అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్ మందార
(గత సంచిక తరువాయి…)
వెట్టి చాకిరీ కార్మికులను మునుముందు మళ్లీ వేధించకుండా భూస్వాముల మీద చర్యలు తీసుకోవాలంటూ మేం పిటిషన్లను ఫైల్ చేశాం. దాంతో భూస్వాములు మరో కొత్త ఎత్తు వేశారు. తమ కింద పనిచేస్తున్న వెట్టి కూలీల తరఫున వాళ్లే అలాంటి నకిలీ పిటిషన్లు వేశారు.

ఆ వెట్టి కూలీలకు ప్రభుత్వం నుంచి వచ్చే 500 రూపాయల ఆర్థిక సహాయం, 4000 రూపాయల పునరావాసం మొత్తంలో వాటా ఇస్తామని కొందరు కూలీలకు మాట ఇచ్చారు. చివరికి అదంతా ఒక ప్రహసనంలాగా ముగిసింది. భూస్వాములు ఎక్కడెక్కడి జనాలనో తీసుకొచ్చి వెట్టి కూలీలుగా చూపించారు. వారిని వెట్టి నుంచి విముక్తి చేసినట్టుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం దక్కించుకున్నారు. నిజమైన వెట్టి కూలీలకు అందులోంచి ఒక్క రూపాయి కూడా దక్కలేñదు. వెట్టి చాకిరీ నిర్మూýనా చట్టం కింద ప్రభుత్వం నుంచి లభించిన ఆర్థిక సహాయం మొత్తాన్ని భూస్వాములూ, పైరవీకార్లూ, వెట్టి కూలీలుగా నటించినవాళ్లూ కలసి పంచుకున్నారు.
రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మూలా భాస్కర రెడ్డి తమ్ముడైన జనార్దన రెడ్డిని కూడా అప్పుడు వెట్టి చాకిరీ నుంచి విముక్తుడైన వాడిగా ప్రభుత్వ అధికార్ల ముందు చూపించారు. అలాగే దెబ్బడ్‌గూడ గ్రామంలో మొత్తం 238 మంది వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందినట్టు పేర్కొన్నారు. నిజానికి ఆ ఊళ్లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం యువజనుల సంఖ్య కేవలం 222 మాత్రమే. వెట్టి కూలీలను కలిగివున్న కొంతమంది యజమానులే స్వయంగా ప్రభుత్వాధికార్ల ముందు వెట్టి కూలీలుగా నటించారు. మరికొన్ని చోట్ల వెట్టి కూలీల చేత యజమానులుగా నటింపజేశారు. టీ షాపులు నడుపుకునేవాళ్లనూ, హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగులనూ, బడిపిల్లలనూ, చివరికి అప్పుడే పుట్టిన పసిబిడ్డలనూ వెట్టి చాకిరీ కార్మికులుగా చూపించారు. కందుకూరు మండలంలో ఇలాంటి చోద్యాలు విపరీతంగా జరిగాయి. ఒకరోజు హైదరాబాద్`శ్రీశైలం రహదారిలో కందుకూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని లేమూరు వద్ద ఒక ీVAటళ్లో ప్రభుత్వాధికార్లు ఆర్థిక సహాయం మొత్తాలను రహస్యంగా పంచుతున్నట్టు తెలిసింది. మేమంతా కోపంతో రగిలిపోయాం. ఈ దుర్మార్గాన్ని ఆపకపోతే, ఈ బోగస్ సహాయాలు ఇలాగే కొనసాగుతూ పోతే వెట్టి కూలీలు మళ్లీ భూస్వాముల చెప్పుచేతుల్లో వెట్టివాళ్లుగా వుండిపోయే ప్రమాదం వుంది. మేం వెంటనే కందుకూరు ఎంఆరఓ నుండి వెట్టి చాకిరీ కూలీల జాబితాను సేకరించాం. దానిప్రకారం గ్రామాల్లో స్వయంగా విచారణలు జరిపాం. ఇండియా టుడేకు చెందిన అమర్‌నాథ్ మీనన్ వంటి ప్రముఖ పత్రికా విలేకరులని ఆహ్వానించి మావెంట సర్వేకు తీసుకెళ్లాం. ఈవిషయం మీద 1986లో హైకోర్టుకు మరో పిటిషన్‌ను సమర్పించాం. అందులో ఈ బోగస్ వెట్టి విముక్తి తతంగపు విభ్రాంతికరమైన వివరాలను పొందుపరిచాం. మీడియాలో ఈ వార్తలకు విపరీతమైన ప్రచారం లభించింది. దీనిపై వెంటనే విచారణ జరపమని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దాంతో బోగస్ విముక్తులన్నీ ఆగిపోయాయి. అంతవరకు పంచిన మొత్తాలను తిరిగి వసూలు చేసే పనిలో పడ్డారు మండల రెవెన్యూ అధికార్లు.
సీపీఎం వంటి పార్టీల నుంచి రైతులు సంక్షోభంలో వున్నారు, కూలీలకు మంచి వేతనాలు చెల్లించే స్థితిలో వాళ్లు లేరనే వాదనలనూ విమర్శలనూ మేం నిరంతరం ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ అది రాజకీయంగా సరైన స్టాండ్ కాదని ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. అందుకే వాళ్లా విషయాన్ని బహిరంగంగా అనేవారుకాదు. వాళ్ల కేడర్ మాత్రం మాతో తరచూ అదే వాదన చేసేది. మొదట్లో వారికి ఏ వర్గానికి ఆ వర్గమే తమ స్థితి గతులను చూసుకోవాలనీ, అందరికంటే అట్టడుగున వున్న వర్గం వెట్టి కూలీలదేననీ మర్యాదపూర్వకంగా చెప్పాం. అయినా వాళ్లు అలాగే వాదిస్తుంటే అసహనం వచ్చేది. ‘అలాంటప్పుడు రైతులు వ్యవసాయం మానేసి తమ సమస్యల గురించి ప్రభుత్వంపై పోరాడొచ్చు కదా, వాళ్ల సమస్యలకు కూలీలెలా బాధ్యులవుతారు?’ అని ఎదురువాదన చేసేదాన్ని. ఇబ్రహీంపట్నం రెడ్డి రైతులు తూర్పు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. వాళ్లకు ఎలాంటి సహాయాలూ అవసరం లేదు. వాళ్లు సంపన్న పాలక వర్గం కిందకు వస్తారు. అయినా ఇంకా ఇంకా సంపాదించాలన్న యావ వుండేది వాళ్లకి. తమ ఊళ్లో విమానాశ్రయం లేకపోవడం వల్ల గన్నవరం నుంచి కారుల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోందని కారంచేడు లోని సంపన్న రైతులు అప్పట్లో వాపోలేదా అలా! సిపిఎం వాదన తార్కికమైనది కాదు. వాళ్లెప్పుడూ తమ మధ్యస్థ, సంపన్న రైతుల నియోజకవర్గ ప్రయోజనాల గురించే ఆలోచించేవారు.
ఉద్యమం ద్వారా మేం పరిస్థితులను చాలా సంక్లిష్టం చేస్తున్నామని చెప్పేందుకు ప్రయత్నించే సంపన్న వర్గానికి చెందిన అధికార్లకేం కొదవుండేదికాదు. ఆ విధంగా మాట్లాడే తహశీల్దారు, పోలీస్ సబఇన్స్‌పెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, డిఐజి వంటి అనేకమంది ప్రభుత్వాధికార్లను తరచుగా కలుస్తుండేదాన్ని. వారితో ఎదురు వాదించకూడదనీ, ఒకే సమయంలో అందరితో పోట్లాడకూడదనీ నన్ను నేను నిగ్రహించుకునేదాన్ని. టీ తాగుతూ వాళ్లు చెప్పేదే ఎక్కువగా వినేదాన్ని. దాంతో నేనేదో పొరపాటున దారితప్పినట్టు భావించి నాకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నించేవాళ్లు. అయితే బాధితుల పిటిషన్లు పట్టుకుని వెళ్లినప్పుడు మాత్రం వాళ్ల స్పందన భిన్నంగా వుండేది. వెట్టి కూలీల వేతనాలు చాలా దారుణంగా వున్నాయనీ, వారినుంచి విపరీతమైన వడ్డీలు వసూలు చేస్తున్నారనే వాస్తవం వారికి తెలుసు. ఎక్కువ ఉదారంగా వుండే అధికారులు ఆ పరిస్థితిని పైకి వ్యతిరేకిస్తూనే షాబాద్ మండలంతో, కొన్ని మారుమూల ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే వెట్టి కూలీల పరిస్థితి మెరుగ్గా వుందన్నట్టు మాట్లాడేవారు. మరికొందరు మీరలాంటి ప్రాంతాలకు వెళ్లి ఆర్గనైజ్ చేయండి అని సలహాలిచ్చేవారు. ఒక ప్రభుత్వాధికారి అయితే ‘ప్రతి ఒక్క వెట్టి కూలీనీ విముక్తి చేయలేం, ప్రభుత్వం దగ్గర అన్ని నిధులు లేవు. పైగా దానివల్ల రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది’ అన్నాడు. ఇంకొక అతి ఉదారవాది ‘అసలు వాళ్లని భూస్వాముల దగ్గర అప్పు ఎవరు తీసుకోమన్నారు? తీసుకున్నప్పుడు తిరిగి కట్టాలి కదా’ అన్నాడు. మరి కొందరు అధికార్లయితే ‘మేం కూడా మంత్రి గారి దగ్గర వెట్టి కూలీలమే కదా’ అని వ్యాఖ్యానించారు.
పోలీసులతో మా వాగ్వివాదాలు ఆ దశలో చాలా అరుదనే చెప్పాలి. ఒక్క సంఘటన మాత్రం నాకు బాగా గుర్తుంది. ఆరోజు గుంగల్ నుంచి శంకరయ్య తన ఊరు చీదేడుకు ఒంటరిగా వెళ్తున్నాడు. దారిలో నర్సింహా రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ అతని కాలర్ పట్టుకుని లాగి “నీలాంటోళ్ల వల్లనే ఇక్కడి ఊర్లన్నీ నాశనమైపోతున్నయి. రేపటి సంది నీ ఊర్ల తప్ప వేరే ఊర్ల కనిపిస్తే చంపుత బిడ్డా” అని బెదిరించాడు. అందుకు నిరసనగా మేం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశాం. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ బాలకష్ణా రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పాం. చివరికి సిఐ బాలకష్ణా రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పారు. ఈ ఒక్క సంఘటన తప్ప పోలీసులతో మరే గొడవలు లేవు. పోలీసులు కూడా నా విషయంలో భూస్వాముల్లాగే నిరుత్తరులైనట్టున్నారు. అత్యున్నత అధికార్లతో కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగే ఒక యువతి ఏ రాజకీయ పార్టీ, ఏ స్వచ్ఛంద సంస్థల రక్షణ లేకుండా ఒంటరిగా గ్రామాల్లో తిరగడం, అక్కడే వుండటం ఆరోజుల్లో చాలా అరుదైన విషయం. నాకు ఇప్పుడు ఏ ఎంఎల్ గ్రూపుతో ఎలాంటి సంబంధాలు లేవని నిఘా అధికారులూ, పోలీసు అధికారులూ తేల్చేసినట్టున్నారు. నేను గనక మహిళను కాకుండా పురుషుణ్నయివుంటే మాత్రం నన్నెప్పుడో చంపేసివుండేవారు. మహిళనైనందుకు నాకా మేలు జరిగింది.
14. భూస్వామ్య సంకెళ్లను బద్దలు కొట్టే నినాదాలు
1985 చివరినాటికి యాచారం మండలంలోని గుంగల్, నల్లవెల్లి, మొండిగౌరెల్లి, గడ్డమల్లాయ్‌గూడెం గ్రామాల్లో మొగ్గతొడిగిన సంఘం కార్యకలాపాలు సమీప ఇబ్రహీంపట్నం, మంచాల్, కందుకూరు, మహేశ్వరం మండలాల్లోని అనేక గ్రామాలకు విస్తరించాయి. యాచారం మాత్రం సంఘ కేంద్రంగా అలాగే కొనసాగింది. ఇబ్రహీంపట్నంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ బస్సు సౌకర్యాలెక్కువ, పెద్ద అంగడి వుంది. యాభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఉత్పత్తిదార్లు తమ సరుకులను ఆ అంగడికి తెచ్చి అమ్ముతుంటారు. ఎక్కడెక్కడి నుంచో పశువుల కాపర్లు రెండు మూడు రోజుల పాటు పయనిస్తూ తమ పశువుల్ని తోలుకొస్తారు.
మా సంఘ కార్యకలాపాలకు కీలకమైన, నాకు బాగా అలవాటైన నాలుగు గ్రామాలను దాటి ఇతర చోట్లకు వెళ్లిరావడం ఇప్పుడే మొదలయింది. ఇబ్రహీంపట్నం, మంచాల్ మండలాలు యాచారం కంటే భిన్నంగా వున్నట్టు నాÅ£నిపించేది. హైదరాబాద్‌కు సమీపంగా వుండటం వల్ల అక్కడి భూముల ధరలు ఎక్కువగా వుండేవి. బయటి నుంచి వచ్చిన సెట్లర్స్ కూడా ఎక్కువే. అదే యాచారం మండలంలో అయితే ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు తప్ప బయటి నుంచి వచ్చినవాళ్లెవరూ కనిపించేవారు కాదు. అక్కడ ప్రతి ఒక్కరికీ ఆ ఊళ్లోని ప్రతి ఒక్కరి వివరాలూ తెలుసు. అంతేకాదు వాళ్ల తండ్రులు, తాత ముత్తాతల గురించి కూడా తెలుసు. కానీ ఇబ్రహీంపట్నం, మంచాల్ మండలాల్లో మాత్రం జనం అందరినీ అనుమానిస్తున్నట్టు, సమయానుకూల నిర్ణయాలు సత్వరమే తీసుకోలేకపోతున్నట్టు అనిపించేది. ఎవరికి వారు దడి కట్టుకుని కూర్చున్నట్టుంటారు. మేం ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించినప్పుడు మొత్తం గ్రామాలు కదిలినట్టే కదిలి వెనుకంజవేస్తున్నట్టు అనిపించేది. మహేశ్వరం, కందుకూరు గ్రామాల్లో సారవంతమైన సాగుభూములు ఎక్కువ. వేరే గ్రామాల్లో పనులకోసం జనాలు ఇతర గ్రామాలకు తరలి వెళ్లినట్టు ఇక్కడి వారు పనులకోసం ఎక్కడికీ వెళ్లరు. యాచారంలో మాదిరిగా జనం త్వరగా ఒక్కటి కాలేరు. సంఘంలోని ముఖ్య కార్యకర్తలమంతా ప్రతి ప్రాంతంలోని ఇలాంటి ప్రత్యేకతల గురించి చర్చించుకునేవాళ్లం. సంఘంలోని స్థానిక పూర్తికాల కార్యకర్తలు నా కంటే ప్రాంతీయ దష్టితో వుండేవాళ్ళు. ఇక్కడి జనం ఎప్పుడూ ముందుకు రారని వాళ్లు నాతో చెప్పేవాళ్లు. అయితే నేను వాటినంత పట్టించుకునేదాన్ని కాదు.
కందుకూరు గ్రామం ఇబ్రహీంపట్నానికి దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో వుంటుంది. గుంగల్‌లోని నా గది నుంచి అయితే 30 కిలో మీటర్ల దూరం. అంటే నేను ఇక సైకిల్‌ని ఉపయోగించడానికి వీలుకాదన్నమాట. నా చుట్టూ చాలామంది జనం వుండేవాళ్లు. వాళ్లు నన్ను బస్సుల్లో తీసుకెళ్తుండేవారు. ఐదు కిలోమీటర్ల దూరం లోపు అయితే అందరం కలసి కాలినడకన వెళ్లేవాళ్లం. ఈవిధంగా మా గ్రామాల పర్యటనలు మూడు నాలుగు రోజుల పాటు సాగుతుండేవి. గుంగల్‌లోని నా గదిలో వుండటం చాలా తగ్గిపోయింది. నా దగ్గరున్న సైకిల్ క్రమంగా వాడకం తగ్గి హైదరాబాద్‌లోని శాంతా సిన్హా ఇంటికి తిరిగి చేరుకుంది.
కందుకూరు పరిస్థితులను పరిశీలిస్తున్నప్పుడే పక్కనే మహబూబ్‌నగర్ జిల్లాలోని తలకొండపల్లి మండలం నుంచి అత్యవసరంగా సహాయం కావాలంటూ మాకు అభ్యర్థనలు వచ్చాయి. 1986 నుంచీ అక్కడి గ్రామాల జనం ఇబ్రహీంపట్నంలో జరిగే మా సంఘం సమావేశాలకు వచ్చిపోతుండేవారు. తమ గ్రామాలకు రావాలంటూ అప్పటినుంచే తరచూ ఆహ్వానిస్తుండేవారు. ఇక్కడి గ్రామాల్లో వాళ్ల బంధువులు చాలామంది వుండేవారు. అందువల్ల తలకొండపల్లి మండలానికి రమ్మనే ఒత్తిడి 1987 నుంచీ మరీ ఎక్కువయింది.
తలకొండపల్లి ఇబ్రహీంపట్నం నుంచి దాదాపు 70 కిలో మీటర్ల దూరంలో, కందుకూరు నుంచి 30 కిలో మీటర్ల దూరంలో వుంటుంది. రంగారెడ్డి జిల్లాలో చిట్టచివరన వుండే మండలం కందుకూరు. శ్రీశైలం వెళ్లే రోడ్డులో కడ్తాల్ దాటిం తర్వాత చెట్ల పొదలతో కూడిన సువిశాలమైన ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న లంబాడీ తండాలుంటాయి. అవి మెట్ట భూములు, వర్షపాతం తక్కువ అవడం వల్ల అక్కడ పంటలు పండవు. ఆ భూముల్లో గొర్రెలూ, మేకలూ మేపుతుంటారు. ఇబ్రహీంపట్నంలోని వెట్టి చాకిరీ కూలీల పరిస్థితి కంటే ఇక్కడి వెట్టి కూలీల పరిస్థితి చాలా దారుణంగా వుంది. తలకొండపల్లి మండలంలోని కొన్ని గ్రామాల పేర్లు చీపునుంతల, తలకొండపల్లి, చందన, మతుకుపల్లి, సంగాయ్‌పల్లి. మేం వాళ్ల ప్రాంతానికి రావాలన్న ఉత్సాహంతో కొందరు మాదిగలు అప్పటికే “స్వయం విముక్త వెట్టి కూలీల సంఘం”ను ఏర్పాటు చేసుకున్నారు. దానిని పోతుగంటి నరసింహ మరికొందరు కలసి నిర్వహించేవారు. 1987 మొదట్లో మేం ఆ గ్రామాలను సందర్శించడం మొదలుపె{్టక ముందే వాళ్లు వెట్టి చాకిరీ కూలీలను సమీకరిస్తుండేవారు. మా సంఘానికున్న పేరువల్ల మాదిగ వాడలో వందలాదిమంది మాదిగలు మా చుట్టూ గుమిగూడారు. మేం ఇబ్రహీంపట్నంలో జనాన్ని సమీకరించిన తీరుతో పోలిస్తే ఇక్కడి జనాన్ని సమీకరించడం చాలా సులభం. ఎందుకంటే అప్పటికే వాళ్లు తమ ప్రాంతంలో వెట్టి చాకిరీ విధానాన్ని పూర్తిగా నిర్మూలించాలనీ, కూలీ రేట్లు పెంచాలనీ నిర్ణయించుకున్నారు. కేవలం తమ నిర్ణయానికి మరింత బలాన్ని సమీకరించుకునేందుకే మాలాంటి బయటివారి మద్దతు కోరుకుంటున్నారు.
అప్పటివరకూ నాకు తెలీని తలకొండపల్లి లోని కొత్త గ్రామాల్లో అడుగుపె{్టడం, వాళ్లు నన్ను కేంద్ర బిందువుగా చూడటం ఇబ్బందిగానూ, హాస్యాస్పదంగానూ అనిపించింది. నన్ను వాళ్ల నాయకులతో పాటు ముందు వరుసలో నుంచోబెట్టి మా వెనక వందలాది మందినినాదాలు చేస్తుండగా సన్నాయి డప్పుల చప్పుళ్లతో పెద్ద ఊరేగింపును నిర్వహించారు. “వెట్టి చాకిరీ నశించాలి!”, “వ్యవసాయ కూలీల సంఘం వర్థిల్లాలి!”, “కనీస వేతనాలు అమలు చేయాలి!”, “ఆకిలి ఊకేది రద్దు చేయాలి!” (మాదిగ మహిళలచేత బలవంతంగా వాకిళ్లూ, వీధులు ఊడ్పించడం నిలిపివేయాలి!), “దొరల దౌర్జన్యం నశించాలి!”, “పోలీస్ జులుం నశించాలి!” వంటి నినాదాలు చేశారు. నాకు ఇబ్బందిగా అనిపించినా మాదిగల బల ప్రదర్శనకు అదొక సంకేతమని అర్థమయింది.
తలకొండపల్లి గ్రామాల్లో అడుగడుగునా పేదరికం తాండవించేది. హరిజన వాడగా పిలుచుకునే మాదిగ వాడలో అన్నీ పూరి గుడిసెలే… ఒక్క పక్కా ఇల్లు కూడా కనిపించలేదు. (విచిత్రంగా మాలలు నివసించే ప్రాంతాన్ని మాత్రం హరిజన వాడ అనేవాళ్లు కాదు. హరిజన అనే పదం కేవలం మాదిగలకే పరిమితం). అక్కడి పిల్లలు చిరిగి పేలికలైన దుస్తులతో కనిపించారు. నేను ఒక గుడిసెలోపలికి వెళ్లినప్పుడు ఏ సామాన్లూ లేకుండా బోసిగా కనిపించింది. లోపల అడ్డంగా ఒక తాడు కట్టి వుంది. దాని మీద ఒకటిరెండు బొంతలు, పాత బట్టలు వున్నాయి. ఒక మూలన మడిచిన చాప వుంది. మరో మూలన ఒక అడుగు ఎత్తున మట్టితో కట్టిన పొయ్యి, దానిమీద కొన్ని గిన్నెలు వున్నాయి. ఇబ్రహీంపట్నం వెట్టి కూలీలకంటే ఇక్కడి కూలీలకు చాలా తక్కువ కూలీ ఇస్తారట. ఇక్కడి భూస్వాములకు మాత్రం విశాలమైన స్థలంలో నిర్మించిన విలాసవంతమైన భవనాలున్నాయి.
1987 మొదట్లోనే తలకొండపల్లి మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన ఐదు వందల మంది వెట్టి కూలీలు తమను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయాలని కోరుతూ ఎంఆరఓకు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ గ్రామాలన్నీ ఒకే మండలం నిర్వహణా పరిధిలో వున్నప్పటికీ అవి రెండు వేరువేరు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. ఒకటి రాష్ట రహదారిపై వుండే ఆమనగల్ పోలీస్ స్టేషన్‌కాగా, రెండోది మారుమూల ప్రాంతంలోని వెలిజాల్ పోలీస్ స్టేషన్. తమ దరఖాస్తుల మీద ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టకపోవడంతో వెట్టి కూలీలంతా పనులు మానేసి మే 1987లో తమను తాము వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసుకున్నట్టుగా ప్రకటించుకున్నారు. తమ యజమానులకు ఇకనుంచీ ఏ సేవలూ చేసేది లేదని తీర్మానించుకున్నారు. దానిపై విచారణ జరిపేందుకు ఎంఆరఓ నిరాకరించారు. వాళ్లంతా నెల జీతం మీద పనిచేస్తున్న వాళ్లే తప్ప వెట్టి చాకిరీ కూలీలు కాదనేది ఆయన వాదన. వాళ్ల సమస్య కనీస వేతనాల చట్టం కిందకు వస్తుంది కాబట్టి లేబర్ ఆఫీసర్ విచారణ జరపాలి తప్ప తను కాదన్నాడు. ఆ తరువాత అదే సంవత్సరం ఆగస్ట్ 27 నాడు స్వయం విముక్త వెట్టి కూలీల సంఘం నాయకుడు పోతుగంటి నరసింహనూ, మరి కొందరు ముఖ్యుల్నీ ఆమనగల్ పోలీసులు పట్టుకపోయి చితకబాదారు. నరసింహం చేత నేను వెట్టి కూలీని కాననీ, తమ ప్రాంతంలో అసలు వెట్టి చాకిరీ సమస్యే లేదనీ ఒక ప్రకటన మీద బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. కల్వకుర్తి న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ తర్వాత విడుదల చేశారు. కానీ, ఇలాంటి దుర్మార్గాలు కొనసాగుతూనేవున్నాయి.
అక్టోబర్ నెలలో మతుకుపల్లి గ్రామానికి చెందిన నలుగురు స్వయం విముక్తి ప్రకటించుకున్న వెట్టి కూలీల పిల్లల్ని భూస్వాములు పట్టుకుని తమ పోలాల్లోకి పశువులు వచ్చాయన్న నెపంతో వారిచేత మూడేసి వందల బస్కీలు తీయించారు. అలాగే నవంబర్ నెలలో సింగాయిపల్లి గ్రామంలో తిరుగుబాటు చేశారన్న అక్కసుతో భూస్వాములు ఆరుగురు కూలీల్ని పట్టుకుని చితకబాదారు, ఒక మహిళ మెడలోని పుస్తెల్ని లాక్కున్నారు. ఆ కేసుపై అదేరోజు పోలీస్ స్టేషన్‌లో ఎఫఐఆర్‌లు, కౌంటర్ ఎఫఐఆర్‌లు నమోదయ్యాయి. వెట్టి చాకిరీ కూలీలు గనక పనిలోకి రాకపోతే హరిజన వాడలను తగులబెడతానంటూ వెలిజాల పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ బెదిరింపులకు దిగాడు. తలకొండపల్లి మండల కేంద్రంలో ఒక భూస్వామి తన బావిలోంచి మంచినీళ్లు తోడుకుని వెళ్తున్న మాదిగ మహిళల మీద దాడి చేసి వారి కుండలన్నింటినీ పగుల గొట్టాడు. ఆ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు… మాదిగలు తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న సమయంలో జరిగిన అమానుష సంఘటన అది.
ఇలాంటి దారుణాలు అక్కడ పునరావతమవుతూనే వున్నాయి. బలహీనులు గొంతెత్తకుండా చేయాలని బలవంతులు తహతహలాడుతున్నారు. ఆ ఊళ్లో ప్రభుత్వానికి చెందిన చిన్న కుంటలో నీళ్లు ఎండిపోయినప్పుడు వ్యవసాయానికి అనువైన నేల బయటపడుతుంది. ఆ నేలలో మాదిగలు తాత్కాలికంగా సాగు చేసుకుంటుంటారు. అది చూసి ఓర్వలేని భూస్వాములు వెళ్లి ఉసిగొల్పగానే ఎంఆరఓ ప్రభుత్వానికి చెందిన ఆ కుంట శిఖం భూమిలో మాదిగలు పండించిన పంటలను ప్రభుత్వం వేలంవేస్తున్నట్టు ప్రకటించాడు. చివరికి మాదిగలు గత్యంతరం లేని స్థితిలో ఆ వేలం పాటలో పాల్గొని తాము కష్టపడి పండించుకున్న పంటను తామే 1,855 రూపాయలకు కొనుక్కోవలసి వచ్చింది. ఇలాంటి నిరంతర అణిచివేత చర్యల్ని, నిరుపేద మాదిగల బాధల్ని నేను చూడలేకపోయేదాన్ని. వాటిని ఎదురించాలంటే కష్టంగా వుండేది. ఎందుకంటే ఆ ఇరుగు పొరుగు ఐదు గ్రామాల నుంచి ఎలాంటి మద్దతు లభించేది కాదు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలోని మా కేంద్ర కార్యాలయానికి డెబ్బై కిలోమీటర్ల దూరం వుంటుంది. అలాగే కల్వకుర్తి కోర్టుకు వెళ్లాలంటే మరింత ఎక్కువ దూరం పయనించాలి. కల్వకుర్తి నుంచి ఇబ్రహీంపట్నం 90 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. హైదరాబాద్‌లోని సలహా సంస్థ అప్పటికే తీవ్రమైన పని భారంతో వుంది. ఆ సంస్థ అప్పటికే ఇబ్రహీంపట్నం కోసం ప్రత్యేకంగా ఒక న్యాయవాది సేవలను కేటాయించింది. కల్వకుర్తిలో మా కేసులు చూసేందుకు ఒక సానుభూతి పరుడైన న్యాయవాదిని చూసుకున్నాం. కానీ అన్ని కేసులకూ ఆ ఒక్క న్యాయవాది మీద ఎంతకాలం ఆధారపడగలుగుతాం? ఇక్కడి సమస్యలను మా సంఘం చేపట్టగలదా? ఇంత అననుకూలమైన పరిస్థితుý మధ్య సంఘం విస్తరణకు అర్థం వుంటుందా? ఆలోచనలతో నా మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది.
మహబూబ్‌నగర్‌లోని అధికార్లు ఏమాత్రం సహకారం అందించేవాళ్లు కాదు. ఒక ఫిర్యాదు తీసుకుని పోలీస్ సూపరింటెండెంట్ ఎ. శివకుమార్ వద్దకు వెళ్లినప్పుడు తను కేవలం భారత శిక్షా స్మతి (ఐపిసి) మీద ప్రమాణం చేసి దానికి లోబడి పనిచేస్తున్నాననీ, అందులో వ్యవసాయ కూలీల సమ్మె చట్ట విరుద్ధమని వుందనీ, అందుకే అరెస్టులు చేశామనీ అన్నాడు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు నిన్ను కూడా అరెస్టు చేయాల్సి వుంటుందన్నాడు. నిజానికి నన్ను అప్పటికే ఒక కేసులో అరెస్టు చేశారు. ఆ కేసు ఎఫఐఆర్‌లో నేను 1987లో సంగాయిపల్లి గ్రామంలో వ్యవసాయ కూలీల సమ్మెకు నాయకత్వం వహించినట్టు పేర్కొన్నారు. ఆ సమ్మె చట్ట విరుద్ధమనీ, ఐపిసి నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. అప్పుడు నేనా ఎఫఐఆర్‌ను పట్టుకుని సీనియర్ న్యాయవాది పద్మనాభ రెడ్డి వద్దకు వెళ్లాను. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. పోలీసులు ఫైల్ చేసిన అలాంటి ‘చట్టవ్యతిరేక, పిచ్చి కేసులు’ ఆ ప్రాంతమంతటా చాలానే వున్నాయి. వాటిలో చాలా వాటిని పద్మనాభ రెడ్డి కొట్టివేయించారు. పోలీసులు తరచుగా ఆ కేసుల్లో నన్ను ప్రధాన నిందితురాలిగా పేర్కొనేవారు. వాళ్లు తెలివిగా స్థానిక దళితుల నిస్సహాయ స్థితిని వాడుకునేవారు. ఎఫఐఆర్‌లలో ‘గీతా రామస్వామి మరియు ఇతరులు’ అని పేర్కొనేవారు. విచారణ సమయంలో మానుంచి నిరసన ప్రదర్శనలు, పై అధికార్లకు పిటిషన్లు సమర్పించడం వంటివి లేనప్పుడు ఆ ఇతరులు అనే పదం కింద సరికొత్త పేర్లు జొప్పించడానికి, మరింత మందిని అరెస్టు చేయడానికి పోలీసులకు వీలయ్యేది.వెట్టి చాకిరీ నుంచి తమను తాము విముక్తి చేసుకున్నట్టు ప్రకటించుకున్న తలకొండపల్లి వెట్టి కూలీలు తమ పట్టును అలాగే కొనసాగించడంతో క్రమంగా సమస్య సమసిపోయింది. వెట్టి కూలీలకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక మాదిగలను లొంగదీసుకోవడం సాధ్యం కాదని గ్రహించిన భూస్వాములే మెట్టుదిగి వారితో సంప్రదింపులకు వచ్చారు. తలకొండపల్లి వెట్టి కూలీల వార్త మొత్తం ఆ మండలంలో సంచలనం సష్టించింది. ఆ అలజడి దానికదే తగ్గిపోతుందని భూస్వాములు మౌనం వహించారు. తాము అడ్డుకోకుంటేనే వ్యవసాయ కూలీల సంఘం తమ ఊళ్లల్లో అడుగుపెట్టదని ఇతర గ్రామాల భూస్వాములు భావించారు.
మేం కొత్త గ్రామాలకు విస్తరించకపోయినా ఈ గ్రామాల్లో సంఘం కార్యక్రమాలను కొనసాగించాం. 1987లో మహబూబ్‌నగర్ వ్యవసాయ కూలీల సంఘాన్ని ప్రారంభించాం. దానికి పోతుగంటి నరసింహ అధ్యక్షుడు. సంగాయ్‌పల్లికి చెందిన డి. చెన్నయ్య ఉపాధ్యక్షుడు. డి. నారాయణ సంయుక్త కార్యదర్శి.
డి. బాలకిష్టయ్య కోశాధికారి. నేను ప్రధాన కార్యదర్శిని. మేనేజింగ్ కమిటీలో ఇద్దరు మహిళలు కూడా వుండేవారు. కొన్ని నెలలకు ముందే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మహబూబ్‌నగర్ వ్యవసాయ కూలీల సంఘాన్ని 1987 డిసెంబర్ 8న రిజిష్టర్ చేశారు. ఆ గ్రామాలకు చెందిన స్తీలూ, పురుషులూ ఇటీవల నన్ను కలిశారు. సంఘాన్ని నిర్వహించిన రోజుల్లో తామంతా చిన్నవాళ్లమనీ, అప్పుడు మేం చేసిన కషి వల్ల తమ గ్రామాలు చాలా మారాయన్నారు. వేతనాలు గణనీయంగా పెరిగాయి. మాదిగలు తమ పిల్లల్ని పశువులు కాచే పని మాన్పించి బడికి పంపిస్తున్నారు. గతంలో లాగా ఇప్పుడు జనం భూస్వాములకు భయపడటం లేదు. వాళ్లు కాగితం పులులన్న సంగతి తెలిసిపోయింది.
సంఘం ప్రాముఖ్యత పెరిగిన తరువాత అనుకోని ఒక కొత్త బాధ్యత మీద పడింది. అది వేరు వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నప్పుడు అండగా నిలబడి వారి వివాహం చేయడం! కులాంతర వివాహాలను తల్లిదండ్రులు అంత సులువుగా అంగీకరించేవాళ్లు కాదు. దాంతో ఆ జంట సంఘాన్ని ఆశ్రయించేది. వాళ్లంతా సంఘం పనిచేసే ప్రాంతానికి చెందినవాళ్లే. మేం అండగా వుంటామని వారికి ధైర్యం చెప్పి, ఇక్కడికి ఎనభై కిలోమీటర్ల దూరంలోని యాదగిరి గుట్టకు తీసుకెళ్లి వివాహం జరిపించేవాళ్లం. తల్లిదండ్రులు శాంతించిన తర్వాత, వారికి నచ్చజెప్పిన తరువాత ఆ జంట తమ ఊళ్లోకి తిరిగి వచ్చేది. కులాంతర వివాహాల సమయంలో ఎక్కడా ఒక్క హింసాత్మక సంఘటన గానీ, గొడవలు గానీ చోటు చేసుకోలేదు. కులాంతర వివాహాలు తరచుగా జరుగుతుండేవి. కుల వ్యవస్థను నిర్మూలించేందుకు కులాంతర వివాహాలే ఏకైక మార్గమని బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్న మాటను అప్పుడు నేను అర్థం చేసుకోగలిగాను.
నల్లవెల్లి గ్రామానికి చెందిన పద్మ అనే మాల అమ్మాయిదొక కేసు. ఆమె తండ్రి చనిపోయాడు. తల్లి మా సంఘంలోనే సభ్యురాలు. వాళ్లు నల్లవెల్లి నుంచి మాల్ అనే మరో చిన్న పట్టణానికి మకాం మార్చారు. అక్కడ రోడ్డు పక్కన ఒక గుడిసె వేసుకుని వుండేవారు. 1986లో మేం నల్లవెల్లి గ్రామానికి చెందిన ముఫ్పై మాల కుటుంబాలకు మాల్‌లో ఇంటి స్థలాల పట్టాలు ఇప్పించాము. అందులో ఈ పద్మ కుటుంబం కూడా ఒకటి. పద్మ అనియత విద్యా పాఠశాలలో పిల్లలకు చదువు చెప్పేది. ఆమె మంగలి కులానికి చెందిన జంగయ్యతో ప్రేమలో పడింది. ఇరు పక్షాలకు చెందిన కుల పెద్దలు ఆ జంటను గట్టిగా హెచ్చరించారు. అయినప్పటికీ వాళ్లు పరస్పరం ప్రేమించుకుంటూనే వుండేవారు. సంఘం సహాయం కోరి వచ్చినప్పుడు మేం పద్మని అడిగితే ‘నేను జంగయ్యని తప్ప మరెవర్నీ పెళ్లి చేసుకోను’ అని దఢంగా అంది. జంగయ్య కూడా అదే మాట అన్నాడు. కానీ మేం వాళ్ల రిజిష్టర్ పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తుండగానే అతను ఊళ్లో పత్తా లేకుండాపోయాడు.‘మాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుటుంబ ఆస్తిలో వాటా ఇవ్వమని, చంపి పారేస్తాం’ అని అతని సోదరులు అతడిని గట్టిగా బెదిరించినట్టు తెలిసింది. మేం చివరికి బేగారికంచె గ్రామంలో బంధువుల ఇంట్లో వుంటున్న జంగయ్యని కలుసుకున్నాం. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ధైర్యంగా నిలబడాలని అతనికి నచ్చజెప్పాం. పద్మ తల్లి కూడా వాళ్ల పెళ్లికి వ్యతిరేకంగా వుంది. ఇరు పక్షాలతో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి.
చివరికి ఆ జంటని మేం ఇబ్రహీంపట్నం రిజిష్టార్ కార్యాలయానికి తీసుకెళ్లాం. ఆరోజు బస్టాండ్ నుంచి రిజిష్టార్ కార్యాలయం వరకూ ఆ జంటతో కలసి ఒక పెద్ద ఊరేగింపు తీశాం. ప్రేమించుకున్న యువతీ యువకుల హక్కుల గురించి, కుల దురాచారాల గురించి కరపత్రాన్ని ముద్రించి ఇబ్రహీంపట్నం పట్టణంలోనూ, మాల్‌లోనూ విస్తతంగా పంచిపెట్టాం. ఆ ప్రేమ జంట పట్ల సానుభూతిగా వున్న మాల్‌లోని దుకాణ యజమానుల నుంచి విరాళాలు సేకరించాం. ఆ డబ్బుతో పెళ్లి కూతురికి మంగళ సూత్రాన్నీ, వాళ్లిద్దరికీ కొత్త బట్టల్నీ కొన్నాం. ఇరు పక్షాల నుంచీ ఆ వివాహానికి ఎవ్వరూ హ్పుారు కాలేదు. అయితే పెళ్లయి కొన్ని నెలలు గడిచిన తరువాత శాంతించి వారిని తిరిగి దగ్గరకు తీసుకున్నారు. ఇవాళ పద్మ మేడ్చెల్ ఎంఆరఓ కార్యాలయంలో పనిచేస్తోంది. పిల్లలున్నారు. జంగయ్య కొన్నాళ్ల క్రితం చనిపోయాడని తెలిసింది. మరో కేసు గురించి కూడా ఇక్కడ చెప్పాలి. గుంగల్ లోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఓ మాదిగ అమ్మాయి హైదరాబాద్ మలక్‌పేట కొత్త దాస్ ముఠాలోని ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుsది. గుంగల్‌లోని మాదిగలను తీసుకుని మేం హైదరాబాద్ గోల్నాకకు వచ్చి కొత్త దాస్ ముఠా సభ్యులతో చర్చలు జరిపి పెళ్లికి ఒప్పించాం. ఆ సమయంలో కొత్త దాస్ ఎంత పేరుమోసిన రౌడీయో, అతని బలమేమిటో నాకు తెలియదు. అలాంటి ముఠాతో పోట్లాటకు ఎలా సంసిద్ధుల మయ్యామా అని నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నేను శంకరయ్యని ‘అసలు కొత్త దాస్ ముఠా సభ్యులు మనతో ఆనాడు చర్చలకు ఎలా ఒప్పుకున్నారు, ఏ గొడవకు దిగకుండా నన్ను ఎలా మాట్లాడనిచ్చారు?’ అని అడిగాను. ‘నేను గతంలో నక్సలైట్లతో కలసి పనిచేసి వచ్చాననీ, నా బ్యాగులో ఎప్పుడూ పిస్తోలు వుంటుందనీ, అవసరమైనప్పుడు దానిని ఉపయోగించేందుకు వెనుకాడనని నాగురించి ఆప్రాంతమంతటా బాగా ప్రచారంఅయ్యిందట, అందుకే కొత్త దాస్ ముఠా వాళ్లు కూడా అనవసరపు గొడవ ఎందుÅ£ని అనుకుని వుంటారు’ అని చెప్పాడు.
ప్రేమించుకున్న వాళ్లని ఒక్కటి చేయడానికే పరిమితం కాకుండా భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు వాటిని సర్దుబాటు చేసేందుకు కూడా మేం సహాయపడేవాళ్లం. మాల్‌లో వడ్డెర కులానికి చెందిన ఈదయ్య అనే అతను ఒక ీVAటల్‌ని నడుపుకునేవాడు. అతని కూతురు మల్కిస్‌గూడెంకు చెందిన ఒకతణ్ని పెళ్లిచేసుకుంది. అయితే అతను తాగుడుకు బానిసైపోయి మొత్తం సంపాదననంతా తాగుడుకే ఖర్చుపెట్టేవాడట. దాంతో ఆమె తరచూ మాల్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుండేది. ఇది అతనికి నచ్చేది కాదు. ఈ సమస్య పరిష్కారానికి ఆమె తల్లిదండ్రులు చాలమంది రాజకీయ పార్టీల వారిదగ్గరకు వెళ్లి ప్రయత్నించి చివరికి మా దగ్గరకు వచ్చారు. మేం వాళ్లకి ఒక రాజీ ప్రతిపాదన చేశాం. ఆ అమ్మాయికి ీVAటల్ నడపడం ఎలాగో తెలుసు, ఇప్పటికీ తన తండ్రి ీVAటల్లో పనిచేస్తోంది. కాబట్టి ఆ జంటకు ఇటు మల్కిస్‌గూడెం, అటు మాల్ కాకుండా మరో కొత్త చోట ఒక ీVAటల్‌ని పెట్టిస్తే ఇటు ఆ అమ్మాయి మాటి మాటికీ పుట్టింటికి వెళ్లకుండా అవుతుంది… అటు తాగుబోతు స్నేహితులు దూరమై అతను కూడా ఆ అలవాటు నుంచి బయటపడతాడు అని ప్రతిపాదించాం. అందుకు అందరూ అంగీకరించారు. అప్పుడు వాళ్ల చేత వింజమూరు గ్రామంలో శ్రీశైలం రోడ్డు పక్కన ఒక ీVAటల్‌ని ఏర్పాటు చేశాం. ఆ ీVAటల్ ఇప్పటికీ చాలా బాగా నడుస్తోంది.
ఇవి చిన్న విజయాలే.. కానీ, ప్రజలను ఐక్యం చేసేందుకు, పెద్ద సమస్యలను చేపట్టే సాహసం చేసేందుకు దోహదం చేశాయి. చిన్న సమస్యలపై చేసే పోరాటాలు నాకు ఎక్కువ సంతోషమిచ్చేవి.. ఎందుకంటే బాధితుల నిత్యజీవితంలో వాటిì ప్రభావం సత్వరమే కనిపించేది. అవి మాదిగలతో మా సంబంధాలని పటిష్ట పరిచాయి. వారి జీవితానుభవాలను తెలుసుకునేందుకు దోహద పడ్డాయి. మొట్టమొదటి సారిగా నేను స్తీ పురుషుల మధ్య వున్న సంక్లిష్ట సంబంధాలను, నిత్య జీవితాన్ని నియంత్రించే జటిలమైన కుటుంబ బంధాలనూ అర్థం చేసుకున్నాను. వాటికి ఒక పనికొచ్చే పరిష్కారాన్ని కనుగొనేందుకు ఎంత దూరం లాగగలమో గ్రహించాను.
15. వేటగాళ్లను వేటాడటం
ఇతర సంఘటనలు మమ్మల్ని వెంబడించి వుండకపోతే వేతనాలు, భూస్వాముల దురాగతాలపై చేస్తున్న సంఘం కార్యకలాపాలు అటు దక్షిణాన మహబూబ్‌నగర్ వరకూ, ఇటు తూర్పున హయత్‌నగర్, చౌటుప్పల్‌ల వరకూ సత్వరమే విస్తరించి వుండేవి. ఇబ్రహీంపట్నంలోని మాదిగలలో, అట్టడుగు వర్గాల వారిలో అప్పటికే మా మీద బాగా నమ్మకం పెరిగింది. భూమి హక్కులూ, పట్టాల విషయంలో తమకు చాలా అన్యాయం జరిగిందనీ, సంఘం వాటిని కూడా చేపట్టాలనీ మమ్మల్ని కోరేవారు. వేతన సమస్యలు, నష్టపరిహారం, శ్రామిక హక్కులకు పరిమితమై వుందామనుకున్న మా సంఘం భూసమస్యలను చేపట్టడం గురించి యోచించలేదు.
అయినప్పటికీ తమ దగ్గర వున్న భూపత్రాల తాలూకు చిన్న చిన్న కాగితం ముక్కల్ని సైతం వాళ్లు మా వద్దకు తెచ్చేవారు. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు మా సమావేశాలు ముగిసేవరకు బయట వేచివుండి మరీ దశాబ్దాలుగా తాము దాచుకున్న దస్తావేజులను తెచ్చి చూపించేవారు. కొందరు నన్ను తమ గుడిసెలకు తీసుకెళ్లి పాత ట్రంకు పెట్టెల్లో, ప్లాస్టిక్ కవర్లలో భద్రపరచిన పత్రాలను బయటకుతీసి ‘కొంచెం వీటిని చదవమ్మా, ఇందులోని భూమి నాది. కానీ అన్యాయంగా తీసుకున్నరు. మా తాత ముంతెడు కల్లు కోసం ఆశపడి వాళ్లు ఎక్కడ వేలిముద్ర వేయమంటే అక్కడ వేసిండు’ అనీ… మా నాయిన చనిపోయినంక మా అమ్మనూ, మమ్మల్నీ ఆ భూమిలోంచి ఎల్లగొట్టిండ్లనీ…. మా నాయినకు పట్టా కాగితం అయితె చేతుల పెట్టిండ్లు గని ఆ భూమి ఎక్కడున్నదో చూపియ్యనేలేదనీ… ఇలా రకరకాలుగా తమ గోడును వెళ్లబోసుకునేవారు. వాళ్లు దాచుకున్న ఆ కాగితాలు చాలా పాతబడి, రంగుమారి, తేలిగ్గా చిరిగిపోయే దశలో వుండేవి. పాతకాలపు తెలుగు రాతలో, తెలుగు అంకెలతో వుండటం వల్ల వాటిని చదవడమే కష్టమయ్యేది. (నేను ఆ తరువాత తెలుగు అంకెలను నేర్చుకున్నాను). కొన్నిసార్లు వాటిలో కొన్ని ముఖ్యమైన పేజీలు మాయమైపోయివుండేవి. వాటి గురించి వివరించేందుకు bవరూ దొరికేవారు కాదు. 1986లో సంఘం సభ్యులంతా అత్యంత నిరుపేదలు, నిరక్షరాస్యులు. యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో సంఘం 1987 నాటికి బలం పుంజుకుంది. అప్పటికి కొందరు కాస్త చదువుకున్న మధ్యతరగతి రైతులు, భూరికార్డుల గురించి అవగాహన వున్నవాళ్లు మాకు అందుబాటులోకి వచ్చారు. ఇతరుల పొలాల్లో కూలి పనులు చేయకుండా తమకున్న కొద్దిపాటి పొలాల్లో పనిచేసుకునే వాళ్లని మధ్య తరగతి రైతులుగా పరిగణించేవాళ్లం. వారికి కూడా భూస్వాములతో సమస్యలుండేవి. భూమి కొన్నప్పుడు, పన్నులు కట్టినప్పుడు, పట్టాలు రాస్తున్నప్పు మోసాలు జరిగేవి. పట్వారీ, భూస్వామీ కుమ్మక్కై అన్యాయాలకు పాల్పడేవారు. గతంలో రెడ్డి భూస్వాములతో వాళ్లు చేసిన పోరాటాలు వారికి చేదు అనుభవాలను మిగిల్చాయి తప్ప ఏ మేలూ జరగలేదు. చిన్న, మధ్యతరగతి రైతుల్లో ఎక్కువ మంది దళితేతరులు, వెనుకబడిన కులాలకు చెందినవాళ్లున్నారు. భూ చట్టాలు, ఆస్తి యాజమాన్య నియమాలు, భూస్వాములు చేసిన మోసాల గురించి వాళ్లు నాకు అవగాహన కల్పించారు.
చట్టం ప్రకారం పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిపై హక్కును ఆ పేదలకే ఇవ్వాలి. పట్టాలు మంజూరు చేస్తున్నప్పుడు మాల మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నప్పుడు వారి పేర్లు రికార్డుల్లో నమోదై వుండేవి. కానీ మధ్యలో బయటినుంచి ఎవరో ఒక వ్యక్తి కాగితాలు పట్టుకుని వచ్చి భూస్వామి ఆ భూమిని తనకు ఎప్పుడో అమ్మాడంటూ వాదించేవాడు. భూసంస్కరణల చట్టం వచ్చినప్పుడు సీలింగ్ పరిమితికి మించి వున్న భూములను భూస్వాములు తమ బంధువుల పేరిట, తమ దగ్గర పనిచేసే జీతగాళ్ల పేరిట చూపించారు. (1973 లో తెలంగాణాలో మెట్ట భూముల ప్రాంతంలో భూపరిమితి 55 ఎకరాలుగా వుండేది. అంతకు మించి వున్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది). భూస్వాములు ఆవిధంగా దొంగ పట్టాలను సష్టించి భూసంస్కరణల చట్టాన్ని ఉల్లంఘించేవారు. పట్టాల మీద తమ పేరు మార్పు అనేది కేవలం కాగితాలకే పరిమితమనీ, భూమిపై తమకు ఎలాంటి హక్కు వుండదని ఆ బంధువులకూ, జీతగాళ్లకూ తెలుసు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.