(డిశంబరు 13న పలు సంఘాలు కలిసి విజయభారతి గారికి సన్మానం చేసిన సందర్భంగా)
బోయి భీమన్న కూతురిగా ఆమె ఆ ఖ్యాతిని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. బొజ్జాతారకం భార్యగా ఆ పలుకుబడితో ప్రాచుర్యంలోకి రాలేదు. ఆమె రచనే ఆమె ఉనికి. ఆమె సృజనే ఆమె అస్తిత్వం. ‘తెలుగు సాహిత్యకోశం’, పురాణాస్త్రీల కథలు అంబేద్కర్, పూలే జీవితాలపై చేసిన రచనలు తెలుగులో ఆమెను గట్టి విమర్శకురాలిగా నిలబెట్టాయి. డిసెంబర్ 13న హైదరాబాద్ సారస్వత పరిషత్ హాలులో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, అన్వేషి వంటి మహిళాసంఘాల ఆధ్వర్యంలో విజయభారతికి సన్మానం జరగనున్న సందర్భంగా ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
చదవడం అలవాటు: చిన్నప్పటి నుంచి చదవడం బాగా అలవాటు. అదీ నాన్న-బోయి భీమన్నగారి వల్లే అయితే ఆయన రచనలను చాలా పెద్దయ్యాకే చదివాను. నాన్న నా చిన్నప్పుడు రామాయణం, మహాభారతాలు చెప్తుండే వారు. చాలా వివరంగా విపులంగా, విశ్లేషనాత్మకంగా చెప్పేవాడు.ఆ ప్రభావం నా మీదుంది. కానీ వాటికి సంబంధించిన రచనలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.
అంబేద్కర్ పుస్తకం….పూలే సీరియల్: సహ జంగానే మహిళలకు మగవా ళ్ల మద్దతు సంపూర్ణంగా లభించదు. నా విష యంలో నూ అంతే. అయితే వెనక్కిలాగిన సందర్భా లు లేవు. పుస్తకాలు రాయడంలో బొజ్జా తారకంగారు నన్ను కొంత డైరెక్ట్ చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ జీవితం మీద పుస్తకం రాయడానికి ఆయన ప్రోత్సాహమే కారణం. ఆ తర్వాత గౌతు లచ్చన్నగారు పెట్టిన పత్రిక కోసం పూలే జీవితాన్ని సిరియ ల్‌గా రాయడం మొదలుపెట్టాను. కొన్నాళ్లకి పత్రికను మూసేసారు. సగంలోనే ఉండిపో యిన సీరియల్‌ను పూర్తి చేశాను. పుస్తకం వేద్దామని వాళ్లని వీళ్లను అడిగాను. చూద్దాం లే అన్నారు. కానీ ఎవరూ పట్టించు కోలేదు. చివరకు మేమే సొంత డబ్బులతో పస్ట్ ప్రింట్ వేశాం..
పురాణాల మీద: తెలుగు ఆకాడమీకి రాకముందు నిజమాబాద్ విమెన్స్ కాలేజిలో పదకొండేళ్ళు లెక్చరర్‌గా పనిచేశాను. తెలుగు అకాడమీలో ఉన్నప్పుడు టెక్ట్స్ బుక్స్ కోసం పురాణాలను మామూలు ధోరణిలోనే చెప్పా ను. అప్పటికి వాటి మీద నాకు ఐడియాలజీ లేదు. పూలే గురించి రాసిన తర్వాతే పురాణా లకు విశ్లేష ణాత్మక వ్యాఖ్యానం జోడించి రాయొచ్చు అనిపించింది. అకాడమిలో ఓ తెలుగు పుస్త కంలో శ్రీకృష్ణ మధురానగరం లో ప్రవేశం అని ఓ పాఠం ఉండేది. శ్రీకృష్ణు డు, బలరా ముడు ఇద్దరూ మధురానగరిలో అడుగు పెట్టి రాజుగారి కోసమని తీసుకెళ్తు న్న పూలదం డల్ని లాక్కుని తమ మెడలో వేసుకోవడం, గోపికల వస్త్రాలను అపహరిం చడం లాంటి అల్లరి పనులన్నీ చేస్తుంటారు. నిజానికి ఇవన్ని రౌడీ చేష్టలు. పురాణ పురుషులకు రౌడీ చేష్టలను అంటగట్టడం వాటిని మనం సమర్ధించడం విచిత్రంగా అనిపించింది. సాదారణ తెలుగు లెక్చరర్లకు ఇలాంటి సందేహాలు రావు(నవ్వు). అకాడమీ లో ఉండటం వల్ల ఆంథ్రోపాలజీ లాంటి పుస్తకాలు చదవడం పరిశీలించడం వల్ల నా ఆలోచనా ధోరణి మారి వుండవచ్చు.
సాహిత్యం కోసం: తెలుగు అకాడమీలో మంచి పోస్ట్‌లకు దళితులు పనికిరారు. వాళ్లకి పాండిత్యం ఉండదు అనే భావన ఉండేది. అకాడమీలో నా పోస్ట్ రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ టెర్మినాలజీ తెలుగు సాహిత్య కోశమనేది, ఒక కూర్పు నన్నయ్యకు ముందు నుంచి క్రీ.శ 1850 వరకు ఒక వాల్యూమ్. క్రీ.శ 1850 నుంచి క్రీ.శ. 1950 వరకు ఒక వాల్యూమ్. అంటే మొత్తం రెండు వాల్యూమ్స్‌గా తీసుకురావా లనుకున్నారు. అదో ప్రాజెక్ట్ కాని మూలనపడి ఉంది.
టెర్మినాలజీలో నేను రిసెర్చి ఆఫీస ర్‌ని కదా. అయినా కూడా అసలు పని చెప్ప కుండా డిక్షనరిలోంచి ఎత్తిరాసే పని అప్ప జెప్పేవారు. అలాంటి వివక్ష వాతావరణంలో డైరెక్టర్ వెంకటస్వామిగారు నాకు ఇంకొకరికి కలిపి మూలనపడున్న తెలుగు సాహిత్యకోశం ప్రాజెక్ట్‌ని అప్పజెప్పారు. మిగిలిన వాళ్లంతా గగ్గోలు. పైకి చెప్పలేరు. దాంతో సహాయ నిరాకరణ చేసేవారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాలను ఇచ్చేవాళ్లు కాదు. ఇలా అవస్థలు పెట్టారు.అయినా ప్రాజెక్ట్ పూర్తి చేశాం. ఫస్ట్ వాల్యూమ్ పుస్తకంగా ప్రింట్ అయి వచ్చాక వీళ్లు ఊరుకోలేదు.తప్పులు వెతకడం మొదలుపెట్టారు. బయటి పత్రికల్లో సాహిత్యకోశం నిండా తప్పులు అని వ్యాసాలు రాశారు. ఆఖరికి దీని మీద ఒ కమిటీ కూడా వేశారు. కమిటీ, వీళ్లు గగ్గోలు పెడుతన్నం తగా ఏమిలేదు. చూసుకోక పాతవే కొన్ని క్యారీ అయ్యాయి. ఇంకొన్ని అచ్చుతప్పులు న్నాయి. రెండోది వీళ్లే వేయొచ్చు. వీళ్లు సమర్ధులే అని నివేదిక ఇచ్చింది. దాంతో సాహిత్యకోశం సెకండ్ పార్ట్ కూడా మేమే చేశాం. స్త్రీలకు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా బాగా చేయగలరు అని రుజువు చేశాం. ఇదంతా 1980నాటి సంగతి.
రచనల్లో స్త్రీ: పురాణాల్లో స్త్రీల గురించి రాయడా నికి స్ఫూర్తి ప్రేరణ అంతా నేను చదివిన పుస్తకాల నుంచి పొందిందే. శరత్ నవల ల్లోని స్త్రీ పాత్రలు కూడా. ఇవన్ని చదివి ఎక్కడో రివోల్ట్ అయి ఉంటాను అదే నా రచనల ద్వారా బయటికి వచ్చి ఉంటుం ది. నా రచనలు చదివి ఎవరో ఎలీట్ అవు తారు. అన్న ఆలోచనతో ఎప్పుడూ రాయను. కులం వల్ల భాదపడ్డానా? స్త్రీ కావడం వల్ల బాధపడ్డానా అంటే రెండింటి వల్ల పెద్దగా బాధపడలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను చేసిన సాహిత్యంకోశం చాలా మంచి వర్క్ అది ఎన్‌సైక్లోపిడియా. దాన్ని ఎవరో అప్పర్‌కాస్ట్ వాళ్లు చేసి ఉంటే ఎన్నో సత్కారాలు జరిగి ఉండేవి. మాకు కనీసం గుర్తింపు రాలేదు.పైగా అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఇక్కడ మాత్రం రెండు రకాల వివక్షను ఎదుర్కొంటున్నారు.ఇక భవిష్యత్తు ఆలోచన చెప్పాలంటే నోరి నరసింహశాస్త్రి ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రక రచన చేయాలని కోరిక. చేస్తానేమో తెలీదు.
పురాణాల్లో స్త్రీల గురించి రాయడానికి స్ఫూర్తి ప్రేరణ అంతా నేను చదివిన పుస్తకాల నుంచి పొందిందే.శరత్ నవలల్లోని స్త్రీ పాత్రలు కూడా. ఇవన్ని చదివి ఎక్కడో రివోల్టు అయి ఉంటాను.