డా.జి. భారతి
ఏకాంతం పరమానందం అంటారు
కానీ ఈ వంటరితనం ఒక చిత్ర హింస
అలమటించినప్పుడు దొరకని ఏకాంతం
ఇపడు ఒంటరితనపు శాపంలా అలుముకుంది
ఊపిరిపీల్చుకుని జీవితాన్ని చేతుల్లోకి తీసుకుందామను కున్నప్పుడు
కాప్తైనా దొరకని ఏకాంతం, ఇప్పుడు వంటరితనపు చిత్రహింసైంది
వెక్కిరింపుగా చూస్తున్న ఖాళీ గూట్లో
ఎవరూ పలకరించని సాయంత్రం
వదిలేసినదానిలా ఒంటరిగా నేను
ఏరీ ఎక్కడ నేనెంతో ప్రేమించిన నా నేస్తాలు?
గడ్డకట్టిన నిశ్శబ్దమేకానీ
ఒక్క కంఠమూ వినపడదు
శూన్యంగా మిగిలిన ఈ గూటిలో
ఇప్పుడు వినబడుతోంది నా గుండె చప్పుడొక్కటే
అదికూడా ఎప్పుడో ఆగిపోతానంటూ హెచ్చరిప్తోంది
పగలంతా సాయంత్రంకోసం నిరీక్షణ
ప్రేమతో ఎవరైనా రాకపోతారా అని!
ఎక్కడికి పోయారు ప్రియమిత్రులంతా?
అగాధమైన నా ఒంటరితనానికి
ఒట్టి సందర్శకులు వొద్దు
తోడు కావాలి
”లోన్లీనేస్” అనువాదం : పి.సత్యవతి
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags