భూమికకు ప్రేమతో,
శుభాభినందనలు. ముప్ఫయ్యేళ్ళ కృషి ఫలించి మహిళలకు తోడు నీడగా నిలిచినందుకు, స్త్రీవాదంలో పట్టా పుచ్చుకున్న శుభ సందర్భంలో. మనం పాలిచ్చి పెంచిన లోకంలో సగం మనలను పాలిస్తోందని బాధపడడం కాదు, మనలను మనమే పాలించకుందాం.
మన జీవితాలకు మనమే శాసనకర్తలవుదాం. నరకాసురుల బారినుండి రక్షించమని ప్రార్థించే భూదేవిలా కాదు, దుర్గమాసురుల చీల్చి చెండాడే దుర్గలా బ్రతుకుదాం. సంఘటిత ‘శక్తి’ మారు రూపు కావాలని, శక్తికి భూమికై నిలవాలని ఆకాంక్షిస్తూ…
`సీతామహాలక్ష్మి