మన రాజ్యాంగం స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించినా కూడా గృహ హింసలు, మానభంగాలు, లైంగిక హింసలు, వరకట్న హింసలు, అసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, ఆడపిల్లల్ని వ్యభిచారానికి అక్రమ రవాణాలు, ఉద్యోగినిలపై లైంగిక వేధింపులు, గర్భస్రావం చేయుటం, భ్రూణహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స్త్రీలు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఆర్థికంగా ఇళ్లల్లోను మరియు సమాజంలో హింసకు గురౌతూనే ఉన్నారు. ఈ రకమైన హింసలు వారి మానసికంగా ఒత్తిడికి గురి చేసి కుంగి కృశింపచేస్తాయి. స్త్రీలపై హింస అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనగా గుర్తించింది.
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్త్రీల చట్టాలను వారి హక్కులను కాపాడుకొనుటకు న్యాయపరంగా చట్ట రీత్యా చర్య తీసుకొనుటకు వీలుగా స్త్రీలకు, ఆడపిల్లల రక్షణ కొరకు మరియు ఆసరా కల్పిస్తూ సహాయము చేయడానికి వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్‌ను రూపకల్పన చేయడం జరిగింది. ఈ వన్ స్టాఫ్ క్రెసిస్ సెంటర్ ఒకే చూరు క్రింద వైద్య పోలీసు, మానసిక, న్యాయ సహాయం అందిస్తు మనోధైర్యం కల్పిస్తుంది.
నిర్భయ సెంటర్‌లో అందుబాటులో ఉన్న సేవలు: 1. ఒక్క ఫోన్‌కాల్‌తోసహాయం: అత్యాచారానికి గురైన బాధితులు ఈ కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ (అందుబాటులో వచ్చాక 181)కు గాని లేదా 108 గాని ఫోన్ చేసినయెడల అంబులెన్స్ బాధితుల వద్దకే వస్తుంది. 2. కౌన్సిలింగ్: అత్యాచార బాధితురాలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా నిపుణులతో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. 3. ఎఫ్‌ఐఆర్: బాధితులు అఘాయిత్యంపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లాలిసిన అవసరముండదు. కేంద్రంలోనే మహిళా డి.ఎస్.పి పర్యవేక్షణలో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసుకోవచ్చు. 4. సత్వర ఆశ్రమం: బాధితురాలికి సత్వర ఆశ్రయం కల్పించడం. ఒకవేళశాశ్వతంగా ఉండాల్సి వస్తే సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు లేదాస్త్రీ, శిశు సంక్షేమ సంస్థగాని పర్యవేక్షిస్తుంది. 5. ఉచిత వైద్య సేవలు: బాధితురాలికి అవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు ఉచితంగా అందచేస్తారు.
6. న్యాయ సహాయం: బాధితురాలి తరపున మహిళా న్యాయవాది అందుబాటులో ఉంటారు. 7. ఆర్థిక సహాయం: బాధితుల భవిష్యత్తులో నిలదోక్కొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందచేస్తారు. మైనర్లు అయితే 1 లక్ష, మేజర్లు అయితే 50 వేల రూపాయలు అందజేస్తారు.
ప్రాజెక్ట్ డైరెక్టర్
మహిళా శిశు సంక్షేమ సంస్థ
రంగారెడ్డి జిల్లా
జిల్లా కలెక్టర్
రంగారెడ్డి జిల్లా