భూమిక ఎడిటర్ గారికి
‘‘ఎల్లలు దాటిన అచ్చమాంబ ఖ్యాతి’’ పేరుతో డా. షేఖ్మహబూబ్ భాషా అక్టోబర్ సంచికలో రాసిన వ్యాసానికి స్పందన…
‘‘11 గంటల నుంచీ ఇప్పుడు 12.30 వరకూ అచ్చమాంబ గారి మీదా, కమల గారి మీదా మీరు రాసిన అతి పెద్ద వ్యాసాన్ని బిగ్గరగా రంగనాయకమ్మ గారికి చదివి వినిపించాను.
చాలా ఆశ్చర్యపోయారు. మీ శ్రద్దకీ, మీ కృషికీ, ఈయనకి ఈ విషయం గురించి రాయాలని ఎలా అనిపించింది. ఎందుకు అనిపించింది అని ఆశ్చర్యం వేసింది. మొత్తం మీద చాలా చక్కగా ఎన్నో విషయాలతో రాశారు. అర్థరాత్రి ఇప్పుడు, ఇక ఆపుతాను.’’
` గాంధీ రంగనాయకమ్మ
…. ఙ ….