మీడియా ఉంది కానీ కవరేజ్‌ ఏది? సెన్సిటైజేషన్‌ ఏది? -వై.కృష్ణ జ్యోతి

జర్నలిజం అనే కాదు, మహిళల విషయం ఏదైనా సమాజం మొత్తాన్ని భాగస్వామిని చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. పేరుకి ఈ రోజు వర్క్‌షాప్‌లో మీడియా ఉంది, కానీ మీడియా కవరేజ్‌ లేదు! బహుశా అది రాజకీయం కాదనో, అక్కడ సెలబ్రిటీలు లేరనో,

ప్రచురించినా/ప్రసారం చేసినా ఎవరూ చదవరనో/చూడరనో తెలియదు కానీ, జర్నలిస్టుల సమస్యలను (ఆడ, మగ తేడా లేకుండా) ముందుకు తెస్తున్నప్పుడు, వాటిని ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి, తోటి జర్నలిస్టుల దృష్టికి తీసుకెళ్ళడం మీడియా కనీస బాధ్యత!!! ఆఫీసులో మాకు సరైన టాయిలెట్‌ సౌకర్యం లేదుÑ పీరియడ్స్‌ టైంలో చాలా ఇబ్బందిగా ఉంది… ఆ రెండు రోజులు సెలవు పెడితో అదో పెద్ద చర్చ అవుతోంది, ఒంట్లో బాగాలేకపోయినా పని చేయాల్సిందేనా? మా ఆరోగ్యం ముఖ్యం కాదా? అమ్మాయిల్ని ఫీచర్స్‌ లేదా డెస్క్‌లో లేదా యాంకర్లుగానే ఎందుకు తీసుకుంటారు? పాలిటిక్స్‌, బిజినెస్‌, రూరల్‌, జెండర్‌ ఇష్యూస్‌ లాంటి సీరియస్‌ విషయాలు ఎందుకు రాయనివ్వరు? డెస్క్‌లో పనిచేస్తున్న సబ్‌ ఎడిటర్లకి రాత్రిపూట ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయం కల్పించడంలేదు.
పెళ్ళయితే ఇంకా మా ఉద్యోగానికి ఆశ వదులుకోమన్నట్టు మాట్లాడుతున్నారు. గర్భవతిని అని తెలిసినా సరే సౌకర్యాలు
ఉండవు, వెసులుబాటు ఉండదు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఉండే మహిళా జర్నలిస్టులు రోజంతా సరిగా తినకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా పని చేయాల్సి వస్తోంది… ఇది మా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా సమయంలో చాలామందికి ఉద్యోగాలు పోయాయి కానీ, మొదటి వేటు మహిళలపైనే పడిరది. ఇప్పటికీ అలా ఉద్యోగం కోల్పోయిన మహిళలు చాలా మంది నిరుద్యోగులుగానే ఉన్నారు. అందులో నేనూ ఒకదాన్ని. మీడియాలో ఆడవాళ్ళ ప్రాతినిధ్యం కేవలం 14 శాతానికి (మరి కొన్ని చోట్ల అంతకన్నా తక్కువ) పడిపోయింది. పత్రికల్లో మహిళల పేజీ అంటే… కుట్లు, అల్లికలు, అందం, బట్టలు, ఫ్యాషన్‌, కుటుంబం, ఆచారం, వ్యవహారం తప్ప మరింకేదీ కాదు అన్నట్టు ఎందుకు ఉంది? వార్తల్లో ఆడవాళ్ళ రిప్రజెంటేషన్‌ అంటే కేవలం అత్యాచారం, హత్య, ఆత్మహత్య, హింస, వివాహం, వివాహేతర సంబంధం వరకు మాత్రమే ఎందుకు ఉంటోంది? మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో మహిళలు రాసే స్టోరీలకు బైలైన్లు ఎందుకు కరువయ్యాయి? మీడియాలో కూడా, మగవాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చినట్లు మహిళా జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వరు?
ఈ రోజు జరిగిన తెలంగాణా రాష్ట్ర మీడియా అకాడమీ నిర్వహించిన మహిళా జర్నలిస్టుల (మొదటిరోజు) వర్క్‌షాప్‌లో పాల్గొన్న వాళ్ళు ఈ సమస్యలు చెప్పుకొచ్చారు. సమస్యలు ఇవే కాక ఇంకా చాలానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఇలాంటి వర్క్‌షాప్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. తమ సమస్యల గురించి ఒకచోట కూర్చుని, చర్చించుకొని, వాటి పరిష్కారాలు ఏంటో వెతుక్కునే అవకాశం అందరికీ దొరకదు. అందుకే ఈ వర్క్‌ షాప్‌ గురించి చెప్పగానే మంచి ప్రతిస్పందన వచ్చింది. చాలామంది జర్నలిస్టులు సమయం దొరక్క రాలేదు. కొంతమంది డ్యూటీ పిలుస్తోందని పొద్దుటి సెషన్‌కు హాజరై వెళ్ళిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి చర్చా వేదికను ఏర్పాటు చేసిందని తెలిసినపుడు, అందులో పాల్గొనమని మీడియా సంస్థలు తమ సిబ్బందిని ప్రోత్సహిస్తే బాగుండేది. వాళ్ళు పాల్గొనడానికి అనువుగా సెలవిచ్చినా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కనీసం మహిళా జర్నలిస్టులనే ఆ చర్చల సారాంశం తర్వాత రిపోర్ట్‌ చేయమనైనా అడగవచ్చు. అయినా ఇప్పుడు కొత్తగా జాయినైన వారికి సరైన ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌లే నిర్వహించని సంస్థలు ఇవెందుకు ఆలోచిస్తాయి. అందుకే సీనియర్లకు, అవగాహన ఉన్న వాళ్ళకు తప్ప జెండర్‌ సెన్సిటివిటీ, సామాజిక స్పృహ లాంటి విషయాలు తెలియడం లేదు. ఇదే విషయం వర్క్‌షాప్‌లో చర్చనీయాంశం కూడా అయింది. రేప్‌ విక్టిమ్‌ ఫోటో, ఇంటి అడ్రస్‌, తల్లిదండ్రుల పేర్లు అన్నీ బయటపెట్టేస్తాం. పత్రికా ఎడిటర్లు ప్రచురిస్తారు, టీవీ ఛానళ్ళు 24 గంటలూ అదే చూపిస్తాయి.
కానీ, ఇక్కడ నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరచిన విషయం ఏంటంటే, నేను జర్నలిజంలోకి వచ్చి దాదాపు 17 ఏళ్ళవుతున్నా, ప్రతి మహిళా జర్నలిస్టు ఇప్పటికీ అవే సమస్యలు ఎదుర్కొంటోంది. నేను పి.జి చేస్తున్న రోజుల్లో (2003`05) పాల్గొన్న కొన్ని వర్క్‌షాప్‌లలో ఈ అంశాలను లేవనెత్తడం జరిగింది. సభా నిర్వాహకులు అవి పరిష్కరించేలా ప్రయత్నిస్తామని చెప్పడం, పరిష్కారమవుతాయన్న భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయినా ఇప్పటికీ ఏమీ మారలేదు. అదే సాధికారత, విద్య, వివక్ష, లైంగిక వేధింపులు, అస్తిత్వం, ప్రాతినిధ్యం గురించే ఇంకా చర్చించుకుంటున్నాం. ఈ రోజు వర్క్‌షాప్‌లో ఒక సీనియర్‌ జర్నలిస్టు మాట్లాడుతూ, ఆమె 40 ఏళ్ళనుండి వివిధ చర్చా వేదికలపై ఇవే అంశాలను మాట్లాడినట్లు తెలిపారు. అప్పటినుండీ ఇవి సమస్యలుగానే మిగిలాయి తప్ప, సమాధానాలు దొరికినా అవి ఆచరణలోకి రాలేదని బాధపడ్డారు. కానీ ఇంకో వెయ్యేళ్ళయినా ఈ పరిస్థితి మారదని ఇక్కడ ఎవరూ గ్రహించడంలేదు. ఎందుకంటే, అంతకు ముందులాగే ఈ వర్క్‌షాప్‌లో కూడా ఒక్క మేనేజ్‌మెంట్‌ ప్రతినిధి కూడా లేదు. ఒక్క మగ జర్నలిస్టు లేరు! పొద్దున్న జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రసంగాల కోసం వేచి చూసిన కెమెరాలు ఒక్కటి కూడా అసలు చర్చ కోసం ఆగలేకపోయాయి. ‘ఇది మీ ఆడోళ్ళ చర్చ కదా’ అనుకుంటూ సదరు రిపోర్టర్లంతా వెళ్ళిపోయారు. మహిళా సమస్యల పట్ల ఇంకా ఎంతో అవగాహన రావాలి, అందరినీ సెన్సిటైజ్‌ చేయాలి అని అక్కడ అందరం ఏకీభవించాం కానీ, అసలు సమస్య (్‌ష్ట్రవ వశ్రీవజూష్ట్రaఅ్‌ ఱఅ ్‌ష్ట్రవ తీశీశీఎ) ఇక్కడే ఉందని గుర్తించడం లేదు. ఈ చర్చాంశాలు అదే గదిలో, ఏవో పుస్తకంలో ఉండిపోతాయి తప్ప మీడియా మేనేజ్‌మెంట్‌, మగ జర్నలిస్టుల వరకూ చేరవు, వాళ్ళ మెదళ్ళకు ఎక్కవు, చేరే అవకాశం అక్కడ మనం కల్పించలేదు కనుక.
ఇలాంటి సభలతో మనకు మద్దతు, సంఫీుభావం వస్తుంది నిజమే. కానీ ఆ మద్దతు, సంఫీుభావం 1920ల నుండే మహిళలకు ఉన్నాయని ప్రొఫెసర్‌ విమల కొల్లాపూర్‌ ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చి మరీ తెలిపారు. నల్లమల అడవుల్లో ఉన్న ఒక గ్రామంలో ఉండే మహిళలు ‘వైజయంతి’ పేరుతో ఒక పత్రికను నడిపారట. అందులో ఎడిటర్‌ దగ్గర్నుండి అందరూ మహిళలే. ఆ సమయంలోనే వాళ్ళు ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ కూడా ఏర్పరచుకున్నారట. ఆ పత్రిక, బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఆంధ్రా ప్రజలను, నిజాం పాలనలో ఉన్న ప్రజలను ఒక్కటిగా కలిపేదట. మహిళలచే నడిపించబడ్డ పత్రిక అయినా, నిజాం రాజ్యం నుండి కొంతమంది పురుషులు దానికి రాసేవారట. ఎందుకంటే, ఆ మగవాళ్ళకు ఈ విషయాలపై సెన్సిటైజేషన్‌ ఉంది కనుక.
కానీ ఆ సెన్సిటైజేషన్‌ ఇప్పుడు కరువయింది. దానికి కారణం, మనం ఇలాంటి చర్చల్లో వాళ్ళను భాగస్వాములను చేయకపోవడమే. జర్నలిజం అనే కాదు, మహిళల విషయం ఏదైనా సమాజం మొత్తాన్ని భాగస్వామిని చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. పేరుకి ఈ రోజు వర్క్‌ షాప్‌లో మీడియా ఉంది, కానీ మీడియా కవరేజ్‌ లేదు! బహుశా అది రాజకీయం కాదనో, అక్కడ సెలబ్రిటీలు లేరనో, ప్రచురించినా/ప్రసారం చేసినా ఎవరూ చదవరనో/చూడరనో తెలియదు కానీ, జర్నలిస్టుల సమస్యలను (ఆడ,మగ తేడా లేకుండా) ముందుకు తెస్తున్నప్పుడు, వాటిని ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి, తోటి జర్నలిస్టుల దృష్టికి తీసుకెళ్ళడం మీడియా కనీస బాధ్యత. ఈ బాధ్యతలను మరోసారైనా మీడియా నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నాను.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.