ఆదర్శాల అమ్మ ! పేరిచర్ల లక్ష్మీకాంతమ్మ ! – అనిశెట్టి రజిత

దేశ స్వాతంత్య్రానికి పూర్వం గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంతో ప్రఖ్యాతి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా మట్లపాలెం గ్రామంలో 78 ఏళ్ల క్రితం సంప్రదాయ రాజుల కుటుంబంలో జన్మించిన లక్ష్మీకాంతంకు తన 17వ ఏట తనకన్నా 20 ఏళ్లు పెద్దవాడైన పేరిచర్ల సుబ్బరాజుతో వివాహం కావడంతో పేరిచర్ల లక్ష్మీకాంతంగా మారిపోయి గృహస్థ ధర్మాల నిర్వహణలో ఉండిపోయారు.

తమ గ్రామంలో 5వ తరగతి మాత్రమే చదివిన ఆమె ఉపాధ్యాయుడైన భర్త ప్రోత్సాహంతో చదువుతూ హైదరాబాద్‌ సారస్వత పరిషత్‌లో తెలుగు పండిట్‌ శిక్షణ పొందారు. మునిమాణిక్యంగారి పాఠాలు వింటూ తెలుగు భాషా, సాహిత్యం, రచనలపై ఆసక్తిని పెంచుకున్నారు. శ్రీశ్రీ కవితాభావాలకు ప్రభావితమయ్యారు.
ఆమెకు పెళ్ళయ్యేనాటికి ‘సురా’ (సుబ్బరాజు) గారికి ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. పదిహేడేళ్ళ వయసులో ఆమె ముగ్గురు పిల్లలకు తల్లిగా ఉండీ చదువుల్లో అర్హతలు సాధిస్తూ తనకు కలిగిన ముగ్గురు సంతానంతో కలిపి ఆరుగురు మగపిల్లల్ని సవరించుకుంటూ అందర్నీ తేడాలూ తెలియకుండా పెంచారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి భీమవరం, అగ్రహారం, ఖండవల్లి మొదలగు ఎన్నో ఊర్లలో సేవలందిస్తూ సామాజిక స్పృహతో ఆలోచనల్ని శాస్త్రీయ దృక్పధంతో సమన్వయపరుచుకుంటా విద్యార్థులకు జీవన విలువల్ని నేర్పించాల్సిన బాధ్యతను తీసుకొని వారిలో సంస్కృతిక జాగృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. గేయాలు, గీతికలు, కవితలు, చిరు నాటికల్ని రచిస్తూ విద్యార్థుల్ని ఉత్సాహపరుస్తూ ఉండేవారు ఈ బాలసాహిత్య రచయిత్రి.
1980 దశకంలో ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం సాంస్కృతిక ఉద్యమంలో భర్త ‘సురా’ గారితో కలిసి మతమౌఢ్యాలను, కుల అంతరాలను, మూఢ విశ్వాసాలను వ్యతిరేకిస్తూ ప్రజా సమూహాలను చైతన్యపరిచే ఉద్యమకారులుగా మారిపోయారు. 2006లో ఉద్యోగ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. కారంచేడు మారణకాండ అనంతరం హేతువాద ఉద్యమం క్రమంగా ఆగిపోయినా లక్ష్మీకాంతమ్మ ` ‘సురా’ బాబాయ్‌ల్లో సామాజిక స్పృహ స్తబ్దమై పోలేదు.
విశాఖపట్నంలో తమ ఉద్యమాల మానస పుత్రిక గూడూరు సీతామహాలక్ష్మి (హేతువాదం లక్ష్మి) ఒన్‌ మ్యాన్‌ ఆర్మీలా ప్రారంభించిన శరీర అవయవదాన ఉద్యమానికి తొలుత నైతిక బలాన్నీ ప్రోత్సాహాన్ని వీరు అందించారు. 16 ఏళ్ల క్రితం ఈ ఉద్యమ నిర్మాణం సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్‌ Ê చారిటబుల్‌ ట్రస్ట్‌గా ఏర్పడినప్పుడు వీరిరువురూ, వీరి చిన్న కుమారుడు శ్రీహరిరాజు వ్యవస్థాపక సభ్యులుగా, ట్రస్టీలుగా ఉండి ఆ మహత్తర ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ‘స్పెక్ట్‌’ (ూaఙఱ్‌తీఱపaఱ ూష్ట్రబశ్రీవ జుసబషa్‌ఱశీఅaశ్రీ డ జష్ట్రaతీఱ్‌aపశ్రీవ ుతీబర్‌) కార్యకలాపాలైన నేత్ర, శరీర అవయవదాన ఉద్యమ వ్యాప్తి కార్యచరణ అయినా, పేద పిల్లల్ని దత్తత తీసుకొని చదివించే విద్యాదాన కార్యక్రమమైనా లక్ష్మికాంతమ్మ సురా జంట ఆర్ధిక సహకారం ఎంతో ఉంటూ వచ్చింది. అందుకే 2018 సెప్టెంబర్‌ 5న ‘సురా’ బాబాయ్‌ మరణానంతర ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు వారి పార్ధివ దేహాన్ని అప్పగించారు. ఇప్పుడు జూన్‌ 16 2025న హఠాత్తుగా కీర్తిశేషులయిన అమ్మ లక్ష్మీకాంతమ్మ పార్ధివ దేహాన్ని కూడా ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు అప్పగించాము, యల్‌.వి. ప్రసాద్‌ ఐ ఇన్యూస్టుట్‌కు నేత్రదానం చేసాము. ూష్ట్రవ పవషaఎవ a ్‌వaషష్ట్రవతీ ్‌శీ ్‌ష్ట్రవ సశీష్‌శీతీం aట్‌వతీ ష్ట్రవతీ సవa్‌ష్ట్ర.
కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే సామాజిక బాధ్యతను వీరు ఇష్టంగా కొనసాగించారు. అత్యంత నిరాడంబరంగా సామాన్యులుగా జీవించిన అసమాన్యులుగా, మానవతావాదులుగా, సమతామూర్తులుగా, హేతువాదులుగా ఎల్లప్పుడూ ఉద్యమజీవులుగా ఆదర్శాలను ఆచరిస్తూ, ఆశయాల స్ఫూర్తిని వెలిగిస్తూ జీవితాల్ని సార్ధకం చేసుకున్న అభ్యుదయ మార్గదర్శకులు వీరు. స్నేహశీలి లక్ష్మీకాంతం అమ్మ కొత్తాపాతా, పెద్దా చిన్నా అనే బేధం లేకుండా అందర్నీ ఆప్యాయంగా, ఆదరణగా చూసేవారు. ఆమె భౌతిక దూరం ఎంతగానో బాధిస్తున్నా, ఆమె ఉన్నారు మనలోనే సజీవంగా.. ఆమె ఆశయాలూ ఉన్నాయి. మనిషిపోతే మాత్రమేమి ఆ మనిషికి సంబంధించిన అన్ని అనుభూతులూ ఉంటాయి. మనసుతో కలిసిపోయిన మనసు స్నేహానికి మరణం లేదని నిరూపిస్తుంటుంది.
అందమైన చందమామ, చల్లని తల్లి లక్ష్మీకాంతమ్మ. ఒక విధంగా ఆమెను తెలిసిన, ఆమెతో ఉద్యమదారుల్లో ప్రయాణించిన వారందరికీ ఆమె అనురాగమూర్తి అయిన అమ్మే! అమ్మ బహువచనం! దేశాలూ, జాతులూ, ప్రాంతాలకూ అతీతంగా మనుషుల్ని ప్రేమించే ప్రేమమూర్తి లక్ష్మీకాంతమ్మకు శతకోటి నీరాజనాలు !

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.