భూమిక ప్రారంభ సంచిక 1993 జనవరి నెలలో విడుదలైంది. సుదీర్ఘమైన ఈ పదిహేనేళ్ళ ప్రయాణం వెనుక మాకెన్నో అనుభవాలున్నాయి. ఒక ప్రత్యామ్నాయ పత్రికగా, ఒక సీరియస్ మాగజైన్‌గా భూమికను బతికించుకుకోవడానికి మేము పడిన శ్రమ, సంఘర్షణ మాటల్లో వర్ణించలేనిది. అయితే ఈ రోజున తెలుగులోనే కాక యావత్ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా `భూమిక’ ప్రాచుర్యం పొందడం మాకెంతో గర్వకారణమైన విషయం. మేము పడిన కష్టానికి, ఖర్చు చేసిన కన్నీళ్ళకి తగిన ప్రతిఫలం లభించిన తృప్తి దొరికింది.
భూమిక నేపథ్యం:
1980 దశాబ్దంలో తెలుగు సాహిత్యంలోకి వెల్లువలా దూసుకొచ్చిన స్త్రీవాదం, సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్ని ప్రభావితం చేసింది. తెలుగు దినపత్రికలో స్త్రీల పేజీలను ఏర్పాటు చేయవలసిన అనివార్య పరిస్థితిని స్త్రీవాదం కలగచేసింది. ఈ పేజీల నిండా స్త్రీవాద కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యేవి. స్త్రీవాద సిద్ధాంత చర్చలు తీవ్ర స్థాయిలో జరిగేవి. ఉధృతంగా సాగిన స్త్రీవాద ఉద్యమాలు, ప్రచారంలోకి వచ్చిన స్త్రీవాద ఆలోచనలు ,స్త్రీల సాహిత్యంలో వస్తున్న పరిణామాలు ఇవన్నీ కూడా భూమిక ఆవిర్భావానికి కారణలయ్యాయి. అలాగే ప్రచార వ్యవస్థలో స్త్రీల సమస్యలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వటం, వార్తా పత్రికలలో స్త్రీల శీర్షికలు నడవటం లాంటివి ఎక్కువైనప్పటికీ ఇవన్నీ కూడా పితృస్వామిక విలువల మూస పద్ధతులకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా వుండడం కన్పిస్తుంది. దీనివల్ల ఒక పక్క స్త్రీల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కన్పించినా, అణిచివేతకు మూలమైన విలువల పునాది మాత్రం యధాతధంగానే వుండి పోయింది. ఏ అంశం మీది చర్చలైనా పితృస్వామిక భావజాలానికి సమ్మతమా, కాదా అనే దానికి లోబడి మాత్రమే ఉండేవి. స్త్రీల వాస్తవ సమస్యల చిత్రణకోసం, స్త్రీల దృష్టికోణం నుంచి స్త్రీ సమస్యను అంచనా వెయ్యడం కోసం ఒక సమగ్ర పత్రిక అవసరం చాలా వుందని భావించి `భూమిక’ రూపకల్పన చేయడం జరిగింది.
భూమిక ఉద్దేశాలు:
– ఏ మాత్రం గుర్తింపు పొందని, అంచుకు నెట్టి వేయబడిన స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను వివిధ భాషల నుంచీ సేకరించి ప్రచురించడం
– స్త్రీలు సృజనాత్మకమైన తమ ప్రతిభా పాటవాలను ఇతరులతో పంచుకునే విధంగా చోటు కల్పించటం
– భారతీయ సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ ఉన్న స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయటం
– మూస పద్ధతిలో కాకుండా స్త్రీ వాస్తవ జీవితాశలను ప్రతిబింబించే కథలూ, కవితలూ, పాటలు సేకరించి ప్రచురించటం
– స్త్రీవాద దృక్పథం నుంచీ సాంఘిక – ఆర్థిక – రాజకీయ పరిస్థితులను విశ్లేషణాత్మంగా పరిశీలించటం
– వివిధ రంగాలలో నిపుణులైన స్త్రీ కళాకారుల జీవన పరిస్థితులు, చరిత్ర గురించి వారి మాటల్లోనే పరిచయం చేయటం
– సినిమాలు, టెలివిజన్, రేడియో కార్యక్రమాలపై అలాగే ప్రాచుర్యం పొందిన ఈనాటి సంస్కృతిని సమీక్షిస్తూ చర్చలు నిర్వహించటం
– ఇప్పటివరకూ ముఖ్యమైన విషయాలుగా గుర్తింపబడని స్త్రీల ఆరోగ్యం, కుటుంబ హింస, ఇంటి చాకిరీ వంటి అంశాల గురించి చర్చించటం
– స్త్రీలు, దళితులూ, మైనారిటీలకు సంబందించి ఏ వివక్షతా ధోరణులకూ తావీయని పిల్లల సాహిత్యాన్ని అన్ని భాషలనుంచీ సేకరించి ప్రచురించటం
– స్త్రీల విషయాల మీద ప్రభుత్వ ప్రణాళికలు, వాటి పని తీరు, ఫలితాలపై సమాచారం, అలాగే వాటి మీద స్త్రీల సంఘాల, కార్యకర్తల అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడం
– కులం, మతం, వర్గం వంటి సరిహద్దులు లేకుండా స్త్రీలు తమ జీవితాల్లోని సంఘర్షణలనూ, అనుభవాలను పంచుకోవటానికి అవకాశం కల్పించటం
– స్త్రీల విషయాలపై ఇప్పటి వరకూ ఉన్న చట్టాలు, వాటి వివరాలు, వాటి పని తీరు, న్యాయస్థానాల్లో వివక్షతా ధోరణులు – న్యాయవాదుల ప్రతిస్పందన
– స్త్రీల కోసం స్వయం ఉపాధి అవకాశాలు – వాటి వివరాలు (వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ప్రణాళికల వివరాలు)
– విద్యా, ఉద్యోగ రంగాలలో స్త్రీలకున్న రిజర్వేషన్ సౌకర్యాలు
– స్త్రీల ఆరోగ్య సమస్యలు – వైద్య వ్యవస్థ గురించి అవగాహన
– జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్త్రీల ఉద్యమాలు, సంస్థల రిపోర్టులు
– పుస్తక సమీక్షలు
– వార్తా సంకలనాలు, సంబంధిత సమావేశాల రిపోర్టులు
– ఛాయా చిత్రాలతో కూడిన వార్తా నివేదికలు
ఈ పదిహేనేళ్ల కాలంలో మేము ఎన్నో ప్రత్యేక సంచికలు తీసుకొచ్చాం. వ్యవసాయ సంక్షోభం, ప్రపంచీకరణ పరిణామాలు, దళిత స్త్రీ సమస్య, చేనేత సంక్షోభం, పిల్లల ప్రత్యేకం, స్త్రీల రాజకీయ భాగస్వామ్యం, తెలంగాణ, రచయిత్రుల ప్రత్యేక సంచిక, స్త్రీలు-మానసికారోగ్యం, హెచ్ఐవి/ ఎయిడ్స్ ఇలా ఎన్నో అంశాల మీద ప్రత్యేక సంచికలొచ్చాయి. పదేళ్ళు నిండిన సందర్భంగా దశాబ్ది ప్రత్యేక సంచిక వెలువరించాం. ఈ సంచికలన్నీ పాఠకుల అభిమానాన్ని పొందాయి.
మొదట్లో `భూమిక’ సమిష్టి కృషిగానే వెలువడినప్పటికీ, వివిధ కారణాలవల్ల ఆనాటి సభ్యులంతా వేరే పనుల్లోకి మళ్ళిపోయారు. `భూమిక’లో పూర్తి కాలం పనిచేయడానికి నేను నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాను. భూమికలో పనిచేసే వారంతా స్త్రీలే కావడం విశేషం. అంతేకాదు ఈ పనంతా స్వచ్ఛందమే. ఎలాంటి జీతభత్యాలు లేవు. స్త్రీల కోసం ఒక ప్రత్యామ్నాయ, సీరియస్ పత్రిక నడపాలన్న తపనతోనే, ఎన్ని సవాళ్ళెదురైనా తట్టుకుని ముందుకు వెళుతున్నాను. ప్రత్యామ్నాయ పత్రిక నడపటం కత్తి మీద సాములాంటిది. నిత్యం ఈ సంఘర్షణ నెదుర్కుంటూనే భూమికను మరింత సమగ్రంగా రూపొందించి ఎక్కువ మంది పాఠకుల్లోకి తీసుకెళ్ళాలన్నది నా ముఖ్య ఆశయం.
– కొండవీటి సత్యవతి
కులం, మతం, వర్గం వంటి సరిహద్దులు లేకుండా స్త్రీలు తమ జీవితాల్లోని సంఘర్షణలనూ, అనుభవాలను పంచుకోవటానికి అవకాశం కల్పించటం
పత్రిక బాగుంది.
జనవరి పత్రిక లింకులొ లేదు.
గమనించండి
తెలుగు వాళ్ళకు ఇంకా నెట్టు చూడ్డం అలవడలెదు.
అప్టు డెటు సిస్టం వాడ్డం లెదు.
పిడిఎఫ అవసరం చూడండి.
Pingback: కొండవీటి సత్యవతి
భూమిక పత్రిక చాల భాగున్నది…
చాలా బాగుందండీ.
కంగ్రాచులేషునులు.
మీరు తెలుగు భాష కు చేస్తున్న సేవకు నా హ్రుదయపూర్వక అభివందనములు, మీ శ్రమకు తగ్గ ఫలితం అందాలని కోరుతున్న మీ అభిమాని
హెల్లౌ
ఇఅమ సందీప ఇఅమ హ్అప్ప్య ఇగొత అ నెవస
కొంద వతి సత్య వతి గార్కి నమస్కరములు తెలుగు లొ అందులొను నెత లొ భూమిక పత్రిక దిగ్విజయము గ స్రీ ల కొసము నదుపుతున్న మీ క్రుషి అబినందనీయము.నెను ఈరొజె భూమిక పత్రిక గుర్చి తెలుసుకొన్నను తెలిసి ఆచర్య పొయాను ఎమీన మీరు అభినందనీయులు
చాలా బాగుంది పత్రిక. తెలుగులొ వ్రాసె ఫెసిలిటీ బాగుంది. నా వెబ్ చూస్తారా?
http://www.vuhalapallaki.com
తాతారావు
15 వసంతాల పత్రిక కు మనస్పూగర్తిగా అభినందనలు.
ప్రక్షాళిని
15 వసంతాల పత్రిక కు మనస్పూర్తిగా అభినందనలు.
ప్రక్షాళిని
ఆహ! తెలుగు లో ఇంత మంచి బ్లాగు ఉందంటె భలే ఉంది! 15 వ పుట్టిన రోజ శుభాభివందనములు.
సత్యవతి గారికి నమస్త్కరములు,ఈ రొజె మీ పత్రిక గురించి తెలుసుకున్నను.మీకు నా హ్రుదయపుర్వక అభినందనలు.
మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.
భూమిక లాతి పత్రిక ఇంతవరకూ రాలెదు.సత్యవతి గారికి అభినందనలు.
అన్నపూర్న
మిన్నిసొత[అమెరికా]
ఈ మహిలో సామజికంగ నెలకొన్న అస్త వ్యస్తతకు ఎన్నో కారణాలు1
మీ “భూమిక”,మీ ఎన లేని కృషికి నిలువుటద్దం.మనమింకా చేర వలసిన సుదూర గమ్యాలకు,దారిని చూపిస్తూన్న బావుటా.
సత్య వతి గారికి,
కన్నీటి అభివందనములు. మీ క్రుషి అభినందనీయము. స్త్రీ జాతి మీకు రుణపడి ఉంది.
లలిథ చిట్టీ.
కువైటు.
మీ పత్రిక బాగు0ది .
సత్యవతి గారికి
శుభాబి వందనములు. వ్యాసాలు అద్బుతము. పాటకులకు మీరు అందిస్తున్న లెటెస్టు టాపిక్సు చాలా అదృస్టముగా భా విస్తున్నాము
వందనములతొ
నాగేశ్వ్ ర రావు గుళ్ళ పల్లి
చాలా బాగుంది.
చాలా బాగుంది… నెట్ లొ భూమికని అందిస్తున్నందుకు, నాలాగా పరదేశంలొ ఉన్నవారికి చదివే అవకాశము కల్పించినందుకు ధన్యవాదములు.
భూమిక వంటి స్త్రీవాద పత్రికల కృషి మెచ్చుకోతగ్గది.వందలకొద్ది సంవత్సరాలనుండి పేరుకు పోయిన పురుషాధిక్యత తగ్గి స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించుటకు కృషిచేయవలసిన అవుసరం యింకాయెంతైనా వుంది.
జాబాలిముని
ధన్యవాదాలు.
08680_275125
ఎడిటరు గారికి నమస్కారములు,
2008 ఎప్రిలులొ విద్యార0గ0లొ మార్పుల గురి0చి నెను రాసిన వ్యాసాన్ని ప్రచురి0చిన0దుకు గాను నెను మీకు ఎంతగానొ రునపడి ఉన్నాను.
08680_275125
పాటకులందరికి అభిన0దనలు.
చాలా బాగున్నది
దెందుకూరి జితేంద్ర రావు
మీ ప్రయత్నానికి అభినందనలు
ఎడిటర్ గారికి,
ఆంగ్ల భాషా వ్యామొహమె మన దెశంలొని అన్ని సమస్యలకు కారణమని నా అభిప్రాయం.
మాత్రుభాషలొ విద్యాబొధన గురించి చర్చ కార్యక్రమం నిర్వహించాల్సింగా కొరుతున్నాను.
పాటకులకు,
మీ అభిప్రాయం ఏదయినప్పటికి నాకు తెలియజేయాల్సిందిగా కొరుతున్నాను. నం: 99660-95258
భూమిక చాలా బాగున్నది. వ్యాసాలు, కథలు చదువుతుంటే చాలా బాగున్నాయి.
భూమిక ప్రతి పత్రిక చూస్తాను ఎక్క్ద వున్నా…..మంచి అర్తస్క్క్ల,కథలు వ్స్తున్నాయి…. బాగుతుంది……
యు..ఎసె.ఎ.
ఈ భూమిక పత్రిక జపాన్ యొక్క స్థితిని ప్రజలకు తెలియజెయాలని కోరుతున్నాను.వాళ్ళకి మన సహాయం లబించాలి అని అందరికి కోరుకుంటున్నాను.
తెలుగులొవస్తున్నపత్రిక భూమిక చాలా బాగుంది, నెను ఇంతవరకు చూదలెదు. ఈ పత్రిక స్త్ర్రి వాద పత్రిక ఐన చూదముచ్హతగా ఉంది.
లాభాపేక్ష లేకుండా నడుపుతున్న స్త్రీవాద పత్రిక అయిన భూమిక క్షణ క్షణాభివృద్ధి చెందాలని ఆశిస్తూ…
భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి
తెలుగువారందరము తెలుగులోనే మాట్లాడుదాము
తెలుగులోనే వ్రాద్దాము.దేశ భాషలందు తెలుగు లెస్స!
“A WINNER NEVER QUITS AND A QUITTER NEVER WINS”
మీ సేవకు క్రుతగ్నతలు