రాజ్యాంగ నైతికతతో గౌరవ ప్రదంగా జీవించే హక్కు

కల్పనా కన్నభిరాన్‌
అనువాదం : వేపలపర్తి సుభాషిణి

”రాజ్యాంగ నైతికత సహజసిద్ధమైన భావన కాదు. దానిని పెంపొందించాలి.. దాని గురించి మన ప్రజలు యింకా నేర్వాల్సింది ఉందని మనం తప్పక గుర్తించాలి” – బి. ఆర్‌. అంబేద్కర్‌ను ఉటంకిస్తూ నాజ్‌ ఫౌండేషన్‌ తీర్పు పేరా 79 తెలుపుతుంది.
భిన్నత్వం, అనేకానేక వాదాలున్న భారతదేశ న్యాయశాస్త్ర విజ్ఞానంలో ఇటీవల నాజ్‌ ఫౌండేషన్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఎన్‌సిటి ఆఫ్‌ ఢిల్లీ అండ్‌ అదర్స్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం యిచ్చిన తీర్పు మైలురాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో రాజ్యాంగ తత్వానికి సంబంధించిన ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఈ తీర్పు ద్వారా స్వలింగ సంపర్కులైన స్త్రీలు, పురుషులు, స్వలింగ సంపర్కంతో పాటు యితరులతోనూ లైంగిక జీవనం సాగించే వారు. లింగ మార్పిడైన వ్యక్తుల హక్కులను గుర్తించడం మాత్రమే జరగలేదు. వారినే ఎల్‌జిబిటి వ్యక్తులుగా వ్యవహరి స్తున్నాం. ఒక వైపు వివక్ష, అణచివేత, సాంఘిక బహిష్కరణ, స్వేచ్ఛా నిరోధాన్ని మరింతగా అర్ధం చేసుకోవడానికీ, మరొక వైపు స్వాతంత్య్రం, గౌరవానికీ అర్ధం తెలిపేలా ఎల్‌జిబిటి హక్కుల గురించి ఈ తీర్పు వివరిస్తుంది.
లైంగిక భావన మరియు లింగ గుర్తింపుకు సంబంధించి మానవ హక్కుల చట్టాన్ని అన్వయిస్తూ యోగ్యకర్త సూత్రాలను మార్చి 26, 2007 లో ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలకు ప్రాతినిధ్యం వహించిన నిపుణులతో ఈ పత్రం లిఖించబడింది. లైంగిక భావన మరియు లింగ గుర్తింపులతో నిమిత్తం లేకుండా వ్యక్తులందరికీ గౌరవం, రక్షణ, పరిపూర్ణ మానవహక్కులు కల్పించడంలో రాజ్యాల బాధ్యతని ఈ సూత్రాలు సూచిస్తాయి. 18 డిసెంబర్‌ 2008లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు ప్రపంచ వ్యాప్తంగా హాజరైన 66 దేశాలు యోగ్యకర్త సూత్రాల్లోని సారాన్ని పునరామోదిస్తూ ప్రకటన చేశాయి.
అంతర్జాతీయ ప్రయత్నాలతో పాటు భారదేశంలో ఎల్‌జిబిటి హక్కుల ఉద్యమంతో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించ కూడదనే వాదనకు వీలు కల్పించాయి. డా. అంబేద్కర్‌ను ఉటంకిస్తూ భారతదేశంలో స్వలింగ సంపర్కం ప్రజామోదిత నైతికతకు విరుద్ధమనే వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆలోచనా పరమైన మార్పును పేర్కొన్న అంబేద్కర్‌ ఆలోచనలు విస్తృతపరిచేలా ప్రజామోదిత నైతికతకు బదులుగా రాజ్యాంగ నైతికతను న్యాయస్థానం సమర్ధించింది. తీర్పులోని కొంతభాగంలో పేర్కొన్నారిలా: ”భారత రాజ్యాంగం భిన్నత్వాన్ని గుర్తిస్తుంది. రక్షిస్తుంది. గౌరవిస్తుంది. కేవలం వారి లైంగిక భావనల కారణంగా స్వలింగ సంపర్కులను అగౌరవపరచినా లేదా నేరస్తులుగా చూసినా అది రాజ్యాంగ నైతికతకు విరుద్ధం కాగలదు!(పేరా 80)’. దీనికి సంబంధించిన హక్కుల వర్తింపు విషయంలో ప్రత్యేకించీ ఆర్టికల్‌ 15 (2) తో పాటు ఆర్టికల్‌ 15 కు న్యాయస్థానం యిచ్చిన విస్తృత అర్ధాన్ని గుర్తించుకోవాలి: కులం, లింగ, మరే యితర ప్రత్యేకమైన కారణాల వల్ల ఏ పౌరుడూ మరొకరిని బహిరంగ ప్రదేశాలలోకి రానివ్వకుండా అడ్డుకోలేడు (పేరా 104). అందుకు ఉద్దేశించబడిన ఆర్టికల్‌ 15(2) యిప్పటివరకూ అస్పృశ్యత, దళితులకు పరస్పరం అన్నట్లుగా నియంత్రించడంలో రాజ్యాంగ అన్వయం లోని ముఖ్యమైన విధానం వెలుగు చూస్తోంది.
లైంగిక భావన మరియు లింగ గుర్తింపులను అర్ధం చేసుకోవటానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యా చరణను అన్వయిస్తూ తీర్పును మూడు విభాగాలుగా చేద్దాం: (అ) వివక్ష లేకుండుట (ఆ) వ్యక్తిగత హక్కుల పరిరక్షణ (ఇ) లైంగిక భావన మరియు లింగ గుర్తింపులతో నిమిత్తం లేకుండా అందరికీ మానవ హక్కుల రక్షణ కల్పించటం.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 15(1)లో ”సెక్స్‌”కు అర్ధం వివరించడం ఈ తీర్పులోని మరింత ముఖ్యమైన అంశం : ”మతం, జాతి, కుల, లింగ , జన్మస్థలం కారణంగానైనా లేదా వీటిలో ఏ కారణం చేతనైనా రాజ్యం ఏ పౌరుడినీ వివక్షకు గురి చేయకూడదు”. ఈ సందర్భంలో ”సెక్స్‌” అనేది లైంగిక భావనకు సంబంధించినదా లేక లింగపరమైనదా? సెక్స్‌ను లింగపరమైన అంశానికే పరిమితం చేయాలా లేక సాధారణంగా ఉపయోగించే విధంగా లింగపరమైనదీ, లైంగిక భావన రెండింటికీ సంబంధించిన ఆంశంగా పరిగణించాలా? కేస్‌లాను విస్తృతంగా సమీక్షించటం, ప్రపంచంలోని భిన్న ప్రాంతాల నుండి వచ్చిన సూత్రాల ద్వారా వచ్చిన ఈ తీర్పుతో లింగపరమైన మరియు లైంగిక భావన అనేవి ప్రతి మనిషికీ సహజసిద్ధమైనవని విశదమవుతుంది. వాటిని ఒకరి నుండి మరొకరికి బదిలీ చేయలేనివి. మనిషి గుర్తింపుకు వాటిని కలిగి ఉంటాడు. దక్షిణాఫ్రికా న్యాయమూర్తి జస్టిస్‌ సాచ్స్‌ మాటల్లో, రాజ్యాంగం ”ప్రజలు వారి దేహాలలో, వారి సమూహాలలో, వారి సంస్కృతులలో, వారి ప్రదేశాలలో, వారి కాలాలలో జీవిస్తారని” తెలియజేస్తుందం టారు (ది నేషనల్‌ కొయలిషన్‌ ఫర్‌ గే అండ్‌ లెన్బియన్‌ ఈక్వాలిటీ వర్సెస్‌ ది మినిస్టర్‌ ఆఫ్‌ జస్టిస్‌ లో సాచ్స్‌ జె) ఆర్టికల్‌ 15 (1)లో ”సెక్స్‌” ను కొంత వైవిధ్యంగా అర్ధం చేసుకోవడం ద్వారా ప్రతి మనిషిికీ గుర్తింపు ఉంటుంది.: ”లైంగిక భావన అనేది లింగపరమైన భావానికి మూలం. లైంగిక భావన కారణంగా వివక్షకు తావులేదని ఆర్టికల్‌ 15 (పేరా104)”తెలుపుతుంది.
జస్గిస్‌ పి.ఎన్‌. భగవతి జీవి గౌరవంగా జీవించే హక్కు గురించి ప్రాన్సిస్‌ కొరాలీ ముల్లిన్‌ వర్సెస్‌ అడ్మినిస్ట్రేటర్‌, యూనియన్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ అండ్‌ అదర్స్‌ కేసులో ”జీవించే హక్కులో గౌరవంగా జీవించే హక్కు కూడా వుంటుంది. అందులో భాగంగానే జీవనానికి కావలసిన అవసరాలన్నీ ఉంటాయి. స్వేచ్ఛగా తిరగటం, సహ వ్యక్తులతో కలివిడిగా ఉండటం” వంటివన్నీ జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తించిన స్వీయ గౌరవం, స్వయం ప్రతిభ, మానవ సాంఘిక జీవన ‘స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తూ చర్చకు శ్రీకారం జరిగిందంటారు. లైంగిక సంబంధాలలో స్వేచ్ఛ మరింత ముఖ్యం. కాకపోతే ఒక నియమం ఏంటంటే ” లైంగిక విషయాలలో మనం ఎవరికీ హానీ కలిగించకూడదు. దీనిని అతిక్రమించకుంటే అందువల్ల మనస్వేచ్ఛకు ఎలాంటి భంగమూ కలగదు (పారిస్‌ అడల్ట్‌ ధియేటర్‌ 1 వర్సెస్‌ స్టాటన్‌, (413 యుఎస్‌ 49 (1973) పేజీ 63).”
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించి బలవంతంగా వారి ”వెతల నీడల్లో జీవిస్తూ, దోపిడీకి గురవుతూ, అణచివేత, క్రూరత్వానికి బలవుతూ, చట్టం అమలు పరిచే యంత్రాంగం చేతుల్లోనే అగౌరవింపబడటం”తో వారిని ” నైతిక పౌరసత్వం” నుండి దూరం చేస్తాయని తీర్పులో పేర్కొన్నారు (పేరా 52) ఎందుకంటే సెక్షన్‌ 377 వ్యక్తిగత నడతలో పెద్దల అంగీకారాన్ని నేరంగా పేర్కొంటుంది. అది వివక్ష పరిధిలోకి వస్తుందనీ, దానివల్ల”స్వలింగ సంపర్కుల హక్కులు, అభీష్టాలు తీవ్రంగా ప్రభావితమవుతాయనీ, వారి గౌరవానికి భంగమనీ” న్యాయస్థానం పేర్కొంది (పేరా93). అది ”నిస్పాక్షికత కాదు. అకారణమైనది. అందువల్ల భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 14ను అతిక్రమిస్తుంది. (పేరా 98).”
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించటంతో మానవ మానవ హక్కుల విషయంలో ప్రజల ఆరోగ్య హక్కును దృష్టిిలో ఉంచుకోవాలి. ఈ హక్కుకు రెండు పార్శ్వాలున్నాయి. ఆ రెండు పార్శ్వాలూ ప్రాధమిక హక్కు ఆర్టికల్‌ 21లోని జీవించే హక్కునే ప్రస్తావిస్తాయి. అందులో మొదటిది ఆరోగ్యంగా ఉండే హక్కు. ఈ సందర్భంలో నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనేజేషన్‌ (ఎన్‌ఎసిఓ) కార్యకలాపాలు యిందుకు సంబంధించినవే. చట్టపరమైన సంస్థల వల్ల భయం కారణంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నిరోధక కార్యక్రమాలలో నిజాలు వెలుగు చూడక విపరీత పరిణామాలు పెరుగుతాయి.
ఆరోగ్య హక్కు రెండవ పార్శ్వం మరింత విస్తృతమైనది. ఒకరి ఆరోగ్యం, దేహాన్ని నియంత్రణలో ఉంచుకునే హక్కుతో కూడినది. లైంగిక మరియు పునరుత్పత్తి స్వేచ్ఛ, బలవంతపు వైద్య చికిత్సను వ్యతిరేకించే హక్కు, ఉన్నతమైన ఆరోగ్య స్థాయిని సాధించేందుకు సమాన అవకాశం కల్పించే ఆరోగ్య వ్యవస్థను కలిగి ఉండే హక్కు యిందులో భాగంగా ఉంటాయి. ఎల్‌జిబిటి వ్యక్తుల వైద్య పరీక్షా నిర్ధారణ పత్రాలు వారి లైంగిక భావనను మానసిక దౌర్భల్యంగా/ అపసవ్యమైన మానసిక స్థితిగా తెలుపుతాయి. లైంగిక భావన అనేది మానవ లైంగికతకు వ్యక్తీకరణ – అది స్వలింగ సంపర్కమైనా, స్వలింగ సంపర్కంతో పాటు యితరత్రా సంబంధాలు కలిగి ఉండేవారి మధ్యనైనా, స్త్రీ, పురుషుల మధ్యనైనా ఏదైనా కావచ్చని ప్రపంచ వ్యాపితమైన అభిప్రాయాన్నే ఈ తీర్పులో ముఖ్యంగా పేర్కొన్నారు. ప్రజల నైతికతకు బదులుగా ”రాజ్యంపై ఒత్తిడి” తేవాలని ”అటువంటి వాటిని నేరంగా పరిగణించకుంటే ప్రజల ఆరోగ్యానికి మరింత బలం చేకూరుతుంది. దాంతో వారు గుర్తింపబడి మరింత మెరుగ్గా ఉండగలరు( పేరా 86) ” అని తీర్పులో పేర్కొన్నారు.
సెక్షన్‌ 377 ఎందుకు ఉద్దేశింప బడిందో, దానిని ఎందుకు కొనసాగించాలో వాటి మధ్య సమన్వయం లేకపోవడంతో ”కఠినమైన పరిశీలన” లో అది విఫల మైందని తీర్పులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వలస దేశాలు చేసిన శాసనంలో రాజ్యాంగ విధానానికి సంబంధించిన ఊహకు తావు లేదు. ”రాజ్యాంగ ప్రాధాన్యత”కు సంబంధించి ప్రశ్నలు తలెత్తినపుడు ఎల్‌జిబిటి వ్యక్తుల హక్కులు వంటి విషయంలో న్యాయస్థానాలు వాటి పరిధిలో బాధ్యతను నిర్వర్తిస్తాయి. ఈ కేసు విషయంలో సెక్షన్‌ 377 బాలలపై అత్యాచారాలకు మాత్రమే వర్తిస్తుంది.
సెక్షన్‌ 377 కంటేనూ ( ఈనచ్స్‌) నపుంసకులు, హిజ్రాలను లక్ష్యంగా చేసు కుని ఆంధ్రప్రదేశ్‌ (తెలంగాణ ప్రాంతాలు) ఈ నచ్స్‌ ఆక్ట్‌ తయారు చేయబడిందని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎల్‌జిబిటి హక్కుల ఉద్యమం వచ్చిన క్షణం నుంచీ కాలం చెల్లిన శాసనాలపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తేగలరనీ, అటువంటి చట్టాలు అమలులో ఉన్న చోటు నుంచే వారు పూర్తి స్వేచ్ఛ, గౌరవ ప్రదమైన జీవనం మొదలుపెడతారని ఆశిద్దాం.
(6 జూలై 2009 ది హిందూ లో ప్రచురితమైన వ్యాసానికి తెలుగు అనువాదం) ‘ది హిందూ’ సౌజన్యంతో

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to రాజ్యాంగ నైతికతతో గౌరవ ప్రదంగా జీవించే హక్కు

  1. మంచి విషయాలు విపులంగా అందించారు. ధన్యవాదములు.

  2. ఈ వ్యాసాన్ని నేను స్వలింగ సంపర్కం గురించి వ్రాస్తున్న పుస్తకంలో పొందుపరచాలనుకుంటున్నాను. వ్యాస రచయితలకూ, భూమికకూ పూర్తి క్రెడిట్స్ ఇస్తూ పొందుపరుస్తాను. దానికి మీ అనుమతి కావాలి. మీ నిర్ణయాన్ని తెలియజేయగలరు. నాకు ఈమెయిల్లో తెలిపినా సంతోషమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.