భూమిక’ ఆ పేరు నాకు పరిచయమై 10 సంవత్సరాలయింది. మొదటిసారిగా స్త్రీల కోసం ప్రత్యేకమైన మాస పత్రిక ఉందని, దానిలో అన్ని అంశాలు కూడా స్త్రీలను ఉద్దేశించి రాస్తారు అని భూమికలో చేరాక తెలుసుకున్నాను. ఇంతకు ముందు వరకు ఏ పత్రికలో కానీ, పేపర్‌లో కానీ
స్త్రీల కోసం, పిల్లల కోసం ఒక పేజీని కేటాయించడం, అందులో కూడా అన్నీ వంటల చిట్కాలు, అందానికి చిట్కాలు వంటివి మాత్రమే ఉన్నాయి.
మన ‘భూమిక’లో మాత్రం చాలా ప్రత్యేకమైన అంశాలు ప్రచురించబడతాయి. ప్రతి నెలా మ్యాగజైన్ రాగానే ఎడిటోరియల్ చదవడం అలవాటుగా మారింది. ప్రతి అంశాన్నీ స్త్రీవాద కోణంలో చూడడం అనేది ఎడిటోరియల్ వల్లే నాకు అలవాటైంది. ‘పచ్చి పసుపుకొమ్ము’ కాలమ్‌లో వచ్చే కథలు చాలా సింపుల్‌గాను, ఇన్‌ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉంటాయి.
భూమిక సంస్థలో పనిచేస్తున్న ఈ పది సంవత్సరాల్లో నాలో వ్యక్తిగతంగాను, వృత్తి పరంగాను చాలా మార్పు వచ్చింది. స్త్రీలపై జరిగే హింస, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, బాధితులకు సత్వర సహాయం అందించే అన్ని విషయాలలో నేను చాలా నేర్చుకోగలిగాను. భూమిక సంస్థలో తప్ప మరెక్కడ పనిచేసినా ఇలాంటి అంశాలు తెలుసుకోవడం మరియు పనిచేయగలగడం ఉండదు. ఇది నాకు దొరికిన ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. .
కొత్తగా కథలు రాసేవారిని భూమిక ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. భూమిక పత్రికలో నేను రాసిన రిపోర్ట్స్ ప్రచురించబడడం నాకు సంతోషాన్నిచ్చింది. భూమిక పత్రికకు రాయడం ద్వారానే నేను కూడా రాయగలను అనే నమ్మకం ఏర్పడిరది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇందుకు భూమిక పత్రికకు నా ధన్యవాదాలు.
`డి.జి.మాధవి