టీవీతో మనం

డా.జి.భారతి
దాదాపు పది పన్నెండేండ్ల క్రిందట వార్తాపత్రికల్లో, టీవీలో ఆడపిల్లలను తక్కువ చేసి చూపించేలాగా ప్రకటనలు వచ్చేవి. ”అమ్మాయి పెళ్ళికీ, అబ్బాయి అమెరికా చదువుకీ ఇప్పట్నుంచే చిట్‌ఫండ్స్‌లో పొదుపు చేయండి” అనేది ఒక ప్రకటన.
మరో ప్రకటనలో అమ్మాయి నల్లగా వుంటుంది. అదేదో క్రీమ్‌ రాసుకునే సరికి అప్పుడు వద్దన్న కుఱ్ఱాడే, అమ్మాయిని పెళ్ళాడటానికి పరుగెత్తుకొస్తాడు. ఒక పెళ్ళేకాదు. ఉద్యోగాలు, ప్రమొషన్ల కూడా అమ్మాయి శరీరచ్ఛాయ మీదే ఆధారపడి ఉండేవి. ఎంతసేపూ ఆడవాళ్ళ జీవిత పరమవధి పెళ్ళేనా? అందం అంత ముఖ్యమ? అని విసుక్కునే వాళ్ళం.
ఇప్పుడంతా మారిపోయింది. అబ్బాయిలు ఆడపిల్లల్ని ఆకర్షించడానికి క్రీమ్‌ల వగైరాలు వాడుతున్నారు. వాళ్లు మంచి సట్లు వేసుకున్నా, షూస్‌ వేసుకున్నా, పర్‌ఫ్యూమ్‌ వాడినా అన్నీ అందుకే. చివరికి వాడే రేజర్‌ బ్లేడ్‌ గూడా అందుకే. ఇప్పుడు అమ్మాయిలు అలాంటి హీరోని పెళ్ళాడాలని ఆరాటపడటం లేదు. అబ్బాయిలకీ అమ్మాయిలకీ కావలసిందీ అదికాదు. ఒక డజనుమంది ఆడపిల్లలు అతని మీద పడిపోతారు (అక్షరాలా). ఈ మార్పు సంతోషించాల్సిందా? ఆలోచించాల్సిందా? మన సంస్కృతి, సంప్రదాయల మాట వదిలేస్తే, ఇప్పటి యువత జీవిత పరమావధి ఏమిటని ఆలోచిస్తే – కేవలం లైంగికాకర్షణను తృప్తిపరచుకోవటమే కనిపిస్తుంది. దీన్ని గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదా! అంటే మా అమ్మ (84 ఏళ్ళు) అంది ”బయటకూడా అవేవో పబ్‌లట అనీ, ఈ సినిమాలు ఇది వరకు మనం ఎరుగుదుమా?” అని ప్రశ్నించింది. నిజమే మార్పు అన్నిట్లో వస్తోంది. లోకంలో ఉన్న విషయన్నే ప్రకటనదార్ల వాడుకుంటున్నారు అని వప్పుకోక తప్పదు కదా? ఆడపిల్లలకి ప్రకటనలు ఒక ప్రొఫెషన్‌ ఇచ్చాయి కానీ దానివల్ల వారికి జరిగే మేలేంటి? ఏదో ఒక మంచి కోసం కొండంత ఆపద నెత్తిన వేసుకోవాలా?
మొదట టీవీని తీసుకుందాం. అది అందరికీ అందుబాటులో ఉన్న ప్రచార సాధనం కదా? తింటానికి తిండి లేకపోయినా, కేబుల్‌ టీవీ చూసి కడుపు నింపుకుంటున్నారు మన అమాయక ప్రజలు. టివీల్లో ఈ మధ్య వచ్చే నాట్యపోటీలు చూసే ఉండి ఉంటారు. పీలికల, తాళ్ళూ, దారాల దుస్తులుగా ధరించిన అమ్మాయిలు, అంతకన్నా తక్కువ వెతాదులో అర్ధనగ్నంగా ఉన్న అబ్బాయిలు కలిసి, వళ్ళూ వళ్ళూ రాసుకుంట, ఒకళ్ళమీద ఒకళ్ళు పడుతూ చేసే ఆ నాట్యాలు,మా తాతయ్య భాషలో దొమ్మరిగంతులు. అవి ఏ సంప్రదాయనికీ సంబంధించిన నాట్యాలు కాదు. కేవలం అమ్మాయిల అంగాంగ ప్రదర్శనను యువతీయువకులు(చేసేవాళ్ళూ, చూసేవాళ్ళూ), కాస్త వెటుగా చెప్పాలంటే, వంటి్దూల తీర్చుకునేందుకు చేసే ఎక్సర్‌సైజులు. వీటికి ‘భేష్‌’ ‘అద్భుతం’ అనే ప్రశంసలు వింటుంటే మతిపోతుంది. మనం ఎక్కడున్నాం? ఎక్కడికి పోతున్నాం? ఏమిటి మన ధ్యేయం? ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరు పట్టించుకోరేం? మన దేశం గురించీ, చరిత్ర గురించీ, మన మహానాయకుల గురించీ, మన కళల గురించీ ఏ ప్రోగ్రామ్‌ల ఎవరు చెయ్యరా? చేస్తే చూడరా? మన అనుభవం అటువంటి వాటినే ఆదరిస్తున్నట్లు చెప్తోంది. మరి ఎందుకీ సర్వనాశనం? మనం చేజేతులా చేస్త, చేస్తుంటే చస్తున్నాం? అసలు ఏ దేశంలోనయినా ఆదర్శవాదుల, సాంఘిక మార్పు కోరేవాళ్ళూ, మార్పు కోసం నడుంకట్టి ముందుకు దూకే కార్యకారులు యువతే. వాళ్ళకి ప్రోత్సాహం, ఆదర్శ సమాజం కోసం కావలసిన సిద్ధాంతబలం చేకూర్చటం మీడియ విధి కాదా? మన సంస్కృతీ సంప్రదాయలను అందర అర్థం చేసుకునేట్లు చేసే బాధ్యత లేదా? ఏ దేశమైనా మన సంస్కృతిని గౌరవించి, గర్వపడుతుంది. ఇతరులు వారి సంస్కృతీ సంప్రదాయలను చిన్నబుచ్చితే ఊరుకోరు. మనం మాత్రం మన సంప్రదాయల్ని చూసి సిగ్గుపడతాం. అందరికంటే ముందు మనమే వాటిని హేళన చేస్తాం. ఇది మన జాతికి పట్టిన జబ్బు.
టీవీ మనలాంటి బడుగుదేశంలో చక్కని విద్యాబోధక పరికరంగా కూడా ఉపయెగపడుతుంది. విద్యక టీవీ కీ చుక్కెదురు. ఒక ఊళ్లో ఆడపిల్లలకి చదువుకునేందుకు బడి లేదు. ఒక గ్లామర్‌ హీరో వాళ్ళకి స్కూలు కట్టించిస్తాడు. ఆ స్కూల్లో విదేశ మహిళలాగా కనపడే ఒకావిడ, ‘గుడ్‌మార్నింగ్‌’, ‘ఎ బి సి డి’లతో చదువు చెప్తుంటే, ఈ పేదింటి ఆడపిల్లలు ఏం చదువు నేర్చుకుంటారు? ఆ చదువు వాళ్ళ జీవితాలకి ఏ విధంగా ఉపయెగపడుతుంది? అసలు చదువంటే ఏమిటి? ఈ మౌలికమైన ప్రశ్నలు ఎవరు అడగరే? హీరో మాత్రం తను చేసిన మహామహా మహత్కార్యానికి ఎగిరి గంతులు వేస్తాడు. మేధావులంతా జరిపే చర్చా కార్యక్రమాల్లో యీ విషయలు చర్చకు రావేం? టీవీ చర్చల్లో పనికివచ్చే ఒక్క విషయం గుడా ఉండకపోవటం వాటి ప్రత్యేకత.
ఇక స్త్రీల కార్యకమాలు, ఆ డాన్సు ప్రోగ్రాములు ఏంటి? ఈ స్త్రీల కార్యక్రస్కూలేంటి? మనకి ఒక ధ్యేయం లేదా? వద్దా? కొంతవరకూ స్త్రీల కార్యక్రమాలు తమ పరిధిని దాటకుండా కొంత ప్రయెజనకారులుగానే ఉన్నందుకు సంతోషించాలి. ఈ మగమేధావులందరు వాటితో జోక్యం పెట్టుకోరు కాబోలు. బ్రతికించారు.
టీవీ సీరియల్స్‌ ముఖ్యంగా స్త్రీలకు ముఖ్యమైనవి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎప్పటికీ పూర్తి కావు. ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ పనులు హడావిడిగా పూర్తిచేసుకుని టీవీ.లు ముందు కూర్చుంటారు. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే వాళ్ళ చర్చలు వీటి గురించే. వచ్చేవారం ఏం జరుగుతుందో అనే ఆదుర్దా అందర్నీ వేధిస్త ఉంటుంది. దీంతో వాళ్ళకి టెన్షన్‌, విసుగ, చిరాకూ ఎక్కువవుత ఉంటాయి. వాళ్ళ వనసిక ఆరోగ్యం ఏమవుతోందో – కుట్ల అల్లికల అన్నీ మాయమయ్యయి. ఇదివరకు పనంతా అయ్యక చాలామంది ఆడవాళ్ళు ఆనాటి పేపరో, పత్రికో చదువుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తీరికేదీ? అదికాక యీ సీరియల్స్‌ ఏం చెప్తాయి? కోట్ల, లక్షల చిల్లిగవ్వల్లాగా చూసే ధనవంతుల జీవితాల్నీ, వాళ్ళ వివాహేతర సంబంధాల్నీ, వారి మానసిక వేదనా గురించేనా? ఇంకా సంఘటనల, పాత్రల గురించి తలవకపోవటమే మంచిది. ముఖ్యంగా ఆడపాత్రలు! అవ్మె! భయం వేస్తోంది. తరాలు గడిచినా వాళ్ళ తరగని పగల, ప్రతీకారాల చస్తే, ఎందుకివ్వి చూస్తున్నాం మనం? ఎవరికీ అనిపించదా? ఈ ఆడపాత్రలు ఎదుటివారు ఎంత అన్యాయం చేస్తున్నా భరించే బుద్ధిలేని వ్యక్తులు (సహనమూర్తులు) లేదా తమకు ఎదురుతిరిగిన వారిని చంపే దుర్మార్గులు. చిన్న అభిప్రాయభేదం వచ్చినా అవతల వ్యక్తిని ఏదో విధంగా చంపాలని ప్రయత్నిస్తారు. చంపటం తప్ప మరో ఆలోచన రాదు వీరికి. విషం కలపటమేనా, గండాలను నియమించటమేనా – ఒకటేంటీ? సినిమాల్లో మగవిలన్లు, రాయలసీమ రౌడీలు వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. ఇలాంటి సీరియల్స్‌ ఎందుకు చూస్తున్నారు ఆడవాళ్ళు? వాళ్ళలో ఈ లక్షణాలు అణిగిమణిగి పడి ఉన్నాయ? ఒకసారి ఆలోచించుకోండి! ఒక సైకాలజిస్టుగా నాకు వారు అణచిపెట్టిన దౌర్జన్యభావాలు, వారి నిస్సహాయత ఇలాంటి కారెక్టర్లను ఆరాధించే లెవెల్‌కి దించుతున్నాయ? వారు దౌర్జన్య మానసిక రుగ్మతనీ, ఆదుర్దా స్వభావాన్నీ పెంపొందించు కుంటున్నారు?
మనం ఏం చెయ్యలి? వ్యాపారవైఖరే అన్నిట్లోన కనిపిస్తోంది. ఈ సీరియల్స్‌ని స్పాన్సర్‌ చేసే వ్యాపారసంస్థల, ఏ విధమైన బాధ్యతా లేని ప్రజల (అంటే మనమే), ఛానల్‌ అధికారుల మారేట్లు మనం ఉద్యమం చెయ్యలి.
(ఈ వ్యాసంలో అన్నీ ప్రశ్నలే ఉన్నాయి. ఈ ప్రశ్నల గురించి పాఠకులు చర్చిస్తే బాగుంటుంది అని రచయిత్రి సచన. పాఠకులు ఉత్సాహంతో వారివారి అభిప్రాయలు వెలిబుచ్చుతారని ఆశిద్దాం.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.