అవకాశం వస్తే ఆకాశాన్నందుకోగలంఆత్మస్థైర్యంతో, అతివలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలే కాకుండా కొర్పొరేట్‌, రాజకీయ, ఆర్ధిక, ఉద్యోగ, క్రీడారంగాలలో మహిళలు తమ ప్రతిభను కనపరుస్తున్నారు.

అయినా జనాభాలో దాదాపు సగమైనా, స్త్రీలకు రక్షణ లేని దేశాలలో, మనదేశం నాల్గవ స్థానంలో ఉన్నది.

పుట్టేది అమ్మాయి అని తెలియగానే, కడుపులోనే కడతేరుస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా భూమ్మీద పడకుండానే రాలిపోయిన ఆడశిశువుల సంఖ్య దాదాపు ఒక కోటి ఇరవై లక్షలని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ఒకవేళ పుట్టినా, నెలలలోపు పసిగుడ్డును గొంతు నులిమి చంపేస్తున్నారు. అందుకే ఒక వెయ్యికి 914 మందే ఆడపిల్లలున్నారు.

గ్రామీణ ప్రాంతాలలో ప్రతి వేయి మంది గర్భిణీ స్త్రీలలో 47 మంది వైద్య సహాయం అందని దుర్భర పరిస్థితులలో మరణిస్తున్నారు. పోషకాహార లోపం మరో సమస్య.

దేశం మొత్తం మీద దాదాపు 50 శాతం 18 సంవత్సరాలు నిండని బాలికలకు జరుగుతున్న బాల్య వివాహాలతో దేశపురోబివృద్ధికే ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

2010 ఒక సంవత్సరంలోనే 8391 వరకట్న చావులు నమోదు అయ్యాని జాతీయ నేర గణాంక సంస్థ (శ్ర్పీుష్ట్రఔ) తెలియజేసింది.

ప్రేమ పేరుతో వేధింపులు, అమ్మాయిలపై నడిరోడ్లపైననే ఆమ్లదాడులు, అమ్మాయిలను అంగటి సరకులా మార్చేసిన మార్కెటింగ్‌, మీడియా ప్రసార సాధనాలు, సమాజపు వికృత ధోరణులకు దారితీస్తున్నాయి.

భర్త చావగొడుతున్నా, వేధిస్తున్నా 52 శాతం భార్యలు రాజీపడుతూ అనుక్షణం నరకవేదన అనుభవిస్తున్నారని సర్వేలు చెపుతున్నాయి.

భారత్‌లో గడపదాటితే ఇంటికి సురక్షితంగా చేరతారనే పూచీ లేదని, నిర్భయపై జరిగిన అత్యాచార సంఘటన దేశాన్నే కుదిపివేసింది. 3,4 సంవత్సరాల పసిపిల్లని కూడా లైంగిక వేధింపులు జరుపుతున్న మృగాళ్ళను, ఆడపిల్లలని ఆక్రమ రవాణా చేస్తూ, వ్యభిచార గృహాలకు, ఇతర దేశాలకు పంపుతున్న దుర్మార్గపు సంఘటనలు టి.వి. పత్రికలలో రోజూ చూస్తూనే ఉన్నాం.

గ్రామ పెద్దలే దాష్టీకం చేస్తూ, స్త్రీలపై కఠిన నిబంధనలు చేస్తూ వివక్షణతను చూపుతున్న రాష్ట్రాలు మనదేశంలో ఉన్నాయి.

అవకాశమివ్వండి ఆకాశాన్నందుకోగలం అని ఋజువు చేస్తున్న మహిళలు, ముంచుకొస్తున్న ఈ సామాజిక సంక్షోభంను ఎదిరించలేరా? స్వాతంత్య్ర సమరంలో ఆడా మగా అనే వివక్షత లేకుండా గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌ వంటి నాయకుల అండతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని ఈనాటి యువతరం కాపాడుకోవలసిన సమయామాసన్నమైంది. స్త్రీ యైనా, పురుషుడైనా సమాజానికి రెండు ఇరుసుల వంటివారు. అన్ని రంగాలలో వారు సమానులే. స్త్రీ లేకుండా పురుషుని జన్మ లేదు. అలాగేపురుషుని ఉనికి స్త్రీకి ఎంతో అవసరం. భావితరానికి ఇద్దరూ రూపం ఇస్తారు. నేటి కుటుంబాలలో ఆధునికత, సాంకేతిక మార్పులవలన, ప్రపంచీకరణ నేపథ్యంలో మనదేశ సంస్కృతి, సంస్కారం మరుగునపడుతున్నాయి. లక్ష్యం లేని జీవన విధానాలు, డబ్బు పట్ల, జీవితం పట్ల చులకన స్వభావం ఏర్పడుతున్నాయి. ఆధునిక కుటుంబం అవసరాలు తీర్చుకునే వేదికగా మారి యాంత్రికంగా రూపొందాయి.

గ్రామాలలో యువత గుట్కాలు, మాదకద్రవ్యాలు, త్రాగుడు, పేకాట, వ్యభిచారం వంటి చెడు అలవాట్లకు లోనవుతుండగా, పట్టణాలలో అంతర్జాలం, మొబైల్‌ ఫోనులు, చెడు స్నేహాలు, పబ్‌లు వంటి వాటిలోని ఆకర్షణలకు లోనవుతున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. తల్లితండ్రులు కన్నబిడ్డలే తమకు విలువైన ఆస్తి వారిని సన్మార్గులుగా చేయాలని నిర్ణయించుకోవాలి. స్త్రీలు గర్భస్రావాలకు అందునా ఆడపిల్ల అని తెలియనివ్వకుండా, పుట్టాక కూడా ‘ఆడపిల్ల’ అని వివక్షతతో పెంచరాదు. బాల్యవివాహాలకు ఇష్టపడకుండా తమ కిష్టమైన వృత్తి విద్యలో రాణించి, సాధికారత సాధించుకున్నాకే పెండ్లి అని బాలికలు తమ తల్లితండ్రులను, ఒప్పించుకోవాలి.

ప్రేమ నిరూపించుకున్నపుడే పెండ్లి అంతవరకు బాలురతో స్నేహంగా ఉండాలి గాని, శారీరక సౌఖ్యం పొందవచ్చునని అమ్మాయిలు అనుకోరాదు. నిజమైన ప్రేమ ఉన్న అబ్బాయి తన ప్రియురాలు కోరిన కోరికను తప్పక మన్నిస్తాడు. ప్రేమ వేరు ఆకర్షణ వేరు అని యువత గ్రహించాలి. సెల్‌ఫోన్‌ అంతర్జాలం, సినిమాలు తప్పుదోవన తీసుకుపోకుండ యువత తమని తాము రక్షించుకోవాలి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. బాలికా సంఘాల ద్వారా తమ సమస్యలను స్నేహితు రాళ్ళతో చర్చించుకుని తద్వారా పెద్దలకు తెలియజేసి, అవసరమైతే పోలీసు, గ్రామ పెద్దలు, న్యాయాధికారులు, అంగన్‌వాడీ, ఆషా వర్కర్ల సమాయం తీసుకోని తల్లిండ్రులకు ఒప్పించి, చదువులో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అమ్మాయిలు.

అందుకు క్రమశిక్షణ, విశ్వాసం, నమ్మకం, నైతిక విలువల పునాదులపై జీవితాన్ని తీర్చిదిద్దుకుని వచ్చిన మంచి అవకాశాల్ని మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పుడు అకాశాన్నందుకోగలరు. ‘ముదితలు నేర్వగరాని విద్యగలదె ముద్దార నేర్పించినన్‌” ఏమంటారు?

స్త్రీలపై అత్యాచార నిరోధక చట్టం 2013

ఢిల్లీలో మహిళపై అత్యాచార సంఘటన తర్వాత ప్రజలలో ఏర్పడిన స్పందనతో, ఈ సమస్యకు పరిష్కారం కనుగునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఒక నిపుణుల సంఘాన్ని నియమించడంతోపాటు, చట్టాలను బలోపేతం చేయడానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌. వర్మ నేతృత్వంలో చట్టాల సమీక్షకు సంఘాన్ని నియమించింది వారి సూచనల మేరకు కేంద్ర కాబినెట్‌ అత్యవసర శాసనం అమలు పరచి దానిని చట్టరూపేణా తెచ్చేందుకు మార్చి 21వ తేదీన పార్లమెంటు ఉభయసభలు అంగీకరించాయి ఆ బిల్లు వచ్చేనెల అంటే ఏప్రిల్‌ 4వ తేదీ లోపల రాష్ట్రపతి సంతకం చేయగానే చట్టమౌతుంది. 2012లో జరిగిన క్రిమినల్‌ సవరణ చట్టంనకు బదులుగా ఈ 2013 చట్టం చేయబడింది దీని ప్రకారం భారత శిక్షాస్మృతి, నేర విచారణ విధానస్మృతి 1973, మరియు 1873 భారత ప్రమాణీకరించిన సాక్ష్యాధారాల చట్టంలలో సవరణలు చేశారు.

ఈ చట్టం ద్వారా సెక్షన్లు ఐ.పి.సి 326, 354, 370, 375, 376లలో ప్రధానమైన మార్పులు చేయబడ్డాయి.

స్త్రీలపై బలాత్కారం చేసిన పురుష నేరస్థులను మాత్రమే ఈ చట్టం శిక్షిస్తుంది. బలత్కారం చేయబడిన స్త్రీ చనిపోయినా. మరణించే దశలో ఆమెని వదలివెళ్ళిన ఆ నేరస్థునికి, తిరిగి తిరిగి అదే నేరం చేసిన వ్యక్తులకు కొత్త చట్టం ప్రకారం మరణ శిక్ష విధించబడుతుంది.

స్త్రీ శరీరాంగాల కొన్నిటికి పాక్షికంగా లేక శాశ్వతంగా హాని కల్గించిన, కాల్చిన, వికృతంగా చేసిన, యాసిడ్‌దాడులకు పాల్పడిన నేరస్థులకు కనీసం 10 సంవత్సరాల వరకు ఖైదు లేక జీవిత పర్యంతం ఖైదు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది ఈ జరిమానా డబ్బును బాధితురాలి ఖాతాలో జమ చేస్తారు.

(సెక్షను 354) స్త్రీలపై లైంగిక వేధింపులు, (5 సం||వరకు ఖైదు శిక్ష) – అనగా

1. వికృత చేష్టలు/ప్రవర్తన/వెనుకబడటం

2. శారీరక స్పర్శ, లైంగిక కలాపాల ప్రకటనలు

3. లైంగిక సంబంధాలు కోరడం

4. లైంగిక అర్థాలు వచ్చేటట్లు మాట్లాడటం

5. బలవంతాన అశ్లీల సాహిత్యం చూపడం

6. ఆమె ఇష్టపడని శారీరక/మౌఖిక/నిశ్శబ్ద భావ ప్రకటనలు

బి) స్త్రీపై దాడి/బహిరంగ ప్రదేశాలలో వివస్త్రను చేసిన వారికి – 3 నుంచి 7 సం|| వరకు జైలు శిక్ష

సి) ఆమె వ్యక్తిగత చర్యలను చూడడం/బొమ్మలు తీయడం – 1 నుండి 3 సంవత్సరాల జైలు శిక్ష. జననేంద్రియాలు/స్నానం చేస్తున్నా/లైంగిక సంబంధాలు జరుపుతున్నా రొమ్ములు/వృష్టభాగాలు ఫోటోలు తీయడం వంటివి పాల్పడితే þ 3 నుండి 7 సం|| శిక్ష. ఈ చట్టంలో 370 సెక్షను ప్రకారం స్త్రీలను, బాలికలను దోపిడీ చేసే ఉద్దేశంతో బెదిరించి, బలప్రయోగం జరిపి ఎత్తుకుపోవడం, అక్రమ రవాణా చేయడం, ఆశ్రయం కల్పించి లైంగిక దోపిడీ కొరకు బానిసగా చూడడం, వేరే వ్యక్తులకు బదిలీ చేయడం వంటి నేరాలకు పది సంవత్సరాలకు నుండి జీవిత పర్యంత ఖైదుశిక్ష విధింపబడుతుంది.

ఈ చట్టం ద్వారా18 సంవత్సరాలు నిండిన స్త్రీలు పురుషులు లైంగిక సంబంధాలు. పరస్పర అంగీకారంతో జరిపినపుడు నేరం కాకపోవచ్చును.

సెక్షను 376 ప్రకారం బలాత్కారం, లైంగిక దాడి అనగా ఏమిటో వివరంగా తెలియజేయబడింది.

స్త్రీల ప్రేరణ, ఇష్టం లేకుండా, వారిని భయపెట్టి చంపుతామని బెదిరించి లేక మత్తు పదార్థాలు ఇచ్చి, లైంగిక దాడులు జరపడం నేరం అవుతుంది. అంతేకాదు తానే ఆమె భర్తనని చెప్పి, 18 సం||ల కన్నా లోపుగా ఉన్న స్త్రీల సమ్మతమైనా, కాకపోయినా నేరమే ఆమె సమ్మతం పరిస్థితి లేకుండా మతిభ్రమణ స్థితిలో లైంగిక దాడి జరిపితే నేరమే.

అటువంటి నేరస్థులకు 10 సం||లు తక్కువ కాని. కఠిన కారాగారాశిక్ష/జీవితకాల ఖైదు విధించవచ్చును. జరిమానా కూడా విధింపబడుతుంది. 376 (1) ప్రకారం ఎవరు లైంగిక దాడికి పాల్పడుతారో వారికి 7 సం|| నుండి సాధారణ/కఠిన కారాగారా శిక్ష/జీవిత కాల ఖైదు విధించబడుతుంది.

1) పోలీసు అధికారులు 2) ప్రభుత్వ ఉద్యోగులు 3) సాయుధ దళాల అధికారులు 4) జైలు ఉద్యోగులు/రిమాండ్‌ గృహాల అధికారులు 5) ఆసుపత్రి ఉద్యోగులు/యాజమాన్యం 6) బంధువులు/సంరక్షకులు/ఉపాధ్యాయులు 7) అనాధ/బాలల/స్త్రీ శిశుగృహాల ఉద్యోగులు 8) గుంపు/వ్యక్తి/కొంతమంది వ్యక్తులు అందులో ప్రతి వ్యక్తి నేరస్తుడౌతాడు. వీరికి 20 సం|| జీవిత ఖైదు బాధితురాలి వైద్య ఖర్చు పునరావాస ఖర్చు/ నష్టపరిహారం వారే ఇవ్వాలి.

స్త్రీలకు ఆత్మరక్షణ ఎలా?

1. ప్రతి స్త్రీ బాల్యం నుండే తనను తాను రక్షించుకొనుట ఎలా అన్నది తల్లి ఉగ్గుపాలతోనే నేర్పించాలి ఎందుకంటే చంటిపిల్లల్ని కూడా మృగాలుగా వ్యవహారించే, తార్కిక జ్ఞానం కోల్పోయిన మగవారు అత్యాచారం చేయడానికి వెనకాడటం లేదన్నది వాస్తవం.

2. బాల్యంలో బాలికలను ముద్దు చేసే దగ్గర బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వారిని ముట్టరానిప్రదేశాలలో నోటితో చేతులతో ముట్టినప్పుడు వారి నుండి దూరంగా మసలడం పిల్లలకు నేర్పాలి తల్లులు ‘స్త్రళిళిఖి ఊళితిబీనీ’ ‘ఔబిఖిఊళితిబీనీ’ అంటే ఏ ఉద్దేశంతో ముద్దు చేస్తారో గమనించి, పిల్లలకు అవగాహన ఏర్పర్చాలి. సాధ్యమయినంతవరకు ఎదుటి వ్యక్తులకు ఆనుకోని, తగులుతూ మాట్లాడకుండా దూరం జరగాలి.

3. ఉగ్గుపాలతో ‘అమ్మని, అక్కని, చెల్లిని, మొత్తం స్త్రీ జాతిని గౌరవించాలని బాలురకు తల్లితండ్రులు నేర్పాలి. స్త్రీ పురుషు సమానతలను ఒకరు లేకుండా మరొకరు లేరన్న విషయం, తెలియజేయాలి.

4. వివక్షతతో చూడకుండా బాల బాలికలను ఒకే రకమైన పాఠశాలలకు పంపడం పౌష్ఠికాహారం, ఆటపాటలు నేర్పించాలి.

5.బాలికలకు ఆత్మరక్షణ విద్యలు అంటే కరాటే, జూడో, క్రికెట్‌, బంతి ఆటలు అన్నీ నేర్పాలి.

6) రజస్వల అయిన బాలికలకు ఉత్సవాలు జరిపి, స్కూలు మానిపించి పెండ్లి చేయాలనడం తెలివి తక్కువ. జీవ ప్రక్రియలో అవి ప్రకృతి సిద్ధంగా జరిగే కార్యక్రమాలు, మగపిల్లలకు కూడా వారి జాతి పరమైన మార్పులు వస్తున్నా వాళ్ళ చదువు, ఉద్యోగం, వృత్తి ఏదీ మానరు కదా! అలాగే స్త్రీలు కూడా తగిన రక్షణ శారీరక పోషణ జరుపుకుంటూ అన్ని పనులు చేసుకోగలరు అన్నది ఎంతో మంది విజేతలైన స్త్రీలు ఋజువు చేశారు.

7) ఎవరైనా స్త్రీలపై దాడి జరుపగలరన్న సంఘటన జరగబోతున్నపుడు తమ దగ్గర సెంటు స్ప్రే డబ్బాలలో కారంపొడి/మిరియాలపొడి నీళ్ళలో కలిపి వారి కళ్ళలో కొట్టాలి. అప్పుడు దొరికిన సమయంలో తప్పించుకోవాలి.

8) లేనట్లయితే మోచేయి అడ్డంగా పెట్టి దానితో ఎదుటి వ్యక్తి ముఖంపై, కాళ్ళతో వారి లైంగిక భాగలపై కొట్టాలి.

అలాగే కుడి కాలు వెనక్కి ఎడమకాలు ముందుకు ఉంచి, ఎడమ చేత్తో వాని ఎడమ చేయి గట్టిగా పట్టుకుని కుడి చేత్తో వాని మొఖం మీద మెడ మీద కొట్టాలి.

9) ఆడపిల్లలు ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే వారిలో ఆత్మస్థెర్యం ఏర్పడును.

10) ఎక్కడికి వెళ్ళినా తమ సెల్‌ఫోనులలో పోలీసు నెంబరు – 100/1098, దగ్గర పోలీసు స్టేషను నెంబరు, దగ్గర బంధువులకు తమ ఉనికిని తెలియజేయడం, ద్వారా ఆత్మరక్షణ చేసుకోగలుగుతారు.

అత్యాచారానికి గురైతే ఏం చేయాలి?

1. అత్యాచారానికి గురైన స్త్రీ ఆనేరం తాను చేయలేదు. తనపై దుర్మార్గులు చేశారు అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి నేరస్థుడిని గుర్తించడం, వాడి ఉనికి, ఇతర వివరాలు తెలిస్తే కంగారు పడకుండా గుర్తు పెట్టుకొని వీలైతే తన వారికి, వ్రాత పూర్వకంగా తెలియజేయడం ముఖ్యం.

2. లైంగిక వేధింపులకు గురైన స్త్రీని వెంటనే ఆసుపత్రికి తరలించి, తల్లితండ్రులకు/దగ్గర బంధువులకు తెలియజేయడం ప్రతి పోలీసు అధికారి/పౌరుల కర్తవ్యం.

3. ఆసుపత్రిలోని సిబ్బంది, డాక్టర్లు ఆమెపై జరిగిన నేరాన్ని పదిమందికి వెల్లడించకుండా, ఆమెను సానుభూతితో మానసికపరమైన, వైద్యపరమైన సేవలు అందించాలి. నేరం జరిగిన ఋజువులను, ఆమె బట్టలను వెంటనే భద్రపరచి పోలీసు అధికారులకు వ్రాతపూర్వకంగా రశీదు తీస్కుని ఇవ్వాలి పోలీసులు ఆమెని కించపరచి మాట్లాడరాదు.

4. నేరానికి గురైన స్త్రీకిప్రత్యేకమైన మానసిక శారీరక సేవల, కౌన్సిలింగ్‌ అందించడం, ఆమె ధైర్యం పొందడానికి తగిన వాతావరణం కల్పించడం డాక్టర్ల కర్తవ్యం కుటుంబ పెద్దలు కూడా అందుకు సహకరించి వెన్నంటి ఉండాలి ఆమె గర్భందాల్చకుండా, ఇన్ఫెక్షను సోకకుండా చికిత్సలందించాలి.

5. వీలైనంత త్వరగా ఆమె తన నిత్యకృత్యాలు, వృత్తి, విద్యలు చేసుకుంటూ, మానసిక ధైర్యం పొందడానికి ఇతర వ్యాపకాలు, సంగీతం, కళలు, సాహిత్యరంగాలలో కొత్త విద్యలు నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలి సమాజంలో నలుగురిని కలిస్తేఆమెకి మానసికి ధైర్యం ఏర్పడి, భయం పోతుంది.

ఏదో తప్పు జరిగి పోయిందన్న భావన, భయం ఆమెకి లేకుండా చేయడం ద్వారా, తర్వాత కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు కూడా లాయర్లు అనవసరమైన ప్రశ్నలు వేసి వేధించరాదు. ఏ స్త్రీ కూడా తాను అపవిత్రురాలనయ్యానని, కారణం లేకుండా నేరస్థులపై నిందమోపదు. అందుకే చట్టంలో పురుషులపైననే నేరమాపాదించ బడుతుందని వివరంగా తెలియజేయబడిందిపైగా ఆమె చెప్పిన వాంగ్మూలమే ప్రధాన ఆరోపణగా న్యాయస్థానం అంగీకరిస్తుంది.

– తరుణి స్వచ్ఛంద సంస్థ

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.