ప్రతిస్పందన

డా. సమతారోష్ని సత్యవతిగార్లకు

మీరు జూన్ సంచికలో రవాణాశాఖమంత్రిగారికి రాసిన ఉత్తరం చదివాను. అందులో రాసిన విషయం మంత్రి గారికిగాని ఆర్టిసి వారికి గాని అతి మాములు విషయం. వారినించి ఏలాంటి సమాధానం రాదు. ఒక వేళ వచ్చినా ఆ డిపో మేనేజరుకు ఎంక్వయిరీ చేయమని వస్తుంది. డిపో మేనేజర్ ఆ రోజు బస్సులో ఉన్న కండక్టరును విచారిస్తారు. కండక్టరు అలాంటిది ఏమి జరగలేదని అంటారు. అప్పుడు మీకు ఒక ఉత్తరం వస్తుంది. మీ వద్ద ఏమైనా సాక్ష్యాలుగాని ఆధారాలుగాని ఉన్నాయా? అని. మీ వద్ద అలాంటివి ఏమి లేవు. మీరు అప్పుడు ఒక నలుగురు ప్రయాణికులు సాక్ష్యాలు తీసుకోవలసింది. మనం ముక్కు సూటీగా పోయే వాళ్ళం కాబట్టి అటువంటి ఆలోచన రావు. మనం నిజం చెప్తున్నాము కదా అనే ధ్యేయంతో ఉంటాం. అటువంటి ఆలోచనలు మన ప్రజాజీవనంలో చెల్లవు.

డిపోల నించి బయటు దేరిన స్త్రీలకు మాత్రమే రిజర్వేషన్లు చెల్లుతాయి అనే రూలు లేదు. స్త్రీలు ఎక్కడైనా ఎక్కవచ్చు. మీకు కండక్టరు చెప్పిన సమాధానం కేవలం ఆ సీట్లలో కూచున్న మగవారిని సమర్దించటానికే.

ఇక వాస్తవాలకి వద్దాం. మన దేశంలో ఏ రూలు పాటిస్తున్నారు గనుక. ఈ రూలు పాటించటానిక.ి రెండో విషయం కండక్టర్లు దౌర్జన్యానికి భయపడ్తారు. ఒక వేళ కండక్టరు వాళ్ళని లేవగొట్టి మీకు సీటు ఇప్పించినా, బస్సు పికెటు చేరే వరకు గాని, పికెటు చేరిన తరువాతగాని అతనికి దేహశుద్ది తప్పదు. అందుకని రోజూ అదే రూటులో ప్రయాణం చేయాలి కాబట్టి కండక్టర్లు ఆ రూట్లో తిరిగే రౌడీలతో కయ్యానికి దిగరు. అయితే మీరు కూడా స్టేటస్ ఉన్న వారు అయితే ఒక ఎంఎల్ఏ గారి తాలుకో, పోలీసు అధికారుల తాలుకో అయితే మిమ్మల్ని సపోర్టు చేస్తాడు. ఎందుకంటే తరువాత ఏదైనా జరగకూడనది జరిగితే సాయపడ్తారని. నా అనుభవంతో ఒక విషయం చెప్తాను. సిటీలోనే అటువంటిది జరిగింది. ఆడవాళ్ళ సీట్లలోంచి లేవగొట్టబడ్డవాళ్ళు బస్సు దిగిపోయేటప్పుడు కండక్టరుకి దేహశుద్ది చేసి పారిపోయారు. కండక్టరు బస్సుని పోలీసు స్టేషనుకి తీసుకెళ్ళి కంప్లయింట్ ఇచ్చారు. ఒక్కడంటే ఒక్కడు “నిజమే” అని సాక్ష్యం చెప్పలేదు. డ్రయివర్ తప్ప. పోలీసువాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు. కాబట్టి మీరు ఈ విషయంలో ఎలాంటి జవాబు ఆశించడం దండగ. ఇకపోతే కండక్టర్లకి ఒక సర్కులర్ ఇస్తారు. ఆడవాళ్ళ సీట్లో మగవాళ్లు కూచ్చుంటే త”క్షణం చర్య తీసుకోవాలి. దౌర్జన్యం చేస్తే పోలీసు సాయం తీసుకోవాలని.. ఇలాంటి సర్కులర్లు రోజు కోటి వస్తూ ఉంటాయి. ఇక దీనికి పరిష్కారం. సీటు ఖాళీగా ఉంటే కూచోవటం. కూచున్నవాడు మర్యాదస్తుడైతే లేచి సీటు ఇస్తాడు. లేక పోతే లేదు. అసలు లోపం ప్రయాణీకులలో ఉంది. నలభై మంది ప్రయాణీకులు, అక్రమంగా ఆడవాళ్ళ సీటు ఆక్రమించిన ఇద్దరికి వ్యతిరేకంగా నిలబడరు. మన కెందుకు లే అనే తత్వం మనలో బాగా ఉంది.

ఇక మీరు జెండర్ సెన్సెటైజేషన్ ప్రోగ్రామ్ అన్నారు. అదేమిటి? కళ్ళకెదురుగా జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించలేనిది ఈ ప్రోగ్రామ్లు చేయకలుగుతాయా?

ఇక బస్సులో రాసిన రాతను బట్టి అర్ధం చేసుకోవచ్చు. అది కేవలం రౌడీల కొరకు రాసిన స్లోగన్. వాళ్ళ దయ ఉంటే స్త్రీలు తమ సీట్లలో కూర్చోవచ్చు లేకపోతే లేదు. దాని బయట “స్త్రీల సీట్లలో కూర్చున్న మగవారికి అయిదేళ్ళు జైలు వెయ్యి రూపాయలు జుర్మానా” అని రాయమనండి. తరువాత ఆకస్మిక తనిఖీ చేసి కేసులు బుక్ చేయమనండి. ఇదంతా విష్ ఫుల్ ధింకింగు తప్ప జరిగే పని కాదు.

చివరగా మీకు చెప్పేది ఏమంటే ఈ విషయంలో ఆర్టిసి గాని మంత్రి గారు గాని ఏ చర్య తీసుకోరు. ఇదొక ఆఫ్టరాల్” కేసు.

– కె. రామారావు, హైద్రాబాద్

జనారణ్యంలో ఓ తల్లికి అవమానం

ఏయ్ పక్కకు జరగవే.. కొంచెం మంచిగ మాట్లాడండి..ఎయ్ లెయ్యవే…ఎందుకు లేవాలి. ఇది నేను రిజర్వు చేసుకున్న బెర్తు.. ఒసేయ్ లంజదాన, నిన్ను కోస్తా.. జరగమంటే జరగవేందే…నీ అమ్మను… దెం… ఈ పదాలు ఎక్కడో అనాగారికులో లేదా పిల్లలు గోళీలు ఆడుకుంటూ మాట్లాడుకొన్నవో కాదు. అన్నదమ్ముల ఆస్థి దగాదాల్లో వచ్చిన వైరంకు పోట్లాడుకున్నది అసలే కాదు, మరి ఎక్కడ జరిగిందో…ఎందుకో జరిగిందో ఊహించడం కొంత ఇబ్బందికరమే మరి…

ఇదొక యదార్ధ ఘటన దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతమిది. సగటున ప్రతి మూడు నిమిసాలకొక రైలు వచ్చి పోవడం జరుగుతుంది. లక్షలాది ప్రజలు, దేశ విదేశాల నుండి, పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు వృద్ధులతో పాటు, ప్రజా ప్రతినిధులు, సంఘసంస్కర్తలు, విద్యావేత్తలు, దొంగలు, రౌడీలు, పోలీసులు, రైల్వే సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు రక్షణ కల్పించడం కోసం గస్తీ తిరుగుతుంటాయి. ఇటువంటి ప్రదేేశంలో ఈ సంఘటన జరగడం యావత్తు ప్రజానీకం తలదించుకోవాలి. ఏనాడో భారతంలో విన్నాం దుర్యోధనుడు ద్రౌపది చీర లాగుతుంటే శ్రీ కృష్ణుడు ఆమెకు చీర ఇచ్చి మానాన్ని కాపాడిండని. ఇక్కడ శ్రీ కృష్ణుడు ఎవరు కలగ జేసుకోకపోగా, అవమానానికి గురయిన ఆ తల్లినే నిందించడం బాధాకరం.

అది 5 మే, 2007 వ తేది సికింద్రాబాద్ నుండి గూడురు వరకు వెళ్లే సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బోగీ నెంబరు 4లో జరిగింది. సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారం నెం. 1 మీద ఆగి వున్న రైలులో రాత్రి 9 గం.ల నుండి, 9.30 గం. వరకు జరిగిన ఘటన ఇది. సికింద్రాబాద్లో ఇద్దరు చిన్నపిల్లలతో 35 సం. వయస్సుగల ఒక యువతి రైలులో తన సీట్లో కూర్చొని ఉంది. ప్రయాణీకులందరు ఎవరు బెర్తులు వారు చూసుకుంటున్నారు. అది రిజర్వుడు బోగీ, అంటే రిజర్వేషన్ లేని వాళ్లు ఆ బోగిలో ప్రవేశించడం నేరం. జరిమానా చెల్లించాలి. ఎవరో మరొక ప్రయాణికుడు తన వెంట ఒక స్త్రీని తీసుకొచ్చి రైలు ఎక్కించాడు. అతనికి రిజర్వేషన్ లేదు. అతను ప్రయాణికుడు కూడా కాదు. అతని వయస్సు 38-40 సంవత్సరాలు ఉండవచ్చు. ఆమెతో వివాదంకు దిగాడు. ఏయ్ అటు జరుగు, కొంచెం మంచిగా మాట్లాడండి. ఏయ్ లెయ్యవే..నీవు ఆడదానవైతే నాకేం.. ఇంకొకదానవైతే నాకేమే లెయ్యే.. అయ్యో..ఎందుకిలా మాట్లాడతారు నీకు అక్క చెల్లెళ్లు లేరా? ఇంకా ఎదురు మాట్లాడతావేందే లంజదానా…..లో కారం పోసి కొడతా.. రెండు చేతులతో పట్టుకుని కడుపులో తన్నాడు. ఆమె పిల్లలకు ఏమీ తోచక ఏడుస్తున్నారు. తనతో వచ్చిన మహిళ కొంత ధైర్యం చేసి మాట్లాడింది. ఎందుకయ్యా అలా చేస్తావు మహిళ అని కూడా చూడకుండ.. ఒసేయ్ నువ్వు రావే… నేనెవర్నరుకున్నావే.. పోలీస్ ఆఫీసర్నని బెదిరించసాగాడు. ఈ సంఘటనంతా జరుగుతున్నది ఏదో ముసుగులో కాదు, పోలీసులు, గార్డులు అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా నోరు మెదప లేదు. అటు వైపు నుండి వస్తున్న గ్యాంగుమెన్ ఒకరు కలగజేసుకుని పోలీసులని పిలిచారు. పోలీసులు వచ్చి ఏం జరిగింది…ఏం జరిగింది అని ప్రశ్నించారు. అవమానం జరిగిన తల్లి లేచి ఇదిగో అతను నన్ను తిట్టాడు, దుర్భాషలాడాడు. అవమానకరంగా మాట్లాడాడు, నా రొమ్ములు పట్టుకుని నన్ను తన్నాడు… అని ఫిర్యాడు చేసింది. ఆ.. నువ్వు కూర్చోమ్మ అని.. ఆమెను తిట్టి రభస చేసిన వాడి చేతులు పట్టుకుని నవ్వుకుంటూ రైలు దిగి కిందకు వెళ్లి చేతులు ఊపుతూ గట్టి గట్టిగా నవ్వుకుంటూనే ఉన్నారు.

ఎంతో మంది జనం మధ్యలో జరిగిన క్రూరమైన సంఘటనలపైన అక్కడి జనం మాట్లాడనూ లేదు.. కలగ చేసుకోనూలేదు. ఈ జనారణ్యంలోనే ఇటువంటి ఘోరమైన సంఘటనలు చోటు చేసుకుంటే…స్త్రీలు ఒంటరిగా నిర్భయంగా తిరిగే రోజులు వస్తాయా…? ప్రతి కుటుంబంలో స్త్రీలు, పురుషులు ఉంటారు. రైలు బోగీలో కూడా అందరూ ఉన్నారు.. ఇటువంటి అవమానాలెంతకాలం భరిస్తాం. ఎదురు తిరిగి ఎదుటోడి గుండెల్లో గుణపం పొడిచి నట్టుండాలి. సభ్యసమాజంలో ఇటువంటి సంఘటన లెదురించే శక్తులు ఎక్కడిక్కడ పుట్టుకు రావాల్సిన అవసరం ఉందని భావిస్తూ…
(మేము బెర్తుల కోసం వెతుక్కుంటూ అటుఇటూ తిరుగుతున్నపుడు ఈ సంఘటన జరిగింది. నేనెందుకు ఆమెకు అండగా నిలవలేకపోయానా అనే బాధ నన్నిప్పటికీ పిండేస్తోంది)
– పి. సురేష్, చీరాల

మీ సంపాదకీయం మీద నా స్పందన

సునీత అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళగా సంతోషించినా ఆవిడ ప్రయోగాల వెనుక అమెరికా అంతరిక్ష ఆయుధ పోటీ ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయం మీద గర్వంచతగ్గ, ఆనందించతగ్గ పని సునీత చేయలేదనే నా అభిప్రాయం. మానవ జాతికి ప్రమాదకరమైన ప్రయోగాలు ఆడవారు చేసినా ప్రమాదమే. కాబట్టి ప్రయోగాల అసలు ఉద్దేశ్యం వ్రాయటం మర్చిపోయి చేసినది స్త్రీయా లేక పురుషుడా అని గర్వించడం సముచితం కాదు అని మనవి.
– ఆనంద్,ఇమెయిల్

నాంపల్లి సుజాత రాసిన ‘అమానుషం’ కవిత చదివి ఇది రాస్తున్నాను.
శ్రీ కనక లింగేశ్వర శర్మగారు మహా పండితులు. అటువంటి మనిషికి అటువంటి మరణం అనూహ్యం అసమంజసం. చిత్రగుప్తుల వారి పనితనం మీదనే నాకు సందేహం కలుగుతున్నది. వారి కుటుంబానికి ఇదే నా ప్రగాడ సానుభూతి.
– కందర్ప కృష్ణమోహన్ ఇమెయిల్

‘దానికేం కోరికలుంటాయమ్మా’ అనే కవిత చదివి ఈ ఉత్తరం రాస్తున్నాను. అద్భుతమైన కవిత. అమ్మాయిల మనసు పడే ఆవేదనని అద్భుతంగా ఈ కవితలో చెప్పారు.
– స్వప్న, ఇమెయిల్

Share
This entry was posted in ఎడిటర్‌కి లేఖలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.