ఏమని చెప్పాలి భూమిక గురించి? భూమికతో నా అనుబంధం 18 సంవత్సరాలు. భూమిక నన్ను చాలా మార్చింది. చాలా విషయాలు తెలుసుకున్నాను. భూమికలో చేరకముందు నా
ప్రపంచం నా ఇల్లు, భర్త, పిల్లలు మాత్రమే. భూమికలో చేరాక తెలిసింది బయట ప్రపంచం ఎలా ఉంటుందో. స్త్రీలు పడే కష్టాలు, అవమానాలు తెలుసుకున్నాను. కష్టాల్లో ఉండే చాలామంది స్త్రీలకు, ఏం చెయ్యాలో ఎవరిని ఆశ్రయించాలో తెలియని చాలామంది అభాగ్యులకు భూమిక ఒక తోడు, చేయూత అయింది. భూమిక పత్రిక వలన, అందులో వచ్చే కథలు, రచనలు, వ్యాసాలు, కవితలు చాలా మంది స్త్రీలు, పురుషులను కూడా ఆలోచింపచేశాయి.
`ఎస్.లక్ష్మి
షషష