చాసో గురజాడకి అక్షరాల వారసుడు- చాగంటి తులసి

చాసో ఆదర్శం స్ఫూర్తి దాయకం. జీవితంలోని గడ్డు వాస్తవికతలని పట్టుకొని వ్యవస్థ మారవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, అంతర్గతంగా ఆదర్శాన్ని నిలు పుతూ, కథలు రాశాడు ఆయన. ఆ కథల్ని పున:పున: మనం అధ్యయనం చేసుకుంటేనే గాని, చేసుకుంటూ మనల్ని మనం చైతన్య వంతుల్ని చేసుకోగలుగుతాం. మనం ఎలా ఉన్నామో, ఎందుకలా ఉన్నామో, అలా ఉండ కుండా ఎలా ఉండటానికి ఎలా మారాలో అనే ఆలోచన కలిగించి ఆ అభ్యుదయ కరమై న దిశవైపు మనల్ని ఆ కథలు ప్రయాణం చేయిస్తాయి. మన సంస్కారాన్ని తీర్చిదిద్దు తాయి. జీవితాన్ని కాచి వడబోసినటువంటి కథలవి.

ఆయన కథల్లో జీవితంలో ఎంత వైవిధ్యం ఉందో, అంత వైవిధ్యం కనబడు తుంది. ఒక కథకి మరో కథకి ఎక్కడా పోలిక ఉండదు.’ఎంపు, ‘పరబ్రహ్మం’, కుక్కుటేశ్వ రం’ ఇలా కథలన్ని కూడా తన ఇరవై ఏడో ఏట అచ్చు వేయించుకున్న టువంటి మొట్టమొదటి కథ ‘చిన్నాజి’ దగ్గర నుండి లోకం దృష్టిలో అనుభవం పండినటువంటి పెద్ద వయసులో వ్రాసినటువంటి కథల వరకూ అన్నీ సర్వోత్తమమైనటువంటి సాహిత్య సృష్టిగా, విశ్వకథా సాహిత్యంలో తెలుగు కథకి పెద్ద పీట వేసినటువంటి కథలే అన్నీ. ఆయన ఏ విషయాన్ని తీసుకొని వ్రాసి నా, ఏ వర్గపు పాత్రల్ని తీసుకొని సృష్టించి చెప్పినా, బతుకులో ఆర్ధికాంశాలకున్నటు వంటి ప్రాధాన్యత కనపడటమేకాక ఆర్థిక అసమానతల వల్ల కలిగినటువంటి విషాద భరితమైన జీవితం మన కళ్లకు కడుతుంది. ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలు మనం చుట్టూ నిత్యం చూస్తున్నటువంటి స్త్రీలే. ‘వాయలీ నం’లోని రాజ్యం,’బండపాటు’ లోని పార్వతి, కనకమ్మ, చామాలు, మొక్కుబడిలోని అంకి, ‘బొమ్మలపెళ్లి’ లోని ముత్తవ్వ , ‘కర్మ సిద్దాం తం’లోని పుల్లవ్వ, పేరక్క, ‘చన్నీళ్లలోని అలివేలు, బూడిదమ్మ’లోని జానకి ‘ఊహ ఊర్వశి’లోని చిట్టి, ‘బదలీ’లోని యువతి, లేడికరుణాకరం’లోని శారద, ‘బుగ్గి బూడిదమ్మ’లోని బూడిదమ్మ ‘పోనీతిను’లోని గున్నమ్మ ‘ఆవెత్ర కథలోని చాకలి దాలిగాడి పెళ్లాం, ఇలా ఈ స్త్రీలందరూ మన చుట్టూ ఉన్న జీవితంలో తారసపడేటటువంటి స్త్రీలే.

చాసో ఎంతో సానుభూతితో జీవి తాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి రచయి త అయితే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపిస్తూ తన శిల్ప చాతుర్యంతో ఈ స్త్రీల బాగోగుల గురించి ఆలోచించమని చెప్పారు. ఓసారి కథ చదివిన తరువాత ఈ స్త్రీ పాత్రల్ని మనం మర్చిపోలేం. ఈ పాత్రలు మనని ఏడిపిస్తా యి. నవ్విస్తాయి,అవును సుమా ఇలాగేవు న్నాం అనిపిస్తాయి.ఈ వ్యవస్థలోంచి పుట్టుకొ చ్చిన ఈ పాత్రలు,వ్యవస్థ మార్పుతో మారాలే తప్ప మరో మార్గం లేదు.

చాసో గురజాడకి అక్షరాల వారసు డు. గురజాడ విజయనగరంలో పుట్టలేదు. చాసో పుట్టలేదు. అయితే ఇద్దరూ విజయన గరం వాళ్లే, కాని ఇద్దరూ కేవలం విజయనగ రం వాళ్లు కారు. సమస్త విశ్వానికి చెందిన వాళ్లు. గురజాడ జాడలో ముందడుగు వేసి, తర్వాత తరాలవారిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, ఆయన కథలు నిత్యం స్ఫూర్తిని కలిగిస్తూ వుంటాయి.అందుకే చాసో నమ్మిన విలువల్ని, ఉత్తమ ఆదర్శాల్ని ముందుకు తీసుకుపోవడానికి చాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్టు ఏర్పడింది.

1995 చాసో స్ఫూర్తి పురస్కారాన్ని చాసో తరంవారు, ప్రముఖ అభ్యుదయ నవ లారచయిత శ్రీ మహీధర రామ్మోహన్‌రావు గారికి హైదరాబాద్‌లో 1995 జనవరి 17వ తేదిన జరిగిన సభలో అందజేసాం.1996లో చాసో స్ఫూర్తి పురస్కారాన్ని,చాసో శిష్యుడు, అభ్యుదయ కవి డాక్టర్‌ ఆరుద్ర గారికి, మద్రాసులో 96 జనవరి 17వ తేదిన జరిగే సభలో అందజేయడం జరిగింది.1997 నుండి చాసో స్ఫూర్తి సభని విజయనగరంలో జరుపుకుంటున్నాం.

చాసో అభ్యుదయ భావాలకి అంకి తమై, అభ్యుదయ భావాలని, ఆశయాలని ప్రతిబింబిస్తూ, నిబద్దతతో ఆయన వారస త్వాన్ని రచయితలని, సన్మానించడమన్నది సాహిత్య ట్రస్టు ఆశయం. చాసో స్ఫూర్తి పురస్కారం నిర్ణయం చేసినప్పుడు సన్మానం చేసేటటువంటి వ్యక్తికి 10000 రూపాయలు శాలువ,జ్ఞాపికలని ఇద్దామని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. సాహిత్యవేత్తకి గాని, రచయి తకిగాని, లేదా ఒక ఉత్తమ,సర్వోత్తమ సంకల నానికిగాని ఈయడానికి నిర్ణయం జరిగింది. అయితే చాసో ఆశయాలకి కట్టుబడి వ్రాసినటువంటి రచనలనే, రచయితలనే ఎంపిక చేసుకుందామనే నిర్ణయం కూడా జరిగింది. అవి మన కేవలం తెలుగు భాషకే చెందిన రచనలు కానక్కర్లేదు.మొత్తం భారత దేశంలో ఏ భాషకి చెందిన రచయితలయినా సరే, ఈ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లెటటు వంటి రచయితలని సన్మానించాలనిచెప్పి కూడా ఈ ట్రస్టు నిర్ణయించుకుంది.

అలాగే చాసో కథలు చదివేటటు వంటి పద్దతి కూడా ఉంది. ఆ చాసో కథా పఠనాన్ని కూడా అందరూ నేర్చుకుని, దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయం తో ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది కూడా, మేం చాసో కథా పఠనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని కూడా అందిపుచ్చుకుని యువ రచయితలు ముందుకు తీసువకు వెళతారని చెప్పి ఆశిస్తున్నాం.

1994 జనవరి రెండు. ఆ తేదీ నుండి చాసో భౌతికంగా మనమధ్య లేకుండా ఉండడం జరిగింది. అయితే ఆయన కళ్ళతో అనేక మంది రచయితలు ఇంకా చూస్తూనే ఉన్నారు. అలాగే ఆయన రాసినటువంటి కథలు, ఆకథల ద్వారా ఆయన ఆశయాలు ఆయన అనుసరించిన మార్గం, అది మన మధ్య స్ఫూర్తినిస్తూనే ఉంది. చాసో అవలం బించినటువంటి సామాజిక విధానం, కథా రచన అన్నది ప్రయోజనంతో కూడుకున్నది. సామాజిక బాధ్యతను కలిగినటువంటిది. సామాజిక బాధ్యతను విస్మరించి రాసే రచన రచనకాదు. అలాగే విజయనగరంలో ఉండి విజయనగర జీవితంతోటి, విజయనగరం వీధుల్ని విజయనగరం కొండలనీ, విజయ నగరం మట్టి వాసనతోటి సంబంధించిన వ్యక్తులనీ తీసుకొని కథలు రాసినప్పటికి ఆ కథలన్ని కూడా విశ్వమానవుని కథలే. ‘ప్రపంచంలో మానవుడు ఎక్కడున్నా కూడా ఒక్కడే.నేను విశ్వ మానవ ప్రపంచం గురించి వ్రాస్తున్నాను. అని చాలా నమ్మకంతో చెప్పినటువంటి వ్యక్తి చాసో.

తాను నమ్మిన దానిని జీవిత మంతా ఆచరించి ఒక సృజన శీలతలోనే కాక తన జీవితంలో ఎప్పుడూ కూడా రాజీపడనితత్త్వంతో ఆయన తన బ్రతుకుని చాలా హుందాతో గడిపారు. అది మనంద రికీ ఆచరణీయమైన విషయం. కథా సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన విశ్వకథకుడు, విశ్వ సాహిత్యంతో ఆయన సమకాలికులైన టువంటి రచయితల్లో ఆయనకున్నటువంటి స్థానాన్ని ప్రపంచ సాహిత్యంలో గుర్తించేటట్లు చేయడానికి అవకాశాలు మన తెలుగు సాహిత్య విమర్శలోకం ద్వారా మనకు దొరక కపోయినప్పటికి కూడా మిత్రుల మధ్య సాహితీవేత్తల మధ్య,ఎవరైతే ఆ గుణాన్ని అందిపుచ్చుకొని ఆ గుణమున్నదని గ్రహించారో వారందరి మధ్య చాసో గురించి ప్రసక్తి వచ్చినప్పుడల్లా నాలుగు గోడల మధ్య కలసిన మిత్రుల మధ్య ఏ డ్రాయింగ్‌ రూంలో నయినా ఏ ఊళ్లోనయినా ఏ మూలనయినా ఆంధ్ర దేశం మొత్తాన్నే కాదు, భారతదేశం మొత్తాన్ని ఏ నగరానికి వెళ్లినా ఏ నలుగురు కలసినా ఆయన ప్రస్తావన వస్తూనే ఉన్నది.

దీనికి కారణం ఆయన కథలు. ఆ కథల్లో ఉన్నటువంటి తత్వం. వస్తురీత్యానే కాక శిల్ప రీత్యా కూడా మనం అనునసరించ వలసిన మార్గాన్ని ఆయనకు నిర్ధిష్టంగా చూపించారు. శిల్పరీత్యా ఆ కథకు పరిపుష్టత లేకపోయినట్లయితే ఆ కథ కేవలం నినాదం గానో లేదా తాత్కాలిక ప్రయోజనం గలదాని గానో మాత్రమే నిలుస్తుందే తప్ప శాశ్వతంగా విలువలను సంతరించుకొని మనకు సందే శాన్ని ఇవ్వదు, ఇవ్వలేదు. అంచేత శిల్పరిత్యా కూడా ఆయన మనకి అనునసరించాల్సిన మార్గాన్ని నిర్దేశించారు.

ఆయన అభ్యుదయ పథంలో అగ్ర శ్రేణిలో ఏ విధంగా నిలిచారో ఆ విషయాన్ని మనం వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఆదర్శప్రాయమైన నిబద్దతతకీ, వేలెత్తి చూపెట్టమని సమర్థతకి ఆయన తార్కాణం. మరొక విషయం వాత్సల్యానికి ఆయన నిలువెత్తు రూపం. ఆరుద్ర ‘వాత్సల్యం అంటే ఏమిటో చాసో రాసిన ‘చిన్నాజీ’ కథ చదివి నేను తెలుసుకున్నా’నంటూ అన్నారు. ఎక్కడికి ఎప్పుడు వెళ్లి ఎవరిని కలసినా ఆయన మనమధ్య లేకుండాపోయిన తర్వాత ‘నా తండ్రి చనిపోయినట్లుగా నేను అను భూతి చెందాను. అన్న వ్యక్తులు మొత్తం దేశ మంతటా కూడా నాకు తారసపడుతూ వచ్చారు. ప్రతి ఒక్కరూ నాకలాగే చెప్పారు.ఆ నిలువెత్తు వాత్సల్యం ఆయనలో ఉంది.

శ్రీ పాపినేని శివశంకర్‌గారు మొట్టమొదటి చాసోని కలిసినప్పుడు ఆయన చాలా తీవ్రమైన చూపులతో చూస్తారు. భయ మేస్తుంది. ముందు మాట్లాడడానికి జంకుతా ము. కానీ ఆయనతో పరిచయ మేర్పడిన తర్వాత ఆయనతోటి ఆ దగ్గరితనం వాత్స ల్యం మనం అందుకుంటామ అని చెప్పారు. ఏ విధంగా చూసినప్పటికి కూడా వ్యక్తిగా, రచయితగా ఆయన చూపిన మార్గా న్ని ఎందుకు నడవాలో తెలియజేసే ఉద్దే శ్యంతో ఈ ట్రస్టుని ఏర్పాటు చేయడం జరిగింది.

చాసో చెప్పిన విధంగా చాసో మార్గంలో రాస్తున్న రచయితల్ని సన్మానిం చడం జరుగుతోంది. దాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఆ దీపధారి చూపెట్టిన ఆ దీపపు వెలుగులో ముందుకు వెళ్తున్న రచయి తల్ని సన్మానించడమే దీని ఆశయం.ఆ ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యుదయ పథంలో కథా రచన చేస్తూ తన ప్రసిద్ధిని నిలుపుకుంటున్నటువంటి యువ కథా రయితలను పురస్కారానికి అర్హులుగా ట్రస్టు ఎన్నికచేయడం జరుగుతోంది.

చాసో శ్రీకాకుళంలో జన్మించారు. నాగావళి తీరంలో నిజానికి ఈ మూడు జిల్లాలు కలసి ఒక్క జిల్లాగానే ఉండేవి. ఇప్పుడంటే మనం విభజన చేసుకొని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనుకుంటున్నాం గానీ అప్పుడేమో ఒకటే జిల్లా. ఆ నాగావళి తీరంలోనే ఆయన పుట్టి పెరిగారు. తరువాత శ్రీకాకుళం నుండి దత్తుడిగా విజయనగరానికి వచ్చారు. దత్తుడిగా ఉన్న సోమయాజులుగారు విజయనగరం జిల్లాలోనే చాలాకాలం తన జీవితం మొత్తం, ఇంచుమించు గడిపారు. అయితే విజయనగరంలోనే కాదు. మొత్తం ఆంధ్రదేశమంతటా కూడా ఆయన జీవించి నట్టే లెక్క. ఎక్కడికి వెళ్లినా సరే పెనుగొండ లక్ష్మీనారాయణగారు చెప్పినట్లు ఎక్కడ చాసోను తలుచుకున్నా అక్కడ ఈ ఊరు ఆయనదే. కేవలం విజయనగరంవాడు కాదు కాదు వ్యక్తిగా. అలాగే కథకుడిగా విజయ నగరం కథకుడే కాదు, తెలుగు కథకుడే కాదు,విశ్వ కథకుడు.

చాసో సామాన్యుడిగా కనబడుతూ అసామాన్యుడిగా బ్రతికిన వ్యక్తి. అలా ఉండటం ఆయన విశిష్టత ఆయన కథలు కూడా అలాగే సామాన్యంగా కనబడతాయి. కానీ అవి అసమాన్యమైనవి. దానికి కారణం సామాన్యుల మధ్య సామాన్యుడిగా తిరిగి సామాన్య జీవితాన్ని బాగా దగ్గరగా నిశితంగా పరిశీలించి వాళ్లకోసమే రాసి, వాళ్ల కోసమే బ్రతుకంతా నిబద్దతతో గడిపి ఆ నిజాయితీతోనే కొసవరకూ ఉన్నటువంటి వ్యక్తి అరసం సంస్థాపకుడిగా, సంస్థాపక సభ్యుడిగా అరసానికి చేసినటువంటి కృషి అందరికి బాగా తెలుసు.

చాసో ఎంత లౌకికవాది అంటే తన మరణానంతరం తన దేహాన్ని వైధ్య పరీక్ష లకివ్వాలని చెప్పి ఆయన సభాముఖంగా విశాఖపట్నంలో తనకి చేసిన స్తపతి సన్మాన సభలో తెలియజేసారు. ఆ విధంగానే మద్రా సులో ఆయన మరణానంతరం ఆయన శరీరాన్ని వైద్య పరీక్షలకివ్వడం జరిగింది. ఆయన అంతటి లౌకికవాది.ఆయన చనిపోయిన తర్వాత చాసో సన్నిహితులు మిత్రులు, రచయితలు, శిష్యులు చాసో దేనికోసమైతే బ్రతికాడో దానికోసం బ్రతుకు తూ రచనలు చేస్తున్నటువంటి రచయిత మిత్రులు, చాసో కుటుంబసభ్యులు అందరూ కలిసి, ఆలోచన చేసి దేనికోసమైతే చాసో తన జీవితాన్ని గడిపాడో ఆ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. అన్ని అనుభవాలు రచయిత తాను అనుభవించి రాయాల్సిన అవసరం లేదు. చాసో కథల్లో అట్టడుగు జీవితాన్ని రాసాడు. మధ్య తరగతి జీవితాన్ని రాసాడు. ఆయన రాసిన పాత్రలేమైతే ఉన్నాయో ఆ పాత్రలన్ని తన జీవితంలో తాను అనుభవించి రాసిన పాత్రలు కాదు. చుట్టూరా చూసినవి, పరిశీలన చేసినవి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.