ప్రసూతి సౌకర్య హక్కుల చట్టం గర్భవతులైన మరియు బాలింతలైన ఉద్యోగినులకు, శ్రామికులకు గర్భం మరియు ప్రసవించిన తరువాత వారికి కొన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వంపైన, ప్రైవేటు, యాజమాన్యాలపైన బాధ్యతలను చట్టబద్ధంగా ఉంచడమైనది. చట్ట బద్ధ్దమైన బాధ్యతను నిర్వహించినట్లయితే ఆ చట్టం శిక్షను కూడా నిర్దేశిస్తుంది.
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు పూర్తి జీతభత్యాలను ఇస్తూ 180 రోజుల ప్రసూతి సెలవులను ఇస్తుంది.
ఇతర శ్రామిక, పనిచేయు మహిళలకు 12 వారాల సెలవులను జీతంతో ఇవ్వాలి.
ఈ చట్టం అవివాహితలైన మహిళలకు కూడా వర్తిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న మహిళలకి ఇద్దరు, అంతకు తక్కువ సంతానం ఉన్నవారు మాత్రమే అర్హులు.
ఈ మొత్తం సెలవు దినాలలో కొన్నింటిని ప్రసవానికి ముందు మరియు మిగతా వాటిని ప్రసవానికి తరువాత వాడుకోవచ్చు లేదా అన్నింటిని కూడా ఒకేసారి కాన్పు తరువాత కూడా వాడుకొనుటకు వీలుంది.
ఈ చట్టం మహిళలను ప్రసవానికి ఆరు వారాల ముందు ఉద్యోగాలలో పని చేయించడం శిక్షార్హమైన నేరంగా గుర్తించింది.
పరిశ్రమలు గాని మరియే ఇతర పని ప్రదేశంలో గాని గర్భవతులకు మరియు బాలింతలకు సరియైన సౌకర్యములు కల్పించనట్లయితే నెలకు రూపాయలు 250లు అట్టి స్త్రీలకు చెల్లించవలసి వుంటుంది.
అదే విధంగా ఈ చట్టం ప్రకారం ప్రసవానికి నెల రోజుల ముందు అట్టి మహిళా ఉద్యోగులకు మరియు శ్రామికులకు అధిక శ్రమతో కూడిన పని చెప్పరాదు.
ఎవరైనా శ్రామిక మహిళ గర్భస్రావానికి గురైనట్లయితే తనకు 45 రోజులు సెలవులను జీతంతో సమానంగా తీసుకొను హక్కు ఈ చట్టం కల్పించింది.
గర్భస్రావం విషయంలో ప్రభుత్వ ఉద్యోగినులైతే తమ సర్వీసులో ఒక్కసారి మాత్రమే ఈ 45 రోజుల సెలవు మరియు జీతానికి అర్హులు.
ఒక మహిళ ప్రసవం తరువాత ఉద్యోగంలో చేరినట్లయితే శిశువుకు 15 నెలల వయసు వచ్చే వరకు రోజూ రెండు సార్లు శిశువు పాలకై ఉద్యోగం నుండి విశ్రాంతి ఇవ్వవలసి వుంటుంది.
పైన తెలిపిన సౌకర్యాలను ఉపయోగించుకోవాలంటే ఒక సంవత్సరకాలంలో కనీసం 80 పని దినములు ప్రసవానికి ముందు పని చేసి ఉండాలి. యాజమాన్యం వారికి తను గర్భవతినన్న విషయాన్ని ఆ మహిళ నోటీసు ద్వారా తెలియజేయాలి. సదరు యాజమాన్యం వారు నోటీసు అందిన 48 గంటల లోపల ప్రసూతి తర్వాత వచ్చు 6 వారాల వేతనం ఆమెకు ఇవ్వవలెను. ఈ సౌకర్యం ప్రసవంలో బిడ్డ మరణించి పుట్టినా లేదా బిడ్డ పుట్టిన తర్వాత మరణించినా కూడా పొందవచ్చును. ప్రసవ సమయంలో స్త్రీ మరణించినా కూడా పొందవచ్చును. ప్రసవ సమయంలో స్త్రీ మరణించినా కూడా ఆ స్త్రీ వారసులకు 6 వారాల వేతనం యాజమాన్యం వారు మంజూరు చేయవలసి వుంటుంది. ఒక వేళ స్త్రీ సెలవు పెట్టి వేరే దగ్గర పని చేసినచో ఈ సౌకర్యమునకు ఆమె అర్హురాలు కాదు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags