Monthly Archives: December 2024

డిసెంబర్ 2024

డిసెంబర్ 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఈ ఆదివాసీల సంస్కారం అనితరసాధ్యం – కొండవీటి సత్యవతి

రంపచోడవం దగ్గరలో అదొక ఆదివాసీ గ్రామం. చుట్టూ కొండలతో, పచ్చటి చెట్లతో అడవి మధ్యలో ఉన్న గ్రామం. గత ఆరు నెలల నుండి ఈ గ్రామాల్లో పనిచేయడం మొదలు పెట్టాం. మహిళలతో తరచుగా సమావేశాలు పెడుతున్నాం. ఆ రోజు కూడా మహిళలతో మాట్లాడాలని ఉదయమే ఆ గ్రామం చేరుకున్నాం. పనులు తొందరగా పూర్తి చేసుకుని ఒక్కొక్కరూ … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

వొట్టిమాటలు కట్టిపెట్టండి – వి.శాంతి ప్రబోధ

లోపలికి వస్తున్న యాదమ్మను చూస్తూ ‘‘ఆరోగ్యం బాగోలేదా?’’ అత్తగారి ప్రశ్న. మౌనంగా లోపలికి పోయి చేట చీపురుతో వచ్చింది యాదమ్మ. కళ్ళు బాగా ఉబ్బి, నుదుట బొప్పి కనిపిస్తున్నాయి. నడకలో కూడా తేడా ఉంది.

Share
Posted in కిటికీ | Leave a comment

లీషాయనమః – ఆపర్ణ తోట

ఏం చెయ్యాలో చెప్పు ఎలా ఉండాలో చెప్పు ఏం వేసుకోవాలో చెప్పు

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఆదివాసీ మహిళల జనజీవనం-వర్తమానం – అనూరాధ. బి

భారత రాజ్యాంగంలోని 342 వ ఆర్టికల్‌ కింద ఇప్పటిదాకా నమోదైన ఆదివాసీ తెగలు 700కి పైన ఉన్నాయి. నమోదు కాని వాటి సంఖ్య ఇంకా చాలా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీ జనాభా మొత్తం జనాభాలో 8.6%గా ఉంది. అంటే దాదాపు 10.4 కోట్లు. భారత దేశంలో ఉన్న తెగలన్నీ ఒకేలాగా లేవు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గాయం – డా.మజ్జిభారతి

‘‘డాక్టరుగారూ! మీతో అర్జెంటుగా మాట్లాడాలి’’ చెప్పాడు కిరణ్‌ సైకియాట్రిస్ట్‌ శ్రీధర్‌ కు. ‘‘సార్‌! జ్యోతి మీద చెయ్యేస్తే అంతవరకు మామూలుగానే ఉన్న జ్యోతి ఏదో శక్తి ఆవహించినట్లు నన్ను విసిరి కొడుతుంది. నేను కూడా బాక్సింగ్‌ ఛాంపియన్‌ ను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరైతే ఈసారికి హాస్పిటల్లో అడ్మిట్‌ అవ్వాల్సి వచ్చేది.’’

Share
Posted in కధలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…) ` అనువాదం: ప్రభాకర్‌ మందార ఈ ఎమర్జెన్సీ గందరగోళంతో మేం కాలేజీని మధ్యలోనే వదిలెయ్యాల్సి వచ్చింది, దాంతో ఇక మాకు పార్టీతో సంబంధం లేని ఇతర మిత్రులను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చుట్టూ గిరి గీసినట్లు, మా ప్రపంచం చాలా చిన్నదైపోవటంతో.. క్రమంగా జీవితం నిరాసక్తంగా కూడా మారటం మొదలైంది. … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బాన్స్‌వాడాలో ఇంట్లో ఒంటరిగా… – స్వదేశ శర్మ

పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా అనువాదం: సుధామయి సత్తెనపల్లి బాధల వలస బాల్యాన్ని ఎప్పటికీ మారుస్తుంది. బాలల దినం సందర్భంగా ఒక కథనం. కిరణ్‌ వంట చేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తుంది, ఇంటిని నడుపుతుంది. ముంచుకొస్తోన్న ఎండాకాలం వలన వెళ్ళాల్సిన దూరాలు పెరుగుతున్నప్పటికీ, ఆమె కట్టెలనూ నీటినీ సేకరించి, వాటిని ఇంటి వరకూ మోసుకొస్తుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నది నుండి సముద్రం వరకు: స్వతంత్రం అవ్వాలి పాలస్తీనా – ప్రవీణ్‌ కొల్లుగురి

కొన్ని రోజుల క్రితం ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్‌ గారు ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంపై సాక్షి పత్రికలో రాసిన ‘‘రెండు దేశాలుగా బతకడమే దారి’’ అనే కథనం కొన్ని కీలక విషయాలపై అవగాహన పెంచి, ఇజ్రాయెల్‌ మరియు పాలస్తీనా సమస్యను పరిష్కరించే మార్గాన్ని సూచించేందుకు చేసిన ప్రయత్నం అయినప్పటికీ, ఈ సమస్యను చూస్తున్నప్పుడు పలువిధమైన వాస్తవాలను విస్మరించడం … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పేదరిక నిర్మూలన బౌద్ధ ఆచరణలతో సాధ్యం – డా.సి.హెచ్‌. వెంకటశివసాయి

బౌద్ధ మతం మరియు ఆర్ధిక శాస్త్రానికి సంబంధించిన బుద్ధుడు బోధించినట్లు మరెవరు చెప్పలేదు. బుద్ధుని కాలంలో సమాజాలు సహజ ప్రపంచంలో వాటి స్ధానానికి మరింత లోతుగా పాతుకుపోయాయి. ఆర్ధిక వ్యవస్థలు ఇతరుల మాటలలో మరింత స్థానికీకరించబడ్డాయి. ప్రజల మధ్య మరియు సంస్కృతి మరియు ప్రకృతి మధ్య సంబంధాలు సాపేక్షంగా ఉండేవి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వెలుగు దారుల ప్రజాస్వామ్య ప్రస్థానం – టి. అనురాధ

ఈ పుస్తకంలో రచయిత, అనిశెట్టి సాయి కుమార్‌ గారు ప్రాచీన గ్రీకు దేశం నుంచి మొదలై నేటి ఆధునిక ప్రభుత్వాల వరకు విస్తరించిన ప్రజాస్వామ్య భావన పుట్టుక పరిణామం, వివిధ దశలు అలాగే నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎలా నిలబడిరదో చక్కగా విశదీకరించారు.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

చిన్నోడికి ప్రేమతో – నాదెళ్ళ అనూరాధ

అక్షరానికున్న గొప్పదనం నిర్వచించలేనిది. వాటిని పొదువుకున్న పుస్తకాలు చేసే మేలు గురించి చెప్పటం అంత సులువు కాదు. పేరుకి తగినట్టే అక్షరం తన ప్రభావాన్ని చదువరి మీద గాఢంగా వేస్తూ మనసుల్లో నిలబడిపోతుంది. చదివిన విషయాలు సందర్భానుసారంగా మనల్ని ఆలోచించేలా చేసి సరైన దిశా నిర్దేశం చేస్తూండటం అనుభవంలోకి వచ్చే విషయమే.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మనిషితనంపై మమకారం – అస్తిత్వంకై ఆరాటం బిట్ల అంజనీ దేవి కవిత్వం! – సింగరాజు రమాదేవి

‘మనసెందుకో సున్నితం’ పేరుతో బిట్ల అంజనీ దేవి రచించి వెలువరించిన కవితా సంపుటిలో మొత్తం యాభై కవితలు ఉన్నాయి. ఈ కవితల్లో వైవిధ్యమైన వస్తు ఎంపిక ఉంది. మనిషితనంపై మమకారం ఉంది. వర్గ స్పృహ ఉంది. రాజకీయ చైతన్యం ఉంది. ప్రకృతి ప్రేమ ఉంది. సామాజిక స్పృహ ఉంది. స్త్రీవాద చైతన్యం ఉంది. అస్తిత్వ ప్రకటన … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

జముడు పువ్వు – రమాదేవి చేలూరు

ఉద్యోగరీత్యా రోజూ అతను, బస్‌లో వాళ్ళ ఊరి నుంచి పక్క ఊరికి, కడప నుంచి నెల్లూరు వెళ్ళే బస్‌లో ప్రయానిస్తుంటాడు. రోజూ ఆతనితో సహదేవ్‌ అనే మరో ఉద్యోగస్తుడు కూడా ప్రయానిస్తుంటాడు. అలా ఇద్దరికీ బాగా పరిచయం.

Share
Posted in కథా పరిచయం | Leave a comment

అక్షరం రెండు మునివేళ్ళతో విశ్వాన్ని వెలిగించే జీవన సృజనం- మహాకవి డాక్టర్‌ కత్తి పద్మారావు

అరకు లోయలో వికసిస్తున్న ఆ గడ్డి పూల సొగసుకు వెన్నెల దివిటీలు వెలిగిస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment

మాకంటూ ఓ పప్రంచం – షేక్‌ . కాశింబి

ఊయలలో నిదురించే ఉంగా ఉంగా పసిపాప నైనా బుడి బుడి అడుగుల నడకన సాగే

Share
Posted in కవితలు | Leave a comment