భూమిక పత్రిక వార్షిక పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎందరో కవయిత్రులు, రచయిత్రు లు పాల్గొన్నారు.
మధ్యాహ్నం మూడు నుండి ఐదు గంటల వరకు ఉడ్లాడ్ హోటల్లో జరిగింది. ఉదయం భూమిక హెల్ప్‌లైన్ రివ్యూ మీటింగ్ జరిగింది. దానికి కొనసాగిం పుగా బహుమతుల ప్రదానోత్సవ సమావేశం సరదాగా, ఆహ్లాదకరంగా జరిగింది. అనేక మంది భూమికతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తరువాత బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది.
కథల పోటీలో
మొదటి బహుమతి – గంటి భానుమతి గారు రచించిన ‘ఇదోరకం పోరాటం’ కథకు ఇవ్వడమైనది. రెండవ బహుమతిగా హైమా శ్రీనివాస్ తీరుమారిన తీర్పు కథకు ఇవ్వడం జరిగింది.
కవిత్వంలో మొదటి బహుమతి ‘కళా గోపాల్’ గారి ‘ఈ తరం నినాదం వై – తరుణి’, కవిత ఎంపకయ్యింది. రెండవ బహుమతికై శివపురపు శారద రాసిన ‘తస్మాత్ జాగ్రత్త’ అనే కవిత ఎంపికైంది.
వ్యాసం పోటీలో మహిళలపై పెరిగి పోతున్న లైంగిక వేధింపులు – పరిష్కా రాలు భావరాజు పద్మిని మొదటి బహుమ తికి ఎంపికయ్యారు. రెండవ బహుమతికి పి.వి. లక్ష్మణరావు గారు ఎంపికయ్యారు.
విజీతలకు అందచేసిన బహుమతు లను భూమిక మితృలు, ఆత్మీయులు స్పాన్సర్ చేసారు. అబ్బూరి చాయాదేవి, ఆర్.శాంత సుందరి, ప్రభుజన్రావు, యల వర్తి రాజేంద్రప్రసాద్, బాలాదేవి గార్లు ఈ బహుమతులను స్పాన్సర్ చేసారు.
ఆర్ శాంతసుందరి, పి. ప్రశాంతి, శిలాలోలితల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
ఎంతో సరదాగా ఉత్సహంగా ఈ సభ జరిగింది. భావరాజు పద్మిని హుషారైన పాటలు పాడి సభను ఉల్లాసపరిచారు.