ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థలలో ర్యాగింగుని నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగు నిరోధక చట్టం నెం. 26ను తీసుకొచ్చింది.
ర్యాగింగు అంటే విద్యార్ధినీ విద్యార్థులను పీడించడం, కలవరపెట్టడం, చిన్న బుచ్చడం, వారిపై దౌర్జన్యం చేయడం, బెదిరించడం, ఘోరమైన హాని తలపెట్టడం, అపహరణ, బలాత్కరించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం.
ర్యాగింగు నిరోధానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టింది?
జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు ఆధ్వర్యాన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఉపాధ్యక్షుడిగా, రెవెన్యూ డివిజనల్ అధికారి, డిఫ్యూటీ పోలీసు సూపరింటెండెంట్, విద్యా సంస్థల అధిపతులు (ప్రిన్సిపాల్) సభ్యులుగా ఒక సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సంఘం కళాశాలల విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రెండు సార్లు కలిసి, ర్యాగింగు నిరోధక చర్యలను రూపొందించి అమలు పరుస్తారు.
ప్రతి కళాశాలలోను ర్యాగింగు నిరోధక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉపన్యాసకాలు, విద్యార్ధినీ విద్యార్ధుల ప్రతినిధులు ఉంటారు. కళాశాలలందు ర్యాగింగు చేసినట్లయితే ఎదుర్కోవలసిన పరిణామాలను తెలియజేస్తూ ప్రకటనలను రాతపూర్వకంగా ప్రదర్శిస్తారు.
విద్యార్ధినీ, విద్యార్ధులు ర్యాగింగు చేయం అనీ, చేసినట్లయితే తగిన శిక్షకు తమదే బాధ్యత అనీ రాత పూర్వక హామీపత్రాలను కళాశాల అధికారులకు అందజేయవలసి వుంటుంది.
ర్యాగింగు నివారణకు సూచనలు
జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 1800, 18022, 18055 నెంబర్లకు విద్యార్థులు ఫోన్ చేసి సమస్యను తెలిపి పరిష్కారాన్ని పొందాలని సూచించారు.
ర్యాగింగు వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కమిటీలో అనుభవం ఉన్న ప్రొఫెసరు, స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారుడిని భాగస్వామిని చేయాలన్నారు.
సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య సత్సంబంధాలు నెరపేలా హాస్టల్ వార్డెన్‌లు కృషి చేయాలన్నారు.
నూతనంగా కళాశాలల్లో చేరిన విద్యార్ధులకు ప్రత్యేకమైన బ్లాక్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
1997 ర్యాగింగు నిరోధక చట్టాన్ని అతిక్రమించిన వారిపై పెట్టే కేసులను వివరించే బ్యానర్లను కళాశాల ప్రాంగణంలో విద్యార్ధులకు కనపడేలా ఉంచాలన్నారు.
విద్యార్ధి సంఘాలను భాగస్వామ్యం చేసి అవగాహన కల్పించాలన్నారు
ర్యాగింగు జరిగిన విషయాన్ని విద్యార్ధులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చిన్పటికి ఎలాంటి చర్యలు చేపట్టపోతే యాజమాన్యం పై చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్ధులు హెల్ప్‌లైన్‌ను ఉపయోగించుకోవడంతో పాటు తనను నేరుగా ఫోన్ 9490616301లో సంప్రదించవచ్చని సూచించారు.
మీ కళాశాలలో ర్యాగింగు సంఘానికి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. భయపడొద్దు. స్థానిక రెవెన్యూ అధికారికి, పోలీసులకు ఫిర్యాదుకూడా ఫిర్యాదు చేయవచ్చు.
ర్యాగింగు చేసిన వారికి ఏ విధమైన శిక్షలను విధిస్తారు.
పీడించుట, కలవరపెట్టుట, చిన్నబుచ్చట ఆరు నెలల నుండి జైలు శిక్ష లేదా రూ.1000 వరకు జరిమానా లేదా రెండునూ
దౌర్జన్యం, నేర ప్రవృత్తి, బెదిరించడం సంవత్సరకాలం జైలుశిక్ష లేదా రూ.2000 వరకు జరిమానా లేదా రెండునూ
ు తప్పుడు పద్ధతిలో నియంత్రించడం,
ు అవరోధించడం, అపకారం చేయడం రెండేళ్ళ పాటు జైలు శిక్ష లేదా రూ. 5000 వరకు జరిమానా లేదా రెండునూ
ు ఘోరమైన హానీ తలపెట్టడం, అపహరించడం,
ు అసహజమైన అపరాధం 5సం.పాటు జైలుశిక్ష లేదా రూ.10000 వరకు జరిమానా లేదా రెండునూ
ు మరణకారణమగుట, ఆత్మహత్యకు
ు ప్రేరేపించడం 10 సం. పాటు జైలు శిక్ష లేదా రూ. 50000 వరకు జరిమానా లేదా రెండునూ
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags