గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడానికి భారత ప్రభుత్వం 14 ఏళ్ల లోపు బాలికలకు దేశవ్యాప్త హెచ్‌పివి (HPV) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే మహిళలు మరియు పౌర సమాజ సమూహాలతో విస్తృత సంప్రదింపులు జరపకుండా అమలు చేస్తున్న ఇటువంటి ప్రజా ఆరోగ్య విధానాలు, కార్యక్రమాలు ఆందోళన కలిగించేవిగా వున్నాయి.
తమ శరీరం, లైంగిక ఆరోగ్యంపై ఎటువంటి స్వీయ నిర్ణయాధికారం లేని అట్టడుగు, బలహీన వర్గాలకు చెందిన బాలికలకు గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలలో ఒక విస్తృత ప్రజారోగ్య కార్యక్రమంగా (డ్రైవ్) ఈ టీకాను అందిస్తున్నట్లు తెలుస్తున్నది.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మనందరికీ సంబంధించిన ఆరోగ్య సమస్య అయినప్పటికీ, అనేక ఇతర కీలకమైన, ప్రాథమిక ఆరోగ్య సమస్యల మధ్య ప్రభుత్వ వ్యయాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఈ వాక్సిన్ గురించి బాలికల తల్లితండ్రులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా, దాని ప్రభావాల గురించి చెప్పకుండా అందరికీ వాక్సిన్ ఇవ్వటం ఎంత వరకు నైతికం? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమా? 2010లో ఈ వాక్సిన్ ప్రయోగాలు చేసినప్పుడు జరిగిన దుష్ఫలితాల గురించి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది? అనే ప్రశ్నలు అందరం ఆడగాల్సినవి.
ప్రజా ఆరోగ్యం యొక్క వివిధ కోణాలైన మహిళల ఆరోగ్యం, వారి శరీరాలపై మహిళలకు గల స్వేచ్ఛ, ముఖ్యంగా సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేని పేద మరియు అట్టడుగు వర్గాల మహిళల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి లోతైన సామాజిక-ఆర్థిక కారణాలు, పరిష్కారాల గురించి విస్తృత చర్చ జరగాల్సిన అవసరం చాలా వుంది.
హెచ్‌పివి (HPV) అంటే ఏమిటి?
హెచ్‌పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది, కండోమ్‌ల వంటి బాహ్య గర్భనిరోధక సాధనాల వాడకం ద్వారా సంక్రమణను నివారించలేము. మంచి రోగనిరోధక శక్తి ఉండి, ధూమపానం చేయనివారు, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులు లేనివారిలో 90% కేసులు 2 సంవత్సరాలలో ఈ వ్యాధి సంక్రమణ నుండి కోలుకుంటాయి. అయితే, చాలా మంది భారతీయ మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు, చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటున్నారు, బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారు మరియు ప్రత్యక్ష లేదా పరోక్ష ధూమపానం వల్ల ప్రమాదంలో ఉన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వైరస్ సోకిన వారిలో 10% మందికే వస్తుంది, 90% సంక్రమణ నుండి కోలుకుంటారు.
ప్రస్తుతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు లక్షకు 18గా వున్నాయి. దీనిని లక్షకు 4కు తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం 78,000 మంది మహిళలు మరణిస్తున్నారు, పల్స్ పోలియో లాగా, దీనిని కూడా వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చు అని ప్రభుత్వము, కొంత మంది వైద్య ఆరోగ్య నిపుణులు వాదిస్తున్నారు.
అయితే మరి కొంత మంది వైద్య నిపుణులు, పజారోగ్య కార్యకర్తలు మరొక విధంగా భావిస్తున్నారు. హెచ్‌పివి వైరస్ క్యాన్సర్‌కు కారణమవుతుందా అనే విషయంపై విస్తృత చర్చజరుగుతున్నది, హెచ్‌పివి వ్యాక్సిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారిస్తుందని ఏ అధ్యయనం నిరూపించలేదు, ఇది క్యాన్సర్‌కు ముందు దశలో ఉన్న గాయాలను నివారించగలదని మాత్రమే అధ్యయనాలు పేర్కొన్నాయి అనేది వారి వాదన. భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు వేగంగా తగ్గుతున్నాయని, మరణాల రేటు 32% తగ్గిందని దీవ్పుీ క్యాన్సర్ అధ్యయనం వెల్లడించింది. మెరుగైన లైంగిక పద్ధతులు, మెరుగైన రుతు పరిశుభ్రత, బాల్య వివాహాలు తగ్గడం, పాప్ స్మియర్ పరీక్షలు పెరగడం మరియు మెరుగైన ప్రజారోగ్య మౌలిక సదుపాయాల కారణంగా ఇది సాధ్యమైంది. కానీ ఈ తగ్గుదలను వ్యాక్సిన్ ఫలితంగానే జరిగిందని చెప్పుకుంటారనేది వారి వాదన.
ముందుగా దీని చరిత్ర గురించి తెలుసుకుందాం.
మన దేశంలో హెచ్‌పివి (HPV) ప్రయోగాలు (ట్రయల్స్)
2009 జులై, ఆగస్టు నెలల్లో ప్రభుత్వ ఆరోగ్య శాఖ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను దేశవ్యాప్తంగా నివారించటానికి ఉపయోగపడితుందని హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టింది. ఖమ్మం జిల్లాలోని మూడు మండలాలలో 14,000 మంది బాలికలు, గుజరాత్ లోని మూడు మండలాలలో 16,000 మంది బాలికలకు గార్దసిల్ అనే టీకాను ఇచ్చారు. ఈ టీకాను వీవతీck Sష్ట్రaతీజూవ aఅd ణశీష్ట్రఎవ అనే అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ భారత దేశంలో తన అనుబంధ కంపెనీ ద్వారా తయారు చేసింది. PATH Iఅtవతీఅatఱశీఅaశ్రీ అనే అమెరికాకు చెందిన సంస్థ, భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ కలిసి ఈ టీకా కార్యక్రమాన్ని నిర్వహించాయ. దీనిని 10-14 ఏళ్ల వయసుగల బాలికలకు రెండు నెలల వ్యవధిలో మూడు దఫాలుగా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో మొత్తం ఆదివాసీ బాలికలకు హాస్టల్ వార్డెన్‌ల ద్వారా అనుమతి తీసుకుని ఇచ్చారు. గుజరాత్‌లో కూడా మారుమూల గ్రామాలు, ఆదివాసీ గ్రామాల బాలికలకు ఇచ్చారు. వాక్సిన్ గురించి బాలికల తల్లితండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, వారి అనుమతి తీసుకోలేదు. ఈ టీకా ఇచ్చిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలలోనూ 7 గురు బాలికలు చనిపోయారు, చాలా మంది జబ్బుపడ్డారు. ఇది వార్తా పత్రికలలో పెద్ద ఎత్తున రిపోర్ట్ అయింది.
దానితో ఆందోళన చెందిన ప్రజారోగ్యంపై పనిచేసే సంస్థలు, మహిళా సంఘాల కార్యకర్తలు ఈ అంశంపై నిజనిర్ధారణ చేసి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2010లో ఒక మెమోరాండం ఇచ్చారు. తర్వాత కోర్టులో కేసు కూడా వేశారు. దీని ఫలితంగా, వ్యాక్సిన్ ఇవ్వటాన్ని నిలిపివేశారు, ఒక పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపి విమర్శనాత్మకమైన నివేదికను సమర్పించింది. కానీ ఎవరికీ శిక్ష పడలేదు.
సార్వత్రిక టీకా వేయటంలో నైతిక అంశాలు
ప్రయోగాల విషయంలో బాలికల తల్లితండ్రులకు పూర్తి సమాచారంతో కూడిన సమ్మతి లేకుండా ప్రయోగాలు నిర్వహించారు. ఇది వారిని గినీ పందులుగా మార్చటం తప్ప మరొకటి కాదు. భారతీయ చట్టాల ప్రకారం, టీకా వేయించుకోవడం స్వచ్ఛందం, తప్పనిసరి కాదు. పిల్లలకు టీకా వేయించే ముందు తల్లిదండ్రులు పూర్తి సమాచారంతో కూడిన సమ్మతిని ఇవ్వాలి. విద్యాసంస్థలు మొదలైన వాటికి 100% టీకా కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించటం చట్టవిరుద్ధం.
వ్యాక్సిన్ పంపిణీకి ముందు సమగ్ర చర్చ జరిగి ఉండాల్సింది కానీ జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న హెచ్ పి వి వాక్సినేషన్ డ్రైవ్‌లో ఆశా కార్యకర్తలు ప్రజలను తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు, కానీ అది స్వచ్ఛందంగా ఉండాలి. చట్టపరంగా ఇది నరహత్య కిందకు వస్తుంది.
పురుషులకు కూడా హెచ్‌పివి సంక్రమణ ఉంటుంది. వారు వాహకాలు, పురుషులకు కూడా హెచ్‌పివి టీకా ఇవ్వకపోవటం అనేది ఒక పక్షపాత వైఖరి, పితృస్వామ్య ఆలోచనా విధానాన్ని ప్రతిఫలిస్తుంది. గర్భాశయ ముఖద్వార కాన్సర్ నివారణకు బాలికల/మహిళల శరీరాలనే హింసించటం ఎంత వరకు న్యాయం. పురుషులకు కూడా టీకాలు ఇస్తే మహిళలకు హెచ్‌పివి సంక్రమణను నివారిస్తుంది. సామూహిక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పురుషులకు ప్రత్యక్ష రక్షణను మరియు వారి మహిళా భాగస్వాములకు రక్షణను అందిస్తుంది.
స్వీడన్‌లో టీకా ప్రయోజనాలపై ఉన్న డేటాను భారతదేశంలోని పేద బాలికల స్థితితో ఎలా పోల్చవచ్చు – భారతదేశం వంటి పోషకాహార లోపం ఉన్న జనాభాపై దీని సమర్థతను నిరూపించడానికి ఏవైనా అధ్యయనాలు ఉన్నాయా, దీని తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం లేదు. 90% పోషకాహార లోపంతో బాధపడుతూ, అధికశాతం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభాపై ఈ టీకాలను రుద్దటం అనేది సరైనది కాదు.
స్త్రీలకు తమ శరీరాలపై హక్కుల లేమి
మన దేశంలో మహిళలకు వారి శరీరాలపైనా, లైంగిక సంబంధాలపైనా నియంత్రణ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా అందరం గుర్తుచేసుకోవాలి. పునరుత్పత్తి ఆరోగ్యంపై పితృస్వామ్య నియంత్రణ ఇప్పటికీ కొనసాగుతున్నది. బాల్య వివాహాలు, చిన్న వయసులోనే మొదటి బిడ్డకు జన్మనివ్వటం, కుటుంబ వారసుడు కావాలని మగపిల్లల కోసం ఎక్కువ సార్లు గర్భాలు ధరించటం, గర్భంలో వున్నది ఆడపిల్ల అని తెలిస్తే గర్భాస్రావాలు చేయించటం ఇవన్నీ మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. చిన్న వయసులోనే చాలా మందికి గర్భసంచిలో ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, కాన్సర్ వస్తుందనే బూచిని చూపి. భయపెట్టి గర్భ సంచి తీసివేయటం జరుగుతున్నది. దీని వల్ల మహిళల ఆరోగ్యం మరింత దిగజారుతున్నది.
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో మహిళలలో జననాంగలు, గర్భసంచి సమస్యల గురించి సరైన స్క్రీనింగ్ లేకపోవడం, పారిశుధ్యం మరియు పోషకాహార లేమి వారి ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారకాలుగా వున్నాయి.
ప్రజారోగ్యంలో నివారణ, గుర్తింపు మరియు చికిత్స అనేవి మూడు మూలస్తంభాలు.
మంచి స్క్రీనింగ్ వ్యవస్థలు ఉంటే మహిళల ఆరోగ్యం బాగుపడటానికి పరిస్థితి ఆదర్శంగా ఉంటుంది. కానీ మన మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రజారోగ్య వ్యవస్థను పరిగణనలోకి తీసుకుంటే, (ఇటీవలి చీఖీHS పరిశోధనల ప్రకారం) 24 నెలల లోపు పిల్లలకు కూడా మనం విజయవంతంగా టీకాలు అందించలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అందరికీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయగలమా అనేది పెద్ద ప్రశ్న. మనకు మంచి స్క్రీనింగ్ వ్యవస్థ అవసరం. ఎందుకంటే టీకా బాలికలను (ఋతుస్రావం ప్రారంభం కాకముందు) రక్షిస్తుంది, కానీ వయోజన మహిళలకు క్రమం తప్పని స్క్రీనింగ్ ద్వారా రక్షణ అవసరం.
ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ చేపట్టాల్సిన చర్యలు:
కౌమారదశలో ఉన్న బాలికలు, మహిళలు మరియు పురుషులకు పునరుత్పత్తి మరియు లైంగిక ఆరోగ్య కార్యక్రమాలు/సేవలు సమగ్రంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి.
్న పాప్ స్క్రీనింగ్‌లు, ఎసిటిక్ యాసిడ్‌తో గర్భాశయ ముఖద్వారం యొక్క దృశ్య స్క్రీనింగ్ (VIA) వంటి నివారణ ఆరోగ్య సంరక్షణ సేవలను పెంచడంపై దృష్టి పెట్టాలి.
్న పాప్ పరీక్షలో అసాధారణ ఫలితాలు వచ్చిన మహిళలలో, ద్రవ ఆధారిత పాప్ పరీక్ష వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి స్క్రీనింగ్ కార్యక్రమాలను మెరుగుపరచాలి.
్న ముఖ్యంగా గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల మహిళల కోసం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కొరకు జనాభా ఆధారిత విస్తృత పాప్ స్క్రీనింగ్ సేవలను అందించాలి.
్న మహిళలు ఎటువంటి సంకోచం లేకుండా ఇటువంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు వచ్చేలా, ముఖ్యంగా మహిళలలో మరియు సాధారణంగా సమాజంలో అవగాహనను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
్న ఖరీదైన టీకా వ్యూహానికి బదులుగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను చాలా ప్రారంభ దశలోనే గుర్తించడానికి పర్యవేక్షణ చర్యలను అందుబాటులో ఉంచాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ అయిన మహిళలందరికీ చికిత్స అందించడానికి అయ్యే ఖర్చు, టీకా కొనడానికి అయ్యే ఖర్చు కంటే ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు చాలా తక్కువగా ఉంటుంది.
్న గైనకాలజిస్టులు మరియు పారామెడికల్ సిబ్బంది పదవుల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా, ప్రాథమిక స్క్రీనింగ్ సౌకర్యాలను అందించడం ద్వారా, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజారోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి.
