ఇది నేను ఆశించని గౌరవం. బండి నారాయణస్వామిగారి కథల అభిమానిగా ఈ కృతి విడుదల మహోత్సవంలో పాల్గొంటానని చెప్పాను. అయితే ప్రచురణకర్తలు, సన్మిత్రులు వాసిరెడ్డి నవీన్‌గారు నన్ను ముఖ్య అతిథిగా ఉండాలని కోరారు. ఇది నాకు లభించిన అపురూపమైన గౌరవంగా భావిస్తున్నాను.
బండి నారాయణస్వామి రాయలసీమకు చెందిన గొప్ప కథకులు. నాలాగే ఆయన కూడా పాఠశాల ఉపాధ్యాయులుగా పని చేసినవారు. ఒక్కమాటలో చెప్పవలసి వస్తే ఉపాధ్యాయులు, ఉపన్యాసకుల వల్ల ప్రాంతీయ భాషలు మరియు వాటికి సంబంధించిన సాహిత్యం సమగ్రమైన అభివృద్ధిని చూస్తాయి. ఆయనలా నేను కూడా ఆంధ్రలోని ఒకటి రెండు గ్రామాల్లోని పాఠశాలలో ముప్ఫయి అయిదేళ్ళు ఉపాధ్యాయుడిగాసే చేసి నివృత్తుడయ్యాను. ఇది నా పాలిట గర్వించే విషయం. అత్యధిక శాతం గొప్ప రచయితలు విద్యారంగంలో సేవలు అందించిన వారు, సేవలు అందిస్తున్నవారు. అందువల్ల భాషను ఉపయోగించేటటువంటి వారిని కలిగినటువంటి సమాజం
ఉపాధ్యాయులను, ఉపాన్యాసకులను మరవకూడదు.
అన్నట్టు మరొక విషయం –
అదేమిటంటే ప్రపంచంలో అనేక మంది సాహితీవేత్తలున్నారు. వారిలో రెండు రకాల వర్గాలున్నాయి. పాలక వ్యతిరేక సాహితీపరులు మరియు పాలకపక్ష సాహితీపరులు అని.
ఏ రచయిత కార్ల్‌మార్క్స్, చెగువేరా, లోహియా మరియితర వామపక్ష భావజాలాన్ని జీర్ణించుకుని ఉంటాడో-
ఏ రచయిత నిరంతరం రైతుల మధ్యన, కార్మికుల, పీడితుల మధ్యన ఉంటాడో-
ఎవరైతే ఈ నేల యొక్క కష్టకార్పణ్యాల గురించి రాస్తాడో-
ఎవరైతే పాలక శక్తులను ప్రశ్నిస్తాడో-
ఎవరు ప్రభుత్వం ఇచ్చే టి.ఏ., డి.ఏ. మరితర సంభావన, గౌరవ ధనం కోసం ఆశపడడో-
ఒక్క మాటలో చెప్పవలసి వస్తే ఎవరైతే సుఖంగా ఉండరో, ఎవరు పూర్ణాయుష్కులు కారో- అతడు పాలక వ్యతిరేక సాహితీపరుడు!
కొండలు పగిలేసినాం
బండలను పిండినామ్
మా నెత్తురు కంకరుగా
ప్రాజెక్టులు కట్టినాం!
అని చెరబండ రాజు పాడకపోయుంటే-
ఆయన బ్రెయిన్ ట్యూమర్ జబ్బుకు గురయ్యేవారు కాదు. చావకూడని వయసులో చనిపోయేవారు కాదు.
రామాయణాన్ని కల్పవృక్షమని పిలిచిన విశ్వనాథ సత్యనారాయణ సుఖంగా ఉన్నారు.
అయితే అదే రామాయణాన్ని విషవృక్షం అని పిలిచిన ముప్పాల రంగనాయకమ్మ జీవితం పొడవునా ఇబ్బందులను అనుభవించారు.
జనరంజక నవలలను రాసి లక్షలాది సొమ్మును సంపాదించిన యద్దనపూడి సులోచనారాణి, కౌశల్యాదేవి, యండమూరి వీరేంద్రనాథ్‌లాంటి రచయితలకూ; బి.ఎస్. రాములు, కాలువ మల్లయ్య, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, పాలగుమ్మి పద్మరాజువంటి రచయితలకూ, ఆంధ్రప్రదేశ్‌లో – అందులోనూ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని మధురాంతకం రాజారాం, ఆయన పిల్లలు, సింగమనేని నారాయణ, శాంతి నారాయణ, దేవపుత్ర అదే విధంగా ఈ గ్రంథావిష్కరణ సమారంభ హీరో మా సన్మిత్రులు బండి నారాయణస్వామి లాంటి సాహితీ వేత్తల వ్యక్తిత్వాలకూ, రచనలకూ మరియు ఇతరుల రచనలకూ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి, సూక్ష్మంగా గమనిస్తే ఎవరు పాలకవ్యతిరేక సాహితీవేత్తలో? ఎవరు పాలకపక్ష సాహితీవేత్తలో? అర్థమవుతుంది.
ఒకసారి ఆ నాటి కాలంలో అత్యధిక పారితోషికం తీసుకునే రచయిత జాక్ లండన్ ఒక అక్షరానికి ఇన్ని డాలర్లు అని పారితోషకం నిర్ణయించి తన కథలను పత్రికలకు పంపేవాడు. ప్రజాభీమానాన్ని పొందిన అతడి ఒక నాటక ప్రదర్శనకు లెనిన్ వెళ్ళి కేవలం అరగంటలో నిరాశ చెందాడు.
పత్రికా విలేఖరులు అడగటంతో లెనిన్- ”జాక్ లండన్ బూర్జువా రచయిత. అతనికి ధనికుడు ముఖ్యడయ్యాడే తప్ప అతడి సేవకుడి శ్రమ ముఖ్యం కాలేదు” అని ప్రశ్నించాడు.
అంటే రచయిత సమాజంలో ఎవరి పరంగా ఉండి రాస్తాడన్నది ముఖ్యం !
సర్వేజనా సుఖినోభవంతు అన్నది నాన్‌సెన్స్ !
తన రాజ్యమైన రోమ్ మంటల్లో తగలబడిపోతున్నప్పుడు దాని చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తూ రచయిత అయినవాడు కాలక్షేపం చేయకూడదు. నిప్పు పెట్టినవారు ఎవరు? దాన్ని ఏ కారణంగా నిప్పు పెట్టారు? వాళ్ళ జాడ పసికట్టి ఎలా శిక్షించాలని ఆలోచించాలి.
మరొక ఉదాహరణ అంటే ఆ కాలంలో గ్రీకులలో ప్లేటో, అరిస్టాటిల్ మరితర తత్వ్తజ్ఞానులు, చింతనా పరులు తమను పాలించే ప్రభువు అలెగ్జాండర్ ఆస్థానంలో సుఖంగా ఉన్నారు. అయితే వారందరి కన్నా చురుకైన తత్వ్తజ్ఞాని బహుముఖ ప్రతిభావంతుడైన హెరాడాటన్ మాత్రం చక్రవర్తి రాజప్రసాదాన్ని దూరంగా ఉంచాడు. అతడు అలెగ్జాండర్ ఆశలు, లోభాలు తుచ్ఛమని భావించాడు. చివరికి అలెగ్జాండర్ స్వయంగా అతడిని వెదక్కుంటూ వీధుల్లోకి వచ్చాడు.
ఆ తత్వ్తజ్ఞాని దారి మధ్యలో అస్తమిస్తున్న సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఉండటం చూసి చక్రవర్తికి ఆశ్యర్యం వేసింది. వెళ్ళి అతడి ఎదుట నిలబడి-
”నేను అలాగ్జాండర్‌ను. నీ కోరిక తీర్చడానికి వచ్చాను. ఏం కావాలో అడుగు” అని అన్నాడు.
దానికి తత్వ్తజ్ఞాని -”కావచ్చు. అయితే నువ్వు ఎదురుగా నిలబడి అస్తమిస్తున్న సూర్యకిరణాలకు అడ్డుతగులుతున్నావు. ఇది సరైంది కాదు. దయచేసి పక్కకు జరిగితే అంతే చాలు.” అని అంటాడు.
ఈ దేశంలోని దాసులు, సూఫిలు, వచనకారులు, అంతే కాకుండా నిరక్షరాస్యులైన జానపద కవులు పాలించే వ్యవస్థలను ధిక్కరించారు.
బ్రహ్మానందరెడ్డిగారు ఇవ్వాలనుకున్న రాష్ట్రకవి పురస్కారాన్ని స్వీకరించకుండా, ఆ కాలంలో దిగంబర కవులు, విప్లవ రచయితల సంఘ సభ్యులు శ్రీశ్రీ మీద ఒత్తిడి మోపారు. అంతే కాకుండా ఆ మహాప్రస్థానం కవిని కిడ్నాప్ చేశారు.
ఈ మధ్యనైతే వామపక్ష వాద రచయితలకు సామాజిక బాధ్యత పెరిగింది.
గతంలో కన్నా వర్తమాన సందర్భం చాలా సున్నితంగా ఉంది.
మితవాదపక్షపు శక్తులు పాలానా చుక్కానిని పట్టుకున్నాయి.
ఈ దేశం బహుళత్వానికి, వైవిధ్యతకు, మతసామరస్యానికి హాని కలిగే పని జరుగుతోంది.
ఈ దేశంలోని అల్ప సంఖ్యాకులు భయానికి లోనయ్యారు.
ఈ దేశ రాజ్యాంగమూ, ప్రజాప్రభుత్వ వ్యవస్థలూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి.
మన మితవాద పక్షపు ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే ప్రభుత్వం అనే వ్యవస్థను అమలుపరిచే ప్రయత్నం చేసింది. దీనివల్ల దేశంలోని స్థానిక భాషలు, స్థానిక సంస్కృతులు, స్థానిక నాగరికతలు అవసానం చెందే భయంలో ఉన్నాయి. ఇందుకు అవకాశం కల్పిస్తే ప్రాంతీయ వ్యవస్థ ఉండదు. దాని స్థానంలో సర్వాధికారాలు విజృంభిస్తాయి. ఆ కారణంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని బలపరుచుకోవడం ముఖ్యం. అందువల్ల సాహితీపరుడైనవాడు ఫ్యాసిజం శక్తులకు వ్యతిరేకంగా తన లాన్ని ఝుళిపించాల్సిన అవసరం ఉంది.
అందువల్లనే మన బండి నారాయణస్వామిగారు తమ ఈ కొత్త నవల శప్తభూమిలో ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా గొంతెత్తారు. రాజ వ్యవస్థకన్నా రాజ్యంలోని సామాజిక వ్యవస్థ యొక్క లోపలి విన్యాసాన్ని ధ్వంసం చేసి పునర్నిర్మించే కార్యాన్ని చేశారు. ఇది ఒక విధంగా సారస్వతలోకంలో వినూత్న ప్రయత్నమని చెప్పవచ్చు.
ఇప్పుడు ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ అనే కృతి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మా కళ్ళ ముందున్నది నిజమైన చరిత్ర కాదు. రచయిత అన్నవాడు బ్లేక్ కవిలా రాజవ్యవస్థకన్నా సామాజిక వ్యవస్థ ముఖ్యమని పరిగణించాలి. మన సమాజంలో అసంఖ్యాకమైన జాతులను అర్థం చేసుకోవాలి. ఆ కార్యం ఈ నవలలో జరిగింది.
ఇదంతా చెప్పడానికి అవకాశం కలగజేసిన బండి నారాయణస్వామిగారికి, అదే విధంగా వాసిరెడ్డి నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ – సెలవ్!