చాసోగారి గురించి నేను మాత్రమే చెప్పగలిగే కొన్ని విషయాలున్నాయి. నేనుచాలా చిన్నతనం నుంచే రచనలు ప్రారంభిస్తే 14వ ఏట నుంచే రచనలు ప్రారంభిస్తే మా మాతామహుల ఊరు ఈ ఊరు. మేము 16,17 సంవత్సరానికే మాస్టారుని కలుస్తుండే వాడిని. ఆయన పలకరిస్తూ వుండేవారు నన్ను.
అయితే ఇప్పుడు కృష్ణకుమారిగారు చదివిన కథ ”ఎందుకు పారేస్తాను నాన్నా” ఆయన వ్రాసేటప్పటికి నాకు నాలుగేళ్లు. నేను వ్రాయడం ప్రారంభించేటప్పటికి ఆయన అప్పుడప్పుడూ వ్రాయడం చేస్తున్నారు.కాని చాగంటి సోమయాజులు గారు ఒకప్పుడు బాగా రాసిన రచయిత మాత్రమే నాకు ఆ తరంలో తెలుసు.
నా అదృష్టం ఏమిటంటే జీవితంలో నాకన్నా లబ్ద ప్రతిష్టులు, పెద్దవాళ్లతో పరిచయం చేసి వాళ్లతో గడిపే అవకాశం నాకు కలగడం.నేను ఆ కాలేజిలో చదువుకునే రోజుల్లో కృష్ణ శాస్త్రిగారు ఈ భావ కవుల పద్యాలు చదువుకుంటూ నేను కూడా 2,3 పద్యాలు వ్రాస్తూ ఉండేవాడిని. చాసో చూసారో లేదో నాకు తెలియదు. ఒక సారి విశాఖపట్నం కోమల విలాస్ దగ్గర ఆయన నేను కలిసినప్పుడు నేను ఆయనతో అన్నాను. ఏమండి మనం రచనలు చేస్తున్నాం కాని సమాజం మనల్ని గర్తించడం లేదని. అప్పటికి నాకు 17,18 ఏళ్లుంటాయి. ఒక మంచి చుట్ట అలా తీసి నువ్వు ఏమి వ్రాస్తావని నిన్ను గుర్తించాలి. అన్నాడాయన. నాకిప్పుడు 66 ఏళ్లండీ! మళ్లీ ఈ వాక్యాల్ని అప్పుడే కాదు.ఇప్పుడు కూడా ఎవరితోటి అనలేదు నేను. జీవితంలో హ్యుమిలిటీని నేర్పిన నిక్కచ్చిగా తన మనసులో ఉన్న మాటను చెప్పగలిగిన ఒక పెద్ద దిక్కు చాసోగారు.
ఒక 28 సం||లు దాటి 28 సం.లో నేను చాలా పనులు చేసి, చేసిన ఆ కొద్ది పనులకే పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత విచిత్రంగా నాకు భిలాయిలో సన్మానం జరిగింది. భిలాయి సన్మానానికి ఆనాడుఅధ్యక్షులు చాగంటి సోమయాజులుగారు. ఆ రోజు సభలో ఈయన విషయం అలా చెప్పా. చెప్తే గర్తుంచుకున్నా డాయన. నేను మాట్లాడి వెళ్లింతర్వాత ఇవన్ని ఇలా జరిగిందని చెప్తే నిన్ను అలా అన్నానా? అన్నారాయన. సోమయాజులుగారు అబ్బోచాలా దశల్లో నేను, సుబ్రమణ్య శర్మగారు, నండూరి రామ్మోహన్‌రావుగారు మేమందరం కూర్చుని విజయవాడలో గంటలు గంటలు సాయంకాలాలు సమావేశాలలో ఉంటే నన్ను మొదటి సారిగా ఆయన అంట్యా కుల పైడిరాజుగారి ఆయనింటికి తీసుకువెళ్లారు. విజయనగరంలో నాకు బాగా గుర్తు, ఈ మధ్య నా ఆత్మకథ వ్రాస్తుంటే డైరీలో ఎన్నిసార్లు కనిపిస్తారో, సోమయాజులు గారు. తీసుకెడితే ఆయన గురజాడ అప్పారావు గారి మంచి పెయింటింగ్ వేస్తున్నారు. మొదటిసారిగా ఆఖరిసారిగా ఆయన స్టూడియోలోనే నేను గురజాడ రామదాసు గారిని కలిసాను. అప్పారావు గారి అబ్బాయి. నాకు ఏదో స్కాలర్‌షిప్ కావాలంటే డా.డిఎల్‌రావుగారికి చాసో ఉత్తరం వ్రాసి, ఉత్తరం చాలదయ్యా నేనే వస్తాను పద అని ఆయన మద్రాసు వచ్చి నన్ను తీసుకువెళ్లి డి.ఎల్ రావుగారికి పరిచయం చేసారు. ”యునైటెడ్ స్టేట్స్ ఎడ్యూకేషన్ పౌండేషన్ ఆఫ్ ఇండియా”కి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండేవారాయన. ఇలాగ కోకొల్లలు.
చాలాచాలా సందర్భాలలో ఆయన స్పూర్తి తీసుకుంటే నేను వ్రాయడం ప్రారంబించే నాటికే ఆయన చాలా తక్కువ వ్రాసేవారు. ఆయనని చూసిన చాలా మందికి ఈయన రచయిత అనిచెపితే తప్ప తెలియని పరిస్థితిలో ఉండేవారాయన.పై పెచ్చు ఆయన వ్రాసిన రచనలన్నీ నేకొక సంవత్సరంలో వ్రాసేశానేమో. అంత ప్రాలిసిక్ మేమందరమూను. ఆయన బహుశా అలా ఫెర్మెంటయి ఫెర్మంటయి ఆలోచన బయటకి వచ్చేదాకా వ్రాసేవారు కాదేమో. నేను వ్రాయడం ప్రారంభించే తరానికి ఆయన వ్రాయడం సకృత్తుగా ఫెర్మెంటయి ఆలోచన బయటికి వచ్చేదాకా వ్రాసేవారు. కాదేమో. నేను వ్రాయడం ప్రారంభించే తరానికి ఆయన వ్రాయడం సకృత్తుగా జరిగే సందర్భానికి వచ్చేశాడాయన. కృష్ణకుమారిగారు చదివిన కథ నేను ఈ మధ్యనే చదివాను. నా అదృష్టం ఏమిటంటే ఈ కథలన్ని ఒకసారే పట్టుకుని చదువుకోగలిగే అవకాశాన్ని ఈ సభ చాగంటి తులసిగారు కల్పించారు.
నేను 20సం||లు ఆలిండియా రేడియోలో పనిచేస్తే, నేను పుట్టిన నాలుగో ఏటకే చెప్పే కథని వ్రాసిన అద్భుతమైన రచయిత ఒకరున్నారనన్న విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను నేను. కథ చెప్పడం అన్నది చాలా కష్టమైన పని. నేను 20 ఏళ్లు చాలా మంది రచయితలతో తంటాలుపడ్డాను.10 బస్సెక్కితే సుబ్బారావు అంకయ్యపాలెంలో దిగాడని వ్రాస్తాడు.కాని వినేవాడికి కథచెప్పాలయ్యా. కథ చదువుకోవడం కాదు అని నేను నేర్పుతుంటే 1943 ప్రాంతానికే అద్భుతంగా కథ చెప్పారు. చదవడం కాకుండా ఈ సభ మొదలెట్టే ముందు చాసో గారు చెప్పే కథల్ని రికార్డింగ్ వేసారు.ఎంతో అద్భుతంగా చదివారు ఆయన. అవి బహుషా రేడియోలో చదివినవి అనుకుంటాను. ఆలిండియా రేడియోలో చదివిన విషయాలు చాలా తక్కువ. గొప్ప బ్రాడ్‌కాస్టర్స్. చెప్పే కథను వ్రాసిన బ్రాడ్‌కాస్టర్స్ ఆయన. నేను ఇతర కథలే బాగా చదివేవాడిని.
ఒకటి నాకు తెలిసిన నాదాకా వచ్చిన చాసో కథ ఎర్లీ కథలో ఒకటి రెండు మూడు కథలు నన్నెవరైనా రెచ్చగొట్టి నన్ను పనిచేయమని 30 ఏండ్ల క్రింద అనకుంటే ఒక్క ”వాయులీనం” మీద మాత్రమే, ఏది కుంకుడాకు మీద కాని ఒక ఎంపున మీద కాని నేను తేలికగా డాక్టరేట్ చేయగలను.తేలికగా ఒక డాక్టరేట్ చేయవచ్చు. రావిశాస్త్రి గారిని ఈయనని దగ్గరగా ఎందుకు అంటానంటే ఇద్దరితోటి నాకు పరిచయం ఉంది.శాస్త్రిగారు నాకు బంధువు కూడాను.శాస్త్రిగారు ఒక వాస్తవాన్ని ఎంతో కొంత ఆలోచనతో అలంకరిస్తే జీవితాన్ని కేవలం అవగాహన దగ్గర నిలిపిన గొప్పరచయిత చాగంటి సోమయాజులుగారు.ఒక ఆలోచన ఎంతో కొంత శాస్త్రిగారి పాత్రతో కనిపిస్తూ ఉంటుంది.ఆయన నూకాలో రాములో ఇంకోళ్లో చిన్న నగిషీ రచయిత కన్‌సర్న్ రచయిత చెప్పాలనుకున్న విషయం కనిపిస్తే ఏ గొప్ప వాక్యములోను చాగంటి సోమయాజులుగారు అనే వ్యక్తి కనిపించడు. పాత్ర కనిపిస్తుంది. ఒక నటుడుగా ఒక రచయితగా నాకిది చాలా ఎమేజింగ్ క్రాఫ్ట్. ఇట్స్ యాన్ ఎమేజింగ్ క్రాప్ట్ నినాదం ప్రచారం చేస్తున్న ప్రచారం అనే పాంప్లిటీని చాలా మొనాటనస్‌గా జరిగే రోజుల్లో తను చెప్పాలనుకున్న జీవుని వేదనని 1943 నాటికే ఫిల్టర్ చేయగలిగిన జీనియస్‌ను పట్టుకున్న వ్యక్తి చాగంటి సోమయాజులుగారు. రియలిజం అన్నాడు రియల్ ఎట్ అన్ రియల్ ఈజ్ ఎసెంసెప్ ఆర్ట్ అన్నాడు. రియల్ ఎట్ అన్ రియల్ ఈజ్ ఎసెంసెఫ్ ఆర్ట్ రియలిజం ఈజ్ వల్గర్ అండ్ ఉపేఖ్. రియలిజం అండ్ వల్గర్ ఉపేఖ్. ఎములు కుళ్లిన ఇంకేదో శవాలు అక్కడ చనిపోతున్నారు. వాళ్లందరిని ఉద్దరించాలి. ఇట్స్ ఏ ఫాంప్లేట్ వీళ్లందరూ బాధపడుతున్నారు. ఇది ఆవేశము ఇది నినాదము. వీళ్లందరినీ మీరు బాగుచేయాలి హుఆర్‌యు టు ఫేడ్. వీళ్లందరీ బాధ నా మసస్సులో పిల్టర్ అయ్యింది. ఇదేమో జీవితము.దిసీజ్ ఆర్ట్ దిసీజ్ ఆర్ట్. ఈ ఆర్ట్‌ని చాలా అధ్బుతంగా సాధించిన వ్యక్తి రియలిజం ఈజ్ వల్గర్ అండ్ పేఖ్ అని చెప్పడానికి చిన్న ఉదహరణ.
రోడ్డుమీద ఒ ఎక్సిడెంట్ జరుగుతుంది ఎక్సిడెంట్ జరిగితే ప్రతివాళ్ల దృష్టి అక్కడే ఆకర్షితమవుతుంది. అందరూ ఆ గుమిగూడిన మనుషుల మద్య నుంచి ప్రయత్నిస్తాము. బికాజ్ ఇటీజ్ ఏ రియల్. ఒక రక్తం మరకలో ఉన్న వ్యక్తిని చూస్తున్నామనుకోండి ఇట్లా అబ్బా మొహం వెంటనే తిప్పుకుంటాము. యూ ఆర్ ఎట్రాక్టెడ్ టు ఇట్ బికాజ్ ఇటీజ్ ఎ రియల్ యు గెట్ ఎ రిపల్ష్‌న్. బికాజ్ ఇటీజ్ ఎ రియల్. మీరు ఇంటికి వచ్చిం తర్వాత ఆ రక్తం మడుగులో పడిఉన్న వ్యక్తిని మీ మాటల్లో వాళ్లకి చెప్పడానికి చూస్తారేే ఇట్స్ యాన్ ఆర్ట్. దీనికి చాలా ఆబ్జెక్టివిటీ కావాలి.
ఒక రియలిజంని రియలిజంలో ఉన్న ఒక వాదననో ఒక వేదననో రిపోర్టు చేస్తే కవిత్వం కాదు.రిపోర్టు చేస్తే కథ కాదు. అలా జరగడానికి కారకులెవరూ అంటే కథ కాదు.రాజకీయానికి కూడా అదే పని.మీరందరూ కారణమైన వాడిని కొట్టండీ అంటే ఇది నినాదం.ఇలాంటివి జరగటానికి ఎవరు కారణము,ఇట్స్ బికమ్ ఏ ట్రాన్స్‌లెట్. ఆ భాధ పడుతున్న వ్యక్తితో వ్యక్తిని వ్యక్తి యొక్క వేదనని ఎంతో కొంత ఫిల్టర్ చేయగలిగితే ఆ ఫిల్టర్ తీసిన ఆ వేదన ఉంటుందే అది ఇన్ని పనులు చేస్తుంది.ఎందుంటే ఆ పని రచయిత చేయడంలేదు కనుక.
రచయిత, ది మూమెంట్ హి టేక్ ఏ సైడ్ ఇట్ బికమ్ సస్‌పెక్ట్. ఈ సమాజం ఇలా ఉండాలి. హు ఆర్‌యు టూసే? హు ఆర్‌యు టూసే? ఈ పని ఇలాగే జరగాలి. వాట్ ఈజ్ రైట్ ఫర్ యూ ఇన్ నాట్ నీడ్ ఎనదర్ పీపుల్. దీనికి ఇలాంటి వేదన ఉంది. ఇటువంటి కష్టం ఉంది. ఇటువంటి నష్టం ఉంది. ఈ విధంగా ఇటువంటి వ్యక్తి నష్టపోతున్నాడు.
ఈ ”వాయులీనం”లో కల్చరర్ హిథోస్ ఎంతుందో ఇందాకటి దాన్లో కూడా కనిపిస్తోంది. హిజ్ హార్ట్ ఈజ్ పుల్ ఆఫ్ ది కల్చరర్ హిథోస్. హి ఈజ్ నాట్ సస్‌పెక్ట్. హి ఈజ్ నాట్ వర్రీడ్. వాటన్నింటిలోంచి ఏ పాత్రలను ఎక్కడో కావలసిన యాంగిల్ మాత్రమే ప్రెస్ చేయడమన్నది. ”వాయులీనం” చాలా తక్కువ మంది చెప్పగలరు. ఆయన ”కుంకుడాకు” షీల్ పొయిట్రీ. హీజ్ నాట్ టేకెన్ సైడ్స్. హి ఈజ్ టెల్లింగ్ సమ్‌థింగ్ విచ్ ఈజ్ టెల్లింగ్ హిథోస్. ఇట్‌ఈజ్ కమింగ్ ఫ్రం హిజ్ హార్ట్.
ఈ మధ్యన ఎక్కడో మన శ్రీరామచంద్రమూర్తి గారు స్టేజి మీద ఉన్నారు. మన జర్నలిజం అంతటికి మన జర్నలిజం భాషని కృష్ణాజిల్లాని అన్వయించుకున్నాము. ఒక సుబ్బారావుగారు, ఒక ముట్నూరి కృష్ణారావుగారు, ఒక నార్ల వెంకటేశ్వర రావుగారు, ఒక జి.కృష్ణగారు, మీరు ఎవరైనా చెప్పండి జర్నలిజంలో నా కెరీర్ స్టార్ట్ చేసాము. ఎవరూ విశాఖపట్నంలో న్యూస్‌లో వ్రాయలేదు. అందరు కృష్ణాజిల్లా తెలుగు నిలబెట్టే తెలుగులోనే వ్రాసారు. నెల్లూరు యాసలో ఎవరూ రాయలేదు. నెల్లూరు యాసలో కథ రాసారేమో జరిగింది. శాస్త్రిగారు కూడా పాత్రకి యాసనిచ్చారు. కాని ఒక చాగంటి సోమ యాజులుగారే కథకి యాస ఇచ్చారు. నా కనిపిస్తుందండీ కథని ఒడిసి పట్టుకున్నాడు నిగ్గు ఈ మాటలున్నాయండీ జాతీయంలో నలిగిన కొన్ని కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్ 20,30 ఏళ్లు ఆ భాషలో ఆ ప్రాంతంలో ఉంటేనే తప్ప లొంగవు. అలాంటివి మన మనస్సుకి పటం కట్టించినట్లు కనిపించే ఒక పిక్చర్. తీసుకురాగలిగే ప్రాంతమో, జాతియమో ఉంటుందే దానిని తన శైలిని చేసుకున్న చాలా తక్కువ మంది రచయితలలో చాగంటి సోమయాజులుగారు ఒకరు.
నేను ఇక్కడికి వచ్చి ప్రేక్షకులతో రెండు మూడు స్పీచస్ రెండు మూడు ఇంటరాక్షన్స్ చేయడానికి వీల్లేనన్ని గొప్ప విషయాలు రాసుకొని వచ్చాను. చాలాసార్లు సినిమాలలో ఇలా పట్టుకొని చూపిస్తాము. రూపాయి నోట్ల కట్ట ఇలా పట్టుకొని చూపిస్తాము ఎంత చక్కగా చందుగులో నోట్లను చేతితో పిసికి పట్టుకున్నాడు. చందుగులో నోట్లు చేతిలో చేతిడు పిసికి పట్టుకోవడం ఎంత చక్కటి చక్కటి పాత్ర అనడం లేదు. చాగంటి సోమయాజులుగారు అన్నారు. మధ్యలోఎక్కడో ఎక్కడో ఆయన మనకి దొరక్కుండానే చిన్న వ్యాక్యాన్ని అలంకరిస్తాడు. మిట్ట మధ్యాహ్నపు తారురోడ్డు దోసెల రేకులాగే నూనె కక్కుతూ ఆవిర్లు వస్తున్నాయి. ఒక్క మాట మనం వెతుక్కునే మాట లేదు. ”నోట్ టు ఆన్‌నోన్ ఈజ్ ఆర్ట్” ఏ పంక్షన్ ఆప్ కమ్యూనికేషన్ ఈజ్ ఆర్ట్” మనకి తెలిసిన విషయాన్ని తెలిసిన విషయంలో తెలియని విషయాన్ని పోలిస్తే ఈ తెలిసిన విషయం మన అనుభవంలోకి ఎంత గొప్పగా వస్తే ఎంత త్వరగా వస్తే ఎంత డీప్‌గా వస్తే ,ఎంత అందంగా వస్తే, ఆరూపు ఎంత అద్భుతంగా కనిపిస్తే ఈ ఆలోచన అంత అందంగా అలంకరించబడుతుంది. మనకు దోశెల రేకు తెలుసు ఎండలు తెలుసు మిట్ట మధ్యాహ్నం తారురోడ్లు దోశెరేకులాగా అంటే కనీసం పదిమందైనా నవ్వారు. దిస్ సంథింగ్,హీజ్ హిట్టింగ్ యువర్ మైండ్ ఈ హిజ్ హిట్టింగ్ యూ డౌన్ టు ఎర్త్ డౌన్ టుఎర్త్ సిమిలీజ్ అంటాము. ఆ సిమిలీ వాతవరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయి. ఇట్ దట్ నెవ్వర్ బి బెటర్ పోయిట్రీ దెన్ దిస్. వాతవరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయి అని వ్రాయడానికి ఈయన కృష్ణశాస్త్రీ లాగా గణాలో శ్రీశ్రీ గారిలాగా ఇంకో పదాలో ఇంకొకరిలాగా ఇంకేదో చేస్తాడని నేననుకోనాయనని ఇట్ మస్ట్ హావ్ ప్లోన్ హిజ్ సైకీ. ఆ సైకీలో ట్యూనీ అని ఒక అద్భుతమైన భాషని సంతరించుకున్న వ్యక్తి చాగంటి సోమయాజులుగారు.
నేను చాలా తక్కువ చదవి ఎక్కువ అర్థం చేసుకునే రోజుల్లో ఈ దశలో ఉన్నవాడిని నేను. ఈ కథలు ప్రతి కథ గురించి ఇలా ఎంతసేపయినా ఎన్ని సార్లయినా, ఎన్ని పేజీలైన నింపగలిగిన గొప్ప కంటెంట్ నాకు ఈ పది పదిహేను రోజులుగా ధాంక్స్ టూ తులసీ,థాంక్స్ టూ చాసో స్ఫూర్తి వల్ల నేర్చుకోగలిగాను. నాకు చమకం అంటే కన్యాశుల్కంలో గిరీశం మాటే జ్ఞాపకం వస్తుంది.చెగోడిచమే వీరిద్దరూ చెమే అన్నాడు.దేవుడుని ప్రార్థించే ప్రార్థనలో చమకం మీద కొంచెం దేవుడిని ప్రార్థిస్తూ చెమె నాకిది కావాలి అదికావాలి అని అడగటం ఎందుకు?
చమకంలో అద్భుతమైన రెండు మాటలు ఉన్నాయి. వృద్దించెమే వృద్దం చమే అని కూడా అడుగుతాడట భక్తుడు,నన్ను వృద్ది చేయాలి అని అడిగి నన్ను వృద్ధుడిని కూడా చేయవయా అని అడిగాడట. వైనో వై ఓన్లీ వెన్ యూ ఆర్ మెంటల్లీ మెచ్చూర్. కెన్ యూ ఆర్ అండర్ స్టాండ్ సమ్‌బడి లైక్ దిస్ చాసో. ఒక్క కథ గురించే ఒక డాక్టరేట్ మాట్లాడగలిగినంత కథల్ని నేను పుట్టిన నాలుగో సంవత్సరానికే వ్రాసిన మహానుభావుడిని తలుచుకుంటూ నమస్కరిస్తున్నాను..