నాన్నలెప్పుడూ ఇంతేనమ్మా

కొండేపూడి నిర్మల
నాన్నలెప్పుడూ ఇంతేనమ్మా
అకస్మాత్తుగానే…
అసలేమీ పంచుకోకుండానే…
ఆచూకీ అయినా చెప్పకుండానే…
నీ సేవలకి సవాలక్ష వంకలు పెడుతూ
బైటి ప్రపంచం కోసం బండెక్కిపోయినట్టుగానే
ఇప్పుడూ…
బూటుకాలితో తన్ని వదిలిన గేటుకివతల
ఇదే ఏకాకితనం. ఇదే చావు దిగులు
సాంద్రతలోనే తప్ప సారంలో తేడా ఏముంది చెప్పు..?
నిట్టూర్చే నీ పక్కన నిప్పులు మింగిన ఈ అయిదు పిల్లులు..
పంచ పాండవుల మీద అప్పుడు నువు కట్టిన జోలపాటలో
ఇప్పుడు మొదటి నలుగురూ పరాయి కర్ణులే కదా..?
పిల్లకొక కొయ్యదుంగ కట్టి
ఎవరి సముద్రంలో వారినొదిలాక
నిజవారసుడు కొడుకేనట మరి..
గజ ఈతలు నేర్చుకోకపోతే ఎలా..?
పాలబాకీలకి పచారి పద్దులకి లెక్క తప్పిపోయి
చివాట్లు తిన్నదానివి కాబట్టి
అరవయ్యేళ్ళ సాహచర్యపు కోతలో గాయాల కూడిక తెలీక
గుండె తెగేలా మా నాన్నను పట్టుకు పిలిచావు
బతికివున్న రోజుల్లో ఎప్పుడైనా నీ పిలుపుకి బదులొచ్చిందా..?
పక్క వీధికైనా షికారుకి పిలవని మనిషితో స్వర్గానికెలా వెడతావమ్మా..
స్వర్గం నిండా పుణ్యాత్ముల కిటకిటేనట..
దగాపడ్డ నవ్వులకీ, దాచిపెట్టిన వేదనలకీ
తలుపులూ అడ్డగడియలూ వుంటాయో లేదో
ప్రాణభయంకంటే పరువు బరువుతో
మునక వేసినదానిని కదా
నువ్వక్కడ వుండలేవు
వుం..డ..లే..వు
ఎంత పండగ పొద్దయినా
”నీ పిండాకూడు” తోనే తెల్లారే మనింటో
విజయాలన్నీ ఆయనకిచ్చి, వైఫల్యాలు నీవనుకున్నావు కదా
చరమాకంలో కురిసిన క్షీణ బింబపు వెన్నెల ప్రేమ
నీ స్వీట్‌ సిక్స్‌టీన్‌ నీకిచ్చిందా..?
మర్చిపోకమ్మా ఏదీ మర్చిపోకు
యుద్ద ఖైదీల్ని అవమానించేతీరులో
కన్యాశుల్కంనాటి బుచ్చెమ్మ వేషానికి నిను దింపి
సంప్రదాయంగా తమ దహన సంస్కారాల్ని చాటుకున్న
బంధుమిత్రుల శత్రు స్పర్శనీ
నుదుటిమీద ఆనవాలుగా మిగిలిపోయిన కుంకుమ భూతంకోరనీ
ఎప్పటికీ మరచిపోకు
మరపు తాత్కాలిక విశ్రాంతే కాదు, విష నిద్ర కూడా..
నీ కడుపులో ప్రతి అవమానం డాక్యుమెంట్‌ కావాలి
తెల్లచీర ఇక ఎవరు కట్టినా శూన్యాకాశం కాదు
అది అన్ని రంగులూ ఇముడ్చుకున్న న్యూటన్‌ వర్ణ చిత్రం.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

One Response to నాన్నలెప్పుడూ ఇంతేనమ్మా

  1. buchi reddy says:

    నిర్మల గారు—చాల భాగుంధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.