కొ.కు. – నేను

అల్లం రాజయ్య
నాకన్న వయసులో, అనుభవంలో అర్ధశతాబ్దం పెద్దవారైన కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్తకానికి ముందుమాట రాయాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. తెలంగాణలోని మారుమూల పల్లెలో పుట్టిన నాబోటి వాడు – అదీ ఇంతకు ముందు మా కుటుంబంలో చదువు లేకుండా, చదువు, అందులో సాహిత్యంలోకి రావడం అందరిలాగే గాయాల నొప్పులమయం. మా ప్రాంతంలో సాహిత్యమేకాదు, సామాజిక ఉద్యమాలలోకి నాబోటి వాళ్లు రావడానికి – అనేక ఇతరేతర కారణాలతోపాటు – కొ.కు. సాహిత్యం కూడా ఒక కారణం.
కథలు – కథల్లోని జీవితం – కొ.కు.ను ప్రభావితం చేసిన అంశాలు విశ్లేషణ లాంటి అంశాలు పాఠకులకు తెలుసు. నిజానికి కొ.కు. సాహిత్యం నాబోటి వాన్ని బతుకు పొడుగుతా – నేనున్న స్థితులు – సందర్భాలల్లో ఎట్లా ప్రభావితం చేసిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
కొ.కు. గారు 1978 నుండి 1980 దాకా నాకు వారికి ఉత్తర ప్రత్యుత్తరాలు తరచుగా జరిగేవి.  మేము రాసుకునే ఉత్తరాల్లో – ఆ కాలంలో తెలంగాణలో ఉవ్వెత్తున లేస్తున్న రైతాంగ ఉద్యమాలు – ఆ ఉద్యమాల నేపథ్యంలో వస్తున్న సాహిత్యం – ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవితంతో పాటు అనేక విషయాలు అడిగేవారు. వారికి సంబంధించిన ఆలోచనలు సాహిత్య ప్రయోజనం – బుద్ధికొలత – ఇలాంటి విషయాలు రాసేవారు.
సాహిత్యానికి శాశ్వత విలువలు – ప్రయోజనాలు ఉండవనేవారు. కాలంతోపాటు, స్థలం, సందర్భంతో పాటు సాహిత్య ప్రయోజనం మారుతూ ఉంటుందనేవారు. నా మట్టుకు నేను కొ.కు. సాహిత్యాన్ని, కథలను ఇప్పటిదాకా మూడు సందర్భాలలో చదివాను. నేను చదివిన ప్రతిసారి కొత్తగా – పాతగా అర్థమైంది.
మొట్టమొదటిసారి నాకు పద్దెనిమిది ఏండ్ల వయసులో చదివాను. అప్పటికి నా స్థితేమిటంటే – ఎచ్‌.ఎస్‌.సి ఒక సంవత్సరం చదువు ఎగ్గొట్టుకొని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తలమునకలై – విద్యార్ధి నాయకునిగా అనేక గొడవల్లో పాల్గొని – ఆ క్రమంలో – మా ప్రాంతంలోకి వలస వచ్చిన ఆంధ్ర ప్రాంతపు సామాన్య ప్రజలు చెల్లాచెదురై భయపడటం చూసి చలించి … ఏం చేయాలో? తెలియని గజిబిజిలో ఎంతో అలజడితో – దారి తెన్నూ లేని అనేక ఆలోచనలతో – చలం రేపిన తిక్క – గోపిచంద్‌ రేపిన నిరాశ, ఉన్నవ హింస అహింసల మీమాంస – శ్రీశ్రీ మరో ప్రపంచం అలజడి… ఇలాంటి స్థితిలో ఖాళీలో అనుకోకుండా మరే పుస్తకం చదవకుండా కొ.కు. రచనలు దొరికినవల్లా చదివాను. నీటి వసతులు లేని – నిత్య కొట్లాటలు, బతుకుతెరువు ఆరాట పోరాటాలు తప్ప నిలకడగా ఆలోచించగల మరో జీవితం ఎరుగని, చూడని నాబోటి వాడికి – స్థితికి – కొ.కు. సాహిత్యంలోని మనుషులు, వాతావరణం, ప్రేమ మరోలోకం వానివిగా కన్పించాయి. అప్పటినుండి తెనాలి నా కలల్లో భాగమయ్యింది. అనేకమార్లు ఆంధ్ర ప్యారిస్‌ తెనాలిని – అక్కడి నీటిపారుదల సౌకర్యాలు, పంటలు, మనుషులతో పాటు ఇప్పటికే చలం, గోపీచంద్‌, కొ.కు., శారద వర్ణించిన తెనాలిని ఎన్నిసార్లు ఎంత ఉద్విగ్నతతో కలిశానో? బహుశా నాలాగే నాతరం వాళ్లకు ప్రేమ, విలువలతో కూడిన జీవితానికి సంబంధించిన కలలు అట్లా మొదలైందేమో?
అట్లా ఆరంభమైన జీవితం నుండి ఊపిరి సలుపని అనేకానేక మలుపులు. జీవితాన్ని, ప్రజలను ప్రేమించిన అనేకమంది సహచరుల బలిదానం – మా గడ్డ మీదే మేము అజ్ఞాతులమైన స్థితిలో… నిర్భంధం… రెండోమారు ముప్పయి అయిదు సంవత్సరాల వయస్సులో తప్పనిసరిగా కొ.కు. సాహిత్యం చదివాను. అప్పటివరకు నేను కోస్తా జీవితాన్ని ప్రత్యక్షంగా చూశాను. అనేక ప్రాంతాలు తిరిగాను. చాలా సాహిత్యం అక్కడినుంచి వచ్చినది చదివాను. అక్కడి జన జీవితం, ఉద్యమాలు, క్రమానుగత పరిణామాలు – ఎంతో కొంత అర్థమౌతున్న దశలో. అప్పటికి తెలంగాణలో ఉక్కుపాదం మోపబడింది. రైతాంగ ఉద్యమాలు క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. లోలోపల వ్యక్తుల్లో, ఉద్యమాలల్లో ఆత్మవిమర్శ – అంతర్గతంగా అనేక చర్చలు – సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడం – చైనాలో సంస్కరణలు – వగైరా వగైరా – ఇది రెండోదశ. ఉద్యమాలు బాగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో, మరీ ఎక్కువగా సింగరేణి ప్రాంతంలో – జన జీవితంలో మార్పులు – ఉద్యమాల ఫలితంగా జరిగిన మార్పులు – ఈ పరిణామాల నేపథ్యంలో ‘మధ్యతరగతి’ గురించి అధ్యయనంలో భాగంగా – భారతదేశంలో వచ్చిన ఇలాంటి సాహిత్యంతో పాటు మరీ ముఖ్యంగా గోపీచంద్‌, ప్రత్యేకంగా కొ.కు. సాహిత్యం మేము చదవడం జరిగింది. ఈ నేపథ్యంలో నుండే నేను ‘మధ్యవర్తులు’ కథ రాయడం జరిగింది.
మూడోసారి మళ్లీ ఇప్పుడు చదవడం… కుప్పకూలిన స్థితి – ప్రపంచవ్యాపితంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థలు… కలెగల్వని విడివిడి ప్రజాపోరాటాలు… కొ.కు. కాలంలోని ఉద్యమాలు, జాతీయ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ, మళ్లీ తెలంగాణలో ఆరంభమైన రైతాంగ పోరాటాలు – నవ్య సాహిత్య పరిషత్తు, అభ్యుదయ రచయితల సంఘం, విరసం లాంటి సాహిత్య సంఘాలతో మమేకత్వం. ఉన్నవ, చలం, గోపీచంద్‌, శారద నుండి రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య నుండి భూషణం తను చనిపోయే నాటికి వచ్చిన తెలంగాణలోని సాహిత్య చదివారు.. అన్ని రకాల సాహిత్య ప్రయాణంలో తన మార్గం ఎంచుకున్నారు. మధ్యతరగతి జీవనం నేపథ్యంలోంచి, తను బాగా ఎరిగిన వ్యక్తుల జీవితాలలోంచి – తను నమ్మిన విలువల జీవితాన్ని చిత్రించడానికి ప్రయత్నం చేశారు. కనుకనే ఆయన కథలన్నీ సీదాసాదాగా నడుస్తాయి. తదనుగుణంగానే శిల్పం, భాష ఎంచుకున్నారు.
కొ.కు. కథల విలక్షణం – కథ మొదటినుండి చివరిదాకా సమాజంలోని – మానవ జీవితంలోని వైరుధ్యాలు – వాటి ఎదుగుదల స్వభావాన్ని చిత్రించడం – అందులోని అభివృద్ధి నిరోధక భావాలను, దివాళాకోరుతనాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూనే – ఈ ఘర్షణలో నుండి రూపొందే పురోగామి శక్తులను గుర్తించడం…. ముఖ్యంగా తన సమకాలీనులైన రచయితల్లాగా ఏదో వొక సైడు తీసుకోకుండా – రాగద్వేషాలను మోతాదు మించకుండా – యాభై సంవత్సరాలు సృజనాత్మక రచనలు చేయడం కష్టమేకాక ఎంతో సాధనతో జరిగేపని. నిరంతరాయంగా మార్పుతో, మంచితో కొనసాగడం ఒక ఎత్తయితే ఆఖరు వరకు అలిసిపోకుండా రచనలు చేయడం చాలా చాలా కష్టమైనపని.
కొ.కు. వృత్తి – ప్రవృత్తి గురించి చెప్పి, తప్పనిసరై జీవిక కోసం వృత్తిలో ఎంత ఘర్షణ పడినాకూడా మనకు నచ్చిన విధంగా పనిచేయడం కుదరదు. సరే! ప్రవృత్తిలోనైనా ఏ ప్రలోభానికి లోనుకాకుండా – లొంగకుండా మనలను మనం ఎప్పటికప్పుడు కాపాడుకోవాలని నాకు ఒక సందర్భంలో చెప్పారు.
బహుశా నాలాగే నాతరంలో చాలామందికి కుటుంబరావుగారి సాహిత్యం అనేక సందర్భాలలో చేరింది. తెలుగు ప్రాంతంలో మంచికోసం పాటుపడే, విప్లవించే అందరికి కుటుంబరావు పరిచయమే కాదు ప్రభావితం చేశాడు కూడా. ఇట్లా తప్ప కొ.కు. గారిలాగా స్పష్టంగా, సూటిగా చెప్పడం నావల్ల కాలేదు. తనకాలపు మనుషుల పట్ల ప్రేమకు, నాపట్ల వారి ఆదరణకు – ఇంతకన్న నావల్ల సాధ్యంకాక ఈ నాలుగు మాటలు.
ఈ సంకలనంలోని కథలు చదివినవారెవ్వరూ వారి పూర్వస్థితిలో ఉండజాలరు. తమ గురించి – తమ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి తెలుసుకోవడానికి ఉద్యుక్తులౌతారు. తాము ఎక్కడ నిలుచున్నారో ఎటు పయనించాలో తేల్చుకుంటారు. గ్లోబలైజేషన్‌ పేరు మీద కుప్పకూలిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సంక్షోభంలో – అతలాకుతలమౌతున్న ప్రజానీకం – అనైక్యంగా ఉన్న ప్రజానీకంకు, తప్పక నిర్మాణాలకు సంబంధించిన ప్రేరణ ఇలాంటి సాహిత్యం నుండి దొరుకుతుందని నమ్ముతూ –
తప్పకుండా నేటికాలంలో బతికే వారందరం అలాంటి నిర్మాణాలు చేపట్టక తప్పని పరిస్థితిలో – పాఠకులను కొ.కు. కథల్లోకి ఆహ్వానిస్తున్నాను…(విరసం సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 
S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 
తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.