మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, నారాయణపేట, వికారాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ` పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.
సొరంగాలు, సర్జ్‌పూల్స్, రిజర్వాయర్లు, భారీ పంపులు, వందల మెగావాట్ల సామర్ధ్యం గల సబ్స్టేషన్లు… ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ ప్రాజెక్టు శరవేగంగా పరుగులు తీసి ట్రయల్ రన్‌ను కూడా విజయవంతం చేసుకుంది. ఈ పథకాన్ని అత్యధికంగా 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే విధంగా తీర్చిదిద్దారు.
ప్రత్యేకతలు :
1. 35 భారీ మోటార్లు, ఒక్కో మోటారు 145 మెగావాట్లు
2. 400 కెవి సబ్స్టేషన్లు
3. ఆసియాలోనే అతి పెద్ద సర్జ్పూల్గా రికార్డు సృష్టించనున్న ఏదుల సర్జ్‌పూల్ వెడల్పు 31 మీ., పొడవు 360 మీ.
4. మూడు పంప్‌హౌజ్‌లలో భారీ సామర్ధ్యం కలిగిన 9 పంపులను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం.
5. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు
6. సోర్స్ : శ్రీశైలం జలాశయం
7. లబ్ది పొందే జిల్లాలు: 6 (నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ), అసెంబ్లీ నియోజకవర్గాలు : 19
8. ప్రతిరోజూ లిప్ట్ చేసే జలాలు : 2 టిఎంసిలు
9. లిప్ట్ స్టేజిలు : 5
10. రిజర్వాయర్లు : 6
11. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం : 67.74 టిఎంసిలు
12. ఒక పంపు గరిష్ట సామర్థ్యం : 145 మెగావాట్లు
13. మొత్తం 34 పంపుల సామర్థ్యం : 4900 మెగావాట్లు
14. నీటిని లిప్ట్చేసే గరిష్ట ఎత్తు : 672 మీటర్లు
15. సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు
16. ప్రధాన కాలువల పొడవు : 915.47 కిలోమీటర్లు
17. తాగునీటికి వినియోగం : 7.15 టిఎంసిలు
18. పరిశ్రమల వినియోగానికి కేటాయింపులు: 3 టిఎంసిలు
19. సాగునీటి కోసం కేటాయింపులు : 75.94 టిఎంసిలు
20. ఏదుల పంప్ హౌజ్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన భూగర్భ సర్జ్ పూల్.
21. అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డును అధిగమించి 145 మెగావాట్ల సామర్థ్యం మహా బాహుబలి మోటర్ల వినియోగం.
22. మూడు పంప్ హౌజ్‌లలో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం.
23. ఈ మోటార్లను దేశీయ దిగ్గజ కంపనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ తయారుచేయడం విశేషం