానికి పోటీలేకుండా కాపాడుకోవడానికి చేసిన కట్టుదిట్టాలు మూడవ ప్రపంచ దేశాల రుణాలను విపరీతంగా పెంచేశాయి. విదేశీ రుణభారం పెరగడమే కాకుండా, వాటిపై వడ్డీ కూడా పెరిగి అతి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక విధానాలు, వాటి ఆధిపత్యం కింద నలుగుతున్న బడుగు దేశాల విధానాలు, పెరుగుతున్న రక్షణ బడ్జెట్‌లు మొదలైనవి 1970 నుండి వస్తున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముఖ్యకారణాలుగా పేర్కొనవచ్చు. ఈ ఆర్థిక సంక్షోభ ప్రభావం అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలపై కూడా ఉంది. అందుకే ఈ దేశాలకు వర్థమాన దేశాల ముడి సరుకులు, మార్కెట్లు చాలా అవసరం. ఈ కారణంగానే అమెరికా మరియు అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, స్త్రజుఊఊ మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టి మార్కెట్ వ్యవస్థ ద్వారా తమ ఆధిపత్యాన్ని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగమే వ్యవస్థాగతమైన సర్దుబాట్లు (ఐజుఆ). అంతేకాకుండా పైన పేర్కొన్న ప్రయివేటీకరణ లాంటి సంస్కరణలను అమలులో పెట్టిన దేశాలకే రుణ సహాయం, పెట్టుబడులు లభిస్తాయనే షరతులు విధిస్తున్నాయి. ఈ పరిణామం మూడవ ప్రపంచ దేశాలపైన, ముఖ్యంగా స్త్రీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో పరిశీలిద్దాం.
వ్యవస్థాగతమైన మార్పుల ప్రభావం (ఐజుఆ) :
మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో స్త్రీలు ఆహారధాన్యాలను పండించే ఉత్పత్తిదారులని చెప్పవచ్చు. ఆఫ్రికాదేశాల్లో స్త్రీలే కుటుంబానికి కావలసిన ఆహార ధాన్యాలను పండిస్తారు. అంతేకాకుండా ప్రయివేటు సెక్టారు లోని అసంఘటిత రంగంలో (అప్పడాలు చేయటం, బుట్టలల్లడం, బీడీలు తయారు చేయడం) స్త్రీలు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. నూతన ఆర్థిక విధానం వల్ల ఇపుడు కొత్తగా ఎన్నో మార్పులేముంటాయో చూద్దాం. వర్తమాన దేశాల్లో వ్యవస్థాగతమైన మార్పు (ఐశిజీతిబీశితిజీబిజి జుఖిశీతిరీశిళీలిదీశి ఆజీళివీజీబిళీళీలి (ఐజుఆ)) లను ప్రవేశపెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాలు తమ ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఐజుఆ సంఘటితంగా ఉన్న పారిశ్రామిక వాణిజ్య రంగాలకు అవసరమైనటువంటి పథకం. దానివల్ల లాభాలు గడించేది కూడా ఈ రంగాలే. అందువల్ల ఇతర రంగాల్లో అసంఖ్యాకంగా పనిచేస్తున్న వారిపై ఐజుఆ ప్రభావం ఏమీ లోనట్లన్పించొచ్చు. కాని అది ప్రత్యక్షం గాను, పరోక్షంగాను ప్రభావితం చేసి తీరుతుంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, దిగజారి పోతున్న వేతనాలు దీని ప్రభావం వల్ల సంభవిస్తున్న అతిముఖ్య పరిణామాలుగా మనం చూడొచ్చు. పౌర సదుపాయాలపై ప్రభుత్వ ఖర్చు తగ్గించడం వల్ల, పబ్లిక్ సెక్టారులో చేస్తున్న తగ్గింపుల వల్ల అతి కొద్దిమందికే పలు రకాలైన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఐజుఆ పథకాల ఫలితంగా మూడవ ప్రపంచ దేశాల్లో తీవ్ర అసమానతలు చోటుచేసుకున్నాయి. లాటిన్ అమెరికాలో తలసరి ఆదాయం 1980లో కంటె 89లో 9 శాతం తగ్గిపోయింది. 1990లో స్త్రఈఆ 9.6 శాతం తగ్గింది. 1/3 అంటే 130 మిలియన్ల ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ఆఫ్రికాలో 1980-85 మధ్యకాలంలో పేదప్రజల సంఖ్య 210 మిలియన్‌ల నుండి 278 మిలియన్‌ల వరకు పెరిగింది. విదేశీ చెల్లింపుల సమతౌల్యాన్ని సరిదిద్దడానికి, రుణభారాన్ని తగ్గించడమనే నెపంతో ప్రపంచ ద్రవ్యనిధి (|ఖఓ), ప్రపంచ బ్యాంకులు ప్రవేశపెట్టినటువంటి ఐజుఆ వల్ల రుణభారం, వడ్డీభారం పెరగడమే కాకుండా, సంవత్సరానికి కనీసం 20 బిలియన్ డాలర్లు ఉత్తరాది దేశాలకు తరలించబడుతున్నాయి. దక్షిణ దేశాల ముడిసరుకులు, చవకగా అమ్మేధరలను కూడా లెక్కగట్టినట్లయితే ఇది 60 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.
ఆహార పదార్థాల ధరలపై ఆంక్షలు, కంట్రోళ్ళు, మరియు సబ్సిడీలు ఎత్తివేయడం వంటి విధానాల ప్రభావం స్త్రీలపై, పిల్లలపై ఉన్నట్లు, పోషకాహార లోపం వల్ల వారి ఆరోగ్యం క్షీణించినట్లు యూనిసెఫ్ (ఏశ్రీ|్పుజూఓ) రిపోర్ట్ తెలుపుతోంది. బ్రెజిల్‌లో అతిపెద్ద విదేశీ రుణభారాన్ని తగ్గించడానికని చేసిన ఈ విధానం వల్ల ఆహారధాన్యాల ధరలు పెరిగిపోవడం పేద ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం జరిగింది. ఇంతకు పూర్వం కొనుక్కునే సరుకులనే కొనడానికి ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం (అంటే 1981లో వారానికి 120 గంటలు మరియు 1983లో 262.3 గంటలు) ఏర్పడటమే కాకుండా ఆడపిల్లల స్త్రీల పోషకాహార స్థాయి బాగా పడిపోయింది. చిన్నపిల్లలు సైతం పనులు చేయాల్సి రావడం, పాఠశాలలను వదిలేసే పిల్లల సంఖ్య- ముఖ్యంగా ఆడపిల్లల సంఖ్య పెరగడం కూడా జరిగింది. ఎగుమతులను ప్రోత్సహించే విధానం వల్ల స్త్రీలకు ఉద్యోగాలిచ్చే ఉత్పత్తి సంస్థల నుండి పెట్టుబడులను తగ్గించడమో, ఇతర పరిశ్రమలను తరలించడమో లేదా మూసివేయడమో జరిగాయి. జాంబియాలో కూడా |ఖఓ , ప్రపంచ బ్యాంక్ రుణభారం తగ్గించడానికి చేపట్టిన విధానాలవల్ల, పోషకాహార లోపంతో మరణించిన పిల్లల సంఖ్య పెరగడం, విద్యా విషయాలపై కోత విధించడం వల్ల ఆడపిల్లల చదువు తగ్గిపోవడం సంభవించాయి. 1991లో జింబాబ్వేలో ఆరోగ్యశాఖ ఖర్చు 20 శాతానికి, విద్యాశాఖ ఖర్చు 14 శాతానికి తగ్గించడం జరిగింది. దీనివల్ల స్త్రీలకి, పిల్లలకి సరియైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితు లేర్పడినాయని అక్కడి వైద్యుల సంఘం చెబుతోంది. ప్రభుత్వ సబ్సిడీలు రద్దు చేయడంవల్ల ప్రైవేటీకరణవల్ల, ఆఫ్రికాలో చాలావరకు స్త్రీలకు భూమిలేకుండా పోవడం, పనిలేకుండా పోవడం జరుగుతోంది.
నూతన ఆర్థిక విధానం – ప్రభావం :
నూతన ఆర్థిక విధానం వల్ల ప్రభుత్వ ఆదాయ లోటు (జీలిఖీలిదీతిలి ఖిలితీరిబీరిశి) తగ్గలేదు సరికదా పెరిగింది. సంస్థాగతమైన సర్దుబాటువల్ల (ఐజుఆ వల్ల) అనుకున్నట్లుగా ఎగుమతులు పెరగలేదు. విదేశీ వ్యాపారంలో కొంతవరకూ స్థిరత్వమంటూ ఏర్పడిందంటే అది విదేశీ రుణాలు తీసుకోవడంవల్ల జరిగిందే కానీ విదేశీ వ్యాపారం మెరుగుపడినందువల్ల కాదు. ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావాలంటే రెండు ముఖ్యమైన పనులు జరగాలి. 1. ఎగుమతులు బాగా పెరగాలి. 2. విదేశీ పెట్టుబడులు పెరిగి విదేశీ చెల్లింపుల సమతౌల్యం ఏర్పడాలి. (అంటే లీబిజిబిదీబీలి ళితీ చీబిగిళీలిదీశిరీ పరిస్థితి బాగుపడాలి). అయితే ఇప్పటివరకు అమలులోకి వచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏవీ కూడా వీటికి దారితీయలేదు. ఇపుడు నెలకొన్న అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ చేయగలుగుతాయా? అనేది ఒక ప్రశ్న. సరళీకృత విధానం (జిరిలీలిజీబిజిరిరీలిఖి చీళిజిరిబీగి) వల్ల విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టుబడులు పెట్టి దేశాన్ని అభివృద్ధి పరుస్తారనడం కూడా సమంజసంగా లేదు. విదేశీ పెట్టుబడులు అనుకున్నంతగా తరలిరాకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా |ఖఓ ప్రపంచబ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థలనుంచి పెద్ద మొత్తంలో ప్రభుత్వం రుణాలు తీసుకుంటోంది. ప్రపంచ ద్రవ్యనిధి 2.3 బిలియన్‌ల డాలర్లు ఇవ్వడానికి ఒప్పుకొని ఇంతవరకు 680 మిలియన్ల డాలర్లు ఇచ్చింది. 7.2 బిలియన్‌లు ఇవ్వడానికి ఎయిడ్ ఇండియా కన్‌సోర్టియమ్ ఒప్పుకుంది.
నూతన ఆర్థిక విధానం, పరిస్థితులను ఎంతవరకు సరిదిద్ద గలుగుతుందనేది అనుమానాస్పదమే. ద్రవ్యోల్బణం వల్ల విదేశీ వస్తువులు కొనడానికి మనం ఎక్కువ రూపాయలు వెచ్చించాల్సివస్తే మన వస్తువుల్ని కొనడానికి మాత్రమే విదేశీయులకు తక్కువ మొత్తమే సరిపోతుంది. ఈ విధానం వల్ల మన ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గే అవకాశాలు ఇపుడపుడే ఏమీలేవు. మనం ఎగుమతి చేసే వస్తువులు చాలావరకు ముడి సరుకులే కావడం దీనిక్కారణం. అంతే కాకుండా ఎగుమతులపై పరిమితులు (గతిళిశిబి జీలిరీశిజీరిబీశిరిళిదీరీ) చైనా, తైవాన్ మొదలైన దేశాలనుంచి పోటీ, మనం తయారుచేసే ఇంజనీరింగ్ పరికరాలు అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యత రీత్యా నిలబడలేక పోవడం ఈ కారణాలవల్ల మన ఎగుమతులు పెరిగే అవకాశం చాలా తక్కువ. ప్రపంచ వ్యాపారంలో మన విదేశీ వ్యాపార విలువ 0.5 శాతం మాత్రమే.
ప్రభుత్వ సెక్టారులోని కొన్ని పరిశ్రమలు, సంస్థలు, మూసివేయటం మనం చూస్తున్నాం. దీనికి కారణాలు ప్రభుత్వ సెక్టారులోని అసమర్థత, జాప్యం. ఇది కొంత వరకు నిజమైనప్పటికీ పబ్లిక్ సెక్టారు అవసరాన్ని గుర్తించాలి. రవాణా, సరఫరా మొదలైన సౌకర్యాలు కల్పించేది, పబ్లిక్ సెక్టారు మాత్రమే. ప్రజాసౌకర్యాలు కల్పించేదీ, ప్రైవేట్ సెక్టారుకు కావాల్సిన సాధన సంపత్తిని కల్పించేది కూడా పబ్లిక్ సెక్టారే. నిజానికి మన దేశంలో పరిశ్రమల మధ్య పోటీ అనేది చాలా తక్కువ. కొన్ని గుత్త పెట్టుబడి సంస్థలు, కుటుంబాలు మాత్రమే పరిశ్రమలను కంట్రోలు చేస్తున్నాయి. వీటిపై ఆంక్షల చట్టం (ఖష్ట్రఊఆ) ఎత్తివేయడంతో వీటి పెత్తనం ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. సరళీకృత విధానం ముఖ్యంగా పరిశ్రమలకు విదేశీ వ్యాపారానికి సంబంధించింది. అందువల్ల మన దేశంలో పరిశ్రమలు, విదేశీ పరిశ్రమలతో పోటీపడాల్సి వస్తుంది. వ్యవసాయరంగంలో సరళీకృత విధానంవల్ల వ్యావసాయిక ధరలు ఎక్కువకావడం, సబ్సిడీలు తగ్గించడం వల్ల లాభాలు గడించేది ధనిక రైతులే అయినప్పటికీ ధరలు పెరగడం వల్ల నష్టపోయేది మాత్రం పేదరైతులు, సామాన్య ప్రజలు.
సబ్సిడీలు, రాయితీల వల్ల ప్రభుత్వ విధులపై భారం ఎక్కువ అయినప్పటికీ, దానిలో 60% తక్కువ రాబడి ఉండే ఆర్థిక సంస్థల (జూబీళిదీళిళీరిబీ ఏదీరిశిరీ) పై పోగా, చాలా కొద్ది శాతం మాత్రం సమాజ అవసరాలైన విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికై కేటాయించటం జరిగింది. ప్రభుత్వ పౌరసరఫరా శాఖ (ఆతిలీజిరిబీ ఈరిరీశిజీరిలీతిశిరిళిదీ ఐగిరీశిలిళీ) చెప్పుకోదగ్గంత సమర్థవంతంగ పనిచేయక పోయినప్పటికి కొంత వరకైనా ప్రజల కనీసావసరాలను తీర్చగలిగింది. నష్టపోతున్న పరిశ్రమలకు సబ్సిడీలు తగ్గించడం సమంజమైనా, ప్రజలకవసరమైన వస్తువులపైనా, సంస్థలపైనా సబ్సిడీలు తగ్గించినట్లయితే అసమానతలు మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ప్రైవేటు పరిశ్రమలు లాభాలు గడించడానికి కారణం ప్రభుత్వమిచ్చే రక్షణ, సదుపాయాలతో పాటు అవసరమైన సాధన సంపత్తి సమకూర్చటం మొదలైనవి. ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణ (వీజిళిలీబిజిరిరీళీ) చేయడం వల్ల సామర్థ్యం ఎక్కువౌతుందని, పోటీ చేయగలుగుతుందని అనుకోడం అనుమానాస్పదమే. అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర చూసినట్లయితే ఒక విషయం స్పష్టమౌతుంది. పారిశ్రామికీకరణ సందర్భంలో ఆయా దేశాలు తమ వస్తువుల అమ్మకాలను పెంచడానికి అనేక రక్షణ చర్యలు తీసుకున్నాయి. ఆసియా పులులు (జురీరిబిదీ ఊరివీలిజీరీ) అనబడే దక్షిణ కొరియా, తైవాన్, మలేషియా, సింగపూర్ దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం, పటిష్టమైన ఆర్థిక విధానం, సరైన విద్య, ఆరోగ్య సదుపాయాలు కలిగించడం.
ప్రపంచ ద్రవ్యనిధి భారతదేశంపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, పైగా అది ఇచ్చే విరాళాలు, రుణాలు దేశంలోని ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి, ఉద్యోగావకాశాలు పెంచడానికి ఉపయోగించుకోవచ్చని వాదిస్తూ, ప్రభుత్వం లిబరలైజేషన్ పాలసీని సమర్థిస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడులవల్ల ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందనడం, పైగా ఆధునిక టెక్నాలజీ దేశంలోకి వస్తుందనుకోవడం ఎంతవరకు నమ్మదగిందో హిందూస్తాన్ లీవర్ (కఉఉ) కంపెనీ పరిస్థితిని చూస్త్తే అర్థమౌతుంది. ఈ కంపెనీకి బొంబాయి, కలకత్తాలలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. బొంబాయిలో ఉన్న ఫ్యాక్టరీ చాలా పెద్దది. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు బలమైన యూనియన్ కింద సంఘటితమై ఉంటూ, మేనేజ్‌మెంట్‌తో అన్ని విషయాలను (సమస్యలను) చర్చించి పరిష్కరించుకునే స్థాయిలో ఉన్నారు. అయితే 1988 జూన్‌లో మానేజ్‌మెంట్ ఏకపక్షంగా వ్యవహరించి ‘లాకౌట్’ ప్రకటించింది. కన్సర్న్‌డ్ సిటిజన్స్ కమిటీ ఛైర్మన్ అయిన డాక్టర్ కె.జి.దేశాయి ఉద్దేశం ప్రకారం ఈ లాకౌట్ అనవసరమైన చర్య. అంతే కాదు ‘లాకౌట్’ లాంటి దారుణచర్య తీసుకునేంతగా శ్రామికులు ప్రవర్తించలేదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఫ్యాక్టరీని, శ్రామికులను పూర్తిగా యాజమాన్యం ఆధిపత్యం కింద ఉంచుకోవడానికే ఈ లాకౌట్‌ను ప్రకటించారని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా 600 మందిని స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయించడం, ఐదు డిపార్ట్‌మెంట్‌లను మూసివేయడం, పర్మనెంట్ వర్కర్స్ స్థానంలో కాంట్రాక్ట్ లేబర్‌ను నియమించడంలాంటి చర్యలు తీసుకున్నారని, దీనివల్ల 1988లో 3100 ఉన్న పర్మినెంట్ సిబ్బంది 1993 నాటికి 2057కి పడిపోయిందని కూడా ఆయన అన్నారు. లాకౌట్ సమయంలో కూడా ఫ్యాక్టరీ మామూలుగానే పనిచేసిందని, ఉత్పత్తి ఏమాత్రం దెబ్బతినలేదని అన్నారు. అంటే సబ్ కాంట్రాక్ట్ ద్వారా ఫ్యాక్టరీని నడిపిస్తూ, ఉపఫ్యాక్టరీలతో (ఐబిశిలిజిజిరిశిలి తీబిబీశిళిజీరిలిరీ) కలిసి ఉత్పత్తి సాగిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రామికులను ఇలా విడదీయడం వల్ల సంఘటిత కార్మిక శక్తి, కార్యకలాపాలు తగ్గిపోవడమో, అసలు లేకుండా పోవడమో జరుగుతున్నది. కఉఉ ఫ్యాక్టరీలో విదేశీ పెట్టుబడులు 51 శాతం ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ కంపెనీ 1982లో విదేశీ పెట్టుబడిని అధికం చేయడానికి భారత ప్రభుత్వా న్ని ఒప్పించింది. 1981-90 వరకు హిందూస్తాన్ లీవర్ ద్వారా 194.16 కోట్ల రూపాయల విదేశీ ద్రవ్యం బయట దేశాలకు తరలించబడింది. అంటే యూనీలివర్‌కు విస్తారమైన భారత మార్కెట్ అందుబాటులోకి వస్తే, మన దేశానికి మాత్రం ప్రపంచ మార్కెట్‌లో అవకాశాలు పరిమితంగానే ఉండిపోయాయి.
పారిశ్రామిక రంగంలో ఆధునికీకరణ, ప్రపంచీకరణ మార్కెట్ ఆధిపత్యం లాంటి విధానాల వల్ల చాలా పరిశ్రమలు మూతబడే పరిస్థితులేర్పడ్డాయి. దీనివల్ల సంఘటిత, అసంఘటిత సెక్టార్లలో నిరుద్యోగ సమస్య పెరగనున్నది. ముఖ్యంగా చేనేత రంగం, భవన నిర్మాణ పరిశ్రమ, పంచదార పరిశ్రమ, తోలు పరిశ్రమలతో పాటు, ఆహారపదార్థాలు తయారు చేసే పరిశ్రమలు కూడా నష్టాలకు గురయ్యే పరిస్థితులు ఉత్పన్నమవ్వచ్చు. నెస్లే, కోకోకోలా, పెప్సికోలా, కెల్లాగ్ లాంటి బహుళజాతి సంస్థలు భారతమార్కెట్‌లో ప్రవేశించడమే దీనిక్కారణంగా చెప్పొచ్చు. అంతేకాదు ఈ సంస్థలతో పోటీ పడలేక అనేక పరిశ్రమలు మూతపడే ప్రమాదం కూడా పొంచి ఉంది.
ఆర్థిక విధానాన్ని విశ్లేషించేటపుడు జెండర్ విశ్లేషణ లేకపోవడం వల్ల, స్త్రీల అభివృద్ధికి సంక్షేమ పథకాలు మాత్రమే చాలనే ధోరణిలో ఆలోచించడం వల్ల స్త్రీలు ఉత్పత్తిదారులుగా వారికుండే పాత్రను గురించి, వారి హక్కుల్ని గురించి పట్టించుకోవడం జరగడం లేదు. 1992 ఫిబ్రవరిలో ఏశ్రీఈఆ (ఏదీరిశిలిఖి శ్రీబిశిరిళిదీరీ ఈలిఖీలిజిళిచీళీలిదీశి ఆజీళివీజీబిళీళీలి) వ్యవస్థాగత సర్దుబాట్లు ప్రభావం స్త్రీలపై ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని గురించి చర్చించి ఒక రిపోర్టు తయారు చేసింది. ఇంతకు ముందు వచ్చిన అనేక రిపోర్టులలో పేర్కొన్నట్లుగానే దీనిలో కూడా ప్రభుత్వ పాత్ర తగ్గించి, మార్కెట్ పాత్రను పెంచటం వల్ల స్త్రీలు మరింత వెనుకకు నెట్టివేయబడుతున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. పేదప్రజలకు, స్త్రీలకు వ్యతిరేకమైనదనడంలో సందేహంలేదు.
ఉదా: గుజరాత్‌లో ‘సేవా’ (ఐలిజితీ జూళీచీజిళిగిలిఖి ఇళిళీలిదీ’రీ జురీరీళిబీరిబిశిరిళిదీ) కింద సంఘటితంగా ఉన్న స్త్రీలు నూతన ఆర్థిక విధానం వల్ల చాలా నష్టాలకు గురవుతున్నారు. పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలవల్లే కాకుండా, వారికవసరమైన ముడి సరుకుల ధరలు పెరగడం కూడా దీనిక్కారణంగా చెప్పొచ్చు. ముడి సరుకుల ధరలు పెరిగి పోతున్నాయి గానీ, తయారుచేస్తున్న వస్తువులకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంవల్ల వారి ఆదాయం చాలా తగ్గిపోతోంది. మొన్నటి వరకు స్త్రీలు అడవుల్లో జిగురు పోగుచేసి అటవీశాఖకు అమ్మేవారు. ప్రైవేటీకరణ వల్ల ఈ జిగురును అటవీశాఖకు బదులు ప్రైవేటు డీిలర్లకు అమ్మవలసి వస్తోంది. దీనివలన కూడా వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అంతేకాదు గృహపరిశ్రమల్లో పనిచేసే వారి వేతనాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే బట్టల మిల్లులు మూసి వేయడం వల్ల ఉపాధి కోల్పోయిన పురుషులు కూడా స్త్రీల ఉద్యోగాలకై పోటీ పడుతున్నారు. ఇది ఒక విధంగా స్త్రీల పనులు, పురుషుల పనులు అనే విభేదాన్ని తగ్గిస్తున్నప్పటికీ, స్త్రీలకు ఉద్యోగ అవకాశాలను కూడా తగ్గిస్తున్నది. అమూల్ కంపెనీ మొన్నటి వరకు సహకార సంఘాల ద్వారా పాలను సరఫరా చేసేది. ఈ సహకార సంఘాల వల్ల ఎంతో మంది స్త్రీలు ప్రయోజనం పొందేవారు. అయితే పాలసరఫరాలను ప్రైవేటీకరణ చేయడంతో ఈ రంగంలో ఉన్న స్త్రీలు అనేక కష్టనష్టాలకు గురవుతున్నారు.
సాధారణంగా స్త్రీలు నేర్పరితనము లేని పనులలో ఎక్కువగా ఉంటారు. నిరుద్యోగం పెరిగే సందర్భాల్లో పురుషులకూడా ఈ ఉద్యోగాలకై పోటీ చేయటం వల్ల ఆధునిక టెక్నాలజీ ఉపయోగించే ఉద్యోగాలు స్త్రీలకు లేకుండా పోయి, మరింత తక్కువ జీతాలకు పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రైవేటీకరణ వల్ల, ప్రపంచస్థాయిలో కంప్యూటర్లను తీసుకొచ్చిన నూతన ఆర్థిక వ్యవస్థ స్త్రీలను మరింత అంచులకు నెట్టివేస్తున్నది. బహుళజాతి సంస్థల ఉత్పత్తి విధానం వికేంద్రీకృతమై, పరిశ్రమలకు కావలసిన వివిధ విడి భాగాలను తక్కువ జీతాలకు మూడవ ప్రపంచ దేశాల స్త్రీలచే తయారు చేయించి చాలా లాభాలు గణిస్తున్నాయి. ప్రపంచీకరణ వల్ల మనదేశంలో కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటి విధానాలను విదేశీయులు నిర్ణయించడం వల్ల, ఉత్పత్తి పద్ధతులవల్ల స్త్రీలు అసంఘటిత సెక్టరు (ఏదీళిజీవీబిదీరిరీలిఖి ఐలిబీశిళిజీ) లోకి తోయబడతారు. ఉదా: కంప్యూటర్లలో వాడే మైక్రో చిప్స్ చేయడంలో స్త్రీలు ఇళ్లలో పనిచేయడం. ఎగుమతులను అభివృద్ధి చేయాలనే విధానంలో స్వేచ్ఛా వ్యాపార జోన్ స్థాపించడం వల్ల ఎగుమతులపై పన్నులు తీసివేయడమో, తగ్గించడమో జరుగుతుంది. వీటిలో శ్రామిక సంక్షేమ చట్టాలు లేకపోవడం వల్ల పనిచేసే స్త్రీల సంఖ్య పెరిగినప్పటికి వారికి పనిభద్రత తక్కువ అవుతుంది. అయితే వారి వేతనాలు తక్కువయినప్పటికీ కుటుంబాన్ని పోషించడానికి, పెరుగుతున్న ధరలను తట్టుకోడానికి ఈపాటి ఉద్యోగాలైనా అవసరం అవుతాయి.
1980లలో శ్రామిక మార్కెట్టు క్రమంగా నిబంధనలనుంచి తొలగిపోయింది. అంతవరకూ కొన్ని చట్టాలు, సాంఘిక హక్కులు శ్రామిక వర్గానికి తోడ్పడి, శ్రామిక మార్కెటును కట్టుదిట్టాల్లో ఉంచింది. 1970లలో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల ప్రభుత్వ పాత్రను తగ్గించి మార్కెటు పాత్రను, విలువలను పెంచి చాలా దేశాల్లో సరళీకృత విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనివల్ల శ్రామిక వర్గ హక్కులు, చట్టాలు మారిపోయాయి. పరిశ్రమలు, సంస్థలు, శ్రామికులను సులభంగా తీసివేసేట్టుగా తాత్కాలిక ఉద్యోగాలను ఇవ్వడం, కాంట్రాక్టు మరియు దినసరి కూలీలను పెట్టుకోవడం వంటి పద్ధతులను అవలంబించాయి. దీనివల్ల శ్రామిక స్త్రీలు ఇటువంటి ఉద్యోగాల్లోనే ఎక్కువగా పనిచేయాల్సి వస్తోంది. దీన్నే ఫెమినైజేషన్ ఆఫ్ లేబర్ (తీలిళీరిదీరిరీబిశిరిళిదీ ళితీ జిబిలీళితిజీ) అని అంటారు. మనదేశంలో ఈ పరిస్థితి 1980ల నుంచే వున్నట్లు, 1991లో వచ్చిన నూతన ఆర్థిక విధానం దీన్ని మరింత గట్టి పరుస్తుందని కొంతమంది ఆర్థిక వేత్తలు అంటున్నారు.
నేషనల్ శాంపిల్ సర్వే చేసిన సర్వేలను, పట్టికలను చూసినట్లయితే పనిచేసే స్త్రీల సంఖ్య పెరిగినట్లు, అయితే ఈ స్త్రీలు కాంట్రాక్ట్ మరియు దినసరి కూలీలుగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. 1977-78లో మొత్తం పనిచేసే స్త్రీల సంఖ్య 28.9 శాతం అయితే, గ్రామీణ స్త్రీల సంఖ్య 32.6, పట్టణ స్త్రీల సంఖ్య 15.3 శాతం, 1987-88లో మొత్తం 28.0% అయితే గ్రామీణ స్త్రీల సంఖ్య 32.3 శాతం, పట్టణ స్త్రీల సంఖ్య 15.2 శాతం. కాని రోజువారి నిరుద్యోగ స్త్రీలను చూసినట్లయితే 1972-73లో గ్రామీణ స్త్రీల సంఖ్య 11.2 శాతం నుంచి 1987-88లో 6.7 శాతం, పట్టణ వాస స్త్రీల సంఖ్య 13.7 నుంచి 12.0 శాతం వరకు దిగిపోయింది. మొత్తం మీద శ్రామికస్త్రీల సంఖ్య పెరిగింది. అయితే స్వయం ఉపాధిగల గ్రామీణ స్త్రీల సంఖ్య క్రమంగా తగ్గి, వేరే ఉద్యోగాల్లో గాని, దినసరి కూలీలుగా గాని పని చేస్తున్నట్లు తెలుస్తుంది. 1972-73లో 64.5 శాతం గ్రామీణస్త్రీలు స్వయం ఉపాధి ఉద్యోగాల్లో 4.1 శాతం, దినసరి కూలీలుగ 31.4 శాతం ఉన్నారు. 1987-88లో స్వయం ఉపాధిగల వారి సంఖ్య 60.9 శాతం వరకు తగ్గి 3.6 శాతం ఉద్యోగాల్లో చేరడం, దినసరి కూలీలు సంఖ్య 35.5 శాతం వరకు పెరిగింది. అదే విధంగా పట్టణ స్వయం ఉపాధిలో స్త్రీల సంఖ్య 48.5% (1972-73) అయితే 27.8 శాతం ఉద్యోగస్థులుగా, 23.7 శాతం దినసరి కూలీలుగా పనిచేస్తే 1987-88లో స్వయం ఉపాధి సంఖ్య 47.1 శాతం, ఉద్యోగస్థులు 27.5 శాతం తగ్గి దినసరి కూలీలు 25.4 శాతం వరకు పెరిగినవి.
పరిశ్రమల వారిగా చూసినట్లయితే ఉత్పాదక పరిశ్రమలో స్త్రీల సంఖ్య పెరిగినట్లు తెలుస్తుంది. 1977/78-83లో 13.1 శాతం అయితే, 1983-87/88లో 29.3 శాతం వరకు పెరిగింది. అయితే పనివాళ్ల సంఖ్య (ఇంట్లో పనివాళ్లు, చాకలిపనులు, పాత గుడ్డలమ్మేవాళ్లు) కూడా 28.5 శాతం నుండి 30.4 శాతం వరకూ పెరిగింది. వీరికి చట్టరీత్యా ఎటువంటి రక్షణ లేదు. 1980లలో ఆధనిక ఉత్పాదక పరిశ్రమలలో (రబ్బర్, రసాయన, ఇంజనీరింగు లాంటివి) స్త్రీల సంఖ్య పెరిగినప్పటికి వీరు ఆధునిక పద్ధతులననుసరించే, ఎక్కువ జీతాలిచ్చే ఉద్యోగ స్థాయిలో కాకుండా, తక్కువ జీతాలకు సాంప్రదాయక పద్ధతుల్లోనే పనిచేస్తున్నట్లు మైక్రోలెవెల్ స్టడీస్ రిపోర్టులవల్ల తెలుస్తోంది. జీతాల ఖర్చుల తగ్గించడానికి స్త్రీలను భర్తీచేయడం జరుగుతున్నది. సంఘటిత రంగంలో కూడా స్త్రీలు, దినసరి కాంట్రాక్టు కూలీలుగా కాని గృహ పరిశ్రమలైనటువంటి వాటిలో గాని పని చేస్తున్నారు. శ్రామిక చట్టాలు వీరికి వర్తించకపోవడమే కాకుండా, సంఘటిత కార్మికులు కాకపోవడం వల్ల వీరికి ఉద్యోగ భద్రత కూడా లేదు. సర్వీసు సెక్టరులో చదువుకున్న స్త్రీలు, నర్సులుగా, టీచర్లుగా, ఆఫీసు ల్లో క్లర్కులుగా పనిచేస్తే, మిగతావాళ్లు ఇళ్లలో పనివాళ్లుగా వంటవాళ్లుగా పనులు చేస్తున్నారు. స్వయం ఉపాధిలో ఉన్నవాళ్లు బీడీలు చేయడం, పొడి పరిశ్రమల్లో, హస్తకళల పరిశ్రమల్లో, దుస్తులు చేయడం గాని, లేదా పరిశ్రమలిచ్చే పీస్‌కట్ పనులు గాని చేస్తున్నారు. (ఇళిజీజిఖి ఔబిదీది, 1991) వీరికి కూడా ఎటువంటి భద్రత లేకపోవడమే కాకుండా, తక్కువ సంపాదనవల్ల, ఇతర పనులు కూడా చేస్తున్నారు.
పై చెప్పిన వివరాల ప్రకారం, ఇండియాలో పట్టణ శ్రామిక మార్కెటులో క్రమంగా స్త్రీల సంఖ్య 80లలో పెరిగింది. పురుషుల స్థానంలో పనిచేసినప్పటికి తక్కువ జీతాలకు పని చేస్తున్నారు. అయినప్పటికి వీరి సంపాదన కుటుంబ పోషణకు ముఖ్యమే కాకుండా, కొన్నిసార్లు వారి సంపాదనే కుటుంబాన్ని పోషించేది. ఇటువంటి సందర్భంలో నూతన ఆర్థిక విధానం ఇప్పుడున్నటువంటి శ్రామిక చట్టాలను కూడా అమలులో పెట్టే అవసరం లేనటువంటి ఎగుమతి సంస్థలను ప్రోత్సహించడం వల్ల, స్త్రీలు వీటిలో ఎక్కువ శాతం పనిచేసే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇటువంటి ఎగుమతి సంస్థలు సాధారణంగా ఖర్చులు తగ్గించుకోవడానికి వేతనాలు తక్కువ రేటులో ఇవ్వడమే కాకుండా అటువంటి పనులను స్త్రీలచే చేయిస్తారు. ఈ దశాబ్దంలో వీరి సంఖ్య పెరగనున్నది. ఈ కొత్త యాజమాన్య ఎత్తుగడల ప్రకారం ఖర్చులు తగ్గించడానికి తాత్కాలిక శ్రామికులనే భర్తీచేసి శాశ్వత శ్రామికులపై అయ్యే ఆరోగ్యభీమా, ప్రావిడెంట్ ఫండ్, ఇంకా ఇతర సదుపాయాలపై అయ్యే ఖర్చులను తగ్గించుకుంటారు. పెద్ద పరిశ్రమలు కొన్ని పనులను చిన్న పరిశ్రమలకు సబ్ కాంట్రాక్ట్ చేయడం, కొన్ని సార్లు పనులను ఇళ్ళల్లో చేయడానికి ఇస్తున్నారు. 80లలో చిన్న పరిశ్రమలలో పనిచేసే వారి సంఖ్య బాగా పెరగడానికి కారణం ఇవి శ్రామిక చట్టాల పరిధిలోకి రాకపోవడం. నూతన ఆర్థిక విధానం ప్రైవేటు పెట్టుబడులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెంచడానికి, పారిశ్రామిక లైసెన్సుల పద్ధతులను మార్చడమే కాకుండా వికేంద్రీకరణ, క్రమబద్ధంలేని పద్ధతులను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల పారిశ్రామిక రంగంలో పోటీ పెరిగి అవి తమ ఖర్చులను తగ్గించడానికై స్త్రీలను ఉద్యోగాల్లో భర్తీ చేయవచ్చును. సాధారణంగా పబ్లిక్ సెక్టారులో ప్రైవేటు సెక్టరులో కంటె స్త్రీలపై వివక్షత తక్కువే కాకుండా వారికి కొన్ని హక్కులు కూడా వున్నాయి. సమాన వేతనాల చట్టం 1976లో జారీ చేయబడినప్పటికి అది అమలు చేసింది తక్కువ. ప్రసూతి సెలవు లాంటి సౌకర్యం కూడా ప్రైవేటు రంగంలో సరిగ్గా అమలు జరగలేదు. ఇదివరకు కార్మిక చట్టాల ప్రకారం స్త్రీలను రాత్రి షిఫ్ట్‌లో పనిచేయించడం చట్ట విరుద్ధమయితే ఇప్పుడు ఇండియాలో ఎగుమతి జోన్స్‌లో పరిశ్రమలకు ఇది వర్తించదు. మొత్తంమీద నూతన ఆర్థిక విధానం వల్ల పనిచేసే స్త్రీల సంఖ్య పెరిగే అవకాశమున్నప్పటికి, వారి పని పరిస్థితులు దిగజారడమే కాకుండా, పనిభద్రత కూడా కూడా తక్కువయ్యే పరిస్థితి ఏర్పడనున్నదని మూడవ ప్రపంచ దేశాల అనుభవాన్ని బట్టి చెప్పవచ్చును.
సరళీకృత విధానం వల్ల, ఆధునిక టెక్నాలజీని, మిషనరీని దిగుమతి చేసుకోవడం వల్ల, సాంప్రదాయకంగా, ప్రజలకుండే విజ్ఞానాన్ని వినియోగించక పోవడమే కాకుండా, మన అవసరాలను, మనకుండే స్తోమతుతో తీర్చగలిగే టెక్నాలజీ ని అభివృద్ధి చేయడానికి సరియైన ప్రోత్సాహం కూడా లేకుండాపోతున్నది. కంప్యూటరీకరణ వల్ల, నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతున్నది. ఉదా : మన దేశానికి చాలా పెద్ద తీరప్రాంతం వుంది. సముద్రంలో చేపలు పట్టి జీవించే వారి సంఖ్య కూడా పెద్దదే. సాంప్రదాయిక పద్ధతులతో చేపలు, రొయ్యలు పట్టి వాటిని మార్కెటులో అమ్మేవారు. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఆధునిక మరపడవలనుపయోగించి పెద్ద మొత్తంలో చేపలు, రొయ్యలు పట్టి అంతర్జాతీయ మార్కెటులో అమ్మి అధిక లాభాలు గడిస్తున్నారు. దీనివల్ల బెస్తవారు నష్టపోవడమే కాక, వారి జీవనోపాధి కూడా దెబ్బతింటున్నది. ఆంధ్ర తీరప్రాంతాల్లో బెస్తవారికి ముఖ్యంగా మగవాళ్ళకు పనిలేకుండా పోతున్నది. సాధారణంగా మగవాళ్లు చేపలు పట్టి తెస్తే, స్త్రీలు వాటిని మార్కెటులో అమ్ముతారు. అయితే ఇప్పుడు మగవాళ్లు చేపలు పట్టలేక పోవడమేకాక చాలామంది మద్యపానానికి అలవాటు పడి భార్యలను హింసిస్తున్నట్లు తెలుస్తున్నది. దీన్ని బట్టి సమాజంపై టెక్నాలజీ ప్రభావం, ముఖ్యంగా స్త్రీలపై ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. అంతేకాక ఆధునిక పద్ధతుల ద్వారా చేపలు పట్టడం వల్ల సముద్రంలో పర్యావరణం నాశనమవుతుంది. ఇప్పటికే చాలా రకాల చేపలు, రొయ్యలు నాశనం అయిపోయాయి. పర్యావరణ పరిరక్షణ చేయాలంటే, టెక్నాలజీని ఎంత వరకు, ఏ విధంగా ఎవరి ఉపయోగం కొరకు వాడాలి అనే విషయం గురించి ఆలోచించాల్సి వుంటుంది.
కొత్త ఆర్థిక విధానంలో ప్రభుత్వం, మార్కెటు శక్తులకే ప్రాధాన్యతనివ్వడం, ఉత్పత్తిపై ఎటువంటి కట్టుదిట్టాలు పెట్టకపోవడం వల్ల, లాభాలు గడించడమే ప్రాధాన్యమవుతున్నది. దీనివల్ల వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయి. ఆహారధాన్యాలు పండించడం కంటే వాణిజ్య పంటలు పండించడం ఎక్కువ లాభదాయకం అనే ధోరణి ఎక్కువయితే ఆహారధాన్యాల కొరత ఏర్పడవచ్చును. కోస్తా జిల్లాల్లో ఈ మధ్య రొయ్యల పెంపకం చాలా ఎక్కువగా జరుగుతున్నది. రొయ్యలు ఎగుమతి చేసి డాలర్లు సంపాదించవచ్చు కనుక చాలా మంది ఇప్పుడు వ్యవసాయము మానేసి రొయ్యలను పెంచుతున్నారు. దీనివల్ల ఆహారధాన్యాలు పండించే భూమి తగ్గిపోయి, రొయ్యల చెరువుల వల్ల భూమిమేట వేయడం వల్ల పాడయిపోతున్నది. అంతేకాక ఇదివరకు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వారు ఇప్పుడు నిరుద్యోగులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డెల్టా ప్రాంతంలో దాదాపు 2 లక్షల హెక్టార్ల వరి పండించే భూమి ఇప్పుడు చేపల చెరువులుగా మారింది. ఇదంతా మార్కెటు మార్కెటైజేషన్ ప్రభావం! క్రమంగా బియ్యం కొరత, ఆహార ధాన్యాల కొరత ఏర్పడటం, లిబరలైజేషన్ వల్ల ఎటువంటి కట్టుదిట్టాలు లేకపోవడం ప్రజలకు సరిపడేంత ఆహారధాన్యాలను పంపిణీ చేయడానికి దొరకని పరిస్థితి ఏర్పడుతున్నది. అంతే కాకుండా ప్రభుత్వ సబ్సిడీలు, రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వకపోయినట్లయితే వీరు మార్కెట్ పోటీలో పూర్తిగా జీవనోపాధి కూడా కోల్పోవచ్చును. ప్రభుత్వ సబ్సిడీల వల్ల, ప్రజా పంపిణీ వ్యవస్థ వల్ల కనీస అవసరాలు కొంత వరకైనా ప్రజలకందుబాటులో వున్నవి. అయితే ఇకముందు ఆ మాత్రం కూడా లేకుండా పోవచ్చును.
ప్రైవేటీకరణ క్రమంలో ఇప్పుడు ఆరోగ్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు కూడా సామాన్య ప్రజలకు, బడుగు వర్గాలకు, ముఖ్యంగా స్త్రీలకు అందుబాటులో లేకుండా పోతున్నవి. ప్రభుత్వ ఆసుపత్రులకై కేటాయించిన బడ్జెటు తగ్గిపోవడమే కాకుండా, వాటి సంఖ్య పెరగకపోవడం వల్ల ప్రైవేటు హాస్పిటళ్లు, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు ఎక్కువవుతున్నవి. సమర్థత పేరుతో, చిన్న, చిన్న జబ్బులకైనా వీటిలో ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి వస్తున్నది. మన కుటుంబాల్లో సాధారణంగా స్త్రీలకు ఏదైనా జబ్బు చేస్తే సర్దుకుపోవడమో లేక ఎక్కువ ఖర్చు లేకుండా బాగు చేసుకోవడమో, లేక అసలు పట్టించుకోకపోవడమో జరుగుతుంది. ప్రైవేటు డాక్టర్ల దగ్గరికి వెళ్లడానికి వీలుపడదు. అందుకే ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రజల కందేట్టుగా సదుపాయాలు కల్పించకుండా ప్రైవేటీకరణ చేయడం మూలంగా స్త్రీల ఆరోగ్యం విషయంలో మరింత నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడుతున్నది.
ఆరోగ్య, ఔషధరంగంలో ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలి. అలోపతి మందులు వచ్చిన తర్వాత సాంప్రదాయక మందులు (ఊజీబిఖిరిశిరిళిదీబిజి ళీలిఖిరిబీరిదీలిరీ) కొంతవరకు వెనకబడ్డవి. చెట్ల మందులు, వేళ్లమందులు ఒకప్పుడు అందుబాటులో ఉండటమే కాకుండా చాలా జబ్బులు కూడా ఇతర ఇబ్బందులు లేకుండా నయమయ్యేవి. అల్లోపతి మందులు శక్తివంతమైనవే గాక ఎక్కువగా వాడితే ఇతర ఇబ్బందులు కూడా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ సహజ మందులు, వాటి ఉపయోగం గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. వేపచెట్టుతో తయారయ్యే పురుగుమందులు, ఎరువులను తయారు చేయటానికి అమెరికా కంపెనీ పేటెంటు హక్కులను కొన్నట్లుగా, మన దేశంలో దొరికే చెట్లు, వేళ్లతో తయారయ్యే సహజమందులు తయారుచేయడానికి పేటెంటు హక్కులు కొన్నట్లయితే, సాంప్రదాయకంగా మనకు తెలిసిన విజ్ఞానం, సంపద కూడా లేకుండా పోయే అవకాశముంది. అందుకే డంకల్ ప్రతిపాదనలు కోరినట్లుగా మన పేటెంటు చట్టాలను మార్చి ప్రాడక్టు పేటెంటు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లయితే దేశం చాలా నష్టపోతుంది.
విద్యారంగంలో ప్రైవేటీకరణ ప్రభావం అప్పుడే కనిపిస్తున్నది. ఒకవైపు ప్రాథమిక విద్య పెరగక పోవడం, ముఖ్యంగా స్త్రీలలో నిరక్షరాస్యత తగ్గకపోవడం. ఉన్నత విద్యకు కావలసినంత డబ్బు లేకపోవడంవల్ల ప్రైవేటీకరణ జరుగుతున్నది. దీనివల్ల సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు పెట్టుబడి పెట్టగలిగే పెద్ద కంపెనీలు, విదేశీ కంపెనీలు లాభాలు పొందగలిగే రంగాల్లోనే పరిశోధనలు చేయవచ్చును. ముఖ్యంగా గుర్తించాల్సింది – స్త్రీల అక్షరాస్యత పెంచడానికి, ఇప్పుడు ప్రభుత్వం పెద్ద పథకాన్ని రూపొందించడమే కాక స్వచ్ఛంద సంస్థలను కూడా ముందుకు రమ్మని ప్రోత్సహిస్తున్నది. ఇది ఒకందుకు మంచిదే అయినప్పటికి దాని రాజకీయాలు కూడా తెలుసుకోవాలి. ఆర్థిక ప్రపంచీకరణలో పరిశ్రమలు బహుళజాతి సంస్థలు కొన్ని ఆధునిక ఉత్పత్తికి కావలసిన కొన్ని వస్తువులను మైక్రోచిప్స్ లాంటివి వర్థమాన దేశాల స్త్రీలచే చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశాలలో శ్రామికులు చాలా చవకగా దొరకడమే కాకుండా, స్త్రీల జీతాలు మరింత తక్కువగా ఉండటం, వారు ఓపికగా వీటిని ఇంట్లో కూర్చుని చేయడం. అయితే కంప్యూటీరకరణ పంధాలో స్త్రీల శ్రమ అవసరమే కాకుండా వాళ్లకు కొంత అక్షరాస్యత, విద్యకూడా కావలిసి ఉంటుంది. అందుకే ఇప్పుడు విదేశీ కంపెనీలు స్త్రీల అక్షరాస్యత పథకాలకి ప్రాధాన్యత నిస్తున్నారు. ఒరిస్సా ప్రభుత్వము అప్పుడే జర్మనీ కంపెనీలతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నది. స్త్రీలకు అక్షరాస్యత అనేది లాభదాయకం అయినప్పటికి వారికి ఎటువంటి విద్యను ఎంతవరకు ఇస్తున్నారనే విషయం కూడా ఆలోచించాలి.
నూతన ఆర్థిక విధానం ఎంతవరకు దేశాభివృద్ధికై తోడ్పడుతుందనే విషయంపై చర్చ కొనసాగుతున్నది. ఆర్థిక అభివృద్ధి వల్ల సమాజంలోని అసమానతలుగాని, దారిద్య్రం గాని తొలగిపోతాయని చెప్పలేం. అభివృద్ధి రేటు పెరిగినప్పటికి, అసమానతలు, దారిద్య్రం తగ్గకపోవడమే కాకుండా ఎక్కువ కావచ్చు. అంటే అభివృద్ధి వల్ల వచ్చే లాభాలు కొద్దిమందికే పరిమితమవచ్చు. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ లాంటి దేశాల్లో అభివృద్ధి రేటు పెరగడం, పారిశ్రామీకరణ జరిగినప్పటికి, ఆదేశం విదేశీ పెట్టుబడులపై ఆధారపడటమే కాకుండా అసమానతలు పెరిగి, ఋణభారం కూడా పెరిగింది. ఆర్థికాభివృద్ధి అనేది ఒక సామాజిక, రాజకీయ దృక్పథంతో ముడిపడి వున్నటువంటిది. అభివృద్ధి ఎవరికొరకు, ఎటువంటి సమాజ నిర్మాణానికై, ఎవరు చేస్తున్నారు అనేవి అతి ముఖ్యమైన ప్రశ్నలు. కుల, మత, లింగ, వర్గ అసమానతలు వైరుధ్యాలు ఉన్న ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో, ఆర్థిక అభివృద్ధి పథకాలపై అంశాలను దృష్టిలో వుంచుకుని వాటిని తొలగించే విధంగా లేకపోవడంవల్ల ప్రజలను అభివృద్ధి పథకాలలో భాగస్వాములుగా గుర్తించకపోవడం వల్ల, అసమానతలు పెరుగుతున్నాయి. అంతేకాక, పారిశ్రామిక దేశాలకు మూడవ ప్రపంచ దేశాలకు వైరుధ్యాలు పెరగడమే కాక వారి శ్రామికీకరణ, అభివృద్ధి పథకాలు అన్ని రకాల కాలుష్యాలకు దారి తీస్తున్నాయి.
జనాభాలో 50 శాతం పైగా ఉన్న స్త్రీల అవసరాలను, ఉత్పత్తి దారులుగా వారి పాత్రను గుర్తించి ఆర్థిక విధాన నిర్మాణంలో వారి పాత్రను పెంచాలి. ఈ విషయాలు స్త్రీలకు అర్థం కానివి, వారికి అతీతమైనవి అనే ధోరణి వారిని తప్పుదారి పట్టించడమే అవుతుంది. స్త్రీల ఉద్యమాలు – గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చాలా మౌలికమైన ప్రశ్నలు లేవదీస్తున్నాయి. ఇవి కుటుంబంలో అధికారం, పెత్తనం గురించైనా, కుటుంబ నియంత్రణ పేరుతో స్త్రీలపై రుద్దబడుతున్న అపాయకరమైన ఇంజక్షన్ల గురించైనా, లేక రోజు కూలీ పెంచడం గురించైనా కావచ్చు. సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న స్త్రీలు అడిగిన ప్రశ్న అతి మౌలికమైనది. వారు ‘మా ఊరికి సారావద్దు’ అని అనడమే కాకుండా ‘మాకు త్రాగడానికి నీళ్ళులేవు, తినడానికి తిండే ల్లేదు. కనడానికైనా, జబ్బు చేసినా ఆస్పత్రులేవు. మా పిల్లలకు చదువుల్లేవు. ఇవన్నీ లేవు కాని సారా మాత్రం ఎందుకు” అని ప్రశ్నించారు. నిజంగా ఇవన్నీ స్త్రీలకు అందుబాటులో ఉండేట్లు చేయాలంటే, ఆర్థిక వ్యవస్థను చాలా విప్లవాత్మకంగా మార్చాల్సి వస్తుంది. విదేశీ, బహుళ జాతి సంస్థల అధిపత్యానికి వ్యతిరేకంంగా వస్తున్న ఉద్యమాలు – వేపచెట్టు పేటెంట్‌కు వ్యతిరేక ఉద్యమం, రైతాంగ కార్మిక పోరాటాలు – ఇవన్నీ ఆ మౌలిక మార్పులు తేవడానికి చేసే ప్రయత్నంలో చిన్న చిన్న అడుగులుగా మనం అర్థం చేసుకోవాలి. (జనవరి – మార్చి 1994)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags